అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వద్దు

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : రానున్న విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎలాంటి అలసత్వం వహించకూడదని డీఈవో రాజేంద్రప్రసాద్‌ ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోడౌన్‌ను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నా రు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాల సరఫరా ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గోడౌన్‌ నుంచి మండల కేంద్రాలకు పుస్తకాల తరలింపు సాగుతోందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన షెడ్యూల్‌ ప్రకారం పాఠశాలలు ప్రా రంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలుండాలన్నారు. ఎంఈవోలు తమ పరిధి లోని పాఠశాలల అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఇండెంట్‌ పెట్టుకోవాలన్నారు. అనంతరం గోడౌన్‌లో స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాఠ్యపుస్తకాల గోడౌన్‌ మేనేజర్‌ సురేష్‌, సిబ్బంది వనజ, పాల్గొన్నారు.

వేగం పెంచండి

చిత్తూరు కార్పొరేషన్‌: ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్‌ ప్యానల్స్‌ వేగం పెంచాలని ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లా నోడల్‌ ఆఫీసర్‌, క్వాలిటీ కంట్రోల్‌ సీజీఎం శోభా వాలంటీనా ఆదేశించారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్‌, చిత్తూరు రూరల్‌ డివిజన్‌ అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడా రు. జిల్లాలో దాదాపు 19వేల సర్వీసుల ఏర్పాటు ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. అందులో ఇప్పటి వరకు 1000 ప్యానల్స్‌ బిగించారన్నారు. ప్రతిరోజు 150 ప్యానల్స్‌ ఏర్పాటు చేయాలన్నా రు. వర్క్‌ఆర్డర్లను నెలలోపు పూర్తి చేయాలని లేనిపక్షంలో ఏఈ పర్సనల్‌ అకౌంట్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. డయల్‌ యువర్‌ సీఎండీలో జిల్లా పరంగా వస్తున్న ఫిర్యాదులను నమోదు చేసుకొని పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ అమర్‌బాబు, ఈఈలు మునిచంద్ర, సురేష్‌, మోహనమ్మ, డీఈలు, ఏఈలు, సబ్‌ఇంజినీర్లు పాల్గొన్నారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని 40 సెక్షన్ల పరిధి లో శుక్రవారం కరెంటోళ్ల జనబాట నిర్వహించనున్నారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నారు.

అల్లూరి చరిత్ర స్ఫూర్తిదాయకం

చిత్తూరు కలెక్టరేట్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ కొని యాడారు. గురువారం కలెక్టరేట్‌లో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మహోజ్వల శక్తి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులను ఏకం చేసి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర అల్లూరిదన్నారు. ఆయన పోరాట పటిమ ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాసులు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నరేంద్రకుమార్‌, సీపీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఏవో వాసుదేవన్‌ పాల్గొన్నారు.

శిక్షణకు కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ముస్సోరీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ముస్సోరీలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీలో మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు (మొత్తం 25 రోజుల) పాటు శిక్షణ నిర్వహించనున్నారు. ఈ నెల 10న ముస్సోరిలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ శిక్షణకు దేశ వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లను ఎంపిక చేయగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. కలెక్టర్‌ శిక్షణ ముగించుకుని జూన్‌ 6న తిరిగి జిల్లాకు విచ్చేయనున్నారు. అప్పటి వరకు జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement