breaking news
Chittoor District News
-
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
పుంగనూరు: మండలంలోని మార్లపల్లె సమీపంలోని జగనన్న కాలనీలో నివాసం ఉన్న అంకాయమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలి పనులకు వెళ్లిన అంకాయమ్మ ఇంటికి తిరిగి వచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో బంగారు నగలు, లక్ష రూపాయల నగదు, ఇతర వస్తువులు దొంగలించుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి గంగాధర నెల్లూరు: కూలి పనికి వెళ్లిన తన భర్తకు భోజనం అందించి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి చెందిన ఘటన గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వివరాలు.. గంగాధరనెల్లూరు దళితవాడకు చెందిన మూర్తి నీవా నది సమీపంలో కూలి పనులు చేసేవారు. బుధవారం కూలి పనులకు వెళ్లిన తన భర్తకు మూర్తి భార్య నాగమ్మ అలియాస్ శ్రీదేవి (45) భోజనం తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో చిత్తూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం శాంతిపురం: పలమనేరు జాతీయ రహదారిపై మండల పరిధిలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో వి.కోట మండలానికి చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మఠం వద్ద ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. బైకుపై వెళ్తున్న వి.కోట మండలం, దాసార్లపల్లికి చెందిన చంద్రకాంత్(31) తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని రాళ్లబూదుగూరులో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్న చంద్రకాంత్ రోజూ బైకుపై రాకపోకలు సాగిస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. మరో ప్రమాదంలో గుండిశెట్టిపల్లి వద్ద కారును బైకు ఢీకున్న ఘటనలో వి.కోట మండలం, నాగిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్(32) తీవ్రంగా గాయపడ్డాడు. సోమాపురంలో బంధువుల ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు తనను 108 ద్వారా కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయామైంది. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
బాలిక లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్: ప్రేమ.. పెళ్లి పేరిట మాయ మాటలు చెప్పి.. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నను చంపేస్తానని బెదిరించి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి చిత్తూరు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. చిత్తూరు పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన కుమారి కథనం మేరకు.. 2021 సంవత్సరంలో వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక (14)తో అదే మండలం కాపుమొండివెంగనపల్లికి చెందిన టి.మణి అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించాడు. తనతో రావాలని భయపెట్టి మోటార్ సైకిల్ ఎక్కించుకుని భాకరాపేట సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లాడు. ఆ గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. భాకరాపేటలో గది అద్దెకు తీసుకుని అందులో బాలికను ఉంచి బలవంతంగా పలుమార్లు లైగింక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు వెదురుకుప్పం పోలీసులను ఆశ్రయించడంతో 2021 మార్చి 23వ తేదీన ముద్దాయి నుంచి బాలికను రక్షించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదుచేసి చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి ముద్దాయి మణికి గరిష్టంగా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శంకర్రావు తీర్పునిచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ.ఒక లక్ష చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. -
ఉత్సాహంగా పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్
కార్వేటినగరం: పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనండం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా విద్యాశిక్షణా సంస్థ( డైట్) ఇన్చార్జి ప్రిన్సిపల్ దామోదరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాజకుమార రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని హెచ్ఎం కోటేఽశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టడం, ఆత్మవిశ్వాశాన్ని పెంపొందించడమే పరీక్ష పే చర్చ ముఖ్య లక్ష్యమన్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన వచ్చన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1 నుంచి జనవరి 11 వరకు కొనసాగుతుందన్నారు. చర్చలో పాల్గొనదలచిన వారు వెబ్‌సైట్‌ను సందర్శించి ఎంపికను ఎంచుకుని ఈ మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇచ్చిన థమ్స్లో ఒక దాన్ని ఎంచుకుని 5 వందల అక్షరాల్లోపు ఉండే విధంగా ఒక ప్రశ్న లేదా అభిప్రాయాన్ని తెలపాలన్నారు. ఎంపిౖకైన వారు నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. -
శ్రీసిటీలో టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(పీఈటీఐ) సంస్థ తమ అవరణలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎన్ఏబీఎల్( నీటి/ మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ సన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీని ‘ క్లీన్ అండ్ గ్రీన్’ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. పేక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ కొత్త ల్యాబ్ ‘మేక్ ఇన్ ఇండియా’ఆలోచనకు అనుగుణంగా టెస్టింగ్ సేవలను అందిస్తుందన్నారు. -
ఎట్టెట్టా?
పలమనేరు: జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఏనుగుల మెడకు జీపీఆర్ఎస్ ట్రాకర్స్‌ను అమర్చనున్నట్టు తెలిపింది. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో త్వరలో తేలనుంది. ముందస్తు వర్ష సూచనలాగే.. వాతావరణ శాఖ నుంచి మొబైళ్లకు అలెర్ట్ మెసేజీలు వస్తుంటాయి. ఇదే విధంగా ఏనుగుల కదలికల ద్వారా అవి ఏమార్గంలో సంచరిస్తున్నాయే ట్రాక్ ద్వారా పసిగట్టి ఏ గ్రామం వైపు వెళుతున్నాయో ఆ గ్రామస్తుల ఫోన్లకు సందేశాలు పంపేలా అటవీశాఖ ప్లాన్ చేస్తోంది. కాలర్లకు కట్టడం కష్టమే ఇంతకీ అటవీశాఖ భావిస్తున్నట్టు ఏనుగుల మెడకు జీపీఆర్ఆర్ కాలర్లని అమర్చడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. గుంపులోని ఏనుగులను నిలువరించడం ఇక్కడున్న కుంకీల నుంచే సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు మదపుటేనుగులు జోలికెళ్లే కుంకీలను సైతం ఇవి ఎదిరించి దాడులు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల మెడకు జీపీఆర్ టాగ్‌ను ఎలా వేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. ఏనుగు మెడకు జీపీఆర్ఎస్ ట్యాగ్! ప్రస్తుతం పలమనేరు ప్రాంతంలో 14, తమిళనాడు సరిహద్దు అడవుల్లో ఆరు, సోమల ప్రాంతంలో మూడు, గుడిపాల వద్ద రెండు ఏనుగులతోపాటు నాలుగు ఒంటరి ఏనుగులు సంచరిస్తున్నాయి. గుంపులోని ఏనుగుల కంటే ఒంటరిగా సంచరిస్తున్న మదపుటేనుల కారణంగానే ఎక్కువగా ప్రజలపై దాడులు, పంటలకు నష్టం జరుగుతోంది. వీటిని అదుపులోకి తీసుకురావడం కుంకీ ఏనుగులతో కాదని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు తెలిసిపోయింది. దీంతో సాంకేతికంగా కొత్త మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మెడకు రెండేళ్ల బ్యాటరీతో పనిచేసే జీపీఆర్ఎస్ ట్రాకర్‌ను తగిలించి.. దాని సంచారం ద్వారా ఏనుగుల గుంపు ప్రాంతాన్ని లొకేషన్ ద్వారా చూస్తూ ఆ ప్రాంతానికి సమీపంలోని రైతులు, ప్రజల మొబైళ్లకు సందేశాలను పంపేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
కనతలలో అక్రమ క్వారీ
సాక్షి టాస్క్‌ఫోర్స్: బంగారుపాళ్యం కనతల చెరువు వద్ద అక్రమ క్వారీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ లేకుండా నల్లబంగారం మాయమవుతోంది. టీడీపీలోని ఇద్దరు బడా నేతల చేతిలో క్వారీ నడుస్తోంది. ఆ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఆ ప్రాంతం సరిహద్దు కావడంలో చిటికెలో గ్రానైట్‌ను తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయాలు తెలిసినా సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు లైట్ తీసుకుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పాత పత్రాలతో...కోట్లా వ్యాపారం! ఈ క్వారీకి సంబంధించి గతేడాది రెన్యూవల్ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అధికార బలాన్ని ఉపయోగించి కార్వీని వశం చేసుకున్నారు. ఎగువ కనతల నుంచి తమిళనాడుకు సరిహద్దు దాటిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే... పాత పత్రాలను చూపించి క్వారీలో దర్జాగా తవ్వకాలు చేసుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నించే వారిపై ఆ బడానేత ఎదురుతిరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. లైట్ తీసుకో! అక్రమ క్వారీ నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ఽఅధికారులు, బడా నేతకు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అక్రమ క్వారీని ఇన్నాళ్లు దర్జాగా నడిపిస్తున్నారు. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది, టీడీపీలోని ఓ నేత మైనింగ్ అధికారులకు అక్రమ విషయంపై ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకోడంటూ.. బుజ్జగించి పంపించారు. వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అధిష్టానానికి లేఖ పంపారు. ఓ బడా నేత కనుసన్నల్లో జరిగే ఈ అక్రమ తవ్వకాలతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోందని ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పట్టించుకోని పక్షంలో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించినట్టు సమాచారం. అసలేం జరుగుతోందంటే! బంగారుపాళ్యం మండలం, ఎగువ కనతల చెరువు వద్ద విలువైన క్వారీ ఉంది. ఇది నల్ల బంగారం. తమిళనాడు, కర్ణాటకలో ఈ ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఏడాది క్రితమే ఈ క్వారీ రెన్యూవల్‌కు వచ్చింది. అధికారం ఉందని.. అవేవీ పట్టించుకోకుండానే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు చేతులు కలిపారు. మండలంలోని ఓ బడానేతతో.. చిత్తూరుకు చెందిన మరో నేత క్వారీపై కన్ను వేశాడు. కొండను పిండేసేందుకు వెంటనే బండ్లను దింపారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఎదురుతిరిగారు. ఇంతలో మండలంలోని ఆ బడానేత రంగంలోకి దిగారు. గ్రామస్తులను బెదిరించి నోరు మూయించారు. -
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి
చిత్తూరు కలెక్టరేట్ : అర్హులైన నిరుపేదలందరికీ కచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. -
బాబును నమ్మడమంటే మోసపోవడమే
పుంగనూరు: చంద్రబాబును నమ్మడం అంటే మోసపోవడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దెవా చేశారు. బుధవారం పట్టణంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరశిస్తూ కోటి సంతకాల బుక్లెట్ల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, వైఎస్సార్ జిందాబాద్.. పెద్దిరెడ్డి జిందాబాద్.. మిథున్‌రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బస్టాండు నుంచి ఎంబీటీ రోడ్డు, పోలీస్ స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ నుంచి తిరుపతికి వెళ్లింది. ర్యాలీని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం ఆయన నైజం అన్నారు. సూపర్–6 పేరుతో ఒక్కహామీనైనా నేరవేర్చాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కానరాలేదని, ప్రభుత్వ సంపదను ప్రైవేటీకరించడమే తండ్రి, కొడుకుల లక్ష్యమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయడం, వేధించడం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ పరిపాలనపై ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపీపీలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, జెడ్పీటీసీలు సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రాజు, పార్టీ యూత్వింగ్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అమ్ముతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘పచ్చ’ లాటరీపై రంగంలోకి ఎస్పీ!
చిత్తూరు అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు రోజువారీ కూలి పనులు చేసే ప్రజలే లక్ష్యంగా చిత్తూరులో జరుగు తున్న నిషేధిత లాటరీ ముద్రణ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడానికి స్వయంగా ఎస్పీనే రంగంలోకి దిగారు. చిత్తూరులో జరుగుతున్న ఈ సామాజిక అసమాన క్రీడపై ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ‘పచ్చ లాటరీ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రారంభమయ్యే లాటరీ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడంతో పాటు విజయవాడకు కూడా వెళుతుండడం, చిత్తూరులోని కొందరు ఖాకీలు దీనికి కొమ్ముకాయడంపై ‘సాక్షి’లో వచ్చిన వార్తపై ఎస్పీ డూడీ స్పందించారు. ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు..? ఎవరెవరికి మామూళ్లు వెళుతున్నాయి..? అక్రమార్కులకు ఎవరు అండగా నిలుస్తున్నారు..? ఇందులో కింగ్‌పిన్ ఎవరు..? అనే వివరాలను ఆయన రాబడుతున్నారు. పోలీసు శాఖలో తనకు నమ్మకంగా ఉంటున్న వాళ్ల నుంచి నివేదిక నేరుగా తన టేబుల్పైకే తెప్పించుకుంటున్నారు. జిల్లాలో లాటరీ విక్రయాలు పూర్తిగా నిరోధించడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఫలితంగా లాటరీకి దన్నుగా ఉంటున్న వ్యక్తులతో పాటు కొందరు ఖాకీల గుండెల్లో రైళ్లు పడుగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందో తెలియక మదనపడుతున్నారు. హైవేల అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్ చితూరు అర్బన్: జిల్లాలో జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. కుప్పం–హోసూరు, బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే–కాణిపాకం ఆలయ లింకు రోడ్డు (ఎన్‌హెచ్–140) మధ్య కనెక్టివిటీకి తాను ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఈనెల 15న పనుల కేటాయింపు జరుగుతుందన్నారు. -
కరిగిపోతున్న గుట్టపై విచారణ
రొంపిచెర్ల: చిత్తూరు–అన్నమ్మయ్య జిల్లా సరిహద్దులో అనుమతులు లేకుండా గుట్టను కిరిగిస్తున్నారని సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు రెండు జిల్లాల మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మైనింగ్ ఏడీ సత్యనారాయణ కథనం. అన్నమ్మయ్య జిల్లా, పీలేరు మండలం, గూడరేవుపల్లె, చిత్తూ రు జిల్లా, రొంపిచెర్ల మండలం, చిచ్చిలివారిపల్లె గ్రామ సరహద్దులో ఉన్న గుట్టను పరిశీలించినట్టు తెలిపారు. తనిఖీలో పీలేరు మండలం, సూరవ్వచెరువుకు ఉత్తరం వైపున పెద్ద గుంత ఉండడంతో పరిశీలించామన్నారు. అక్కడ కూలీలు రాళ్లు కొడుతున్న వారిని బయటకు పంపిచామని చెప్పారు. రాక్ మార్క్ ప్రకారం పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో ఉన్నట్లు గుర్తించామన్నారు. గుంతను కొలవగా సుమారు 15,000 స్క్వేర్ మీటర్లు, 6 నుంచి 10 మీటర్ల ఎత్తు ఉన్నట్లు గుర్తించి వాటి పరిమాణం గుర్తించేందుకు వివరణాత్మక సర్వే చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నమ్మయ్య జిల్లా మైనింగ్ అధికారులు రికార్డులు పరిశీలించగా పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో 1.998 హెక్టార్లలో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ ఖనిజానికి సి.రజిత అనే మహిళకు 2022 డిసెంబరు 29 నుంచి 2032 డిసెంబరు 28వ తేదీ వరకు లీజుకు ఇచ్చినట్టు ఉందన్నారు. సదురు స్టోన్ క్రషర్కు సమీపంలో అక్రమ తవ్వకాలు జరిగిన గుంత ఉండగా అక్కడే ఉన్న కూలీలను విచారించామని తెలిపారు. అయితే కూలీలు ఈ రాయి సమీపంలోని క్రషర్కు రవాణా అవుతోందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. లీజుదారు రజిత భర్త కిషోర్‌కుమార్‌రెడ్డిని కూడా విచారించగా గుంత లీజు పరిధిలోకి రాదన్నారు. దీంతో పనులు నిలిపి వేయాలని ఆదేశించామన్నారు. అలాగే స్టోన్ కషర్ వద్ద 600 క్యూబిక్ మీటర్ల కంకర నిల్వ ఉన్నట్లు గుర్తించామని, 90 శాతం పనులు పీలేరు మండల పరిధిలోనే జరిగాయని, రొంపిచెర్ల మండల పరిధిలో 10 శాతం పనులు గతంలో జరిగినట్లు గుర్తించామని తెలిపారు. భైరవ స్టోన్ క్రషర్ పేరుతో 2008 నుంచి 2018 వరకు ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకుంటామని ఏడీ తెలిపారు. -
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం
బంగారుపాళెం : విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని కీరమంద జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం రుచి చూశా రు. పిల్లలకు పరిశుభ్రంగా, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే కొదలమడుగు పంచాయతీ బండ్లదొడ్డిలో మౌలిక వసతులను ఆరా తీశారు. తహసీల్దార్ షబ్బీర్‌బాషా, ఎంపీడీఓ మహేష్, ఎంఈఓ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. టెట్‌ను మినహాయించాలని నిరసన చిత్తూరు కలెక్టరేట్ : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి సహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి మణి గండన్, నాయకులు రెడ్డెప్ప నాయుఠి డు, సుధాకర్‌రెడ్డి, ఎస్పీ బాషా, ఏకాంబరం, పార్థసారథి పాల్గొన్నారు. -
లింగనిర్ధారణపై క్రిమినల్ చర్యలు
చిత్తూరు కలెక్టరేట్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన పీసీపీఎన్టీ చట్టం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో అబార్షన్లపై నిఘా ఉంచి నివేదికల్ని ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆర్ఎంపీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ సుధారాణి, వైద్యాధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ్, అనిల్‌కుమార్, అనూష, లత ఉషశ్రీ, ఇంద్రాణి పాల్గొన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు జరిగే సమీక్షలో ఆరోగ్య, విద్య ఇతర కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారని వివరించారు. -
టిడ్కో లబ్ధిదారులపై వేధింపులు తగవు
చిత్తూరు కార్పొరేషన్: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారుల వేధింపులు తగవని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు స్పష్టం చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద డిపాజిట్ తీసుకొని ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అధికారంలో వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కూటమి ప్రభుత్వం టిడ్కో బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. మరో వైపు బ్యాంక్ అధికారులు మాత్రం లబ్ధిదారులను డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహాలు ఇచ్చాక రుణాలు కట్టకపోతే నోటీసులు ఇవ్వాలే గానీ ముందే ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోపీనాథ్, మణి, చంద్ర విజయ గౌరీ జమీలాబి, కుమారి పాల్గొన్నారు. -
మందుల్లేవ్!
కాణిపాకం: మందుల కొరత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వేధిస్తోంది. సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో అక్కడ చికిత్సలు అటుంచి అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అనేక మందులు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం మోయలేక అల్లాడుతున్నారు. దీనికితోడు 104 వాహనాల్లో కూడా మందుల కొరత పీడిస్తోంది. సెంట్రల్ డ్రగ్స్ నుంచే మందులు, మాత్ర ల సరఫరాలో జాప్యం ఉందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో ప్రజలు మంచంపడుతున్నారు. కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. స్క్రబ్‌టైఫస్ కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నా యి. వీటితోపాటు ఇతరత్రా వ్యాధుల బారినపడి ప్రజ లు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు అటుంచి మందు బిళ్లలు కూడా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులు చీటీలు రాసి ఇచ్చి పంపుతుండడంతో పేదలపై భారం పడుతోంది. ఆ మాత్రలు నిల్! ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచడంలో విఫలమవు తోంది. ప్రసూతి సేవలకు అవసరమైన ప్యాడ్స్ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులకు అవసరమైన మందులు కూ డా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేవు. ప్రస్తుతం జిల్లా లో వాతావరణ మార్పులతో ఎక్కువగా చిన్న పిల్లలు జలుబు, దగ్గు, జ్వరంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. ఒక వైద్యశాలలో సుమారు 50 ఓపీ లు వచ్చాయంటే అందులో పది మంది పిల్లలు ఉంటున్నారు. అయితే జలుబు, దగ్గుకు ఇచ్చే టానిక్‌లు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. అప్పుడు పరిస్థితి ఏంటో? జిల్లాలో ఇప్పటి వరకూ భారీ వర్షాలు కురిశాయి. వర్షా ల కారణంగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలుచోట్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా యి. మళ్లీ వర్షాలు ప్రారంభమైతే వీటి దాడి మరింత అధికమవుతుంది. విష జ్వరాలు, డెంగ్యూతోపాటు మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తా యి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి అటు వైద్యులను, ఇటు రోగులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు పరిస్థితిని ఊహించుకొని వారు మరింత కలవరపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. మాత్రలు లేవంటే ఎలా? మా ఊళ్లో పడినట్లు వర్షం యాడా పడలేదు. ఈ వర్షానికి దోమలు.. చిటుకు.. చిటుకుమని కరుస్తున్నాయి. వాతావరణం కూడా సరిగాలేదు. కారుమబ్బులు కమ్ముకుని చలి చంపేస్తోంది. ఈ చలికి చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఒకటే జలు బు, తలనొప్పి. మళ్లా జ్వరం కూడా వస్తా ఉంది. ఏం చేయాలి. ఊరికి దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే మాత్రలు ఏం లేవంటున్నారు. – గోవిందమ్మ, పెద్దతయ్యూరు, ఎస్ఆర్పురం మాత్రలు ఇస్తే చాలు జ్వరాలు పట్టి పీడిస్తుండాయి. అందరూ జ్వరా ల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా రు. ఆరోగ్య కేంద్రాలకు వెళితే డాక్టరు ఉండరు. డాక్టరు ఉంటే మందులు, మాత్రలు ఉండవు. ఆరోగ్య కేంద్రాలు వద్దని ప్రైవేటు ఆస్పత్రికి వెళుతున్నాం. అక్కడ ఫీజుతో కలిసి జ్వరమంటే రూ.1000 లాగేస్తున్నారు. ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా మందులు, మాత్రలు ఇవ్వాలి. – రవి, ఎస్ఆర్పురం పీహెచ్‌సీల్లో మందులు, మాత్రల కొరత ఈ మందులు ఎక్కడ? జిల్లా వ్యాప్తంగా 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ 100 నుంచి 200వరకు ఓపీలొస్తున్నాయి. సీజనల్ ప్రభావంతో ఆరోగ్య కేంద్రాలకు జ్వరం కేసుల తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రల సరఫరా లేదు. పారాసెటిమల్ 500 ఎంజీ, డైక్లోఫెనాక్, పాంటోప్, బీకాంప్లెక్స్, సిట్రిజన్ మందులు ప్రధానంగా లేవని తెలిసింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వాడే సెప్ట్రాన్, డాక్సీసైక్లోన్, నార్పోక్లైస్ కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే సిరఫ్‌లు పారాసెట్మాల్, అమ్రోక్స్, ఫ్రోజెనాల్డె, సిట్రిజన్ సిరఫ్‌లు లేవు. పెద్దలకు చలికాలంలో ఆయాసం ముంచుకొస్తుంటుంది. ఇలాంటి తరుణంలో సలాబుటమోల్ సిరప్ అత్యంత అవసరం కాగా..అవి ఆరోగ్య కేంద్రాల్లో లేవు. అలాగే 104లో కూడా మందుల కొరత పీడిస్తోంది. పలు రకాల రోగాలకు మందులు, మాత్రలు ఇవ్వలేక 104 సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. ఇదేమని అడిగితే సెంట్రల్ డ్రగ్స్ నుంచి సరఫరా లేదని అంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 175 రకాల మందులను అందుబాటులో ఉండాలి. కానీ వాటిలో పదుల సంఖ్యలో కూడా ఉండడం లేదు. జ్వరానికి ఉపయోగించే పారాసెట్మాల్ కూడా లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్ కొనుగోలు చేయ లేని వారు రోజుల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. దీనికితోడు వైద్య పరీక్షలకు ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు, పరికరాలు కూడా లేవు. అనేక చోట్ల బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
పోలీసులు నిబద్ధతతో పనిచేయాలి
చిత్తూరు అర్బన్: న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఒక్క ఫిర్యాదుదారుతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించి, నిబద్ధతతో పనిచేస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అభిప్రాయపడ్డారు. చిత్తూరులోలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 31 వినతులు అందాయి. ఎస్పీ తుషా ర్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకు న్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపు లు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదా లు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. బీజెపీలో పదవులు చిత్తూరు కార్పొరేషన్: బీజెపీలో పలు అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను నియ మించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు తెలిపారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కై లాసం (నగరి), కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా సుజిత్‌రెడ్డి (పూతలపట్టు), మహి ళా మోర్చా అధ్యక్షురాలిగా కవితరాజు (పలమనేరు), ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా శేఖర్ (జీడీనెల్లూరు), మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ ముబారక్ (పలమనేరు)లను నియ మించినట్లు ఆయన వివరించారు. ఈ ఆఫీస్ అమలు చేయాల్సిందే చిత్తూరు కలెక్టరేట్ : అన్ని శాఖల అధికారులు కచ్చితంగా ఈ ఆఫీస్ అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో ఈ ఆఫీస్‌ను అమలు చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 8 వరకు 68,998 అర్జీలు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 58,594 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను ప్రీ ఆడిట్ చేయాలన్నారు. డీఆర్వో మోహన్ కు మార్, డీఎల్డీవో రవికుమార్ పాల్గొన్నారు. -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఐరాల: వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రకు తెరదీశారని ఎంపీపీ మోహన్ మండిపడ్డారు. సోమ వారం సాయంత్రం రంగమ్మచెరువులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంటింటా తిరిగి సంతకాలు సేకరించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందవన్నారు. అలాగే దివిటివారిపల్లె, ఎర్రేపల్లె, చుక్కావారిపల్లె, నాగంవాండ్లపల్లె, వినాయకపురం, ఐకే.రెడ్డిపల్లెల్లో స్థానిక నేతలు ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతలు హరి, లోక, రాము, ఉమాపతిరెడ్డి, మహేష్, విజయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బుజ్జిరెడ్డి, గణపతి, శేఖర్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య విద్య ప్రజల హక్కు వడమాలపేట (పుత్తూరు): ఉచిత వైద్య విద్య ప్రజ ల హక్కుని వడమాలపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి స్పష్టం చేశారు. సోమ వారం పాదిరేడు, కదిరిమంగళం, వడమాల, బుట్టిరెడ్డికండ్రిగ, ఎస్వీపురం పంచాయతీల్లో వైద్య విద్య ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇంటింటికెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వైద్య విద్య ప్రైవేటీకరణపై గ్రామాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేంత వరకు ప్రజా ఉద్యమం కొనసాగుతుందన్నారు. సర్పంచ్ మంజులారెడ్డి, నాయకులు సుదర్శన నాయు డు, బత్తయ్య, కళ్యాణ్, పవన్, ఉమాపతి, రమేష్, జయంతు, తుకారం పాల్గొన్నారు. -
చిరుత దాడిలో ఆవు మృతి
చిరుత దాడిలో పాడి ఆవు మృతిచెందింది. ఈ ఘటన తవణంపల్లె మండలం, చెర్లోపల్లె సమీపంలో చోటు చేసుకుంది.మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చిత్తూరు జిల్లాలో ‘పచ్చ’ లాటరీ మూడు ముక్కలు.. ఆరు పేకాట స్థావరాలుగా విరాజిల్లుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల వారినే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోవడం.. దానికి అధికార పార్టీ నేతలతోపాటు కొందరు ఖాకీలు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. కూలి పనులు చేసే సామాన్య ప్రజలు ఈ రొంపిలోకి దిగి సర్వం పోగొట్టుకుని.. కుటుంబాలను వీధిన పడేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులుగానీ.. అధికార పార్టీ నేతలుగానీ అటువైపు కన్నెత్తి చూడక పోవడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. పచ్చలాటరీ! -
చివరి ఆశలు ఆవిరి
నష్టాలబాటలో వరి రైతులు! పలమనేరు: ఈ సారి వరి రైతులు నిండా మునిగిపోయారు. చెమటోడ్చి పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక కుమిలిపోతున్నారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్లో ఈ రబీకి సంబంధించి సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సన్నర కాలైన బీపీటీ, నర్మద, అమన్, ధనిష్ట, దొడ్డ రకాలైన జేజేఎల్, ఆర్ఎన్ఆర్ లాంటి రకాలను సాగుచేశారు. ఇందులో 2 వేల ఎకరాల దాకా ఇప్పటికే ఒబ్బిళ్లు జరిగాయి. మరో వవెయ్యి ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. కోతలు మొదలుకాగానే ఉన్నట్టుండి ధాన్యం ధరలు తగ్గాయి. మొన్నటి దాకా క్వింటాళ్ ధర రూ.2,500 దాకా ఉండగా ఇప్పుడు రూ.1,800 సైతం పలకడం లేదు. ఒబ్బిళ్ల సమయంలో తుపాన్లు, కూలీలు రాక ఎన్నో ఇబ్బందులు పడి పండిస్తే తీరా రైతుకు మిగిలేది నష్టమే. ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి ఎకరా పొలానికి వరి విత్తనాలు తెచ్చి నారుమడి వేయడానికి రూ.2 వేలు. ఆపై బురదమడి దున్నడానికి ట్రాక్టరుకు గంటకు రూ.1,200 చొప్పున ఏడు గంటలకు రూ.9,600, మడిచుట్టూ గెనాలు కొట్టేందుకు రూ.2వేలు అవుతుంది. నాటేందుకు ముందు పొలంలో రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువుకు రూ.2,600 అవుతుంది. వరినాట్లకు రూ.7వేలు, ఆపై చెత్త తీసేందుకు రూ.3వేలు అవుతోంది. ఈ సమయంలో యూరియా కోసం రూ.1,200 ఖర్చు పెట్టాలి. పంటకు చీడపీడల నివారణకు రూ.1000 అవుతుంది. పంట కోతకొచ్చాక యంత్రాల ద్వారా అయితే రూ.11వేలు, కూలీల ద్వారా అయితే రూ.10వేలు అవుతుంది. ఇవన్నీ పూర్తయి ధాన్యాన్ని ఎండబెట్టి బస్తాల్లో నింపేందుకు మరో వెయ్యి పెడితే ధాన్యం ఇల్లు చేరుతుంది. మొత్తం మీద నారుపోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరేందుకు ఎకరానికి రూ.40 వేలదాకా ఖర్చవుతోంది. చేలవద్దే కొంటున్న బయట రాష్ట్రాల వ్యాపారులు స్థానికంగా వరికి ధర లేదని తెలిసి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు, చింతామణి, శ్రీనివాసపుర తమిళనాడులోని తిమ్మిరి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లారీలతో వచ్చి రైతు పొలాల వద్దే నెమ్ముగా ఉన్న ధాన్యాన్ని కొంటున్నారు. ఆపై అక్కడే రైతుకు నగదు చెల్లిస్తున్నారు. పంటబాగా పండినా.. ఎకరా పొలంలో పంట బాగా పండితే 30 బస్తాలు (బస్తా 80 కేజీలు) లెక్కన 24 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. ఇప్పుడున్న ధరల మేరకు క్వింటాల్ రూ.1,800 చొప్పున రూ.43,200 చేతి కొస్తుంది. ఇందులో రైతు పెట్టిన పెట్టుబడి రూ.40వేలు పోతే చివరికి మిగిలేది రూ.3,200 మాత్రమే. కొనుగోలు చేయని ప్రభుత్వం గతంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయశాఖ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనేవారు. కాని చంద్రబాబు పాలనలో ధాన్యాన్ని కొనకపోగా కనీసం ధర కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించాలని పలువురు కోరుతున్నారు. -
సర్పంచ్ కుర్చీ మాయం
గంగాధరనెల్లూరు మండలంలో సర్పంచ్ కుర్చీ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డును బాగు చేయండి చిత్తూరు కలెక్టరేట్ : రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ను జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు ఆయన సోమ వారం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి విన్నవించా రు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వి.కోటలోని కేజీఎఫ్ నుంచి పట్రపల్లి, పి.కొత్తూరు, గోవిందపురం, నాగన్నగుట్ట, చిన్నచెరువు, కనగానపల్లి, దొమ్మిరిమిట్ట, చేర్నపల్లి, చెరువుముందరవాగు, జౌనిపల్లి, మావత్తూరు మీదుగా పలమనేరు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆర్అండ్బీ పరిధిలోని బెంగళూరు–చైన్నె రహదారుల పనులకు ఎక్కువ మొత్తం టన్నే జ్ లారీలు, టిప్పర్లతో ఇసుక, రాళ్లు తరలించడంతో దారి మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. పలు ప్రమాదాలు సైతం జరిగాయన్నారు. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. సరెండర్? చిత్తూరు రూరల్(కాణిపాకం): ఉమ్మడి జిల్లాలో ని సత్యవేడు మండలానికి సంబంధించిన ఓ పశుసంవర్థక శాఖ సిబ్బందిని ఆ శాఖ జిల్లా అధికారులు సరెండర్ చేశారని తెలిసింది. ఇటీవల ఆ సిబ్బందిపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. విచారణలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఆపై ఆ సిబ్బందిని సరెండర్ చేశారని శాఖ లోని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన విషయాలను ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో త్వరలో వెల్లడించనున్నారు. ఇతనొక్కడే కాదని.. మరింత మంది కూడా బయ టపడే అవకాశాలున్నాయని ఆ శాఖలోని పలువురు గుసగుసలాడుతున్నారు. -
ఏదీ.. ఆపన్న హస్తం?
వీధిన పడుతున్న రోడ్డు ప్రమాద బాధితులు ● సాయం అందించడంలో బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ● మాజీ డెప్యూటీ సీఎం ధ్వజం వెదురుకుప్పం: ‘రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడంలేదు. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి..’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులైన పేద ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వారి కుటంబాలకు బీమా ప్రీమియం గానీ, ఎలాంటి ఆర్థిక సాయం గానీ చెల్లించకపోవడంపై దారుణమన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హాయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఆయా బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో దిక్కుతోచడం లేదన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల కా లంలో సుమారు 14 మంది వివిధ రోడ్డు ప్రమాదా ల్లో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. వారికి నేటికీ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారికి సైతం ఎలాంటి సాయం అందలేదన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఏం ఒరిగిందో చెప్పాలన్నారు. -
పింఛన్ తొలగించారు
టీడీపీ నేతల సూచనలతో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించడం దారుణమని ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ విమర్శించారు. ఈ మేరకు బాధిత దివ్యాంగ పింఛనర్లు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐరాల మండలం, వడ్రాంపల్లెలో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛనర్లకు అన్యాయం జరిగిందన్నారు. మండలంలోని చినకాంపల్లి సచివాలయ పరిధిలో ఉన్న వడ్రాంపల్లెలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌నాయుడు, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం, మునేంద్ర, అలాగే 45కొత్తపల్లికి చెందిన దామోదర్‌నాయుడు అర్హులైనప్పటికీ టీడీపీ నాయకులు కక్ష పూరితంగా వారి పింఛన్లను తొలగించారన్నారు. వెంటనే వారి పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. -
కుల ధ్రువీకరణ పత్రం లేదు
తమ కులానికి కులధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పిరమల్లై కల్లర్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సౌందర్రాాజా వాపోయారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. జిల్లా లోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, తదితర ప్రాంతాల్లో 2 వేల కుటుంబాలు తమ కులానికి చెందినవారున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో తాము ఓబీసీ జాబితాలో ఉన్నట్లు చెప్పారు. ఏపీలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మా గోడు వినేదెవరయ్యా?
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా....మా గోడు పట్టించుకోండి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో వివిధ సమస్యలపై 370 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తెలిపారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న చెర్లోపల్లి గ్రామస్తులు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకుంటున్న అర్జీదారులుతమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా..! అంటూ జిల్లాలోని చెర్లోపల్లి గ్రామస్తులు తేజశ్రీ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇంటి స్థలాలు లేక బాడుగ ఇళ్లల్లో ఉంటున్నామన్నారు. తేనెబండ గ్రామంలోని సర్వే నం.1121, 654లో ప్రభుత్వ భూమి ఉందని, గ్రామ కమిటీ తీర్మానించిందన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారిలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ కులస్తులు ఉన్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. విభజన వొద్దు జిల్లాలోని వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ విభజన వొద్దని ఆ గ్రామస్తులు రవి, నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. తమ పంచాయతీని బొమ్మాయిపల్లి, దేవళంపేట పేరుతో రెండుగా విడగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అలా జరిగితే బడుగు, బలహీన వర్గాలుండే బొమ్మాయిపల్లె ప్రజలు పూర్తిగా వెనుకబడుతారన్నారు. న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా -
నయా స్కామ్!
– అరికట్టలేకపోతున్న జీఎస్టీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జీఎస్టీ స్కామ్ పుట్టగొడుగులా పుట్టి నేడు మహా వృక్షంలా వ్యాపిస్తోంది. ప్రజలకు అవగాహన లేకపోవడంతో సామాన్యులకు మంచి మాటలు చెప్పి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నియంత్రించాల్సిన జీఎస్టీ అధికారుల చర్యలు నామామత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరికట్టలేరా? ఇనుప వ్యర్థాలు(స్కాప్) వ్యాపారం మోసం చేసి రూ.కోట్లు సంపాదించవచ్చని గతంలో చిత్తూరుకు చెందిన వ్యాపారి రుచి చూపించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో బోగస్ కంపెనీలను సృష్టించి లేని వ్యాపారాన్ని చేసినట్లు బిల్లులు సృష్టించాడు. కట్టని పన్నులకు బిల్లులు పెట్టి అప్పనంగా ఐటీసీ రూ.కోట్లు గడించాడు. ఈ తతంగం మరువకముందే నగరంలోని ఓ చిరు వ్యాపారిని మోసగించాడు. ఆ వ్యాపారికి దాదాపు రూ.12 కోట్ల వరకు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసు రావడంతో కొత్త స్కామ్ బయటపడింది. అదుపులో కీలకవ్యక్తి స్కాప్తో అవినీతి రాజ్యాన్ని సృష్టించి కోట్లు వెనకేసిన వ్యాపారి.. ఇప్పుడు చిరు వ్యాపారుల జీవితాలతో అడుకొని ఐటీసీ దోచుకుంటున్నాడు. ఇతన్ని సంబంధిత అధికారులు అదుపులో తీసుకొని పలు విషయాలు రాబట్టినట్లు సమాచారం. గతంలో బోగస్ సంస్థల అకౌంట్లను లాక్ చేయగా వాటి పై నకిలీ వ్యక్తులతో హైకోర్టులో కేసు వేసి సమస్యను పరిష్కారించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకుల అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. అకౌంట్‌దారుడు లేకుండా ఖాతాలను ఎలా తెరుస్తున్నారు.. ఇందులో వారి ప్రమేయం ఎంత అనే వాటిపై సందేహాలు కలుగుతున్నాయి. ఇంటి దొంగల సహకారం లేనిదే ఇంత మొత్తంతో మోసాలు చేసే అవకాశాలు ఉండవు. జీఎస్టీ ఖాతాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ, బ్యాంక్ అధికారులు, చార్టడ్ అకౌంట్స్ సహకారంత ఈ సిండికేటు జరిగినట్లు తెలుస్తోంది. కొత్త ప్లాన్స్‌తో మోసాలు నగరంలో తోపుడు బండ్లు మీద చిరుతిండ్లు, కూరగాయలు, పండ్లు విక్రయించే వారి అమాయకత్వాన్ని వాడుకొని ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్లు తీసుకుంటారు. చిరువ్యాపారి వివరాలతో బ్యాంక్ అకౌంట్ తెరచి సీజీఎస్టీకి లైసెన్స్ తీసుకుంటున్నారు. అనంతరం వాటి ద్వారా బోగస్ కంపెనీల పేరుతో చేయని వ్యాపారిన్ని చేసినట్లు బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి ఐటీసీ వసూలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరుకు చెందిన చిరు వ్యాపారికి రూ.12.32 కోట్లు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో అవాక్కయ్యాడు. నగరంలోనే వందలాది చిరువ్యాపారాలను మోసగించి ఈ దండా సాగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా వందల కోట్లు ఐటీసీ కై ్లమ్ చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అరహం పెట్రో అండ్ నాన్ పెట్రో సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, మదీనా స్టీల్స్, జెడ్ఎఫ్ ట్రేడర్స్, యార్ స్టీల్స్, ఎమ్మార్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ వంటి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి వీటితో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు గడించినట్లు అధికారులు గుర్తించారు. -
టీడీపీ నేత అత్యుత్సాహం
– అనుమతి లేకుండా పాఠశాలలో తన తండ్రి విగ్రహం ఏర్పాటు సాక్షి టాస్క్ ఫోర్సు: టీడీపీ నేత అత్యుత్సాహం ప్రదర్శించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని కొళత్తూరు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన స్టేజీని శనివారం ప్రారంభించాడు. దీంతో పాటు అదే స్టేజీ మీద తన తండ్రి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడు. అయితే గ్రామస్తులు, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల ప్రాంగణంలోని స్టేజీ మీద తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా టీడీపీ నాయకుడు తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. పీఎస్సై మారప్ప గ్రామానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. దీనిపై ఎంఈఓ గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా హెచ్ఎం నివేదికను, పాఠశాల ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
అమ్మా..నాన్నా.. వెళ్తున్నా.. గొడవ పడొద్దు!
వి.కోట: మనోవేదనతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముదిమడు గు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ సోమశేఖర్‌రెడ్డి కథనం.. మండలంలోని ముదిమడుగు గ్రామానికి చెందిన తిమ్మరాజు, రేణుక దంపతుల కుమార్తె అణుశ్రీ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తర గతి చదువుతోంది. ఈ క్రమంలో దంపతులు ఇంట్లో తరచూ గొడవ పడేవారు. తీవ్ర మనస్తాపానికి గురైన అణుశ్రీ ‘అమ్మా, నాన్నా నేను చనిపోయిన తర్వాత అయినా మీరిద్దరూ గొడవ పడకుండా ఉంటారని కోరుకుంటున్నా’ అని లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అణుశ్రీ తగ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. జాతీయ బేస్ బాల్ పోటీలకు ఎంపిక బంగారుపాళెం: జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు మండలంలోని ఎగువ రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిరోష ఎంపికై నట్లు ఇన్చార్జి హెచ్ఎం రామమూర్తి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో గత నెల 29 నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్ర స్థాయి అండర్–14 బేస్‌బాల్ పోటీలు నిర్వహించారన్నారు. ఆ పోటీలలో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నిరోష పాల్గొని జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. 2026 జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న బేస్‌బాల్ పోటీలలో నిరోష పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థి నిరోషను వ్యాయామ ఉపాధ్యాయుడు గురుప్రసాద్ తదిరతులు అభినందించారు. చిరుత దాడిలో ఆవు మృతి తవణంపల్లె: చిరుత దాడిలో ఆవు మృతిచెందిన ఘట న మండలంలోని చెర్లోపల్లె సమీపం, శివ కోన గుట్టలో చోటుచేసుకుంది. ఫారెస్టు ఎఫ్బీఓ జబి సమాచారం మేరకు.. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ఎన్.పరదేశి తమ పశువులను మేత కోసం ఆదివారం శివకోన గుట్టలోకి తరలించా డు. అక్కడ మేత మేస్తున్న పాడి ఆవుపై చిరుత దాడి చేసింది. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరి గి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం శివకోనగుట్టకు వెళ్లి గాలించాడు. గుట్టలో ఎత్తైన భాగంలో రెండు గుండ్లు మధ్యలోని గుహలో చిరుత పులి చంపి తినేసి పడేసిన ఆవు కళేబరాన్ని గుర్తించాడు. ఆపై ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్బీఓ జబి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ అసిస్టెంట్ ద్వారా పోస్టమార్టం చేయించి ఆవును అక్కడే ఖననం చేయించారు. -
సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం
నగరి : కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. మున్సిపల్ పరిధి 11వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం కార్యదర్శి గుడుబా ఆధ్వర్యంలోనూ, సత్రవాడలో మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు తెలు పగా జనం ముందుకు వచ్చి సంతకాలు చేపట్టడంతో ఒక ఉద్యమంలా కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. వైద్య కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యా ర్థుల వైద్య విద్యకు గండికొట్టి జేబులు నింపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కళైసెల్వన్, కేశవన్, రవి, గుణ, అయ్యప్పన్, మోహన్‌రాజ్, భూపాలన్ పాల్గొన్నారు. ఉచిత వైద్య విద్య కోసం పోరు వడమాలపేట (పుత్తూరు) : ఉచిత వైద్య విద్య పేదలకు అందే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ నాయకుడు గాంధీ స్పష్టం చేశారు. ఆది వారం వడమాలపేట మండలం కాయం గ్రామంలో గాంధీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేని చంద్రబాబుకు ఉన్నవాటిని ప్రైవేటీకరించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. నేడు గ్రామాల్లో ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నా రు. అలాగే వడమాలపేట మండలం బట్టికండ్రిగ, ఎస్వీపురం, వడమాలపేటలో పార్టీ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి, సురేష్‌రాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. వేణునాధం, చంద్ర, నిరంజన్‌రెడ్డి, నాని, తుకారాం, జయంతు, గిరిబాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వెల్లువెత్తిన నిరసన సంతకం పూతలపట్టు(యాదమరి) : కోటి సంతకాల సేకరణతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిస్తేజం మొదలయ్యిందని పూతలపట్టు ని యోజకవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తలపులపల్లి పంచాయతీలో బాబు రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు స్వ చ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైద్య కళాశాలలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న స్వార్థ పూరిత నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళతా మని చెప్పారు. స్థానిక సర్పంచ్ సుబ్రమణ్యం, ఉప సర్పంచ్ రెడ్డప్ప రెడ్డి, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.హరి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉద్యమంలా సంతకాల సేకరణ బైరెడ్డిపల్లె : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు మహిళా, రైతు సంక్షేమం సక్రమంగా అందిందని రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం ఆదివారం మండల పరిదిలోని పలు గ్రామాల్లో ఉద్యమంలా సాగింది. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. బైరెడ్డిపల్లెలో సంతకాలు సేకరిస్తున్న రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి క్రిష్ణమూర్తి , 11వ వార్డులో సంతకాలు చేస్తున్న ప్రజలు , సత్రవాడలో.. , పూతలపట్టులో కోటిసంతకాల కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు -
గంగమ్మా..దీవించమ్మా
బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.ఉద్యమం.. మహోద్యమం! సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 పుంగనూరు మున్సిపాలిటీలో కోటి సంతకాల సేకరణ ప్రతులను అందుకుంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్)చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 92 వేల సంతకాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్న్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో 8వేల సంతకాలు కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో నియోజక వర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి కానుంది. 5 కేంద్రాల్లో టెట్ – 10 నుంచి పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : ఐదు కేంద్రాల్లో టెట్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 5 సెంటర్లలో ఈనెల 10వ తేదీ నుంచి 21 వరకు టెట్ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని మదర్‌థెరిస్సా (పలమనేరు), ఎస్వీ సెట్ (ఆర్వీఎస్ నగర్), వేము ఇంజినీరింగ్ కళాశాల (పి.కొత్తకోట, పూతలపట్టు మండలం), సీతమ్స్ (చిత్తూరు), కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (కుప్పం)లో టెట్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలన్నారు. ఒరిజనల్ ఐడీ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 7386408270, 9885506094 నంబర్లలో సంప్రదించాలన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. కాణిపాకం.. భక్తజన సందడి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి పోటె త్తారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు స్వామి దర్శనం కోసం భారీగా వచ్చారు. వీరి రాకతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆలయం ఆవరణం భక్త జనంతో కిక్కిరిసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనంతో పాటు వీఐపీ గేటు గుండా భక్తులు కిటకిటలాడారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. సంతకం..సమర శంఖారావంసిరా చుక్కలు సంతకాల రూపం ధరిస్తున్నాయి.. అక్షర ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ సంతకాలే సమర శంఖారావం పూరిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. సర్కారుపై దండెత్తుతున్నాయి.. వైద్య విద్యను బాబు ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్నాయి. చిన్న ఉద్యమంగా మొదలై మహోద్యమంగా అవతరిస్తున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల యాగంలో పాలుపంచుకోవడానికి ఊరూవాడా సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలపై ప్రైవేటు పెత్తనం వద్దంటూ సామాన్య, మధ్యతరగతి జనం స్వచ్ఛందంగా సంతకం చేసి, తమ నిరసనను వెలిబుచ్చుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం.. మహాద్యమంలా సాగుతోంది. పార్టీలకతీతంగా విద్యార్థినీ విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతుండడంతో తిరుపతి, చిత్తూరు, జిల్లాల్లో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కళాశాలలు 2023–2024 మధ్య కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఆ ఐదు కళాశాలల ద్వారానే అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతోంది. పూతలపట్టు: యాదమరిలో కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ (ఫైల్)నగరి: ముడిపల్లెలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్)చిత్తూరు : సంతకాల సేకరణలో సమన్వయకర్త విజయానందరెడ్డి, పలమనేరులో సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , కుప్పం: కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ భరత్ , కార్వేటినగరం: సంతకాల సేకరణలో సమన్వయకర్త కృపాలక్ష్మి (ఫైల్ ఫొటోలు)ఎవరి స్వలాభం కోసం.. ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్మించిన మెడికల్ కళాశాలను ఎవరి స్వలాభం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మించాల్సింది పోయి ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడం దారుణం. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ పేద విద్యార్థులకు తీవ్ర అన్యా యం చేసేందుకే చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇంక సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాలల పనులు పూర్తి అవుతాయి. అది చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం బాధాకరం. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేరా? అని ప్రశ్నిస్తున్నాం. – పురుషోత్తం, చిత్తూరు నగరం ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి. ప్రైవేట్ పరం చేయకూడదు. వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగా ల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలు గుతుంది. ఇప్పటికే వైద్యం, విద్య రెండూ ఖరీదయ్యాయి. మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం తన నిర్ణ యం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే వైద్య విద్య పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుంది. – దినేష్, చిత్తూరు నగరం -
సార్.. ఎందుకింత మంది పోలీసులు?
– పోలీసుల బందోబస్తు మధ్య మండల సమావేశం బంగారుపాళెం : స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కు ఉదయం 10 గంటలకు పలమనేరు డివిజన్ పరిధి లోని పది మంది పోలీసులు వచ్చి ఆఫీస్ వద్ద కూర్చున్నారు. ఆదివారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పోలీసులను చూస్తూ సభ్యులు ఇంత మంది పోలీసులు ఎందుకు వచ్చారు. ఏమై ఉంటుంది. ఏమి జరుగుతుందో..ఏమోనని మనసులో అనుకుంటూ సమావేశ మందిరం వైపు సాగా రు. 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. యథా విధిగా సమావేశంలో అధికారులు అజెండాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి వివరించారు. సభ్యు లు వారి సందేహాలు, సమస్యలపై ప్రస్తావించారు. సమావేశం మధ్యలో నుంచి ఓ సభ్యురాలు బయటకు వచ్చి తన సందేహాన్ని తీర్చుకునేందుకు వచ్చింది. అక్కడే ఉన్న ఓ పోలీసన్నను ఇలా అడిగింది. సార్, మండల సర్వసభ్య సమావేశానికి ఇంతమంది పోలీసులను బయట నుంచి ఎందుకు రప్చించారు. ఏమి జరుగుతోంది..? అని అడిగింది. నేను గతంలోనూ ప్రజాప్రతినిధి హోదాలో పలుసార్లు మండల సర్వస భ్య సమావేశాలకు హాజరయ్యాను. ఇలా భారీ స్థాయి లో మండల సమావేశానికి బందోబస్తు లేదు. గత నాలుగైదు సమావేశాలప్పటి నుంచి ఇలా పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఎందుకు...? అసెంబ్లీ సమావేశాల తరహాలో పోలీసులను మండల సమావేశానికి బందోబస్తుగా రావడం ఆశ్చర్యంగా ఉంది సార్ అని అన్నారు. ఆ పోలీసన్న నోటి నుంచి చిరునవ్వు తప్ప సమాధానం లేదు. స్థానిక సీఐ పర్యవేక్షణలో ఓ ఎస్ఐ, 10 మంది పోలీసులు మండల సమావేశానికి బందోబస్తుగా రావడంపై చర్చగా మారింది. మండలంలో మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్సా ర్సీపీ పార్టీకి చెందిన వారే. టీడీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడ మండల సమావేశంలో నిలదీస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
వైభవంగా భక్త కనకదాసు ఉత్సవాలు
వి.కోట : మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను కురబలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌శాఖ మంత్రి సవిత, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎమ్మెల్యే వర్తూర్ ప్రకాష్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు పాల కలశాలతో కనకదాసు విగ్రహం వరకు ఊరేగింపు చేపట్టి భక్త కనకదాసు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కురబలు తమ సంప్రదాయ పద్ధతిలో భక్తుల తలపై టెంకాయలు కొట్టి వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర మంత్రి సవిత మాట్లాడుతూ.. కురబలు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కురబ సంఘం అద్యక్షుడు కృష్ణప్ప, ప్రదాన కార్యదర్శి అమర్‌గౌడ్, స్థానిక నేతలు రామచంద్రా నాయుడు, రంగనాథ్, ఈశ్వర్ గౌడ్ , దీరజ్ కురబ కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్మోహన్ రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఆ సంఘం 79వ వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించారు. ముఖ్య అతిధులు, జిల్లా ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, పరిశీలకులుగా బాలగంగిరెడ్డి, చిత్తూరు జిల్లా కు చెందిన గంటామోహన్ తొలుత ఎస్టీయూ జెండాను ఎగురవేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఇలియాస్ భాషా, ఆర్థిక కార్యదర్శిగా పురుషోత్తం, గౌరవ అధ్యక్షునిగా పీతాంబరరాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా గంటామోహన్, దేవరాజులురెడ్డి, చంద్రన్, చంద్రశేఖర్‌నాయుడు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కమాలపతి, బొబ్బిలిరెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శులుగా కిషోర్‌కుమార్‌రెడ్డి, సుల్తాన్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేష్‌కుమార్, గణపతి, కోదండయ్య, కుమారస్వామిరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్‌గా రాధాకుమారి ఎన్నికయ్యారు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్సీపీ పదవులు ఇస్తూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర వైఎస్సార్‌టీఎఫ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన కమ్రుద్దీన్, జిల్లా వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన సోమ చంద్రరెడ్డి, జిల్లా ఆర్టిషన్ విభాగ అధ్యక్షుడిగా జీడీ నెల్లూరుకు చెందిన కొత్తపల్లె మోహన్, నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన సద్దాం, నియోజకవర్గ వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షులుగా నగరి నుంచి రామచంద్రారాజు, పలమనేరు నుంచి గోవింద్‌రెడ్డి, పుంగనూరు నుంచి మోహన్‌రెడ్డి, పూతలపట్టు నుంచి కోదండరామిరెడ్డి, చిత్తూరు నుంచి కోతండాన్లను నియమించారు. అలాగే జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కల్చరల్ విభాగ అధ్యక్షుడిగా మునేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా సుమతి, సుబ్రమణ్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వెంకటరమణ, సుధాకర్, కుప్పయ్య, కార్యదర్శులుగా గణేష్‌రెడ్డి(గౌతమ్), గోపి, జగదీష్‌రెడ్డి, ఇమ్రాన్, గోవిందస్వామి, ఏడుగురు ఈసీ మెంబర్లను నియ మించారు. కార్వేటినగర మండల ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ధర్మయ్య, ఉపాధ్యక్షులుగా చల్లా మోహన్, విష్ణువర్మ, ప్రధాన కార్యదర్శులుగా చంద్ర, యోగానందరెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్య దర్శులుగా ఎం.సుదర్శన్, బాలసుందరన్, సబ్దార్, రాజేంద్ర, జగన్మోహన్రెడ్డి, ఆరుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటినగర మండల ఐటీ విభాగం అధ్యక్షుడిగా చరన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా తేజువర్మ, కొండూరు హరికిషన్, ప్రధాన కార్యదర్శులుగా పురుషోత్తం, గోపాల్‌రెడ్డి, జ్యోత్స ్న, తులసీరామ్రెడ్డి, కార్యదర్శులుగా జగదీష్‌రెడ్డి, ధనశేఖర్‌రెడ్డి, సాయి ప్రతాప్‌రెడ్డి, రూపేష్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, ఎ.జగదీశ్వర్, 8 మందిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటిన గర మండలం వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షులుగా మున్నా, వి.రెడ్డి అత్తూరు, ప్రధాన కార్యదర్శులుగా లవకుమార్, మదన్‌రెడ్డి, గిరిప్రసాద్, కార్యదర్శులుగా నరేష్, రఘురెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, సి.వెంకటేష్‌రెడ్డి, ఎస్.కే.అల్లబకాష్, దాము రెడ్డి, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు. వైఎస్సార్టీయూసీ విభాగ అధ్యక్షుడి శ్యామ్, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి, జ్యోతిశ్వరన్, ప్రధాన కార్యదర్శులుగా ము రళీకృష్ణ, రమేష్‌రెడ్డి, హరిబాబు, లోకేష్‌రెడ్డి, కార్యదర్శులుగా సుబ్రమణ్యం, లాల్‌బాషా, గురవయ్య, రమే ష్, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు. -
జిల్లా విద్యాశాఖ కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఆదివారం జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వీటికి ఎన్నికల అధికారిగా రాజేంద్రప్రసాద్, పరిశీలకులుగా పద్మకుమారి వ్యవహరించారు. నూత న కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా కుమార్ (సూపరింటెండెంట్, సమగ్రశిక్ష), ప్రధాన కార్యదర్శిగా చైతన్య (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం), కోశాధికారిగా గోపాల్ (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా రమేష్, నాగరాజు, రెడ్డిశేఖర్, ఎన్.కుమార్, రహమత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బాలాజీ, సహాయ కార్యదర్శులుగా సుల్తానా, రేణుకావతి, దీపిక, తులసీరామ్, రాజేష్, మహిళా కార్యదర్శిగా కృపావతి, మెంబర్లుగా రవిశేఖర్, సాయిప్రశాంతి, యువరాజ్, మునిరాజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఏపీ జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయం కూల్చివేతపై వివాదం శాంతిపురం : పంచాయతీ కేంద్రమైన సి.బండపల్లిలో పురాతన శ్రీకోదండరామ స్వామి ఆలయం, దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. గ్రామంలో సుమారు 300 ఏళ్ల చరి త్ర ఉన్న కోదండరామస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఆ మేరకు నిధుల సమీకరణ చేశారు. వీరు ప్రభుత్వ సాయం కోరడంతో అధికారులు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కొందరు ఆదివారం జేసీబీతో ఆలయాన్ని, కమ్యూనిటీ భవనాన్ని కూలదోశారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారిపై కుక్కల దాడి శ్రీరంగరాజపురం : ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన మండలంలోని క్షీరసముద్రం దళితవాడలో చోటుచేసుకుంది. బాధిత చిన్నారి తండ్రి మధు కథనం మేరకు.. ఆదివారం కావడంతో చిన్నారి రిచ్లిన్ (9) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుక్కలు ఒకసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రిచ్లిన్కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. జిల్లా అధ్యక్షులు కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య -
పల్లె వైద్యం..పేదలకు దూరం
కాణిపాకం : చంద్రబాబు సర్కారు రాకతో వైద్య ఆరో గ్య సేవలు కుంటుపడుతున్నాయి. పల్లె వైద్యం పక్కా దారి పడుతోంది. క్షేత్రస్థాయిలోని వైద్య వ్యవస్థను నీరుగారుస్తోంది. ఏఎన్ఎంల సొంత సేవలను వదిలించుకునేలా చేస్తోంది. అదనపు పనులు అంటగడుతోంది. మండల అధికారులతో మాటలు పడాల్సి వస్తోంది. ప్రశ్నిస్తే.. కడుపు కోతలు పెట్టిస్తోంది. తద్వా రా వైద్య ఆరోగ్య సేవలు, సర్వేలు నత్తనడకగా మారుతున్నాయి. దీంతో ఏఎన్ఎంలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఈ గోడును ఆ సంఘం నేతలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించారు. సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సిబ్బందికి ఇతర పనులు, సర్వేలకు పరిమితం చేసింది. తద్వారా సచివాలయ సేవలకు ప్రజలు దూరమయ్యారు. మండల స్థాయికి పరుగులు తీస్తున్నారు. ఇదే మాదిరిగానే విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలు దూరం అవుతున్నాయి. ఈ కారణంగా పల్లైవెద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. కేంద్రాల్లో వైద్య సిబ్బంది కనుమరుగవుతున్నారు. ప్రస్తుతం సిబ్బందిని ఇతర సేవలకు వినియోగిస్తుండడంతో పేద ప్రజలకు సేవలు దూరం అవుతున్నాయి. చేయకుంటే వేతనాలపై వేటు జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 464 విలేజ్ హెల్త్ క్లినిక్‌లున్నాయి. వీటి కింద సచివాలయ ఏఎన్ఎంలు 464 మంది, అర్బన్‌లో ఏఎన్ఎంలు 103 మంది, సెంకడ్ ఏఎన్ఎంలు 84 మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా సచివాలయ ఏఎన్ఎంలను వారి పరిధిలో జరిగే సర్వేలు చేయమని పలువురు ఎంపీడీఓలు ఒత్తిడి తెస్తున్నా రు. వాళ్లు చెప్పిన పనిచేయని పక్షంలో నోటీసులు ఇస్తున్నారు. లేకుంటే జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికితోడు డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్సబర్సింగ్ ఆఫీసర్) కూడా ఏఎన్ఎంలపై పెత్త నం చలాయిస్తున్నారు. వాళ్ల సర్వేలను కూడా చేయాలని, లేకుంటే ఎంపీడీఓకు రిపోర్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సర్వేలకు తలొగ్గని పక్షంలో డీడీఓ లు జీతాల్లో జాప్యం చేయిస్తున్నారు. దీనికారణంగా వైద్య ఆరోగ్య సేవలు పల్లె జనానికి దూరమయ్యాయి. ఎంఎల్హెచ్పీలపై ప్రభావం ఏఎన్ఎంలను పట్టి పీడిస్తున్న అదనపు పనులు ఇప్పుడు..ఎంఎల్హెచ్పీలపై ప్రభావం చూపుతోంది. ఐరాల మండలంలోని ముగ్గురు ఎంఎల్‌హెచ్‌పీలను ఇతర పనులు చేయాలని ఇటీవల అక్కడి మండల, డీడీఓలు ఒత్తిడి తెచ్చారు. ఈవిషయాన్ని వెంటనే వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యం దృష్టికి తీసుకొచ్చారు. వారు అదనపు పను లు చేయొద్దని, వైద్య సేవలు మాత్రమే చూడాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంలు వైద్య సేవ లు మాత్రమే చూసేవారు. విధిగా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించేవా రు. మంగళవారం ఆశా మీటింగ్, బుధవారం కేంద్రాల్లో వ్యాక్సినేషన్, శనివారం క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్, మీటింగ్‌లు, శిక్షణ కార్యక్రమాలు హాజరవుతూ..సొంత సర్వేలను చూసుకునేవారు. దీనికి తోడు విలేజ్ హెల్త్ క్లినిక్‌కు వచ్చే వారికి మందులు, మాత్రలు ఇచ్చుకుంటూ..వైద్య సేవలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేవారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పేదలకు దూరం అయింది. ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్రాలు వదిలి అనధికారిక సేవలకు పరిమితమవుతున్నారు. పింఛన్ల పంపిణీ, ఓటరు పరిశీలన, ఆధార్ సీడింగ్, యోగా డే, నాన్ ఏపీ రెసిడెంట్, రేషన్‌కార్డు పంపిణీ, ఇంటింటా సర్వేలతో పాటు సచివాలయ పరి ధిలో జరిగే వాటన్నింటికి వారిని బాధ్యులు చేస్తున్నారు. కొందరు సచివాలయ సిబ్బంది తలకు మించిన సర్వేలు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఆ పనులను కూడా ఏఎన్ఎంలకు అంటగడుతున్నారు. బలవంతంగా సర్వేలు చేయిస్తున్నారు. చేయని పక్షంలో మండల అధికారులు నరకం చూపిస్తున్నారు. విజృంభిస్తున్న విష జ్వరాలు పల్లెల్లో వైద్య సేవలు దూరం కావడంతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం పల్లె, పట్నం తేడా లేకుండా విషజ్వరాల ముప్పు ను తెచ్చిపెడుతున్నాయి. ఇందుకు తగ్గట్టు పల్లెల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండడం లేదు. సీజనల్ వ్యాధుల కట్టడి చేయలేకపోతున్నారు. స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే...అదనపు పనులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక స్క్రబ్ టైఫస్ కేసులు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని జనానికి మందు బిల్లులు ఇచ్చేవారు కూడా కరువుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు ఇచ్చేవారు దూరమవుతున్నారు. ఎన్సీడీ–4, క్షయ, కుష్టు వ్యాధి తదితర సర్వేలన్నీ కూడా వెంటాడుతున్నాయి. ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా మళ్లీ యథావిధిగా సాగుతోంది. వైద్య సిబ్బంది సొంత శాఖ పనులు తప్ప..ఏ ఇతర పనులు చేయకూడదని జీఓలు ఉన్న వాటిని పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కానీ పక్షంలో రోడెక్కడం కాయమని వైద్య సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణంలోని బండ్లవీధికి చెందిన విష్ణుతేజ(28) తన దుకాణంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలనున్న వారు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మరోవైపు అతడి ఒంటిపై ఐదు చోట్ల కత్తిపోట్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా ఇది ఆత్మహత్య లేక హత్య అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది. -
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఈనెల 22న తలపెట్టిన మామిడి రైతుల చలో చిత్తూరు కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని మామిడి రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని ఎస్టీ యూ కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు మురళీ మాట్లాడుతూ.. గుజ్జు పరిశ్రమలు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం మామిడి రైతులకు కిలోకు రూ. 8 ఇవ్వాల్సి ఉందన్నారు. పరిశ్రమలు ఆరు నెలలు గడుస్తున్నా బిల్లుల చెల్లింపులో జాప్యం చేసి తీరా రూ.4 చెల్లిస్తోందన్నారు. ఇదీ చాలా దారుణమన్నారు. మళ్లీ పూతకొచ్చే సమయం ముంచుకొస్తోందన్నారు. గిట్టుబాటు ధర ప్రకారం ఇవ్వాల్సి న బకాయిల కోసం ఈనెల 22వ తేదీన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సురేంద్రన్, సంజీవరెడ్డి, మునిరత్నం నాయుడు, ఉమాపతి నాయుడు, మోహన్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. -
రౖపెవేటీకరణపై అంకుశం
కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు కావడంలో వైఎస్సార్సీపీ నేతలు సఫలీకృతం అయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు , ప్రజల నుంచి ఊహించని ఆదరణ లభించింది. దీంతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఊరూ వాడ ఏకమై సంతకాల సేకరణ ఉద్యమంలా చేపడుతున్నారు. బంగారుపాళెం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ అన్నా రు. శనివారం బంగారుపాళెంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో సునీల్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించి ప్రజల మనస్సులో నిలిచిపోయాడన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు వ్య క్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసమే ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరుబాట సాగిస్తోందన్నారు. అదే విధంగా మండలంలోని ఆండారెడ్డిపల్లె, తగ్గువారిపల్లెలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, రఘుపతిరాజు, కృష్ణమూర్తి, ప్రకాష్‌రెడ్డి, థామస్, కిషోర్‌కుమార్‌రెడ్డి, సర్దార్, వడ్డెర కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మొగిలీశ్వర్, రెడ్డెప్ప, షాకీర్, మహేంద్ర, గజేంద్ర, జగదీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య కాలేజీలను బినామీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర పెద్దపంజాణి: వైద్య కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలకు తీవ్ర నష్టం కలుగుతుందని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వారు శనివారం రాయలపేట, కొళత్తూరు, ముత్తుకూరు, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు పిల్లలు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు. వాటిని చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో తమ వారికి ఇచ్చుకునేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుహేబ్, మేధావుల ఫోరం మండల అధ్యక్షుడు గుర్నాథరెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్, రవికుమార్, నాయకులు మార్కొండయ్య, రాజా, మంజునాథరెడ్డి, హనీఫ్ బాషా, రాజన్న, ముబారక్ పాల్గొన్నారు. బైరెడ్డిపల్లెలో అనూహ్య స్పందనబైరెడ్డిపల్లె : ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. బైరెడ్డిపల్లెలో శనివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లబించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కార్తిక్, మండల యూత్ ప్రెసెడెంట్ మహేష్‌బాబు, వైస్సార్సీపీ నేతలు జయకుమార్‌రెడ్డి, తబ్రాజ్బాష, చంద్రశేఖర్, కుమార్, దినేష్ పాల్గొన్నారు. -
జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు
చిత్తూరు అర్బన్ : ‘‘ పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది గతనెలాఖరు నాటి సంఖ్య. పెండింగ్ కేసుల పరి ష్కారంపై సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు పర్యవేక్షిస్తోంది. కేసుల పరిష్కారంలో న్యాయమూ ర్తులు చొరవ చూపించాలి. ప్రతి కోర్టుకు నిర్దేశించిన కేసుల పరిష్కార లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందే..’’ అంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పోలిస్తే.. కొత్త కేసుల నమోదు సంఖ్య ఆశ్యర్యాన్ని కలిగిస్తోందన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. వయో వృద్ధులకు సంబంధించిన కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా జడ్జిలు చొరవ చూపాలన్నారు.సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు గురునాథం, రామ్‌గోపాల్, అర్చన, శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో అడ్డుకోలేరు
– కావడితో మొక్కులు తీర్చుకున్న కృపాలక్ష్మి కార్వేటినగరం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్లు గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి అన్నారు. శనివారం కార్వేటినగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై గొంతునొక్కి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అవినీతి, అక్రమాలను తమ పార్టీ నేతలకు అంటగట్టి ఏదో రకంగా జైలు పాలు చేయాలన్న కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అబాసుపాలు చేయాలన్న కక్షతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ కేసులో త్వరగా బెయిలు రావాలని సుబ్రమణ్య స్వామికి అప్పట్లోనే మొక్కుకున్నారు. ఇటీవల ఆయనకు బెయిల్ రావడంతో శనివారం పుత్తూరులోని కృపాలక్ష్మి నివాసంలో పుష్ప కావడిని ప్రత్యేకంగా అలంకరించి కార్వేటినగరం లోని శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆమె వెంట ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి(వెదురుకుప్పం), మణి (శ్రీరంగరాజపురం), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రాధికారెడ్డి, స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ, పట్నం ప్రభాకర్‌రెడ్డి, పురంధర్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, జనార్దన్, వెంకటరత్నం,మునిక్రిష్ణ, నందగోపాల్, ధనశేఖర్‌యాదవ్, పట్టాభిరెడ్డి,తులసి, మోహనకుమారి, శ్రీనివాసులురెడ్డి, మున్నా, రత్నంరెడ్డి, దాము, అంబిక, రుక్మిణి , నాగేంద్ర, సాయికుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జనార్ధన్, కాళప్ప, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజి, వైద్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు రమేష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, గోవిందన్, బొజ్జారెడ్డి, మాజీ యువత మండల అధ్యక్షుడు నరేష్ రెడ్డి, ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు. -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
– ఘనంగా హోంగార్డు ఆవిర్భావ దినం చిత్తూరు అర్బన్ : హోంగార్డుల పనితీరు తీరును.. మరెవ్వరితోనూ పోల్చడం సాధ్యంకాదని ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు. 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించారు. పోలీసులకు ఏ మాత్రం తీసిపోకుండా నిర్వహించిన కవాతును ఎస్పీ అభినందించారు. దాదాపు 62 ఏళ్లకు పైగా హోంగార్డులు పోలీసులతో కలిసి సేవలు అందిస్తున్నారన్నారు. అనంతరం ఇటీవల హోంగార్డులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. అలాగే హోంగార్డులు చిత్తూరు నగర వీధుల్లో ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న హోంగార్డు పిల్లల్లో ప్రతిభ ఉన్నవారికి ఉపకార వేతనాలను అందజేశారు. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ చూపించిన 13 మందికి ఉత్క్రిష్ట, అతి ఉత్క్రిష్ట పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్.రాజశేఖర్ రాజు, డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మహబూబ్ భాష, సీఐలు నిత్యబాబు, శ్రీధర్ నాయుడు, మనోహర్, ఉమామహేశ్వరరావు, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ హోంగార్డు కుమారుడికి ఉపకార వేతనం అందజేస్తున్న ఎస్పీ -
సమస్యలపై నిలదీత
జిల్లాలో కీలకమైన జెడ్పీ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టడం విస్మయానికి గురిచేసింది. కాగా జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. గోకులం షెడ్లు, యూరియా కొరత, ఆరోగ్యశ్రీ బకాయిలపై నిలదీశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కీలకమైన అధికారులు డుమ్మా కొట్టడంపై కలెక్టర్ మండిపడ్డారు. చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి డీఆర్వో నరసింహులు, సీఈఓ రవికుమార్‌నాయుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి తిరుప తి, అన్నమయ్య జిల్లాల నుంచి పలువురు ఉన్నతాధికారులు (హెచ్ఓడీ)లు హాజరు కాలేదు. దీంతో అధికారులకు నోటీసులు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పలు అంశాలపై సమస్యలు లేవనెత్తా రు. కాగా నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ జీతాలు ఇవ్వాలని సభ్యులు కలెక్టర్‌కు వినతి చేశారు. తొలుత ఇటీవల మరణించిన రామసముద్రం, రామకుప్పం ఎంపీపీలు కుసుమకుమారి, శాంతమ్మకు నివాళి అర్పించాల ని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మెడికల్ కళాశాలల పీపీపీపై తీర్మానం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వం అప్పగించడం సరికాదని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని జెడ్పీ చైర్మన్‌కు వినతి చేశారు. పీపీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా చైర్మన్ తీర్మానించగా సభ్యులు ఆమోదించారు. గోకులంషెడ్లు పై రగడ జిల్లాలో అర్హులైన వారికి కాకుండా టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి గోకులం షెడ్లు మంజూరు చేస్తే వాటిని కారు షెడ్డుగా వాడుకుంటున్నారని పలువురు జెడ్పీటీసీలు ప్రస్తావించారు. వీటిపై ఇటీవల శ్రీసాక్ష్ఙి పత్రికలో వచ్చిన శ్రీగోకులం..అవినీతిలో బలం్ఙ అనే కథనం గురించి ఉదాహరణగా చూపరు. గోకులం షెడ్లు అనర్హులకు ఇవ్వలేదని అధికారులు నిరూపిస్తే రాజీనామా చేయడానికి కూడా వెనుకడమని సవాల్ విసిరారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్ని షెడ్లు మంజూరు చేశారు అనే సమాచారం కూడా అధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ కరుణాకర్‌రెడ్డి, సదుం జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, బంగారుపాళ్యం ఎంపీపీ అమరావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు దక్కాల్సిన షెడ్లను కార్ పార్కింగ్ కోసం వాడుకోవడం అన్యాయమన్నారు. నివేదిక రాసుకొని వెళ్లిపోయారు.. పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంవత్సర కాలంలో జరిగిన ఎన్ఆర్జీఎస్ పనుల్లో అవినీతి జరిగిందని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారన్నారు. వీటిపై విచారణకు ఆదేశించగా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా రిపోర్టు రాసుకోని వెళ్లిపోయారని సదుం జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, పులిచెర్ల ఎంపీపీ సురేంద్రరెడ్డి ఆరోపించారు. పొజిషన్ పత్రానికి రూ.30 వేలా..? లబ్ధిదారులు హౌసింగ్ పథకం కింద గృహ నిర్మాణానికి లబ్ధి పొందాలంటే రెవెన్యూ అధికారులు పొజిషన్ పత్రం ఇవ్వాలని నారాయణవనం జెడ్పీటీసీ సుమన్ తెలిపారు. అందుకు ప్రతిఫలంగా రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే మందలించినా తీరు మారడం లేదన్నారు. మండలంలో 10 వేల మంది రైతులు ఉన్నారని ఇప్పటి వరకు వేరుశనగ కాయలు ఇవ్వలేదన్నారు. టమోటా రైతులు గిట్టుబాబు ధరలు లేక నష్టపోతున్నరని పెద్దమండ్యం ఎంపీపీ పూర్ణచంద్రిక ఆవేదన వ్యక్తం చేశారు. జాక్‌పాట్ పేరుతో దళారులు దోచుకుంటున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు చేసిన తీర్మానాలు అమలు చేయడం లేదని వెదురుకుప్పం జెడ్పీటీసీ సుకుమార్ ఆరోపించారు. నాడు–నేడు పథకం ద్వారా పలు పాఠశాలల అభివృద్ధి సగంలో అగిపోయిందని వాటిని పూర్తి చేయాలని మదనపల్లె జెడ్పీటీసీ ఉదయ్ కోరారు. చౌడేపల్లె ఆస్పత్రుల నందు అంబులెన్స్‌లు పనిచేయకపోవడం ప్రైవేటు అంబులెన్స్ ద్వారా వైద్యం కోసం పలమనేరుకు పంపుతున్నామని జెడ్పీటీసీ దామోదారరాజు సమస్యను వివరించారు. వ్యవసాయ సర్వీసుల కోసం డబ్బులు కట్టి ఏడాదిన్నర అవుతున్నా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని జెడ్పీటీసీ శివన్న ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ విత్తనాలివ్వాలియూరియా కొరతపై చర్యలేవీ జిల్లాలో యూరియా కొరతపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై కలెక్టర్ ప్రశ్నించారు. రానున్న మూడు నెలల్లో యూరియాను ఎలా ఇస్తారు..?బ్లాక్ మార్కెట్ విక్రయాలు ఎలా అరికడతారు..?వాటిపై తీసుకున్న చర్యలమేమిటన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడా లన్నారు. ప్రజాప్రతినిధులు సమావేశంలో తెలియజేసిన సమస్యలకు అధికారులు పరిష్కార మార్గం చూపాలన్నారు. గతంలో హౌసింగ్ ద్వారా గృహ నిర్మాణాలకు ఎంపికైన లబ్ధిదారులను రద్దు చేయడం లేదని సృష్టం చేశారు. రైతులకు 3 రోజుల్లో వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని వాటిపై అధికారుల అలసత్వం ఎందుకని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూ రియా కొరత పంపిణీ జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీల పరంగా పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇలాంటివి చూడలేదన్నారు. గోకులం షెడ్లు అర్హులైన రైతులకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. వీటిపై పలు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పలు పాఠశాలల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తే పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల పై చర్యలేమిటని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రశ్నించారు. వ్యాధి రాకుండా తీసుకుంటున్న జాగ్రత్తల పై ఆరా తీశారు. వీటికి సంబంధించి మందులు ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఎందుకు లేవన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నందు ఇటీవల కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు ఆస్పత్రిపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.300 కోట్లు పైగా ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉందన్నారు. మామిడి రైతులకు రాయితీ ఇంకా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. -
బలహీనతను బలంగా మార్చుకోవాలి
–ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చిత్తూరు రూరల్(కాణిపాకం) : మనిషి తన బలహీనతను... బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శనివారం చిత్తూరు శ్రీనారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాల కార్యక్రమం కొనసాగింది. ఏ ధర్మానికై నా క్రమశిక్షణ ప్రధానమైందన్నారు. అప్పట్లో హైందవ ధర్మం చాలా గట్టిగా నిలబడిందన్నారు. ఈ ధర్మాన్ని పురాణాలు, సంస్కృతి, ఇతిహాసాలతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా ఎంతో అభిమానిస్తున్నాయన్నారు. బలహీనతను బలంగా మార్చుకొని మనిషి సమాజంలో శక్తికి ఎదగాలన్నారు. ఇందుకు నిష్టతో శివనామస్మరణ చేయాలన్నారు. కోపం వస్తే ప్రజల మీద చూపించకూడదన్నారు. అలా చేస్తే..కేసులు, కోర్టులు తప్పవన్నారు. పూజ గదిలో కూర్చుని భగవంతుడి వద్ద కోపతాపాలను చూపాలన్నారు. కష్టం వచ్చిందని కుంగిపోకుండా స్వామి వద్ద భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టాలన్నారు. దేవుడి కోసం సర్వస్వం వదిలేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కల్యాణ్ పాల్గొన్నారు. పాల్గొన్న ప్రజలుప్రవచనాలు చేస్తున్న గరికిపాటి నరసింహారావు -
శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఆత్మ వంచనలేని అంతశుద్ధితో ముక్తికాంతా సమ్మిళితంగా ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ప్రవచించారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి చిత్తూరు శ్రీనారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాల కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రవచనాలను ప్రారంభించారు. పంచలింగాల్లో ఒకటైన వాయులింగంగా శ్రీకాళహస్తీలోని శివలింగాన్ని భావిస్తారన్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీ మహత్యం, శతకం గుర్తుకొస్తాయన్నారు. భక్తి వైరాగ్య భావనలకు ప్రజల దృష్టాంతరంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నిర్వాహకులు కల్యాణ్ తదితరులున్నారు. -
జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
– మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ వెదురుకుప్పం: ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. బాబు సర్కార్ అస్తవ్యస్త పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పుత్తూరులోని శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీసూపర్సిక్స్ మోసాల్లో భాగంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని గొంతు నొక్కాలని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రాష్ట్రంలో పేదలు, రైతులు, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను జగన్ కూలంకుశంగా వివరిస్తూ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాజకీయ స్వలాభం కోసమే తిరుమల లడ్డూపై లేనిపోని వివాదాలు సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అలాంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. పేదల సంక్షేమాన్ని తన బాధ్యతగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అమలు చేశారు. వారి ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటు పరం చేసి చంద్రబాబు ప్రభుత్వం కోటీశ్వరులకు కొమ్ముకాస్తోందిశ్రీ అని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు వివరించారు.ఇప్పటికైనా ప్రైవేటీకరణ విదానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. -
గజరాజులకు మృత్యుగండం
పలమనేరు : కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవిలోంచి మేత కోసం అడవిని దాటి వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాలు, పెనుగులాటలు, ముఖ్యంగా కరెంట్ షాక్‌లతో మృతి చెందుతున్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోని ఏనుగులకు నిత్యం ప్రాణగండం తప్పడం లేదు. ఐదు రోజుల కిందట కౌండిన్య నుంచి పరదరామి బీట్‌లోకి వెళ్లిన ఒంటరి ఏనుగు గాయపడి చికిత్స నిమిత్తం తిరుపతి జూపార్క్‌కు తరలించగా బుధవారం మృతి చెందింది. తాజాగా కౌండిన్యకు ఆనుకుని ఉన్న తమిళనాడు మోర్థనా అడవిలో మరో ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. దీంతో ఇప్పటికి 22 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహారం కోసం అడవిని దాటి... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవసరమైన ఆహారం తక్కువ. దీంతో ఏనుగులు ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. దీనికితోడు తమిళనాడులోని మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళ్తే తమిళనాడు అటవీశాఖ కౌండిన్య వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండడడం లేదు. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు సోమల మీదుగా చంద్రగిరి వైపునకు బంగారుపాళెం, గుడిపాల వైపునకు వెళ్లిన విషయం తెలిసిందే. శాశ్వత పరిష్కారం చేపడితేనే.. అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంలో ఆ శాఖ విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు అడవిని దాటి బయటకొస్తున్నాయి. ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చనిపోయిన ఏనుగు పలమనేరులో హల్చల్ తిరుపతి జూలో రెండు రోజుల క్రితం మృతి చెందిన ఒంటరి ఏనుగు ఇటీవల పలమనేరులో హల్‌చల్‌చేసి ఎఫ్ఎస్వో సుకుమార్‌పై దాడి చేసింది ఇదే. మదపు టేనుగులు చేసిన దాడిలో ఇది తీవ్రంగా గాయపడి చెరువులో పడిపోయింది. కుంకీ ఏనుగుల ద్వారా దాన్ని బయటకు లాగే ప్రయత్నంలో మరింత గాయపడి మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా మోర్థనా ఫారెస్ట్‌లో ఓ ఒంటరి ఏనుగు మృతి చెందిన కళేబరాన్ని అక్కడి ఫారెస్ట్ అధికారులు శుక్రవారం గుర్తించారు. ఇది కూడా ఇక్కడినుంచి ఆ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. -
స్క్రబ్ టైఫస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్యశాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. స్క్రబ్ టైఫస్ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆస్పత్రిలో వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. -
8న బోయకొండలో హుండీ కానుకల లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 8వ తేదీ సోమవారం హుండీ కానుకలు లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు. రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించా రు. రాహుకాల సమ యం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేకాలు చేశా రు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయ దారులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, భక్తుల కు ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీలో కార్యదర్శుల నియామకం చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం వివరాలను ప్రకటించింది. జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సోమేశ్వరప్రభునాయుడు, కుప్పం నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు. ఎస్టీయూ కౌన్సిల్ సమావేశం జయప్రదం చేయండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 7వ తేదీ ఆదివారం నిర్వహించే ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుందరరాజపురంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలకు పైగా అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం దారుణమని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌యాదవ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలు, 12వ పీఆర్సీ నియామకం వెంటనే పూర్తి చేయాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 8న ధర్మకర్త మండలి సమావేశం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థాన ధర్మకర్త మండలి సమావేశం ఈనెల 8వ తేదీ సోమవారం జరగనున్న ట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఈఓ కార్యా లయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సభ్యులు హాజరు కావాలని పేర్కొన్నారు. -
విద్యార్థులతో పనులు
అరటి చెట్లు నరికివేత వి.కోట మండలం కృష్ణాపురంలో దాదాపు 1000 అరటి చెట్లను గురు ్తతెలియని వ్యక్తులు నరికివేశారు.చౌడేపల్లె : మెగా పీటీఎం పేరిట శుక్రవారం మండలంలోని దాదేపల్లె ఉర్దూ ఉన్నత పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణం నుంచి ప్రధాన రోడ్డుకు వెళ్లే మార్గంలో బురదతో కూడిన గుంతలను విద్యార్థులతో పూడ్చివేయించారు. పిల్లలకు విద్యా బుద్దులను నేర్పడం విస్మరించి, ఇలాంటి పనులు చేయించడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో వాచ్మెన్ , స్కావెంజర్లు ఉండగా వారి చేత కాకుండా విద్యార్థులతో పనులు చేయించడంపై విమర్శలకు దారితీశాయి. -
ప్రగల్బాల పీటీఎం
చిత్తూరు కలెక్టరేట్ : పేరుకే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం), కానీ జిల్లా అంతటా మొక్కుబడిగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో డుమ్మా కొట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2408 పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించాల్సి ఉంది. అయితే 2,202 పాఠశాలల్లో సమావేశం నిర్వహించగా 206 పాఠశాలల్లో ఎగ్గొట్టారు. ఈ సమావేశాల నిర్వహణకు హంగు, ఆర్భాటాలు చేశారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల వద్ద హంగామా చేశారు. సమావేశాల్లో సమస్యలపై మాట్లాడవద్దని విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ముందుగానే చెప్పించినట్లు తెలిసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఈ మెగా పీటీఎం కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే పనికొస్తుందని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. తూతూమంత్రంగా హాజరై.. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా ఒక్కొక్క పాఠశాలకు హాజరై ఆ తర్వాత ముఖం చాటేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూల్లో హాజరై ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి వి.కోట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కుప్పం కేజీబీవీ పాఠశాలకే పరిమితమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలాంటి కేడర్ లేకున్నా చల్లా రామచంద్రారెడ్డి జెడ్పీ రొంపిచెర్ల పాఠశాలలో హంగామా చేశారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏ ఒక్క పాఠశాలలో పాల్గొనకుండా డుమ్మా కొట్టారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు రూరల్ లోని తుమ్మింద పాఠశాల సమావేశానికి మాత్రమే పరిమితమయ్యారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ కాణిపాకం జెడ్పీ హైస్కూల్ లో పాల్గొని ఆ తర్వాత డుమ్మా కొట్టారు. మిగిలిన చోట్ల కార్పొరేటర్లు, టీడీపీ నామినేటెడ్ సభ్యులతో మమ అనిపించారు. టీడీపీ సంబరాల్లా? జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పీటీఎం మీటింగ్‌లు టీడీపీ సంబరాలుగా మార్చేశారు. ఈ సమావేశాల్లో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కార్యా చరణ, ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం, విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డుల పురోగతి తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా టీడీపీ నాయకులు సమావేశాల్లో పాల్గొని ఊకదంపుడు ప్రసంగాలతో ముగించారు. ఈ సమావేశాల్లో తల్లిదండ్రులు కేవలం 40 శాతం మాత్రమే పాల్గొనగా తమ గొప్పల కోసం అధికారులు తప్పుడు నివేదికలను సిద్ధం చేశారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తుగా ఏర్పాట్లు చేశా రు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా హాజ రు కావాలంటూ ముందస్తు హుకుం జారీ చేశారు. -
ఎక్కువగా మదపుటేనుగులే..
పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతో పాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గుట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. వీటిల్లో 21 ఏనుగులు వివిధ కారణాలతో మృతి చెందాయి. గత పదేళ్లలో కరెంట్ షాక్‌లతో 15 ఏనుగులు మృతి చెందాయి. మిగిలిన వాటిల్లో మూడు మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. మరో రెండు మదపు టేనుగుల దాడులతో పాడుబడిన బావుల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్ షాక్‌లతో మృతి చెందుతున్నాయి. -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కార్వేటినగరం : ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశిక్షణా సంస్థ డైట్ ఆవరణలో ఉన్న మోడల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ముఖ్య అతిథిగా డీఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన కొనసాగుతోందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు పోటీ పరీక్షల్లో మెరుగ్గా ఉత్తీర్ణత సాధిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దూరవిద్య లైబ్రరీ సైన్స్ ఫలితాలు విడుదల తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో దూరవిద్య ద్వారా బీఎల్ఎస్సీ డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
‘మీ పిల్లలు బాగా చదువుతున్నారా’?
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మీ పిల్లలు బడికొస్తున్నారా? బాగా చదువుతున్నారా? బడిలో టీచర్ల పనితీరు? మధ్యాహ్న భోజనం బాగుందా? యూనిఫాం, పుస్తకాలు ఇచ్చారా? ఇంటికొచ్చాక మీ పిల్లలను చదివిస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఓ తల్లిని ప్రశ్నించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద ప్రాథమిక పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి తరగతిని క్షుణంగా పరిశీలించారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. విద్యా భోధనపై అడిగి తెలుసుకున్నారు. తరగతిలో విద్యార్థుల హాజరును పరిశీలించారు. బోధనా తీరుపై ఉపాధ్యాయులను ప్ర శ్నించారు. అనంతరం తల్లిదండ్రులతో కాసేపు ముచ్చ టించారు. చివరగా పీటీఎం కార్యక్రమానికి ఎందుకు తల్లిదండ్రులు రాలేదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అడిగారు. అందుకు ఊళ్లో మీటింగ్, స్కూల్లో మీటింగ్ కారణంగా రాలేదని వివరించారు. ఆ మీటింగ్ అయినా తర్వాత తల్లిదండ్రులను పిలిచి కార్యక్రమ ఉద్దేఽశాన్ని వివరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. -
వీటిపై చర్చిస్తారా?
● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. వైద్యులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తూ....ప్రైవేట్ క్లినిక్‌లలో సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతిగృహాలతో పాటు గురుకులపాఠశాలల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించేందుకు ట్యూటర్స్ లేని దుస్థితి. ● చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అడ్డుకునే అధికారులు కరువయ్యారు. ● రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, యూరియా, ఎరువులను అందజేయాలి. నకిలీ పురుగుల మందులు, ఎరువుల విక్రయాలను అరికట్టాలి. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ పురుగుల మందుల వల్ల రైతులు పండించే పంటలను నష్టపోతున్నారు. ● పంచాయతీల్లో పారిశుధ్య లోపం వల్ల దోమలు వ్యాపిస్తున్నాయి. దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. ● గ్రామీణ స్థాయిలో బెల్టుషాపుల విచ్చల విడిగా ఉన్నాయి. ● కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లో మెనూ సక్రమంగా అమలుకావడం లేదనే ఆరోపణలున్నాయి. ● మండల స్థాయిలో కొంతమంది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. సమీక్షలని క్షేత్రస్థాయి పర్యటనలంటూ నిరంతరం ఏవో కారణాలు చెబుతున్నారు. తహసీల్ధార్, ఎంపీడీవో, ఎంఈవోలు ఇలా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీచేయాలి. -
దూసుకొచ్చిన మృత్యువు
కార్వేటినగరం : ఆయిల్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిన ప్రమాదాన్ని చూసేందుకు వెళ్లిన జనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లగా ఒకరు మృతి చెందగా మరి కొంత మంది గాయపడిన ఘటన మండల పరిధిలోని ఆర్కేవీబీపేట రోడ్డు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి ఆయిల్ ప్యాకెట్లతో చిత్తూరు వైపు వెళుతున్న లారీ ఆర్కేవీబీ పేట సమీపానికి చేరుకునే లోపు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో సమీపంలోని ఇందిరా కాలనీకి చెందిన రామలింగం (65), గిరిబాబు ప్రమాద స్థలా నికి చేరుకొని చూస్తున్న సమయంలో తిరు పతి నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా దూసు కొచ్చి లారీ వద్ద నిల్చున్న వ్యక్తులపై దూసుకెళ్లడంతో రామలింగం, గిరిబాబుకు తీవ్ర గాయా లు అయ్యాయి. ఈ క్రమంలో ఇందిరా కాలనీ వాసులు అక్కడికి చేరుకుని క్షత్రగాత్రుల ను 108 వాహనం ద్వారా మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామలింగం మృతి చెందాడు. తీవ్రగాయాలైన గిరిబాబును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. 108 వాహన సిబ్బంది నిర్లక్ష్యం ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని 108 వాహనానికి సమాచారం అందించిన కూత వేటులో ఉన్న వాహనం అర గంటైనా రాక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామలింగం మృతి చెందాడని, సకాలంలో 108 వాహ నం సిబ్బంది స్పందించి ఉంటే ప్రాణాలతో బయట పడే ఉండే వారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతి చెందిన రామలింగం , ఇన్సెట్లో (ఫైల్ ఫొటో)అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్ రోడ్డు ప్రమాదంలో గాయాలైన క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించినప్పటికీ డ్యూ టీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఒక కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయా రని గ్రామస్తులు ఆరోపించారు. సీహెచ్‌సీ లో నైట్ డూటీలో ఉండాల్సిన డాక్టర్ డూటీకి రాక పోవడంతో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నా యని మృతుని కు టుంబ సభ్యులు విలపించారు. దీనికి తోడు విధుల్లో ఉన్న సిబ్బంది డాక్టర్ టీ తాగేందుకు వెళ్లారని కప్పి పుచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు డాక్టర్‌ను నిల దీయడంతో తమ కుమార్తెకు బాగో లేదని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పడంతో రామలింగం మృతి డాక్టర్ అందుబాటు లో లేకపోవడంతోనేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఆవర ణ అంతా శోక సంద్రంగా మారింది. సమా చారం అందుకున్న ట్రైనీ ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వర్షానికి గోడ కూలి ఆవులు మృతి
ఐరాల : వర్షాలకు గుడిపల్లెలో పాత భవనం కూలడంతో శుక్రవారం ఉదయం రెండు పాడి ఆవులు మృత్యువాత పడ్డాగా మరో ఆవు తీవ్రంగా గాయపడింది. గుడిపల్లెకు చెందిన మునికృష్ణారెడ్డి గురువారం సాయంత్రం పాత భవనం పక్కన సీసీ రోడ్డుపై ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో బయటకు వచ్చి చూడగా అప్పటికే భవనం కూలి పాడి ఆవులపై పడడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందగా, మరో ఆవుకు నడుము విరగి నడవలేని పరిస్థితిలో ఉందని మునికృష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. -
జిల్లాలో తాజాగా 5 స్క్రబ్ టైఫస్ కేసులు
ఆస్పత్రులకు ఆదేశం చిత్తూరు రూరల్ (కాణిపాకం)/సదుం : జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు విరుచుకుపడుతున్నాయి. మళ్లీ కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు నగరంలోని మురకంబట్టు, కట్టమంచిలో మూడు, జీడీ నెల్లూరు, సదుం మండలంలోని అమ్మగారిపల్లె పంచాయతీ పరిధిలో కేసులు నమోదయ్యాయి. బాధితులు ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ గా మరో ఇద్దరు మాత్రం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కట్టమంచిలో నమోదైన కేసుకు మాత్రం ఎలాంటి తీవ్రత లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదుం మండలం అమ్మ గారిపల్లె పంచాయతీ పరిధి లో వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించామని చెరుకువారిపల్లె పీహెచ్సీ డాక్టరు చరణ్ తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్, సిబ్బంది నీలకంఠ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు జానకి, పంచాయతీ కార్యదర్శి చలపతి పాల్గొన్నారు. గోప్యంగా ఉంచాలని మౌఖిక ఆదేశాలు ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే స్క్రబ్ టైఫస్ కేసులను గోప్యంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలిచ్చారు. మీడియాకు సమాచారం ఇవ్వొద్దని సూచించారు. కేసుల నమోదుతో ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు ప్రైవేటు ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులను బయటకు చెప్పాలంటే భయపడుతున్నాయి. -
సమస్యల గోడు.. పట్టేదెవరికి?
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా....సమస్యల ను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నా ప్రజాప్రతినిధులు....అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. శనివారం చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. ప్రతిసారి కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైపోతున్న సర్వసభ్య సమావేశం.....ఈసారైనా ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా వాసులు కోరు తున్నారు. అన్ని కీలక ప్రభుత్వ శాఖలపై చర్చ నిర్వహించాలని విన్నవిస్తున్నారు. ఏనుగుల దాడి ఆపలేక.. జిల్లాలో ఏనుగులదాడి నివారణ అసాధ్యంగా మారింది. సరిహద్దు రాష్ట్రాల ప్రాంతం కావడంతో ఏనుగుల రాకను నివారించలేకపోతున్నారు. కనీసం పొలాలు, సమీప గ్రామాల ప్రజలపై రాకుండా అడ్డుకట్ట వేయ లేకపోతున్నారు. కుంకీలంటూ ప్రచారం చేసిన క్షేత్రస్థాయిలో వాటి పనితీరు సరిపోవడం లేదు. వెలగని సోలార్ జిల్లాలో పీఎం సూర్యఘర్ ద్వారా రాయితీ సోలార్ ప థకం వెలగడం లేదు. 3 వేల సర్వీసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో 500 కూడా ఇవ్వలేకపోతున్నారు.వ్యవసాయ సర్వీసుల కో సం నెలల తరబడి అన్నదాతలు 2వేల మంది వేచి చూస్తున్నారు. పేరుకుపోయిన బిల్లులు జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలో ఏడాదిన్నర కాలంలో మరమ్మతు, ప్రత్యేక మరమ్మతు, విస్తరణ పనుల కింద మొత్తం రూ.150 కోట్ల పైగా మొత్తంతో పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇందులో పలు పనుల అయిపోగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆర్అండ్బీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రంథాలయ సెస్ రూ.10.5 కోట్లు జిల్లాలోని గ్రేడ్–1 లో 4, గ్రేడ్–2 లో 8, గ్రేడ్–3 లో 59 చొప్పున గ్రంథాలయాలు ఉన్నాయి. వీటికి స్థానిక సంస్థల నుంచి వసూలు చేసే సెస్‌తో నిర్వహణ చేస్తున్నారు. 116 మంది ఉద్యోగులకు గాను 46 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్నవారికి జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. జిల్లాలో గ్రంథాయాలకు రావాల్సిన సెస్ రూ.10.05 కోట్లు వరకు రాలేదు. గ్రీన్ అంబాసిడర్ల బాధలు పట్టవా.. ఉమ్మడి జిల్లాలో 1411 పంచాయతీల్లో 2697 మంది గ్రీన్‌అంబాసిడర్లు పని ఒత్తిడి, రాజకీయ జోక్యం పెరగడంతో జిల్లాలో 720 మంది విధులు వదులుకో గా ప్రస్తుతం 1977 మంది పనిచేస్తున్నారు. వారికి రూ.65 లక్షలకు పైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. -
పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు ఇంట్లో ఏమి చేస్తున్నారు? ఫోన్‌న్‌లో ఏమి చూస్తున్నారు? వారి రోజువారీ ప్రవర్తనలో ఏమి మార్పులు కనిపిస్తున్నాయి?శ్రీశ్రీ వంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలన్నారు. ప్రత్యేకంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులో ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో పలు అనర్థాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఎంతో సున్నితమైన దశలో ఉంటారని తెలిపారు. ఈ వయస్సులో వారిని సరైన దారిలో నడిపించకపోతే వారు తప్పుడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. మత్తు పదార్థాలను స్కూల్ దగ్గర విక్రయిస్తుంటే వెంటనే 112 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌్ కు సమాచారం ఇవ్వాలన్నారు. శ్ఙ్రీప్రతి విద్యార్థి తన లక్ష్యం వైపు అడుగేసి ముందుకు సాగాలన్నారు. అనంతరం బాస్కెట్‌బాల్ లో రాణిస్తున్న విద్యార్థులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం పూర్వాణి, పీడీ దేవా పాల్గొన్నారు. -
యాప్ ఇన్‌స్టాల్‌కే పరిమితం
రైతన్నా మీకోసం ప్రోగ్రాం డిజైన్ చేసింది మాత్రం ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వం అందించే పథకాల గురించి వివరించి ఆ రైతుల ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. మొదటి రోజు అక్కడక్కడ ఎమ్మెల్యేలు పాల్గొనగా రైతుల నుంచి డిమాండ్లు పెద్ద ఎత్తున రావడంతో ఆ తర్వాత కనీసం సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అధికారులు కూడా మొహం చాటేశారు. చివరకు ఆర్బీకే సిబ్బంది తమకు ఉన్న పరిచయాలతో రైతుల ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ చేసి మమ అనిపించారు. ●చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతోంది. తమను పట్టి పీడిస్తున్న సమస్యలకు సంబంధించి అన్నదాతలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. కర్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మండలానికో చోట కార్యక్రమం జరిపినట్టు ఫొటోలకు ఫోజులిచ్చి మమ అనిపిస్తున్నారు. పచ్చనేతలు ఈ కార్యక్రమం గురించి పట్టించుకోనే లేదు. మొత్తంగా పుడమిపుత్రుడు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుని తిప్పలు పడుతున్నాడు. సైదాపురంలో రైతులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న అధికారులు(ఫైల్) సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతకు భరోసా లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సమస్యలను పక్కదారి పట్టించేందుకు చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ రైతులందరికీ అవగాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు సర్కారు తెరలేపింది. ఈ 18 నెలల కాలంలో రైతులకు చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటం కోసం హడావుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమం తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత నెల 24వ తేదీన ప్రారంభించిన రైతన్నా మీ కోసం కార్యక్రమం మొక్కుబడి కార్యక్రమంగా మారింది. బయట పెట్టని కరపత్రాలు రైతుల కోసం తమ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఎంతో చేసిందని చెప్పుకునేందుకు 16 పథకాలకు సంబంధించి ముద్రించిన కరపత్రాల గురించి ఎక్కడా బయటపెట్టలేదు. రైతుల కోసం 35 ప్రశ్నలతో ముద్రించిన పత్రంలోని కొన్ని ప్రశ్నలు మాత్రం వేసి, వారు చెప్పిన సమాధాన్ని యాప్‌లో అప్లోడ్ చేసి చేతులు దులుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు సైతం రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించలేదు. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్లిపోతే.. మరి కొందరు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈనెల 3వ తేదీ నిర్వహించాల్సిన గ్రామసభలు సైతం నాలుగైదు చోట్ల తప్ప.. మిగిలిన చోట్ల ఎక్కడా నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. అధికారులు మాత్రం అన్ని చోట్ల గ్రామసభలు నిర్వహించామని వివరణ ఇచ్చుకోవడం గమనార్హం. ఇందుకు రైతులను పట్టి పీడీస్తున్న సమస్యలతే నిదర్శనం. అందులో మచ్చుకుకొన్ని.. ముఖం చాటేసిన అధికారులు చేసిందేమీ లేదు బాబు ప్రభుత్వం చెప్పుకునేందుకు చేసిందేమీ లే దని తెలుసుకున్న అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సాహసించలేకపోయారు. క్షేత్రస్థాయిలోకి వెళితే..అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిలదీస్తారని తెలిసే రైతన్నా మీ కోసం నిర్వహించలేకపోయామని ఓ అధికారి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిర్వహించామని చెప్పుకునేందుకు.. రైతన్నా మీ కోసం కార్యక్రమం ఉద్దేశం చెప్పకుండా మొదటి రోజు రైతు సేవాకేంద్రాల్లోని అధికారులు కరపత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు నుంచి ఎవరైనా అడుగుతారేమోనని స్థానిక టీడీపీ నేతలు కొందరు సచివాలయాల వద్దకు చేరుకుని రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహించినట్లు ప్రకటించుకుని ఎల్లో పత్రికల్లో ప్రచురించుకున్నారు. ఎవరైనా మీడియా వారు అధికారులను అడిగితే.. ఓ గంట తరువాత మేమే ఫొటో, వివరాలు పంపుతామని చెప్పి.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వారిని కొందరిని పిలిపించుకున్నారు. వారికి పత్రాలు ఇచ్చినట్లు, మరి కొందరిని కూర్చోబెట్టి ఫొటోలు తీసి, పంపించి చేతులు దులుపుకునే కార్యక్రమాలు చేపట్టారు. -
అయ్యప్పసేవలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
సదుం: అయ్యప్ప దీక్షలో భాగంగా తిరుపతిలో మాలధారణ చేసిన అనంతరం మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం సందర్శించారు. ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వరస్వామి ఉపాలయాలలో పూజలు చేశారు. అయ్యప్పస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆయనకు తీర్థ, ప్రసాదాలను అందించారు. అనంతరం భక్తులతో కలసి అన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని ఆయన స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి ఎర్రాతివారిపల్లెకి విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు ప్రజలు కలసి తమ సమస్యలను విన్నవించారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలినడక భక్తులకు సౌకర్యాలు.. ప్రతి ఏటా మండలం మీదుగా కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుంటారు. వారి సౌకర్యం కోసం షె డ్లు, భోజన సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కొండవీటి నాగభూషణం, జింకా చలపతి, వెంకటరెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, పులిచర్ల ఎంపీపీ సురేంద్రనాథ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రతులు అందజేత తిరుపతి సిటీ: ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి హరిప్రసాద్‌రెడ్డి 30 వేల సంతకాల సేకరణ పూర్తి చేశారు. ఆ ప్రతులను గురువారం తాడేపల్లెలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌ను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పొలిటికల్ పీటీఎంలకు వేళాయే..! చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను రాజకీయ వేదికలుగా మార్చి శుక్రవారం నుంచి మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఒరిగేదేమీ లేకపోయినా రాజకీయంగా తమ పబ్లిసిటీ కోసం నిర్వహించుకుంటున్నారు. మరోవైపు ఈ మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశాలు (పీటీఎం) ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతున్నాయి. ఎక్కడా ఏలోటూ రాకుండా నూరుశాతం తల్లిదండ్రుల హాజరు ఉండాలని ఒక పక్క.. స్థానిక రాజకీయ నాయకులను తప్పనిసరిగా ఆహ్వానించాలన్న ఆదేశాలు మరోపక్క టీచర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నో పేరెంట్స్ – టీచర్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం అంటే భయపడుతున్నారు. చాలీచాలని నిధులతో ఆర్భాటం మెగా పీటీఎం నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి జిల్లాకు రూ.47.54 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. 30 మంది పిల్లలు ఉంటే రూ.900, 31 నుంచి 100 మంది ఉంటే రూ.2,250, 101 నుంచి 250 ఉంటే రూ.4,500, 250 నుంచి 1,000 వరకు ఉంటే రూ.6,750 చొప్పున బడ్జెట్ కేటాయించారు. ఈ మొత్తం నిధులతోనే షామియానా, మైక్సెట్లు, అలంకరణ, బొకేలు తదితర సామగ్రి సమకూర్చాలి. ఈ డబ్బుతోనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. అయితే ఏ మూలకూ సరిపోని అరకొర బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించడం కష్టమని, భోజనం ఏర్పాట్లు తమవల్ల కాదని ఉపాధ్యాయులు తెగేసి చెబుతున్నారు. -
ఆద్యంతం హడావుడి..
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు పర్యటన ఆద్యంతం పోలీసుల పహారా నడుమ.. హడావుడిగా సాగింది. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ (డివిజనల్ అభివృద్ధి అధికారి) కార్యాలయం ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచ్చేశారు. అయితే జిల్లా పర్యటనకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకుందామని ఉదయం నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు డీడీఓ కార్యాలయం పడిగాపులు కాసిన ప్రజలను కలవకుండా పవన్ ముఖం చాటేశారు. అర్జీలు తీసుకోవడానికి ఇష్టపడని పవన్.. కారు దిగకుండా వెళ్లిపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చి వర్చువల్‌లో ప్రారంభించడమేమిటో..! కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ కార్యాలయం ఎప్పుడో నిర్మించారు. ఇదివరకే ఆ భవనంలో గతంలో పలువురు జాయింట్ కలెక్టర్లు సైతం పరిపాలన వ్యవహారాలు సాగించారు. గతంలో సచివాలయా ల పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్క డి నుంచే జరిగేది. ప్రస్తుతం ఆ భవనంలో టూరి జం శాఖతో పాటు పలు కార్యాలయాలు సైతం ఉన్నా యి. అలాంటి భవనానికి ప్రస్తుతం రూ.40 లక్షలు వెచ్చించి తిరిగి డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ చేతు ల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడమేమిటో అని చర్చకు దారి తీసింది. పలు శాఖల అధికారులు కడూఆ ఇది పాత భవనమే కదా .. ఇప్పుడు ప్రారంభించడం ఏమిటంటూ గుసగుసలాడారు. గ్రామస్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు గ్రామస్థాయిలో 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని, 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించామన్నారు. ప్రస్తుతం ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ సెక్రటరీలను మూడు గ్రేడ్లుగా చేస్తూ పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చామన్నారు. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలోనూ డివిజన్ అధికారి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పాలనాపరమైన సంస్కరణల్లో జీఓఎంఎస్ నంబర్ 57, 58లను తీసుకురావడం జరిగిందన్నారు. మండల స్థాయిలో అభివృద్ధి శాఖకు ఎంపీడీఓలు, రెవెన్యూ శాఖకు తహసీల్దార్లు, పోలీస్ శాఖకు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారని చెప్పారు. వీరికి సంబంధించి రెవెన్యూ, పోలీస్ శాఖకు మాత్రమే డివిజినల్ కార్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఇకపై పంచాయతీరాజ్ శాఖకు సైతం ఒక డివిజినల్ స్థాయి అధికారి ఉంటారన్నారు. గ్రూప్–1 పరీక్షల్లో ఈ పోస్ట్‌లను భర్తీ చేయవచ్చన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలతో పాలనాపరంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేయడంతో పాటు శాఖ బలోపేతం చేసినట్లు అవుతుందన్నారు. జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, ఈ కార్యాలయాలను జీప్లస్ వన్ తరహాలో జెడ్పీ నిధుల నుంచి కార్యాలయ భవనాలు, మౌలిక వసతుల ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీడీఓలు, డీడీఓల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీడీఓ రవికుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్‌ను లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు డిప్యూటీ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్న అర్జీదారుడు టీడీపీ, బీజేపీ కేడర్ దూరం డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యాలయం వద్ద మూ డంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ లోప లకు వెళ్లనివ్వకుండా పోలీసులు పహారా కాశారు. డిప్యూటీ సీఎం పర్యటనకు హాజరయ్యేందుకు విచ్చేసిన పలువురు ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు నిలిపివేశారు. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగళ శివరామ్‌కు సైతం అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు డిప్యూ టీ సీఎం పర్యటనకు టీడీపీ, బీజేపీ కేడర్ దూరమయ్యారు. ఈ విషయం ఆయా పార్టీల్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తప్ప మిగిలిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఎవరూ కనిపించలేదు. కొద్దిమంది జనసేన నాయకులు మాత్రం కాస్త హడావుడి చేశారు. -
స్వయం పాలన సంస్థలుగా పంచాయతీలు
రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయిలో పంచాయతీరాజ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ)లు విధులు నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సమన్వయంగా డివిజన్ స్థాయిలో డీడీఓ ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను ప్రారంభించామన్నారు. -
మామిడి రైతులకిచ్చిన హామీ ఏమైంది బాబుగారూ!
తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు మామిడి రైతులకిచ్చిన హామీ ఏమైందో స్పష్టం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో చిత్తూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కిలో మామిడికి రూ.8 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా, మామిడి రైతులకు నగదు జమ కాకపోవడం ఏమిటన్నారు. ఇప్పటివరకు జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి రైతులకు అందాల్సిన నగదు రాకపోవడంతో వారంతా ఫ్యాక్టరీల చుట్టు తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌లో రైతులు పడుతున్న కష్టాలను అన్నీఇన్నీకాదన్నారు. మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ వారి పక్షాన నిలబడిన 30 మందిపై కేసులు పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందో చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. కిలోకు రూ.12 ఇస్తామని, అందులో ఫ్యాక్టరీల నుంచి రూ.8 చొప్పున, ప్రభుత్వం నుంచి రూ.4 చొప్పున ఇస్తామని చెప్పారు. అయితే ఫ్యాక్టరీలు అందులో పెద్ద ఎత్తున కోతలు విధించాయన్నారు. కోతలు విధించినా మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వందల ఎకరాల్లో మామిడి రైతులు పంటను వదిలిపెట్టారని, మరికొందరు ధరలు లేకపోవడంతో పొలంలోనే మామిడి కాయలను వదులుకున్నారని, ఇంకొందరు పెద్ద ఎత్తున మామిడి తోటలను తొలగించారన్నారు. తమ పాలనలో రైతే రాజు అంటూ ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతుల దుస్థితిని తెలుసుకోవాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న అక్కసును రైతులు నిరసన రూపంలో వెళ్లగక్కారని, దాంతోనే రోడ్డెక్కారని గుర్తుచేశారు. మామిడి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అయ్యప్ప మాలధారుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చిత్తూరు మండలం చెర్లోపల్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా...వైఎస్సార్ కడప జిల్లా కమ్మపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(50) శబరిమలకు వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో చెర్లోపల్లి వద్ద భోజనం కోసం కారు ఆపారు. మాలదారుడు సర్వీసు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సంఘటన స్థలంలోనే శ్రీనివాసులు మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ. 30 లక్షల పొదుపు సొమ్ము స్వాహా పుంగనూరు : మండలంలోని మంగళం పంచాయతీ జెట్టిగుండ్లపల్లెకి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు బుధవారం పట్టణంలోని సీ్త్ర శక్తి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. పంచాయతీకి చెందిన సంఘమిత్ర మహిళలు పొదుపు చేసిన సుమారు రూ.30 లక్షల రూపాయలను ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. గత నెల 13న జరిగిన సమావేశంలో ఏపీఎం కృష్ణప్ప సమక్షంలో 15 మంది మహిళలకు చెందిన డబ్బులు వాడుకున్నట్లు సంఘమిత్ర అంగీకరించారని, కానీ నెల రోజులు గడుస్తున్నా చెల్లించకపోవడంతో సంఘ మహిళలు అప్పులు తీర్చలేక , వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని సంఘమిత్ర స్వాహా చేసిన రూ.30 లక్షలు వసూలు చేయించాలని డిమాండ్ చేశారు. కాపర్ తీగలు చోరీ వెదురుకుప్పం : మండలంలోని సీఆర్ కండ్రిగ కాలనీకి చెందిన రమేష్ పొలంలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు బుధవారం విలేకరులకు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరించుకుపోయినట్లు రైతు చెప్పారు. -
పోలీసు వలలో కీచకుడు?
గుడిపాల : అతడి టార్గెట్ గిరిజన మహిళలే.. ముఠాతో కలిసి రావడం వారిపై గ్యాంగ్ రేప్ చేయడం అడ్డొచ్చిన వారిని బెదిరించి పారిపోవడం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఠా నేత అలెక్సా నైజం. గుడిపాల మండలంలోని గిరిజన ప్రాంతాలు ఉన్న గ్రామాలను ఎంచుకొని వారిని టార్గెట్ చేసి యువతులపై గ్యాంగ్‌రేప్ చేసి పారిపోయేవాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికినట్లు సమాచారం. కరుడుగట్టిన కీచకుడికి సంబంధించిన వివరాలు ఇలా.. గుడిపాల మండలంలో పేయనపల్లె, చీలాపల్లె, పల్లూరు, అనుపు ఎస్టీ కాలనీల్లో దందాలు నడిపేవాడు. రెండు రోజుల క్రితం అనుపు ఎస్టీ కాలనీకి సుమారు 15 మంది యువకులను తీసుకొచ్చి హల్చల్ చేశాడు. అక్కడి ఓ యువతిని గ్యాంగ్‌రేప్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వారికి కత్తులు చూపించి బెదిరించాడు. ఇందులో ఓ యువకుడు ఎదురు తిరగ్గా అతన్ని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అలాగే పేయనపల్లె, పల్లూరు, చీలాపల్లె ఎస్టీ కాలనీల్లోని కొంతమంది యువతులపై కూడా గ్యాంగ్‌రేప్ చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ రామ్మోహన్ రంగప్రవేశం చేసి కరుడుగట్టిన నిందితుడు అలెక్సాను వలపన్ని చీలాపల్లె సమీపంలో పట్టుకొని చిత్తూరుకు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. అలెక్స్‌తో పాటు చిత్తపార గ్రామానికి చెందిన మల్లేష్(34) అనే అతను కూడా గ్యాంగ్‌రేప్ చేసినట్లు తెలియడంతో వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. గుడిపాలకు తమిళనాడు పోలీసులు గుడిపాల మండలానికి తమిళనాడు సీఐడీ పోలీసులు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేసినట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన అలెక్స్ వేలూరు జిల్లా కాట్పాడిలో నివాసం ఉంటున్నాడు. అతడి వృత్తి దొంగతనాలు, గ్యాంగ్‌రేప్‌లు, హత్యలు చేయడం వంటివి. విషయం తెలుసుకున్న తమిళనాడు సీఐడీ పోలీసులు గుడిపాల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అతడిపై 35కి పైగా కేసులు ఉన్నట్లు గుడిపాల పోలీసులకు చూపించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీలకు గంజాయి సరఫరా తమిళనాడులోని కాట్పాడి ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయి. ఆ కాలేజీలకు కరుడుగట్టిన నిందితుడు అలెక్సా గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు, హత్యలు ఎక్కడైనా చేశాడా అన్న కోణంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయితో యువకులకు వల అలెక్స్ అనే కరుడుగట్టిన నిందితుడు గుడిపాల మండలంలో కొంత మంది యువకులకు గంజాయి ఇచ్చి మచ్చిక చేసుకొనేవాడు. గుడిపాల మండలంలో మరకాలకుప్పం, గొల్లమడుగు, చిత్తపార, పల్లూరు, పేయనపల్లెకు సంబంధించి కొంత మంది యువకులను గంజాయిని ఉచితంగా ఇస్తుంటాడు. గ్యాంగ్‌రేప్‌లు, దొంగతనాలు చేసేటప్పుడు ఈ యువకులు అతనికి సహకరించేవారని సమాచారం. వీరందరూ ఎస్టీ గ్రామాలకు వెళ్లేప్పుడు మాస్క్‌లు ధరించుకొని అతడితో పాటు హల్ చల్ చేస్తుంటారని తెలుస్తోంది. -
పుత్తూరులో కాసం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం
పుత్తూరు: పుత్తూరు పట్టణంలో బుధవారం కాసం ఫ్యాషన్స్ 22వ స్టోర్‌ను సినీ తార, ప్రముఖ యాంకర్ అనసూర్య భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాసం ఫ్యాషన్స్ చౌకగా దుస్తులను అందించడమే కాకుండా, యువతకు ఉపాధిని సైతం కల్పిస్తోందని తెలిపారు. అధునాతన వస్త్రాలను తక్కువ ధరలకు అందిస్తున్న కారణంగానే వినియోగదారులు కాసంను ఆదరిస్తున్నారన్నారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతూ ఇప్పటి వరకు 22వ స్టోర్లు ప్రారంభించామని తెలిపారు. తమ సంస్థ ద్వారా పుత్తూరులో స్థానికులు 150 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అనసూర్య భరద్వాజ్‌ను చూడడానికి ఉదయం నుంచి అభిమానులు, యువత బారులు తీరారు. కాసం షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు -
బాబోయ్ పురుగు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. వ్యాధి విస్తరిస్తూ..జనాన్ని భయపెడుతోంది. కీటకం జనంపై దాడి చేసి ఆస్పత్రి పాలుచేస్తోంది. జ్వరం తీవ్రత అధికం కావడంతో స్క్రబ్ టైఫస్‌గా వెలుగు చూస్తోంది. టైఫస్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా మారుతున్నాయి. ఆ ఆస్పత్రిల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక జనం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టైఫస్‌కు వైద్యం లేక విలవిల్లాడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గుబులు పుట్టిస్తున్న కేసులు జిల్లాను స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లోని మండలాలో నమోదవుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. చిత్తూరు నుంచి బంగారుపాళ్యం మండలం వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఓ మహిళను రెండు రోజుల క్రితం టైఫస్ కీటకం కుట్టింది. గంటల్లోనే ఆ ఎఫెక్ట్ తీవ్రతరం కావడంతో బంధువులు ఆమెను చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స తీసుకుంటూ...మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అలాగే గుడిపాలకు చెందిన వ్యక్తి కూడా చికిత్స కొనసాగుతోంది. జ్వరం పట్టి పీడిస్తోంది. ఇక కొత్తగా ఐరాల మండలం బొమ్మసముద్రం గ్రామంలోని ఒకరికి స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారణ అయింది. దీంతో జనం హడలిపోతున్నారు. నిద్ర వీడని వైద్యాధికారులు స్క్రబ్ టైఫస్ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులుగా రికార్డుకెక్కింది. అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేదు. టైఫస్ నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఈ టైఫస్ మరింత విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్క్రబ్ టైఫస్‌కు వైద్యం పూర్తిగా కరువుతోంది. వైద్యాధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంతో కేసుల తీవ్రత రెట్టింపవుతోంది. ఈ వ్యాధి నిర్ధారణకు స్క్రబ్ టైఫస్ ఐజీఎమ్ అనే టెస్ట్ చేయాలి. కానీ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ జిల్లాలో లేకపోవడంతో ఆ టెస్టు దూరమవుతోంది. ఎలిసా ద్వారా కూడా ఈ టైఫస్‌ను గుర్తించవచ్చు. కానీ ఎలిసా ఒక్క టెస్టుకు గాను రూ. 2 వేలు వ్యయమవుతోంది. ఈ వ్యయ భారంతో ప్రభుత్వం కూడా టైఫస్ టెస్టు చేసేందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు దోపిడీ స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారికి ప్రస్తుతం ప్రైవేటు ఆస్ప్రత్రుల్లో మాత్రమే చికిత్స అందుతోంది. అధిక జ్వరమని వెళితే.. తొలుత అక్కడ ఎలిసా టెస్టు చేస్తున్నారు. ఇందుకు రూ.2 వేలు ఫీజు తీసుకుంటున్నారు. తర్వాత చికిత్స కోసం రూ. 500 వరకు ఫీజు ఇచ్చుకోమంటున్నారు. అడ్మిట్ అయితే రూ. లక్షల్లో ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తోందని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. తిరుపతి, బెంగుళూరుకు, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, చైన్నె ఆస్పత్రుల్లో లక్షలు పోసి ఊపిరి పోసుకుంటున్నారు. అయితే జిల్లాలో ఈ స్క్రబ్ టైఫస్‌కు ఎలాంటి వైద్యం లేకపోవడంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అధికారుల ఆరా జిల్లాలో నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీశారు. జూమ్ ద్వారా రాష్ట్ర అధికారులు... జిల్లా అధికారులతో గంటపాటు చర్చించారు. స్క్రబ్ టైఫస్ కేసుల వ్యాప్తికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. అవగాహన కల్పించాలని ఆదేశించారు. కేసులు నమోదవుతున్నా ఎందుకు నిర్లక్ష్యమంటూ జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారులకు రాష్ట్ర అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. జనం కలవరపాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం వారం రోజులుగా జిల్లాలో 2,500 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. అనాధికారికంగా 3 వేలకుపైగా కేసులుంటాయి. దీనికి స్క్రబ్ టైఫస్ కేసులు సైతం తోడయ్యాయి. ఇవీ ఏడాదిగా 155 కేసులు నమోదైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్‌కు ఇక్కడ వైద్యం అందక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు వెళ్లిన వారు 160 మందికిపైగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల్లోకి రావడం లేదని తెలుస్తోంది. కేవలం జిల్లాలో చికిత్స తీసుకుంటున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎంత లెక్క తగ్గితే అంత మేలని...అధికారులు కేసుల సంఖ్యను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గతం వారం రోజుల్లో జిల్లాలో 10 కేసులు నమోదు కావడంతో కలవర పాటుకు గురిచేస్తోంది. -
విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతులతోనే మార్పు మొదలవ్వాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు తగిన అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా రాణించి అద్భుతాలు సృష్టిస్తారన్నారు. సమాజం విభిన్నప్రతిభావంతులకు ఇవ్వాల్సింది జాలి, కరుణ కాదని సమాన అవకాశాలని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమ పథకాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజం మొత్తం విభిన్నప్రతిభావంతులను అర్థం చేసుకొని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు ఎవరైనా అన్యాయం చేసినా, వేధింపులు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. అనంతరం వివిధ క్రీడలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ సాయినాథ్ పాల్గొన్నారు. -
ఫుట్ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్ర మంత్రికి ఎంపీ వినతి
● మాజీ మంత్రి ఆర్కే రోజా చొరవ ● పుత్తూరు ప్రజల కల సాకారం పుత్తూరు : పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ గురుమూర్తి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాథ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి మంత్రిని కలిశారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని పుత్తూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా గతంలోనూ ఇదే విషయాన్ని ఆమె మంత్రి హోదాలో అభ్యర్థించినట్లు గుర్తు చేశారు. పుత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, 3 నెలల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడడం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను తెలియజేస్తోందని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు పెండింగ్‌లోనే ఉందని, ఇకనైనా పరిష్కరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హామీ ఇచ్చినట్లు ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. దీంతో పుత్తూరు ప్రజల కల సాకారం కానుంది. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డీఆర్వో మోహన్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవుల ఆధ్వర్యంలో స్పర్శ్ కార్యక్రమం నిర్వహించారు. సిస్టం ఫర్ అడ్మినిస్ట్రేషన్–రక్ష (స్పర్శ్) కార్యక్రమం మాజీ సైనికులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫాంతో మాజీ సైనికుల పెన్షన్ సేవలు వేగవంతంగా అందిస్తామన్నారు. మాజీ సైనికులకు సులభతరంగా సేవలందించేందుకు స్పర్శ్ కార్యక్రమం నెలకొల్పారన్నారు. మాజీ సైనికుల పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు నేరుగా అధికారుల సమక్షంలో పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్ కేవీ రమణ, ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీరామమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యప్రసాద్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు చిత్తూరుకు డిప్యూటీ సీఎం
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని పవన్ ప్రారంభిస్తారు.బుధవారం పవన్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నట్లు డీఈవో వరలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీలో పు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు. -
● పూర్తి స్థాయిలో హాజరుకాని సచివాలయ ఉద్యోగులు ● సమయపాలన పాటించడం అంతంత మాత్రమే ● క్షేత్రస్థాయిలో ప్రజలకు అందని సేవలు ● జిల్లాలోని సచివాలయాల్లో అధికంగా డిప్యూటేషన్లు ● బాబు పాలనలో సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం ● ఇదీ జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిస్
సేవలు నిల్.. సర్వేలు ఫుల్ నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. తప్పని పడిగాపులు పలమనేరు : మండలంలోని మండిపేటకోటూరు సచివాలయం వద్ద రెండు రోజుల కిందట పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు సిబ్బంది లేక ముసురు వర్షంలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి 11 గంటలు దాకా పింఛనుదారులు నిరీక్షించినా సచివాలయ సిబ్బంది విధులకు రాలేదు. వారి గురించి కొందరు యువకులు అధికారులకు తెలిపారు. ఆపై స్పందించిన ఎంపీడీవో భాస్కర్ సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేయించి పింఛన్లు పంపిణీ చేయించారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో రూరల్‌లోని మండలాల్లో 612 గ్రామ సచివాలయాలు ఉండగా అందులో 4,477 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరైన దాఖలాలు లేవు. వారి కోసం ఎవరైనా అడిగితే ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారని చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపులతో సర్వేల బాధ్యతలు అప్పగించడం వల్లేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. సమావేశాల పేరుతో గైర్హాజరు జిల్లాలోని సచివాలయాల పరిధిలో 463 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరిలో అనేక మంది సమావేశాల పేరుతో సాకులు చెప్పి విధులకు గైర్హాజరవుతున్నారు. కొంత మంది వీఆర్వోలు మండల కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, కుప్పం, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని వీఆర్వోలు ఉదయం 11.30 గంటలకు విధులకు హాజరవుతున్నారు. ప్రతి సచివాలయానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన వీఆర్వోలు డైరెక్టుగా మండల కార్యాలయానికి వెళ్తున్నారు. ప్రజలు ఫోన్ చేస్తే సమావేశాలున్నాయని ఏమారుస్తున్నారు. కనీసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయినా సచివాలయాల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదు. రీ సర్వేలతో సర్వేయర్లు సతమతం ప్రతి గ్రామంలో సర్వే సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం 398 మంది సర్వేయర్లను ఏర్పాటు చేసింది. వీరు రీ సర్వే నిర్వహిస్తుండటంతో వారు ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ వేసే అవకాశం కల్పించారు.దీంతో అందుబాటులో ఉండడం లేదు. ఇక విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు 443 మంది ఎనర్జీ అసిస్టెంట్లు ఉండేవారు. వారిని విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటేషన్లకు వినియోగిస్తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. దీంతోపాటు మున్సిపాలిటీల పరిధిలో గేటు వసూళ్ల పనులు అప్పగించారు. ఎన్నికల విధుల్లో బీఎల్వోలుగా నియమించారు. సర్వేలతో సిబ్బంది సతమతం చంద్రబాబు పాలనలో వివిధ సర్వేల పేరుతో ఇప్పటి వరకు జిల్లాలోని సచివాలయ ఉద్యోగుల వందల సంఖ్యలో సర్వేలు నిర్వహించారు. అందులో ఈకేవైసీ అప్డేట్, కౌశలం (వర్క్‌ఫ్రంహోం), కొత్త రేషన్‌కార్డుల ఈకేవైసీ, వాట్సాప్ గవర్నెన్స్ డోర్ టు డోర్ అవేర్నెస్, బయోమెట్రిక్ అప్డేట్, పురమిత్ర, పీ4 దత్తత కార్యక్రమం, పట్టదారు పాసుపుస్తకం సర్వే, చిల్డ్రన్ విత్ ఆధార్ ఐడెంటిటీ, హౌస్ హోల్డ్ వివరాల ఎడిట్, యోగా డైలీ అటెండెన్స్, జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు, బడి బయటి పిల్లల గుర్తింపు, లీప్ యాప్ అసెస్మెంట్, తల్లికి వందనం సర్వే, జ్ణానభూమి వెరిఫికేషన్, ఆటోడ్రైవర్ల సర్వే ఇలా అనేక సర్వేలతో సచివాలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 189కొత్తపల్లె సచివాలయంలో ఖాళీ గుడిపాల: గుడిపాల మండలం 189 కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని బుధవారం సాక్షి పరిశీలించగా సిరికల్చర్ అసిస్టెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎఎన్ఎమ్, వెల్పేర్ అసిస్టెంట్ ఏ ఒక్కరూ కూడా కార్యాలయంలో లేదు. సర్వే డూటీలు ఉన్నాయని అందరూ డుమ్మా కొట్టారు. దీంతో ప్రజలు వచ్చి వెనుదిరుగుతున్నారు.పుంగనూరు : సచివాలయ కార్యదర్శులు అందరూ ఫీల్డ్‌కు వెళ్లారు. మీరు ఎవరు. ఎవరికీ సమాధారం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.పై అధికారులు అడిగితే చెబుతా... అంటూ మున్సిపాలిటీలోని బీడీ కాలనీ 1వ సచివాలయం అడ్మిన్ దామోదరం ఓవర్ యాక్షన్ చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడిన సంఘటన బుధవారం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు బీడీ కాలనీ సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, సమస్యలు పట్టించుకోవడం లేదని , ఎప్పుడు వెళ్లిన కార్యాలయంలో అందుబాటులో ఉండరంటూ ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై గత నెల 27న జరిగిన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ అలీమ్‌బాషా సమావేశంలో సచివాలయ కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ కార్యదర్శులు , ప్రజలతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కమిషనర్ మధుసూదన్‌రెడ్డిని ఆదేశించారు. ఈ విషయాలపై పరిశీలనకు వెళ్లిన సాక్షి విలేకరితో దామోదరం దురుసుగా మాట్లాడి, తమను ఎవరు ఏమి చేయలేరని దురుసుగా మాట్లాడారు. ఈ విషయమై కమిషనర్ మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచారణ జరిపి, విధులకు హాజరుకాని కార్యదర్శులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిప్యూటేషన్‌లో ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 612 గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,477 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 4040 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 437 మంది విధులకు గైర్హాజరవుతున్నారు. -
సవాల్ విసిరారు..వెన్ను చూపారు !
పలమనేరు : ‘తనపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దమని శివుడి సాక్షిగా తాను ఎలాంటి అక్రమాలు చేయలేదంటూ పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి మంగళవారం శివాలయంలో దేవుడి ముందు ప్రమాణం చేశారు’. వైఎస్సార్సీపీ హయాంలో హేమంత్‌కుమార్‌రెడ్డి తన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక తోలించుకున్నాడంటూ పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో కాణిపాకంలో ప్రమాణం చేస్తామని ఆరోపించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న ఆయన స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలసి కాణిపాకానికి రావాలని ఎదురుచూసినా ఎవరూ రాకపోవడంతో స్థానిక శివాలయంలో ప్రమాణం చేశారు. తనను ఆరోపించినవారు శివాలయానికై నా రావాలని అంతదాకా వేచి ఉంటానంటూ సవాల్ విసిరారు. కానీ టీడీపీ నేత రాకపోవడంతో ఆయన మాట్లాడుతూ తాను ఇంటి నిర్మాణానికి టీడీపీవారి వద్ద ఇసుక కొనుగోలు చేశానని వారు కూడా కావాలంటే వచ్చి చెబుతారన్నారు. ఇష్టాను సారంగా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
మోకాళ్లపై నిలబడి దళితనేత విన్నపం
పుంగనూరు : మండలంలోని దళితులకు శ్మశాన వాటికల కోసం సరైన స్థలాలను కేటాయించాలని దళిత నేత రాజు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో నేరుగా తహసీల్దార్ రాముకు మోకాళ్లపై నిలబడి మొరపెట్టుకున్నాడు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల నక్కబండలో ఒకరు మరణించగా , దహనం చేయడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అనేక గ్రామాల్లో వంకలు, చెరువుల సమీపంలోని స్మశానాలను కేటాయించడం వలన దళితులు ప్రతి రోజు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితుల గౌరవం దెబ్బతింటోందని, ప్రతి గ్రామంలో సురక్షితమైన, అందుబాటులో ఉండే స్థలాల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస సౌకర్యాలు కల్పించి, వారికి తగిన ఇంటి స్థలాలను కేటాయించి, కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వ అధికారులు స్పందించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ సుప్రియ, ఎస్ఐ కెవి.రమణ, మున్సిపల్ , రెవెన్యూ సభ్యుల ఎన్ఆర్.అశోక్, చిన్నరాయులు, నరసింహులు, రామయ్య, రమణ, ఎం.శంకరప్ప, రామకృష్ణ, కృష్ణప్ప, శ్రీనివాసులు, చిన్నబ్బ, శ్రీదేవి పాల్గొన్నారు. -
ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి
పుత్తూరు : రైల్వే ప్రమాదాలను నివారించడానికి స్థానిక ధర్మరాజుల గుడి ఎదురుగా గల రైల్వే ట్రాక్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి విత్ ర్యాంప్ నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా , తిరుపతి ఎంపీ గురుమూర్తికి విజ్ఙ ప్తి చేశారు. మంగళవారం ఎంపీని కలిసిన ఆమె 2023 ఆగస్టు 16వ తేదీన అప్పటి రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను అభ్యర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పనులు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో గత మూడు నెలల వ్యవధిలో 13 మంది రైల్వే ట్రాక్ దాటుతూ మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకు సంబంధించిన మ్యాప్‌ను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ గురు మూర్తి మాట్లాడుతూ.. పుత్తూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేటట్లు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. -
పీఈఎస్ ఆస్పత్రిలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు
గుడుపల్లె : పీఈఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలను కడా పీడీ వికాస్ మర్మత్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ, వంటి పథకాలు పొందేందుకు ఆధార్‌లో పేర్లు, నంబర్లు సరిచేసేందుకు వీలు గా ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రిలో సంజీవని పథకాలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పీఈఎస్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న వారికి ప్రభుత్వ రాయితీలు పొందే విధంగా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఈఎస్ చైర్మన్ జవహార్, కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఆర్ కృష్ణారావు, సూపరింటెండెంట్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
4,5 తేదీల్లో ఎస్వీ వెటర్నరీలో జాతీయ సమావేశం
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజుల పాటు పీజీ, డాక్టరల్, యూజీ చివరి సంవత్సరం విద్యార్థులకు వెటర్నరీలో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పశువుల ఆరోగ్యం, ఉత్పాదనపై ప్రభావం అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలు, వారి ఆవిష్కరణల ద్వారా పశువుల్లో వ్యాధులు తగ్గించి, పాలు, మాంసం ఉత్పత్తులు పెంచి జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలోని 8 రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొనడంతోపాటు వారి పరిశోధన పత్రాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ సమావేశంలో మొత్తం 6 అంశాలపై చర్చించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ ఫుడ్స్, ఫీడ్ మిల్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్‌రావు, వీసీ జేవీ రమణ, అంకో సీక్ కంపెనీ చైర్మన్ డాక్టర్ శ్రీలత, న్యూజీలాండ్, అస్ట్రేలియాకు చెందిన జీఓటీఎస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొనున్నారన్నారు. -
శ్రీవారి దర్శనానికి 10గంటలు
తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
గేట్లు మూసి.. కార్యాలయంలో కుస్తీ
పలమనేరు : సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 గంటలకే మూతపడడం అందరికీ తెలిసిందే. కానీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రాత్రి 6.30 దాటినా ఉపాధి అధికారులు రికార్డులతో కుస్తీ పడడం కనిపించింది. అది కూడా కార్యాలయ గేటు వేసి లోపల విధుల్లో కనిపించారు. దీనిపై అక్కడికెళ్లి విచారించగా ఈ విడత జరిగిన ఉపాధి పనులపై త్వరలో సోషల్ ఆడిట్ జరుగుతుందని దీని కోసం ఉపాధి పనులు తనిఖీ చేసే బృందానికి పనుల వివరాలు, మస్టర్లను అందిస్తున్నామని అక్కడున్న అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీలో భారీగా అక్రమాలు జరిగాయని వాటిని కప్పిపుచ్చుకొనేందుకు నేతల సూచనలతోనే అధికారులు రాత్రుల్లో సైతం రికార్డులను తారుమారు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు చెంగారెడ్డి ఆరోపించారు. వీరు అక్కడ రికార్డులు చూస్తున్న సమయంలో ఎంపీడీవో సైతం లేకపోవడం గమనార్హం. -
నష్టాల‘బంతి’
పలమనేరు : జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిజన్లో పూల సాగు చేసిన రైతులు ఆశించిన ధరలు లేక కుదేలయ్యారు. మొన్నటి దాకా ఓ మోస్తరుగా ఉన్న ధరలు ఈ తుపాను కారణంగా ధర మరింత దిగజారింది. బయటి ప్రాంతాల్లోనూ ధరలు తగ్గుముఖం పట్టడంతో పూలను కొనేందుకు వ్యాపారులు ఆసక్తిని చూపకపోవడంతో ధరలు పతనమయ్యా యి. దీంతో పాటు వర్షం కారణంగా నాణ్యత తగ్గిన పూలను రైతులు తోటల్లోనే కోయకుండా వదిలేస్తున్నారు. మరో రెండు నెలల దాకా శుభ కార్యాలు లేకపోవడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఆ మేర బంతి ధర వారం కిందట రూ.50 దాకా ఉండగా ఇప్పుడు కిలో రూ.15 మాత్రమే పలుకుతోంది. చామంతి ధర మొన్నటి దాకా రూ.150 దాకా ఉండగా వర్షంతో వందకు చేరింది. ఎడతెగని వర్షాలతో .. పూల సాగుకు తుపాన్ కారణంగా నష్టాలు తప్పటడం లేదు. వర్షానికి తడిచి పూల నాణ్యత తగ్గుతుంది. దీంతో వీటికి మార్కెట్లో పెద్దగా ధరలు పలకవు. ఎకరా పూల సాగుకు రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టిన రైతులు బంతి పూలు రూ.50 దాకా, చామంతి రూ.150 దాకా ఉంటే తప్ప రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. వర్షం కారణంగా పూలను కొనేందుకు వ్యాపారులు రావడం లేదు. మండీలకు తీసుకెళ్లినా అమ్మకాలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో పలువురు రైతులు పొలాల్లోనే పూలను కోయకుండా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి విజయవాడకు ఎక్కువగా బంతి పూలను తీసుకెళుతుంటారు. అయితే అక్కడ కూడా డిమాండ్ లేక కొనేవాళ్లు లేరు. దీంతో మార్కెట్‌కు తీసుకెళ్లిన పూల నాణ్యత లేని కారణంగా రోడ్లపక్కన పడేస్తున్నారు. హైబ్రిడ్ రకాలతో పెరిగిన ఉత్పత్తులు పలమనేరు డివిజన్లో ఈవిడత సుమారు 200 హెక్టార్లలో ఎల్లో మాక్సిజిమమ్ అనే రకం బంతి, మేరీగ్లోబ్ అనే రకం చామంతి పంటను రైతులు ఎక్కువగా సాగు చేశారు. గతంలో నాటు రకాలను పండిచేవారు. కాబట్టి ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పూల ఉత్పత్తి ఉండేది. ప్రస్తుతం హైబ్రిడ్ రకాల కారణంగా ఎకారానికి 8 నుంచి 10 టన్నులు ఉత్పత్తి అవుతోంది. కుప్పం ప్రాంతంలోని గ్రీన్ హౌస్‌లలో ఎకరానికి మేలి రకం పూలు 15 నుంచి 18 టన్నుల ఉత్పత్తి కావడం గమనార్హం.పంట ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేక ధరలు అమాంతం పతనమవుతున్నాయి. వీకోట, కుప్పం తదితర పూల మార్కెట్‌కు భారీగా సరుకు వస్తున్నా గిరాకీ లేదు. -
డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: అటానమస్ హోదాలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల డిగ్రీ మూడో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అతి త్వరగా విడుదల చేసేందుకు సహకరించి కళాశాల అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో 95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ సభ్యులు జి సుధాకర్, చంద్రశేఖర్, సంధ్య పాల్గొన్నారు. -
బాల్యవివాహాలతోనే హైరిస్క్ కేసులు
చౌడేపల్లె : బాల్య వివాహాల కారణంతోనే హైరిస్క్ కేసులు నమోదవుతున్నాయని జిల్లా గణాంక అధికారి డాక్టర్ జార్జి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని 29 ఏచింతమాకులపల్లె, కాగతి, గడ్డంవారిపల్లెలోని సీహెచ్‌సీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో నిర్వహించాల్సిన రికార్డులను పరిశీలించారు. 12 వారాల్లోపు గర్భిణులను ఆన్లైన్లో నమోదు చేయించి వారికి నిర్ణీత గడువులోపు టీకాలు వేయించాలని ఆరోగ్య సిబ్బందికి సూచనలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 19 ఏళ్లలోపు గల యువతులే త్వరగా వివాహాలు చేసుకొని గర్భం దాల్చడం వలన హైరిస్క్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. రక్తహీనత నుంచి విముక్తి పొందడానికి అంగన్వాడీ కేంద్రాలతో పాటు నాణ్యమైన పౌష్టికాహారంను వినియోగించేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ మోనా, ఆరోగ్యశాఖ సిబ్బంది రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులు ఇప్పించు భీమేశ్వరా!
పూతలపట్టు (యాదమరి): మామిడి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం హామీ మేరకు రూ.8 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని జిల్లా రైతు అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్‌రెడ్డి, మురళీ అన్నారు. మంగళవారం పూతలపట్టు మండల కేంద్రంలోని శివాలయం వద్ద మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుజ్జు పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం దారుణమన్నారు. మామిడి పంటను పరిశ్రమలకు తరలించిన రైతులకు నెలలు గడుస్తున్నా ఇంత వరకు బకాయి బిల్లులు చెల్లించక ఆలస్యం చేయడం దుర్మార్గమన్నారు. మామిడికి గిట్టుబాటు ధర సాధన కోసం, మార్కెటింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి అవసరమైన డిమాండ్ల కోసం ఈ నెల ఆఖరున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అనంతరం భీమేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. కాగా సమావేశంలో మామిడి రైతుల సంఘం పూతలపట్టు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వడమాలపేట విద్యార్థినికి రజత పతకం వడమాలపేట (పుత్తూరు): శ్రీసత్యసాయి జిల్లా చిగిచెర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో వడ మాలపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ప్రణతి జూడో పోటీలలో రజత పతకం సాధించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రణతి అండర్–14 కేటగిరిలో పతకం సాధించింది. విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం కరుణా నవనీ తం, ఉపాధ్యాయ బృందం అభినందించింది. రేపు అర్ధగిరి క్షేత్రంలో పౌర్ణమి వేడుకలు తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో 4వతేదీ గురువారం కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తామని ఆలయ ఇన్‌ఛార్జి ఈఓ మునిశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు స్వామికి సుదర్శన హోమం, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రాకారోత్సవం వైభవంగా జరుగుతుందని వివరించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సైన్స్ ఫెస్టివల్‌కు రమేష్ ఎంపిక నగరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్)కు నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ బి.రమేష్ ఎంపికయ్యారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు చండీఘర్ పంజాబ్ యూనివర్సిటీ నందు జరిగే సైన్స్ ఫెస్టివల్లో వినూత్న బోధన, విజ్ఞాన వ్యాప్తిని బలోపేతం చేయడానికి రూపొందించిన వివిధ విద్యా, నైపుణ్యాలను పెంచే సెషన్లలో రమేష్ పాల్గొనున్నారు. ఆ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.వేణుగోపాల్, అధ్యాపకులు ఆయనకు అభినందనలు తెలిపారు. నేడు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ విక్రమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా స్థాయిలో అధికారికంగా విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఉదయం 10 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతిభావంతులు, విభిన్నప్రతిభావంతుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. -
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరం
– రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరం : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మంగళవారం పుత్తూరు పార్టీ కార్యాలయంలో జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల కరపత్రాలను డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని అమలు చేయకుండా దగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న దగాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి తమకు అనుకూలమైన బినామీల చేతిలో పెట్టారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీ కరణను విరమించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని, కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు దైర్యంగా ఉండాలని అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మామిడి వివరాలు..
సహిత విద్యను పక్కాగా అమలు చేయాలి సహిత విద్యను పక్కాగా అమలు చేయాలని డీఈవో కోరారు.ఆటోను ఢీకొన్న బస్సు రోడ్డు రక్రాస్ చేస్తున్న సమయంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గుడిపాల జాతీయ రహదారిపై రోడ్డెక్కిన మామిడి రైతులు పురుగుమందు డబ్బా తెచ్చివ్వండి. ఇక్కడున్న రైతులంతా తలా కొద్దిగా తాగి చనిపోతాం. ఇంకెందుకు ఈ బతుకులు. కాయలు తోలిన డబ్బులు అడిగితే తప్పా? ఆరునెలలు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర ఏదీ? కిలోకు రూ.3 ఇస్తే ఏం చేసుకోవాలి. రైతులంటే అలుసా? ఎందుకు మమల్ని వేధిస్తున్నారు. కిలో రూ.8 ఇవ్వాలంటూ గుడిపాల మండలంలో మంగళవారం ఫ్యాక్టరీలను ముట్టడించి..ఆపై రోడ్డుపై బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలి లేదంటే ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. మామిడిసాగు విస్తీర్ణం 50వేల హెక్టార్లు ఈఏడాది దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఫ్యాక్టరీలు 46 కాయలు కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు 31 ఫ్యాక్టరీలకు అమ్ముకున్న కాయలు 2.31లక్షల మెట్రిక్ టన్నులు ఫ్యాక్టరీలకు విక్రయించిన రైతులు 49,350 ర్యాంపుల సంఖ్య 26 ర్యాంపులకు చేరిన కాయలు 1.44 లక్ష మెట్రిక్ టన్నులు ర్యాంపులకు తోలిన రైతులు 30,600 ప్రభుత్వం గిట్టుబాటు ధర కిలో రూ.8 ఫ్యాక్టరీలు ఇస్తున్న ధర కిలో రూ.3 నుంచి 4 ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.360 కోట్లు (సుమారు) బకాయలపోరు జిల్లాలో మామిడి రైతుల కష్టం ఫ్యాక్టరీల పాలవుతోంది. ఇన్నాళ్లు రాజులా బతికిన ఫలరాజుల కడుపు మండిపోతోంది. రైతుల ఫలం ఫ్యాక్టరీల్లో గుజ్జుగా మారి.. ప్రతిఫలం చేతికి చిక్కనంటోంది. నెలల తరబడి రైతాంగం బిల్లుల కోసం ఎదురుచూస్తోంది. తీరా కిలో రూ.3, రూ.4 చెల్లించడంతో బిల్లులపై ఆవేదన చెంది మంగళవారం గుడిపాల మండలంలో రైతులు రోడ్డెక్కి ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం/గుడిపాల : మామిడిలో తోతాపురి రకం కోతలు జూన్ మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు ఒకటే కష్టాలు. దిగుబడి విక్రయించుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. టోకెన్ల కోసం తోపులాట, తొక్కిసలాట నడుమ నలిగిపోయారు. ట్రాక్టర్లు దొరక్క తిప్పలు పడ్డారు. తీరా కాయలు ఫ్యాక్టరీలో అన్ లోడింగ్ చేసేందుకు నిద్రలేనిరాత్రుళ్లు గడిపారు. రాత్రుల్లో జాగరణ చేసి..పగలంతా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు పడ్డారు. అయితే ఆ తర్వాత కూడా రైతులను ఫ్యాక్టరీలు వేధిస్తూనే ఉన్నాయి. గుజ్జు లాగేసుకున్నారు జిల్లాలో మామిడి 50 వేల హెక్టార్లల్లో విస్తరించింది. ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అవుతుందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం కాయలు దిగుబడి అయ్యాయి. టేబుల్ రకం మామిడి మాత్రం వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తోతాపురిని కొంత వరకు ఎగుమతి చేయడంతో పాటు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు చేరాయి. 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను రైతులు ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. తీరా వారి కష్టం ఫ్యాక్టరీ పాలవుతోంది. సిండికేట్‌గా మారిన ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి రైతులను దెబ్బతీసేందుకు ఫ్యాక్టరీలు లోలోపల కుట్రలు పన్నుతోంది. సిండికేట్ అయి..మామిడి రైతులను దగా చేస్తున్నారు. కోతల సమయంలో కాయలు వద్దని తిరస్కరించింది. తర్వాత అధికారుల ఒత్తిడితో కొనుగోలు చేస్తున్నట్లు కటింగ్ ఇచ్చారు. చెల్లింపు విషయాన్ని నొక్కి పెట్టారు. కాయలు కొనలేమని బోర్డు పెట్టించి..రైతులకు కన్నీళ్లు తెప్పించారు. తీరా కాయలు కొనుగోలు చేసి..రైతుల కష్టంపై నీళ్లు చల్లింది. కేజీ రూ.3, రూ.4 అంటూ పాట పాడుతోంది. కనిపించని గిట్టుబాటు ధర ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధరను ప్రకటించింది. ప్రభుత్వం కేజీకి రూ. 4 ప్రోత్సాహక నిధి ఇస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున చెల్లిస్తుందని గొప్పలు చెప్పారు. తీరా ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధరకు వెనుకాడుతోంది. వారు ఇచ్చే ధర ప్రకారమే డబ్బులు తీసుకోవాలని హుకుం జారీ చేస్తోంది. దీంతో మామిడి రైతులు కన్నెర్ర జేసి ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. చోద్యం చూస్తున్న పాలకులు ప్రస్తుత పాలకుల పంచ్‌లు సినిమా డైలాగ్‌లు మించిపోతున్నాయి. మామిడి రైతులను ఉద్దేశించి పాలకులు విసిరిన డైలాగ్‌లు..మాటలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వ గిట్టుబాటు ధర కేజీ రూ.8కి ఇవ్వాలని, లేనిపక్షంలో ఫ్యాక్టరీలు సీజ్ చేస్తామని పంచ్‌లు విసిరారు. ఆ పంచ్‌లు ఆ వేదికకే పరిమితం అయ్యాయని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు చోద్యం చూడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాలకులు పట్టించుకోని పక్షంలో మామిడి పోరుకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. రోడ్డెక్కిన అన్నదాత గుడిపాల మండలం కొత్తపల్లి సమీపంలోని ఓ పళ్ల గుజ్జు పరిశ్రమ రూ. 3, రూ.4 చొప్పున రెండు రోజులగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మామిడి రైతులు మంగళవారం ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. కేజీకి రూ.3, రూ.4 ఎలా ఇస్తారని మండిపడ్డారు. రైతులంతా ఏకమై...జాతీయ రహ దారిపై బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్కచేయక తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దిగిరావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రహదారి పొడవునా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని సర్ధుబాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆపై ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని రైతులను సర్ధుబాటు చేశారు. కలెక్టర్ వద్ద చర్చిద్దామని, ఫ్యాక్టరీ వాళ్లను కూడా పిలిపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. -
పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 31 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణ నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఐదు రోజుల పాటు అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు 40 మంది అ ధ్యాపకులు శిక్షణలో పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యత, ప్రాథమిక సిద్ధాంతాలు, ఆధునిక పరిశోధనా ధోరణులు, అనువర్తనాలపై నిపుణులు అధ్యాపకులకు శిక్షణ అందించనున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫిజిక్స్ విభాగం అసో సియేట్ ప్రొఫెసర్లు రితీష్ కుమార్ అగర్వాల్(ఐఐటీ తిరుపతి) చిత్రాసేన్ జైనా(ఐఐఎస్ఈఆర్) మా ట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా విస్తరిస్తున్న క్వాంటమ్ టెక్నాలజీలపై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలన్నారు. సిలబస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభ్యాసాలను ప్రవేశపెట్టి, విద్యార్థులను నిష్టాతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతన సాంకేతికతపై పరిశోధనలు, శిక్షణ అధ్యాపకుల అక డమిక్ నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయన్నారు. ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్ఓడీలు మల్లిక, మురళి, కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమబాల, ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. బాబు ప్రభుత్వంలో బాదుడే బాదుడు – లబోదిబోమంటున్న వినియోగదారులు గుడిపాల: కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం మళ్లీ లబ్ధిదారులకు షాక్ ఇచ్చింది. అరియర్స్ పేరిట బాదుడే బాదుడుగా బిల్లులను దంచేస్తున్నారు. గుడిపాల మండలంలోని వసంతాపురంలో సో మవారం విద్యు త్ బిల్లులు ఇచ్చా రు. సర్వీసు నంబర్ 51133 06003748 గల ఇంటికి కరెంట్ బిల్లు మొత్తం రూ.1919 వచ్చింది. ఇందులో నెల బిల్లు రూ.912 కాగా, అరియర్స్ అమౌంట్ అని చెప్పి మరో రూ.1007 జత చేశారు. దీంతో మొత్తం బిల్లు రూ.1919 వచ్చింది. ఇంత బిల్లు రావడంతో ఆ లబ్ధిదారుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే సంబంధిత ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్‌చేయగా ఆయన ఏ మాత్రం స్పందించలేదని ఆయన వాపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిల్లులు మీద బిల్లులు బాదుతుండడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి ఏడిపింఛన్
ఇప్పుడే ఏదో కొత్త పింఛన్లు పంచినట్లు బిల్డప్.. పాత పింఛన్ల పంపిణీకి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వస్తున్నారని హంగామా.. తిరుపతిలో ఆయన చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఉంటుందని హడావుడి.. పింఛన్లు అందుకునే వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు మంత్రి రాక కోసం ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షణ.. పింఛను ఇంటివద్దనే కాకుండా గుంపుగా ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు.. పింఛన్ చేతికొచ్చేసరికి మధ్యాహ్నం 12:30 గంటలైంది. వీళ్ల ఆర్భాటం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అని లబ్ధిదారులు తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లారు. తిరుపతి తుడా: నగరంలో డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అన గాని సత్యప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, సచివాలయ సెక్రటరీలు రెండు గంటల ముందే జీవకోన అంబేడ్కర్ కూడలి పరిసర ప్రాంతాల నుంచి లబ్ధిదారులను వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. మంత్రి మధ్యాహ్నం 12.15 గంటలకు రావడంతో లబ్ధిదారులు నిరీక్షించక తప్పలేదు. ఇంటి వద్ద కాకుండా.. గుంపులుగా తెచ్చి.. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గౌరవంగా పింఛను పంపిణీ చేసే పటిష్టమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే మంత్రి వస్తున్నారని లబ్ధిదారులందరినీ ఒకే చోట గుంపుగా ఉంచి, పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇలాగేనా పింఛన్లు పంపిణీ చేసేదంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులుగా మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేయమన్నారు? లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని తెలియదా? అంటూ ఆమె మండిపడ్డారు. బల ప్రదర్శనలా పింఛన్ పంపిణీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం బల ప్రదర్శనలా సాగింది. వాహనాలతో ఆ ప్రాంతం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టిలో పడేందుకు ఎవరి కి వారు పోటీపడ్డారు. ఫొటోలో కనిపించేందుకు ఎగబడ్డారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ , టీడీపీ నేతలు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీధర్ వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డివైడర్ని ఢీకొన్న కారు
● నలుగురికి స్వల్ప గాయాలు పాకాల: వేగంగా వస్తూ డివైడర్ని ఢీకొనడంతో కారులో ప్రయా ణిస్తున్న నలుగురికి స్వల్ప గాయా లైన సంఘటన సోమవారం మండలంలోని కోనప్పరెడ్డిపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతూ కోనప్పరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పిన కా రు డివైడర్ని ఢీకొంది. దీంతో కారులోని కర్ణాటకవాసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరీష్‌గౌడ్ తెలిపారు. నదిలో గల్లంతైన వృద్ధుడిని రక్షించిన అధికారులు నాయుడుపేట టౌన్: మండలంలోని తిమ్మాజీకండ్రిగ సమీపంలో స్వర్ణముఖి నది వద్ద సోమవారం మద్యం మత్తులో ఓ వృద్ధుడు నీటి ప్రవాహంలో దిగి, గల్లంతయ్యాడు. పోలీసు, అగ్నిమాపక అధికారులు అతడిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఓ వృద్ధుడు నదిలో కొట్టుకుపోతుండగా అక్కడ స్నానాలు చేస్తున్న అయ్యప్ప భక్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. విష యం తెలుసుకున్న డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి, అగ్నిమాపక శాఖ అధికారి కే సునీల్ కుమార్ చేరుకుని వృద్ధుడిని రక్షించారు. -
బస్సు ఢీకొని స్కూటరిస్టు మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.వినోద్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. నగరంలోని చెన్నమగుడిపల్లెకు చెందిన వినోద్‌కు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల్లో ఒకరికి ఎనిమిది నెలలు. పెయింటింగ్ పనులు పూర్తిచేసుకుని ద్విచక్రవాహనంలో వేలూరు రోడ్డు నుంచి చిత్తూరుకు బయలుదేరాడు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో వేలూరు వైపు నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు.. ద్విచక్రవాహనాన్ని అతిక్రమించే క్రమంలో వినోద్ బైకును ఢీకొట్టింది. బస్సు చక్రం కింద పడిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల అరెస్ట్ పుంగనూరు: మండలంలోని సింగిరిగుంట, సుగాలిమిట్ట, మైనార్టీల ఐటీఐ కళాశాలలో గత రెండు నెలల క్రితం దొంగతనం చేసిన టీవీలు, బ్యాటరీలు దొంగలించుకెళ్లిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కెవి.రమణ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత అక్టోబర్ 9న సింగిరిగుంట, సుగాలిమిట్ట సచివాలయాలు తాళాలు పగుల గొట్టి టీవీలు, బ్యాటరీలు, కరెంటు మోటార్లు ఎత్తుకెళ్లారు. అలాగే మైనార్టీల ఐటీఐ కళాశాలలో వివిధ రకాల వస్తువులను చోరీ చేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటకకు చెందిన పటాన్ హమీద్‌ఖాన్, సాధిక్‌పాషా, షాబాద్ అహమ్మద్‌ను మండలంలోని వనమలదిన్నె క్రాస్ సమీపంలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగతనం అయిన వస్తువులను సాధీనం చేసుకున్నామన్నారు. మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా పట్టుకుంటామని తెలిపారు. ముగ్గురు దొంగలను రిమాండ్‌కు తరలించామన్నారు. పాప వినాశనం డ్యామ్ పరిశీలన తిరుమల : తిరుమలలోని పాప వినాశనం డ్యామ్‌లో సోమవారం కేంద్ర బృందం శాసీ్త్రయ పరిశీలన చేపట్టింది. డ్యామ్ సేఫ్టీ అంశాలను జలవనరులశాఖ అధికారులు తనిఖీ చేశారు. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్యామ్ సామర్థ్యం పరీక్షించారు. ఈ క్రమంలో ముగ్గురు సైంటిస్టులు క్షేత్రస్థాయిలో రిమోట్ ఆపరేటింగ్ వెహికల్ సహకారంతో పాప వినాశనంలోని నీటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జలాశయం లీకేజీలను పరిశీలించారు. డ్యామ్‌ను మరింత పటిష్టం చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. నిపుణుల సలహా మేరకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. -
పూరి గుడిసెకు నిప్పు
శ్రీరంగరాజపురం : ఓ నిరుపేద మహిళ పూరి గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన సంఘటన మండలంలోని డీకే మర్రిపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలి మేరకు.. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో లేని సమయం చూసుకుని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. ఇంటిలోని వస్తువులు, బీరువాలో డ్వాక్రా సంఘం నుంచి తెచ్చి దాచిన నగదు రూ.30 వేలుతో పాటు బంగారం 25 గ్రాములు, జగనన్న ఇచ్చిన ఇంటి పట్టా, బియ్యం, వడ్లు, దుస్తులు పూర్తిగా కాలి బూడిద య్యాయి. తినడానికి కూడా బియ్యం లేవని వాపోయింది. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.ధాన్యం లారీ బోల్తా నాయుడుపేటటౌన్: మండలంలోని చలివేంద్రం గ్రామ సమీపంలో రహదారిపై సోమవారం ధాన్యం లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. బద్వేల్ నుంచి ధాన్యం లోడ్‌తో చైన్నెకు వెళుతున్న లారీ చలివేంద్రం గ్రామ సమీపంలో మరో లారీకి దారి వదిలేందుకు ధాన్యం లారీ పక్కకు వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’కి 62 సమస్యలు
తిరుపతి రూరల్: ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 62 మంది తమ సమస్యలను ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యు వర్ సీఎండీ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లతో కలసి హాజరైన సీఎండీ శివశంకర్ గత సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి వినియోగదారులు దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న త మ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. అందులో ప్ర ధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జా ప్యం, విద్యుత్ లైన్ మార్పు, కాలిపోయిన, చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల మార్పు, లో–ఓల్టేజ్ సమస్యలు ఉన్నాయి. కర్నూలు నుంచి 15, కడప 13, అనంతపురం 11, నెల్లూరు 8, శ్రీసత్యసాయి 5, చిత్తూరు 4, తిరుపతి 2, అన్నమయ్య 2, నంద్యాల నుంచి 2 వినతులు వచ్చాయి. 265 సమస్యలకు గాను 96 పరిష్కారం.. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ ద్వారా గత నెల 24వ తేదీ వరకు మొత్తం 265 మంది వినియోగదారులు తమ సమస్యలను తెలియపరచగా అందులో 96 సమస్యలను ఇప్పటికే పరిష్కరించగా మరో 22 సమస్యలు పాలసీ మ్యాటర్‌కు సంబంధించినవి కావడంతో సంబంధిత విభాగాలకు పంపడం జరిగిందన్నారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్ జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం. ఉమాపతి, పి.సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, రామచంద్రరావు, చక్రపాణి, సురేంద్రరావు, భాస్కర్‌రెడ్డి. జగదీష్, ప్రసాద్, వెంకటరాజు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి ఎనలేని సేవలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో క్రీడాభివృద్ధికి బాలాజీ ఎనలేని సేవలందించారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ విరమణ పొందిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీకి సోమవారం కలెక్టరేట్లో సత్కార కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత బాలాజీకి దక్కతుందన్నారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేశారన్నారు. ఆయనకు అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు. ఏ సమస్యనైనా పరిష్కరించగల నేర్పరితనం ఆయన సొంతమని కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఆయన సేవలు క్రీడాశాఖకు ఎంతో ముఖ్యమన్నారు. రిటైర్డ్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ మాట్లాడుతూ తన విధి నిర్వహణ ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. అనంతరం బాలాజీ దంపతులను ఉన్నతాధికారులు దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్ఓ మోహన్‌కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా నైపుణ్యాధికారి గుణశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిరుత పిల్లల దాడిలో మహిళకు గాయాలు
ఐరాల: చిరుత పిల్లల దాడిలో ఓ మహిళకు స్వల్ప గాయాలైన సంఘటన ఐరాల మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండల డిప్యూటీ రేంజ్ అధికారి రాకేష్‌కుమార్ కథనం మేరకు.. ఐరాల మండలంలోని పుత్రమద్దికి చెందిన కాంతమ్మ (పుట్టుకతో మూగ) తన పాడి ఆవును శనివారం సాయంత్రం గ్రామం సమీపంలోని పసలకొండపై మేతకు వదిలింది. ఆవు మేత మేస్తుండగా సమీపంలోని ఓ చిన్న గుంతలో చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు నీరు తాగుతుండడం గమనించింది. వాటిని చూసి భయపడి బిగ్గరగా అరవలేక.. రాయి తీసుకొని వాటిపై విసిరింది. దీంతో చిరుత పిల్లలు ఆమైపె దాడిచేసి కాలి గోర్లతో రక్కాయి. చిరుత దాడి చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలతో బయటపడ్డ కాంతమ్మ గ్రామానికి చేరుకొని జరిగిన విషయాన్ని తన సైగలతో గ్రామస్తులకు వివరించింది. అటవీ శాఖ సిబ్బంది గ్రామస్తులతో కలిసి సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశువుల మేత కోసం పసల కొండపైకి వెళ్లరాదని గ్రామస్తులకు చెప్పారు. -
భూమి వారిదని అంటున్నారు..
తాము గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్న భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దపంజాణి మండలం బనకందొడ్డి గ్రామానికి చెందిన గ్రామస్తులు శివశంకరయ్య తదితరులు వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని సర్వే నంబర్ 42/1లో 1.33 ఎకరాలు, 39/5లో 0.67 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందన్నారు. అందులో చాలా ఏళ్లుగా 30 కుటుంబాలు గృహాలు కట్టుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పుడు వారు సెటిల్మెంట్ భూమి అంటూ కొందరు భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. -
మల్లిమడుగు గేట్లు ఎత్తివేత
రేణిగుంట: దిత్వా తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. శుక్రవారం సాయంత్రం 9 గేట్లను రెండు అడుగుల ఎత్తు వరకు ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుతుండగా దిగువకు 2200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మల్లిమడుగు రిజర్వాయర్ వద్ద నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితి ఆధారంగా రాత్రి వేళల్లో గేట్లు ఎత్తే వీలుంటుందని సుజల స్రవంతి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమించారు
గ్రావెల్ వల్ల ప్రమాదాలు దారి సౌకర్యం కల్పించడయ్యా.. తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని ఐరాల మండలం గాజులపల్లి దళితవాడకు చెందిన చిట్టెమ్మ, పుష్పమ్మ వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామానికి 1983లో సబ్‌డివిజన్ చేసి దారి కల్పించారన్నారు. రెవెన్యూ అధికారులు సైతం దారి సౌకర్యానికి మార్క్ చేశారన్నారు. అయితే కొందరు అగ్రకులస్తులు దారి సౌకర్యం కల్పించకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని వారు కోరారు. ప్రభుత్వ భూమి ఆక్రమించారని వెల్లడిస్తున్న నునిముద్దలపల్లి గ్రామస్తులుగ్రావెల్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడిస్తున్న నెప్ట్యూన్ నగర్ వాసులు తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారని చౌడేపల్లి మండలం నునిముద్దలపల్లికి చెందిన కోటమ్మ, సుబ్రహ్మణ్యం తదితరులు వాపోయారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్ 996లో ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని పక్క గ్రామంలోని కొందరు ఆక్రమించుకున్నారని తెలిపారు. పరిశీలించి ఆ భూమిని తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ కేంద్రం ఏర్పాటుకు కేటాయించాలని కోరారు. రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చిత్తూరు నగరంలోని నెప్ట్యూన్ నగర్ వాసులు రమణ, ఆనంద్ తదితరులు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కలెక్టరేట్‌కు కూత వేటులో ఉన్న నెప్ట్యూన్ నగర్‌లోని రెండు వీధులకు వెళ్లే దారిలో గ్రావెల్ వ్యర్థాలను వేశారని చెప్పారు. ఆ గ్రావెల్ వ్యర్థాలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు పైకి రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. గ్రావెల్ వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు చిత్తూరు జిల్లా లైజనింగ్ ఆఫీసర్ హరిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ రవి కథనం మేరకు.. 2018 జనవరి 25వ తేదీ రొంపిచర్ల పోలీసులు పీలేరు తిరుపతి రోడ్డు, రొంపిచర్ల మండలం, బొమ్మయ్యగారిపల్లి సమీపంలోని దండపాణి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఓ కారు పోలీసులను చూసి దూరంగా ఆగింది. కారులోని ఐదుగురు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. సదుం మండలం, బూరగమంద గ్రామానికి చెందిన పగడాల వెంకటరమణ, సదుం మండలం సీతన్న గారిపల్లికి చెందిన మల్లెల హరినాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమర్ నారాయణ వాదించారు. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు
తిరుపతి మంగళం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో తరచూ చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తితోపాటుగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, పాడైన ఆర్వో ప్లాంట్లు, శుభ్రం చేయని నీటి ట్యాంకులు, వంటగది పరిశుభ్రత లోపం వంటి కారణాలతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం తదితర వివరాలు తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఎంపీ గురుమూర్తికి వివరించారు. అయితే, వారందరికీ వైద్య చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి, లోపాలున్న చోట వెంటనే సరిదిద్దినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి చెప్పిన వాటికి భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగక ముందే చర్యలు తీసుకొంటే సమస్య ఉండేది కాదన్నారు. ఇప్పటికీ చాలా వసతి గృహాల్లో కనీస వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తప్పులు సరిదిద్దక పోగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా నివేదికలు పంపుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధాన మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం వివరాలతోపాటు పాఠశాలల్లో భోజన నాణ్యత, భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి మంత్రి వివరిస్తూ, ఈ పథకాన్ని అమలు చేయడం, ప్రతిరోజూ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. -
రైలు నుంచి జారి పడి ..
కుప్పంరూరల్: రైలు నుంచి ప్రమాదవశా త్తు జారిపడి యువతి దుర్మరణం పాలైన సంఘటన కుప్పం మండలం పెద్దగోపనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమే ష్ కథనం మేరకు ఇలా.. సుమారు 20 ఏళ్ల వయసు కలిగిన పసుపు, తెలుపు రంగు చుడీ దార్ ధరించిన గుర్తు తెలియని యువతి ప్రమాదవశాత్తు అశోక్పురం రైలు నుంచి జారి పడి మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటన చైన్నె – బెంగళూరు రైల్వే మార్గంలో పెద్దగోపనపల్లి వద్ద చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా వివరాలు తెలిస్తే 9000716436, 8074088806 నంబర్లలో రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరి యా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,187 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,027 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కన్వీనర్ కోటా విద్యార్థులకు మొండిచేయి! తిరుపతి సిటీ : అంబేడ్కర్ లా కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి కళాశాల యాజమాన్యం నిరాకరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కన్వీనర్ కోటా కింద .సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి సోమవారం కళాశాలకు వచ్చిన సుమారు 30మంది విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ఇప్పటికే సీట్లు భర్తీ అయ్యాయని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. మిగిలి సీట్లను రూ.లక్షలకు తమిళనాడు విద్యార్థులకు అమ్ముకునేందుకే కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలలోనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. -
మీరే చూపండి పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో న్యాయం జరగడం లేదు కలెక్టర్ సార్.. తమరే న్యాయం చేయాలంటూ అర్జీదారులు దండం పెట్టి వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 232 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వెల్లడించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ దండం పెట్టి కలెక్టర్‌ను వేడుకుంటున్న అర్జీదారుడు -
ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు
అగనంపూడి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి అండర్14 ఖోఖో టోర్నమెంట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. గత నెల 28 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికలకు జరిగిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జట్లు తమ సత్తా చాటాయి. బాలుర విభాగం ఫైనల్స్‌లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలవగా, గుంటూరు జట్టు మూడో స్థా నాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో చిత్తూరు జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి చాంపియన్‌గా నిలిచి కప్ గెలుచుకుంది. విశాఖ జట్టు రన్నరప్‌గా నిలవగా, శ్రీకాకుళం జట్టు మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, జిల్లా ఉప విద్యాశాఖాధి కారి పొన్నాడ అప్పారావు, హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో బోయకొండ గంగమ్మ దర్శనం టికెట్లు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఆన్లైన్ ద్వారా టికెట్లు, ప్రసాదాలు, వివిద సేవలు పొందవచ్చని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెబ్సైట్, వాట్సాప్ ద్వారా కూడా ఆలయ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మన మిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 తోపాటు https:// www. aptemples. org వెబ్సైట్ ద్వారా ఆలయ సేవలు పొందవచ్చని చెప్పారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక కౌంటర్లో ఆధార్ కార్డులను పరిశీలించి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దర్శనం, ప్రసాదాలు, వసతి సముదాయం కోసం ఆసక్తిగల భక్తులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఆలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భక్తులతో కిటకిట ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా మహిళలు, ఉపవాస దీక్షలతో ఆలయం వద్దకు చేరుకుని గంగమ్మకు పూజలు చేసి జంతుబలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో రద్దీతో క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకొన్నారు. -
మన అడవుల్లో పులులున్నాయా?
జంతుగణన చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : పులులు, ఇతర జంతువుల గణనకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ ప్రాంతంలోని జంతువుల గణన ప్రక్రియను నిర్వహిస్తారు. జిల్లాలో జంతుగణన ప్రక్రియను సోమవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గతంలో జంతువుల గణన పుస్తకాల్లో మాత్రమే నమోదు చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి ద్వారా లెక్కింపు చేయనున్నారు. గణనలో పాల్గొనే సిబ్బందికి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. 1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం జిల్లాలో 1.95 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. చిత్తూరు ఈస్ట్, వెస్ట్, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంతో మొత్తం 6 రేంజ్‌లు ఉన్నాయి. మొత్తం 24 సెక్షన్లు, 84 బీట్లు నందు లెక్కింపు చేయనున్నారు. జంతువులతోపా టు వారు పర్యటించే పరిసర ప్రాంతాల్లో ఏయే రకాల చెట్లు ఉన్నాయో అనే వివరాలను కూడా అటవీశాఖ సిబ్బంది నమోదు చేయనున్నారు. ప్రతి నాలుగేళ్లకూ గణన ప్రతి నాలుగేళ్లకోసారి అభయారణ్యాల్లో పులులు, జంతు గణన సర్వే జరుగుతుంది. జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, గద్దలు, నెమళ్లు, చుక్కల దుప్పులు, ముళ్ల పందులు, నక్కలు, ముంగీసలు, అడవి దున్నలు ఉన్నట్లు గతంలో గుర్తించారు. గణనను పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు (ఫైల్) కెమెరాలకు చిక్కిన అటవీ జంతువులు (ఫైల్) సంసిద్ధంగా ఉన్నాం రేంజ్ పరిధిలోని ప్రతి బీట్ నందు ముగ్గురు సిబ్బంది సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 8 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డీఎఫ్ఓ ఆదేశాల మేరకు అందరూ గణనకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైన ప్రాంతాల్లో గ్రామస్తుల సహకారం తీసుకొని జంతువులు, వాటి పాదముద్రలు, ఇతర గుర్తులను సిబ్బంది ఆన్లైన్ చేయనున్నారు. – థామస్, చిత్తూరు ఈస్ట్ ఎఫ్ఆర్వో 8 రోజుల ప్రక్రియ అరణ్యంలో సుమారు 8 రోజుల పాటు జంతు గణన ప్రక్రియ జరగనుంది. మొదటి మూడు రోజులు అటవీ శాఖ సిబ్బంది తమకు నిర్ణయించిన 3 కిలోమీటర్ల పరిధిలో కాలినడకన తిరుగుతూ జంతువుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తిస్తారు. ఐదు రోజులు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార జంతువులను గుర్తిస్తారు. అలాగే జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటోలు తీయడంతోపాటు వారు సంచరించే సమయంలో జంతువుల పెంటికల్, పాదముద్రలను గుర్తిస్తారు. అడవుల్లో సంచరించే పశువుల కాపర్లతోపాటు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రజల నుంచి కూడా జంతువుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. -
జూద‘కొండ’
నేతల కనుసన్నల్లోనే దందా మండల వ్యాప్తంగా పేకాట జోరుగా సాగుతోంది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకొన్నప్పటికీ టీడీపీ నేతల కనుసన్నల్లో విధులు నిర్వహించాల్సి వస్తున్నట్లు సమాచారం. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధిక మొత్తంలో సొమ్ము పట్టుబడినా కొంత మేరకు సొమ్ము , పేకాట నిర్వాహకులను అరెస్ట్ చూపించి పలుకుబడి ఉన్న వారిని వదిలేస్తున్నారని సమాచారం. ఓ వ్యక్తి పేకాట స్థావరం, నిర్వహణ ఏర్పాట్లు చూసుకొంటూ పోలీసుల దాడుల నుంచి రక్షించేలా ఏర్పాటు చేశారని చర్చ సాగుతోంది. ఇందుకోసమే మేజా అంటూ పేకాట లో కొంతసొమ్ము ఇస్తారని అతనే ఆ బాధ్యత తీసుకుంటూ పేకాటను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి మండలస్థాయి ఓ కూటమి నేత అండదండలు ఉండడం విశేషం. చౌడేపల్లె : అసాంఘిక కార్యకలాపాలకు బోయకొండ పరిసర అటవీ ప్రాంతం అడ్డాగా మారుతోంది. విచ్చలవిడిగా పేకాట దందా సాగుతున్నా పోలీసుల నిఘా కొరవడింది. పేకాట నిర్వహణ దారులతో మామూళ్లు తీసుకొని పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోయకొండకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వేల మంది వస్తుంటారు. ఈ క్రమంలో అదే రీతిలో పేకాటతో పాటు వ్యభిచారం జోరుగా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బోయకొండ ప్రధాన రహదారినుంచి లక్ష్మీపురానికి వెళ్లే మార్గంలో సుమారు 5 కి.మీ. దూరం గల అటవీ ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబరు 12న అంతర్ జిల్లాల నుంచి వచ్చిన వారితో కలిసి పేకాట నిర్వహిస్తుండగా పలమనేరు సబ్ డివిజనల్ ఐడీ పార్టీ, స్పెషల్ బ్రాంచి సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ.13.81 లక్షల నగదు, 20 బైక్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 13 మందిపై అప్పట్లో కేసు నమోదు సంచలనంగా మారింది. కొద్ది రోజులపాటు ప్రశాంతంగా ఉన్న పరిసర ప్రాంతాలు కొంత మంది టీడీపీ నేతల అండదండలతో మళ్లీ పేకా ట స్థావరాలు పుంజుకున్నాయని ప్రజలు చెబుతున్నారు. జూదంతో పాటు వ్యభిచారం బోయకొండ పరిసర ప్రాంతం పేకాటతో పాటు వ్యభిచారానికి నిలయంగా మారుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ రహస్య ప్రాంతాల్లో ప్రేమ జంటలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అటవీ ప్రాంతంతో పాటు రోడ్డు పక్కనున్న గుట్లలోకి వెళ్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అంటూ ఆ దృశ్యాలను గమనించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే రూముల్లోనే వ్యభిచార దందా సాగిస్తున్నారని ప్రజలు నుంచి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎవరినీ వదిలిపెట్టం అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకొంటాం. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. పేకాట, వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం, అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం, నిర్వహణకు సహకరించిన వారిని వదిలిపెట్టం. – నాగేశ్వరరావు, ఎస్ఐ, చౌడేపల్లె -
హోరాహోరీగా బేస్‌బాల్ పోటీలు
పలమనేరు : పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్‌లో భాగంగా రాష్ట్ర స్థాయిలో సాగుతున్న బేస్‌బాల్ అండర్–14 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన బాలుర పోటీల్లో శ్రీకాకుళంపై విజయనగరం, వెస్ట్ గోదావరిపై ఈస్ట్ గోదావరి, ప్రకాశం జట్టుపై చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. నేడు జరిగే పోటీల్లో బాలికల విభాగంలో చిత్తూరు–అనంతపూర్, శ్రీకాకుళం–ఈస్ట్‌గోదావరి, గుంటూరు– విజయనగరం, కడప–వైజాగ్ జట్ల మధ్య క్వార్టర్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆపై సెమీస్, ఫైనల్స్ ఉంటాయన్నారు. ఇందులో నిర్వాహకులు బాబు, సాంబశివ, శశి, ప్రకాష్, స్థానిక హెచ్ఎం షంషీర్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణుల పరీక్షలు, కేసుల వివరాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : హెచ్ఐవీ నియంత్రణకు సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం. సమాజంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిగా వేళ్లూనుకుంది. గతంలో ఈ వ్యాధిపై నలుగురిలో మాట్లాడాలంటే సంశయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్ద కాలానికి ముందు చాపకింద నీరులా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సురక్షితం కాని శృంగారం ఎంత ప్రమాదకరమో కరపత్రాల ద్వారా చెప్పడంతో క్రమంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. క్రమంగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. హెచ్ఐవీ అంటే.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనేది ఎయిడ్స్ (ఎకై ్వర్ ఇమ్యునో డెఫిషియన్సీ సిం డ్రోమ్)ను కలగజేస్తుంది. లైంగికంగా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో రక్తం ఎక్కించడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ బలహీనపరిచి, క్రమ క్రమంగా ఆరోగ్యం క్షీణింపజేస్తుంది. ఈ ఏడాది నినాదమిదే... శ్రీఅంతరాయాన్ని అధిగ మించడం.. ఎయిడ్స్ ప్రతి స్పందనను మార్చడంశ్రీ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది ఓవర్ కమింగ్ డిజరప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్‌న్స్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. అందరితో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్నదే దీని ఉద్దేశం. సంవత్సరం పరీక్షలు కేసులు శాతం 2023–24 52578 9 0.08 2024–25 31297 13 0.04 2025–26 22430 5 0.02అరకొరగా పింఛన్లు జిల్లాలో ప్రస్తుతం 4169 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. చిత్తూరు ఏఆర్టీలో 3422 మంది చికిత్స తీసుకుంటున్నారు. అలాగే పీఈఎస్ కుప్పంలో 747 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కేవలం 750 మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి. మిగిలిన వారు పింఛన్‌కు దూరమయ్యారు. పలువురు బాధితులు పింఛన్ కోసం ప్రాధేయపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు జిల్లాలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. . దీంతో జాతీయ స్థాయిలో హెచ్ఐవీపై ప్రకటించిన యుద్ధం కారణంగా అన్ని స్థాయిల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అభినందనీయం. 2020–21లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి 3,933కు చేరింది. తగ్గుతున్న బాధితులు జిల్లాలో 2023–24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024–25 నాటికి శాతంగా 0.5 ఉంది. 2025–26 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47454 మందిని పరీక్షించగా... 168 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే 22430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. కట్టడికి చర్యలు జిల్లాలో హెచ్ఐవీ సమస్య అదుపులోనే ఉంది. దీని తీవ్రత తెలుసుకున్న చాలా మంది అప్రమత్తంగా ఉంటున్నారు. హెచ్ఐవీ బాధితులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ నుంచి బాధితుల రక్షణకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన రావాలి. తప్పటడుగులు వేయొద్దు. ముఖ్యంగా యువత ఎయిడ్స్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా చూడాలి. – వెంకట ప్రసాద్, జిల్లా క్షయ నివారణ అధికారి, చిత్తూరు కొవ్వొత్తుల ర్యాలీ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : హెచ్ఐవీతో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్తూరు నగరంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి వ్యాధి వ్యాప్తి, కట్టడి తదితర విషయాలపై జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ వివరించారు. నేడు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ చిత్తూరు నగరంలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ తెలిపా రు. ఉదయం 9.15 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఈ ర్యాలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు ఉంటుందన్నారు. అక్కడ మానహారం అనంతరం జడ్పీ సమా వేశ మందిరంలో సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
గస్తీ..నాస్తి!
నిఘా నిద్దరోతోందా? సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025‘చిత్తూరు ఎంఎస్ఆర్ కూడలి నుంచి గుడిపాల మండలంలోని పశుమంద కూడలి దూరం దాదాపు 17కి.మీ. కారులో ఇక్కడకు చేరుకోవడానికి 20 నిముషాలకు పైనే సమయం పడుతుంది. ఇద్దరు చిన్న పిల్లలు, దంపతులతో కారులో వెళుతుంటే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో రెండు కార్లు, ఓ స్కూటర్లో దుండగులు 17 కి.మీ దూరం ఆ కుటుంబాన్ని వెంబడించారు. దారి దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ నుంచి ఎన్ఆర్ పేట సమీపంలోని పశుమంద కూడలి వరకు రోడ్డుపై ఒక్క పోలీసు గస్తీ లేకపోవడం.. ఖాకీల భద్రతా వైఫలాన్ని ఎత్తి చూపిస్తోంది. ’మరింత పకడ్బందీగా చేస్తాం నేరాల నియంత్రణలో రాత్రి గస్తీ కీలకం. ప్రతి రూట్లోనూ పోలీసులు కనిపించడంతో పాటు నేరా లు జరగకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఇక్కడున్న లోటుపాట్లను సరిచేసుకుని మరింత పకడ్బందీగా రాత్రి గస్తీ నిర్వహణపై దృష్టి పెడతాం. ప్రజలు కూడా ఏదైనా అత్యవసర వేళల్లో డయల్ 112, పోలీసు వాట్సాప్ 9440900005, వన్‌టౌన్ 9440796707, టూటౌన్ 9491074517 నంబర్లకు సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తాం. – టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పోలీసుల రాత్రి గస్తీ ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పశుమంద ఘటన వెలుగులోకి వచ్చింది. లేకుంటే ఇది కూడా ప్రజలకు తెలిసేదికాదు. ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ.. శాంతిభద్రత పర్యవేక్షణలో పోలీసు శాఖకు ప్రత్యామ్నాయంగా మరొకటి లేదు. అలాంటి కీలకమైన బాధ్యతలో ఉన్న పోలీసు యంత్రాంగం సామాన్యులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఖాకీల జాడ లేకపోవడం, 17 కి.మీ దూరం ఉన్న ఓ జాతీయ రహదారిపై రాత్రి గస్తీలో ఒక్క వాహనం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కోటి సంతకాలతో బాబు కుట్రను అడ్డుకుందాం శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 79,791 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,911 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. తిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం నిర్మానుష్యంగా మారింది. అవగాహనే ఆయుధం హెచ్ఐవీ కేసుల వివరాలు సంవత్సరం పరీక్షలు కేసులు శాతం 2023–24 58280 292 0.5 2024–25 62537 252 0.4 2025–26 47454 168 0.36నియంత్రణలో లోపాలు రాత్రి గస్తీ అంటే నగరంలో ఉన్న హోటళ్లు, చిన్న పాటి దుకాణాలకు రాత్రి 10 గంటల్లోపు మూయించడం.. స్టేషన్లో ఖైదీలు ఉన్నారని.. వాళ్లకు భోజ నం పెట్టడానికి ఫండ్స్ లేవంటూ హోటళ్లలో బలవంతంగా బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లడమనే భావన చాలా మంది ఖాకీల్లో కనిపిస్తోంది. రాత్రి గస్తీ ఓ బాధ్యతగా గుర్తించేవాళ్లు కొంత మంది మాత్రమే కనిపిస్తున్నారు. గత నెల మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అర్ధరాత్రి పలమనేరు రోడ్డుపై అల్లరి చేస్తూ పోలీసుల కంటబడి, అధికార పార్టీ నేత పేరు చెప్పినా స్టేషన్లో కూర్చోపెట్టిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇదే సమయంలో రక్షక్ జీపును ఓ చోట ఆపేసి, అందులోనే బాగా నిద్రపోవడం.. పక్కనున్న హోటళ్ల నిర్వాహకుల నుంచి బలవంతంగా బిర్యానీలు, టిఫెన్లు తినేసి డ్యూటీలు దిగేవాళ్లు కనిపిస్తున్నారు. ఏదైనా నేరం జరిగిన తరువాత తమిళనాడు నుంచి చిత్తూరులోకి రావాలన్నా.. చిత్తూరు నుంచి తమిళనాడులోకి వెళ్లాలన్నా నిముషాల వ్యవధి సరిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో గస్తీలు కీలకంగా మారనున్నాయనే విషయం చాలా మంది పోలీసులు గుర్తించడం లేదు. మరికొందరు గస్తీ డ్యూటీలు వేసుకుని మరీ.. డ్యూటీ దిగి ఇంటికి వెళ్లేలోపు జేబులో రూ.5 వేలు వేసుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఆయా స్టేషన్ ఇన్స్పెక్టర్లు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎయిడ్స్‌ను తరిమేద్దాం -
జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆదివారం 20 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు కమ్ముకుంది. చల్లటి గాలులు వీస్తూ వాతావరణం చల్లబడింది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అధికారులు వెల్లడించిన నివేదికల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 205.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం 8.30 గంటల వరకు 184.2 మి.మీ, ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4.4 మి.మీ, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో 18.8 మి.మీ, అత్యల్పంగా చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 24 మండలాల్లో 280 గ్రామ సచివాలయాల పరిధిలో దిత్వా తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సచివాలయ సిబ్బంది కచ్చితంగా ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆదివారం రాత్రి, సోమవారం రోజున జిల్లాలోని 14 మండలాల్లోని 168 గ్రామాల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. -
దళితులపై కక్ష సాధింపా?
నగరి : అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ దళితులపై కక్ష సాధింపునకు దిగుతారా? మున్సిపల్ కౌన్సిలర్ హోదాలో ఉన్న మహిళను వేధింపులకు గురిచేస్తారా అంటూ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులపై విరుచుకుపడ్డారు. శని వారం ఉదయం మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. తొలుత అజెండాలోని అంశాలను అధికారులు వివరించిన అనంతరం కౌన్సిలర్లు మూకుమ్మడిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరకంఠాపురం వద్ద రోడ్డుకు ఆనుకొని ఆక్రమణలు ఉన్నాయంటూ మున్సిపల్ అధికారులు వాటిని కూల్చేందుకు వెళ్లి కౌన్సిలర్ చినపాపను, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడంపై అధికారులను వివరణ కోరారు. మున్సిపల్ పరిధి సత్రవాడ నుంచి నగరి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను ఇలాగే తొలగించేందుకు అధికారులు సిద్ధమా అని ప్రశ్నించారు. దళిత మహిళకు చెందిన ఆస్తులు అంటే వాటిపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? కౌన్సిలర్‌కే ఈ పరిస్థితి అంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు అధికార పార్టీ చేపట్టే కక్షసాధింపు చర్యలకు మీరు వత్తాసు పలుకుతున్నారా అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ నుంచి మాకు అందిన ఆదేశాల మేరకే మేము వ్యవహరిస్తున్నామన్నారు. అయితే పసుపులేట్ నగర్లో వీధికి అడ్డంగా ఆక్రమణలు జరుగుతుంటే చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని కౌన్సిలర్ గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. అంటే దళితులకు ఒక న్యాయం? ఇతరులకు ఒక న్యాయం చేస్తున్నారా ఇదేనా సుపరిపాలన అన్నారు. కలుషిత రంగు నీటిపై ఎందుకు స్పందించరు అధికార పార్టీ నేతల ఆజ్ఞలకు ఆగమేఘాలపై వెళ్లే అధికారులు కలుషిత రంగునీటి సమస్యను పరిష్కరించాలని గొంతు చించుకుంటున్నా ఎందుకు స్పందించరు అంటూ ము న్సిపల్ కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బిలాల్, ఇంద్రయ్య ప్రశ్నించారు. రంగు నీరు ఎక్కడ వస్తుందో సభ్యులు తెలిపితే అంద రం కలిసి వెళ్లి పరిశీలిద్దాం అంటూ కమిషనర్ జవాబిచ్చారు. మొండి బకాయిల రైట్ ఆఫ్‌కు ఒప్పుకోం స్థానిక సంత మైదానంలో ఉన్న 27 మున్సిపల్ షాపులను 2016 నుంచి వేలంలో గుత్తకు పాడుకున్న పలువురు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన గుత్త బకాయిలు రూ.64.77 లక్షలు ఉందని అవి మొండి బకాయిలుగా వసూలు చేసేందుకు వీలుపడనందున వాటిని రైట్ ఆఫ్ చేయడానికి కౌన్సిల్ అనుమతి కోరుతూ అధికారులు అజెండాలో ఉంచారు. దీనిపై విప్ దయానిధి మాట్లాడుతూ మొండి బకాయలు వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపాలని రైట్ ఆఫ్ చేస్తే ఇది ఒక సాంప్రదాయంగా మారిపోతుందన్నారు. దీనికి కౌన్సిలర్లు అందరూ మద్దతు పలికారు. నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్ చినపాప మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు నేలపై కూర్చుని కౌన్సిలర్ నిరసన 17వ వార్డు కౌన్సిలర్ చినపాప తన పట్ల అధికారులు వ్యవహరించిన తీరు ఎంతో బాధించిందని, అధికారులు ఎలా చేశారో జవాబు చెప్పాలంటూ సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్, కౌన్సిలర్లు తాము అధికారులతో ఈ విషయంగానే చర్చిస్తున్నామని లేచి పైన కూర్చోవాలంటూ ఆమెకు నచ్చజెప్పారు. మున్సిపల్ పాలక వర్గానికి విలువ లేదా? మున్సిపల్ కౌన్సిలర్లపైనే చర్యలు చేపట్టే విషయంలో చైర్మన్‌గా అధికారులకు విన్నవించుకున్నా ఏ మాత్రం లెక్కచేయలేదని మున్సిపల్ పాలక వర్గానికి ఏ విలువా లేదా? అంటూ మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అధికారులు వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం రెడ్డి, మున్సిపల్ డీఈ రవీంద్ర, హౌసింగ్ డీఈ భాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం, అంగన్వాడీ సూపర్వైజర్ శంకరమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
శుద్ధ అబద్ధం
జిల్లా వ్యాప్తంగా శుద్ధజలం సరఫరాపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వో ప్లాంట్ల నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రజలు రక్షిత నీటిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన జిల్లా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో రక్షిత నీటి సరఫరా తీరుపై సాక్షి ప్రత్యేక కథనం. జిల్లా జనాభా 18.73 లక్షలు పురుషులు 9.40 లక్షలు మహిళలు 9.33 లక్షలు అర్బన్ జనాభా 3.69 లక్షలు రూరల్ జనాభా 15.04 లక్షలు జిల్లాలోని ఆర్వో ప్లాంట్లు 1,259 అనధికారిక ఆర్వో ప్లాంట్లు 2,158చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ల నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి, పూతలపట్టు, జీడీనెల్లూరులలో యథేచ్ఛగా ఆర్వోప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకపోవడంతో పలు ఆర్వో ప్లాంట్లు నిబంధనలకు పాతరేస్తున్నాయి. జిల్లాలోని ఆర్వో ప్లాంట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే వీటిని పొందడానికి ముందు అధికారులు ప్లాంట్లను తనిఖీ చేయడం లేదు. అనుమతి ఉన్న వాటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం లేదు. దీంతో ప్రై వేట్ ప్లాంట్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పంపిణీ చేస్తున్న నీటిలో వందశాతం నాణ్యతను పాటించడం లేదు. వ్యాధుల బారిన ప్రజలు ఆర్వో ప్లాంట్ల అలసత్వం వల్ల ప్రజలు అధిక శాతం డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ, నగరపాలక, పంచాయతీలలో ఉచితంగా సరఫరా చేస్తున్న కొళాయిల నీటి కంటే ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్లాంట్‌లో సరఫరా అయ్యే నీటినే సురక్షిత నీటిగా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని అవకాశంగా తీసుకుంటున్న పలువు రు ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా అమ్మకాలు జరుపుతున్నారు. నేరుగా బోర్ల నుంచి తోడిన నీటినే పట్టి ఇచ్చేస్తున్నారు. కొన్ని ప్లాంట్ల వద్ద అక్కడే మురుగు నీరు ఉంటోంది. కనీస శుభ్రత సైతం ఉండటం లేదు. మరికొన్ని ప్లాంట్లు అతినీలలోహిత (యూవీ) విధానం సరిగ్గా పనిచేయకుండా నడిపేస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజారోగ్యం పై అధిక ప్రమాదం చూపుతున్నాయి. శాంపిల్ పంపడం ఓ ప్రయాసే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నాణ్యతను పరీక్షించే ల్యాబ్ లు లేవు. దీంతో ఇక్కడ సేకరించే శాంపిల్స్ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్ కు పంపాల్సి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఖర్చుతో పాటు వ్యయప్రయాసలకు గురి చేస్తుండటంతో వీలైనంత వరకు అధికారులు శాంపిళ్లను తీయడం మానేస్తున్నారు. నిర్ధేశిత ఫీజుతో పాటు వారి వద్ద ఉన్న ఇతర అనుమతులను బట్టి ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ధ్రువపత్రం ఇచ్చేస్తున్నారు. అనుమతులు ఇలా.. జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వీధికొక్కటి వాటర్ ప్లాంట్ ఉంది. వివిధ రకాల అనుమతులతో నడిచేవి కొన్నయితే, ఎటువంటి అనుమతి తీసుకోకుండా తాగునీటి వ్యాపారం చేసే ప్లాంట్లకు కొదవేలేదు. వీటి ఏర్పాటుకు ముందు స్థానిక సంస్థలు, లీగల్ మెట్రాలజీ, ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్లాంట్లకు చెందిన బోరు, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థలు అనుమతి ఇవ్వాలి. నిబంధనలను అనుసరించి తగిన పరిమాణంలో నీటిని అందించేందుకు పరికరాలు ఉండేలా లీగల్ మెట్రాలజీ చూడాలి. తాగేందుకు సురక్షితంగా నీరు ఉండేలా ఆహార భద్రతా ప్రమాణాల శాఖ పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్న ప్లాంట్లకే అనుమతి ఇవ్వాలి. తరచూ తనిఖీలు చేపట్టాలి. ఇవేమి చూడకుండానే సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఇచ్చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రక్షిత నీరు సందేహమే! ఉండాల్సిన ప్రమాణాలు ఆర్వో ప్లాంట్ నుంచి సరఫరా చేసే నీళ్లల్లో 500– 22000 మధ్య టీడీఎస్ (లవణాలు), 6.5–8.5 మధ్య పీహెచ్ (ఆమ్ల, క్షార గుణం), 1–1.5 లీటర్ నీటిలో మిల్లీగ్రాం ఫ్లోరైడ్, 0–45 నైట్రేట్, 0.3–1.0 ఐరెన్, 75–200 కాల్షియం, 30–100 మెగ్నీషియం, 200–400 సల్ఫేట్, 250–1000 క్లోరైడ్లు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే మించితే రక్తపోటు, కిడ్నీ సమస్య, జీర్ణకోశ వ్యాధులు, ప్లోరోసిస్, పిల్లల్లో బ్లూబేబి సిండ్రోమ్, కడుపులో మంటలు తదితర అనారోగ్య సమస్య లు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. నిఘా లోపం అనుమతులు ఇచ్చిన తరువాత సంవత్సరాల పొడవునా అధికారులు వాటి వైపు కన్నెత్తి కూ డా చూడటం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉండటం కారణంగా ఆర్వో ప్లాంట్ల నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఫుడ్ సేప్టీ అధికారి తనిఖీకి వస్తే స్థానిక సంస్థల అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు కనిపించరు. వీరొస్తే ఫుడ్‌సేఫ్టీ అధికారి రారు. తనిఖీలకు వచ్చే అధి కారులు వివిధ ధ్రువపత్రాలను అడుగుతు న్నారు. లేవంటే సంబంధిత పత్రాలను పొందాలని చెప్పి ముడుపులతో సరిపెట్టేసుకుంటునారనే విమర్శలు ఉన్నాయి. అంతే తప్ప నిబంధనలు పాటిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగా నడుపుతున్నారా? అనే విషయాలను ఏ మాత్రం పరిశీలించడం లేదు. ఈ ఆర్వో ప్లాంట్ల తతంగంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా ఉద్యోగులను వేధించడం సరికాదు
ఐరాల : స్థానిక పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను వైద్యాధికారి రెడ్డెప్ప వేధించడం సబబు కాదని ఏపీఎన్జీఓ అసోసియేషన్, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పీహెచ్సీ వద్ద మహిళా ఉద్యోగులతో కలిసి వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ.. పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను రెడ్డెప్ప వేధిస్తున్నారన్న ఫిర్యాదు శుక్రవారం డీఎంహెచ్ఓకు చేరిందన్నారు. దీనిపై సంఘం నాయకులతో కలిసి వారు పడుతున్న వేధింపులపై ఆరా తీశామన్నారు. ఆశా వర్కర్లను పీహెచ్సీలో రాత్రి పూట విధులు నిర్వర్తించాలని, సెలవు కావాలని అడిగితే సంబంధం లేని వ్యక్తికి డబ్బులు ఇచ్చి సెలవు మంజూరు చేసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి మహిళా ఉద్యోగి సమస్యపై డబ్బే ప్రధానంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాలుగా సంఘం నాయకులు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, మహేష్‌కుమార్, భానుప్రకాష్, దేవకుమార్, సురేంద్రనాథ్‌రెడ్డి, మోహన్, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. -
భర్తను కడతేర్చేందుకు యత్నించి..
పలమనేరు : సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఈ మధ్య ప్రియుడి కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే పలమనేరు మండలంలో ఐదు నెలల క్రితం జరగ్గా ఎట్టకేలకు శనివారం ఈ కేసులో నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ స్వర్ణతేజ తెలిపారు. ఆ వివరాలు ఇలా.. మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్, శిల్ప భార్యాభర్తలు. భర్త సీ. వెంకటేష్ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీలోని సీ.వెంకటేష్ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మను షులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి సీ.వెంకటేష్ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త సీ. వెంకటేష్ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు. భర్తను చంపాలని ప్రయత్నించిన భార్య శిల్ప, ప్రియుడు ఎం.వెంకటేష్ -
విద్యార్థికి పొగాకు ఉత్పత్తుల విక్రయం
చిత్తూరు అర్బన్ : పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పొగాకు ఉత్పత్తులను విద్యార్థులకు విక్రయిస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య హెచ్చరించారు. శనివారం నగరంలోని తోటపాళ్యం, వన్నియర్బ్లాక్, సంతపేట ప్రాంతాల్లోని విద్యా సంస్థల ఆవరణల్లో ఉన్న పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆరో తరగతి చదువుతున్న పిల్లాడి వద్ద రూ.50 ఇచ్చిన పోలీసులు అతడికి ఓ దుకాణానికి పంపించి, పొగాకు ఉత్పత్తి తీసుకురమ్మని పురమాయించారు. ఆ విద్యార్థికి దుకాణ నిర్వాహకుడు పొగాకు ఉత్పత్తిని విక్రయించాడు. అనంతరం దుకాణ యజమానికి పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అలాగే నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఆపరేషన్‌ను కొనసాగించారు. డబ్బులిస్తే చాలు, వయస్సుతో తేడా లేదన్నట్టు పొగాకు ఉత్పత్తులను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. ఇలా చిత్తూరు నగరంలోని వందలాది ప్యాకెట్ల గుట్కా, హాన్స్, కై నీ, సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు వ్యాపారులను బైండోవర్ చేశారు. మళ్లీ ఇదే పొరపాటు చేస్తే, ఈసారి కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రతిపాదనలకు ఆదేశం
– కాణిపాకంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ కాణిపాకం : ఆలయానికి ఎస్పీడీసీఎల్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ విధానానికి ప్రతిపాదనలు పంపాలని విద్యుత్ అధికారులను రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు. పండితుల ఆశీర్వచనాలు, స్వామి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. స్వామి సన్నిధికి ఎలాంటి సేవలు అందించడానికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. కోనసీమ జిల్లాలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగిన ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 పోటీల్లో కాణిపాకం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. యువశ్రీ వ్యక్తిగత విభాగంలో కాంస్యం, నోహిత్ బంగారు పతకం సాధించారన్నారు. డిసెంబర్లో మహారాష్ట్రలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. -
యూరియాపై కర్రపెత్తనం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో యూరియాను నొక్కేస్తున్నారు. మీకింత..మాకింత అంటూ పంచుకుంటున్నారు. కూటమి నేతల ఇంటికే టోకెన్లు పట్టుకెళుతున్నారు. బహిరంగంగానే నేతలకు టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో సామాన్య రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా వెతలపై మండల వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. కూటమి నేతల జోక్యంతో సంబంధిత అధికారులు వాటిని కొట్టిపడేస్తున్నారు. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 28 వేల హెక్టార్లు కాగా.. వరి సాధారణ విస్తీర్ణం 10 వేల హెక్టార్లు. ఇప్పటి వరకు 10 వేల హెక్టార్లలో వ్యవసాయ ఆధారిత పంటలు సాగు కాగా.. వరి మాత్రం 600 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. డిసెంబర్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా వ్యాప్తంగా 3,300 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 314 ఆర్బీకేలలో 2,400 టన్నులు, నాలుగు సొసైటీలో 20 టన్నులు, 80 ప్రైవేటు షాపుల్లో 106 మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయి. అయితే ఈ నిల్వల్లో తేడాలు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. చిత్తూరు మండలంలోని ఓ సచివాలయ పరిధిలో వ్యవసాయశాఖ సహాయకులు టీడీపీ నేతలు ఉన్న గ్రామంలో ఇంటింటికీ వెళ్లి టోకెన్లు పంపిణీ చేశారు. ఇది గమనించిన సామాన్య రైతులు ఆ సిబ్బందికి ఫోన్ చేసి టోకెన్లు అడిగారు. మీరు సచివాలయం వద్దకు రావాలని చెప్పారు. అక్కడొచ్చాక టోకెన్లు లేవని చేతులెత్తేశారు. విషయాన్ని కొందరు టీడీపీ నేతలు, రైతులు మండల వ్యవసాయశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన సదరు అధికారి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తామని సర్దుబాటు చెప్పారు. వరికి సిద్ధమా? వచ్చే నెల నుంచి వరి సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది వరినాట్లు నాటారు. మరింత మంది వరినారు పోశారు. కొంతమంది నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. వరి సాగు విస్తీర్ణం 600 హెక్టార్ల నుంచి 5 వేలలోపు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సాగుకు అవసరమైన యూరియాను అందించడంలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. .. ఇది ఒక్క చిత్తూరులోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అధికార బలంతో కొందరు నేతలు యూరియాపై కర్రపెత్తనానికి పూనుకుంటున్నారు. ముందు తమకు అందిస్తేనే.. తర్వాత ఎవరికై నా ఇవ్వండంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై సామాన్య రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుపైనా పెత్తనం యూరియాపై పలువురు కూటమి నేతలు పెత్తనం చేస్తున్నారు. ముందస్తుగానే ఆర్డర్లు వేస్తున్నారు. నాకు 10 బ్యాగులు.. 20 బ్యాగులు కావాలని వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి వేధిస్తున్నారు. మరికొంత మంది ఇంటికొచ్చి టోకెన్లు ఇచ్చిపోవాలని హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది సిబ్బంది వారి ఇంటికెళ్లి టోకెన్లు ఇచ్చి వస్తున్నారు. కొందరు సిబ్బంది బహిరంగంగా టోకెన్లు ఇస్తే..మరికొందరు లోలోపల టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక దొంగచాటుగా యూరియా బ్యాగులు నేతల ఇంటికి వెళుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి నేతల ఒత్తిడి తాళలేక వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి యూరియాలో తప్పిదాలు జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు. -
విద్య.. క్రీడలతో ఉజ్వల భవిత
యాదమరి : విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తే ఉజ్వల భవిత సాధించవచ్చని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందుతాయన్నారు. అలాగే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే అలవాటును అలవర్చుకోవచ్చని వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు రాణిస్తున్నారని వివరించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం పొందవచ్చని చెప్పారు. అనంతరం టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్ఐ ఈశ్వర్, బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు విశేష పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయకర్తలకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 59,548 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,548 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. -
కుడితే.. కుదుపే!
కాణిపాకం: స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు వింటేనే టెర్రర్ పుడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఈ వ్యాధి హడలెత్తిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాగా టైఫస్ జ్వరాలు ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. పల్లెల్లోనే అధికంగా ఈ రకమైన కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, గుడిపాల మండలంలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడం కలవరపాటుకు గురిచేస్తోంది. బుష్ టైప్ బుసకొడితే స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బుష్ టైఫస్ అనే పేరుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివసించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో దోబూచులాడే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎక్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంత మందికి దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూమోనైటీస్.. తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలే యం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వీళ్లు జాగ్రత్త స్క్రబ్టైప్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరం. అంతే కాకుండా హెచ్ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకితే ప్రమాకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఽధికి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం లేదని బాధితులు వాపోతున్నారు.వేలూరు, బెంగళూరు, చైన్నె, తిరుపతిలోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడే అధికం జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఏడాది కాలంలో 300కుపైగా నమోదైనట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. అధికారికంగా మాత్రం 150కి పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నా యి. చిత్తూరు, గుడిపాల, ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లిన వ్యక్తులు కూడా స్క్రబ్‌టైపస్ బారినపడుతున్నారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
చిత్తూరు కలెక్టరేట్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతి బాపూలే అని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్లో పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో పూలే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పీసీఆర్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శనీయులన్నారు. చిన్నతనంలోనే వితంతువులైన మహిళలకు పునర్వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఆర్వో మోహన్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ డీడీ రబ్బానీబాషా, నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వేదాలకు సరికొత్త భాష్యకారుడు మహాత్మ జ్యోతిబా పూలే వేదాలకు సరికొత్త భాష్యకారుడని వైఎస్సార్సీపీ కో–ఆప్షన్ మెంబర్ ఆను కొనియాడారు. పీసీఆర్ సర్కిల్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు సుధీర్, హమీద్, సద్దామ్, షాన్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. చిరస్మరణీయం మహాత్మ జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయమని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ విభాగాధిపతి గోపినాయక్ కొనియాడారు. ఈ మేరకు పీవీకేఎన్ కళాశాలలో పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చరిత్ర అధ్యాపకులు రెడ్డిబాషా, అర్థశాస్త్ర అధ్యాపకులు కోటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు రాజేష్, ఉమాదేవి, చంద్ర పాల్గొన్నారు. -
‘దేవగుడి’ సినీ చరిత్రలో నిలిచిపోతుంది
పూతలపట్టు(యాదమరి): దేవగుడి సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్థం చేశారు. శుక్రవారం మండల పరిధి వేము ఇంజినీరింగ్ కళాశాలలో ఆ చిత్ర హీరో, హీరోయిన్లు సందడి చేశారు. రామకృష్ణా రెడ్డి మాత్లాడుతూ.. రాయలసీమ నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఒక భావోద్వేగంతో కూడిన సినిమా తీశామన్నారు. కేవలం కథను నమ్ముకుని చిత్రాన్ని తీశామని చెప్పారు. అనంతరం దేవగుడి సినిమా హీరో, హీరోయిన్లు అభినవ్ శౌర్య, అనుశ్రీ విద్యార్థులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కిలారి తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల ఫిట్నెస్ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల బస్సులు ఫిట్నెస్ తప్పని సరి అని రవాణాశాఖ ఎంవీఐ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా రవాణాశాఖ అధికారులు విజ యం విద్యాసంస్థల బస్సుల ను తనిఖీ చేసి, ఆ పాఠశాల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంవీఐ మాట్లాడుతూ పాఠశాల బస్సులు నాణ్యత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అధిక వేగంతో వెళ్లకూడదని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ఆ విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్సుల రికార్డులు తనిఖీ చేశారు. ఎంవీఐ మురళి, నరసింహులు పాల్గొన్నారు. -
చర్చకు రాని ప్రజా సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమీక్షలో ప్రజాసమస్యలు చర్చకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. కానీ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులే డుమ్మా ముఖ్యమైన సమావేశాలకు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన దిశా సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పలు శాఖల అధికారులు సైతం గైర్హాజరయ్యారు. చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి, పలమనేరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అవి ఎందుకు అలానే ఉన్నాయ్? జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల ముందు మొదలుపెట్టిన గృహ నిర్మాణాలు ఎందుకు ఇంకా అలానే ఉన్నాయని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హౌసింగ్ పీడీని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేసినప్పటికీ లబ్ధిదారులు సగంలోనే గృహ నిర్మాణాలు ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మాట్లాడుతూ జిల్లాలో 53,338 గృహా నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ప్రతి నెలా 300 గృహాలు పూర్తి చేసే లా చర్యలు చేపడుతున్నామన్నారు. -
ఎలా బతికేది బాబూ?
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఇటీవల ఒకేసారి ఏకంగా ఏడు పరిశ్రమల స్థాపనకు శంఖుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమలకు రైతుల వద్ద నుంచి సుమారు 2243.12 ఎకరాలు సేకరించారు. ఆపై ఆయా భూముల్లో బోర్డులు పెట్టి మిన్నకుండిపోతున్నారు. ఉన్న భూములు కోల్పోయి.. పరిశ్రమల్లో ఉపాధి దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. మేమేం చేయాలి.. ఏం తినాలి బాబూ.. అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. పలార్లపల్లి వద్ద పరిశ్రమలకు కేటాయించిన వ్యవసాయ భూములు 2,68,066 మందికి పింఛన్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1న 2,68,066 మందికి రూ.114.80 కోట్ల మేర పింఛన్ పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1న పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 27 రకాల పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 16 రకాల సామాజిక పింఛన్లకు 2,65,525 మందికి రూ.111.46 కోట్లు, ఆరో గ్య సమస్యల పింఛన్లు 2,541 మందికి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి టీచర్ల క్రీడా పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని టీచర్లకు శనివారం నుంచి జనవరి 4వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు విద్యాశాఖ, జిల్లా సమగ్రశిక్ష శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పోటీల నిర్వహణకు మండలానికి రూ.5 వేలు, డివిజన్‌కు 20 వేలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.20 వేల చొప్పున బడ్జెట్‌ను కేటాయించారు. ఈ పోటీలలో జనరల్ టీచర్లకు, పీఈటీలకు వేర్వేరు టీంలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. 1న ఫర్నీచర్ వేలం చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు కార్యాలయంలో ఉపయోగించిన ఫర్నీచర్‌ను డిసెంబర్ 1వ తేదీన బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఏసీ, జనరేటర్, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ఉదయం 10.30 గంటలకు చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో వేలం పాటలో విక్రయిస్తామన్నారు. వివరాలకు పోలీసు కార్యాలయ సూపరింటెండ్ పుష్పరాజ్‌ను సంప్రదించాలని సూచించారు. డిసెంబర్ 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 7న ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణపై పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లాలో గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 7న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌టికెట్లను వాట్సాప్ మనమిత్ర యాప్‌లో, www. bse.ap.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పిదాలు ఉంటే సంబంధిత విద్యార్థి హెచ్ఎం ధ్రువీకరించే లేఖతో పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌తో నామినల్ రోల్లో నమోదు చేయించుకోవాలని చెప్పారు. హాల్ టికెట్ పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పరీక్ష కేంద్రం వివరాలు, రూట్ తెలుసుకునేలా వెసులుబాటు కల్పించారు. రైతులు కూలీలవుతున్నారు శాంతిపురం మండలంలో రైతులకు ఒక సెంటు భూమి లేకుండా ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇక్కడ రైతులు కూలీలుగా మారా ల్సి వస్తోంది. పంటలకు సారవంతమైన భూములు ఎయిర్ పోర్టుకోసం ప్రభ్తుత్వం సేకరిస్తోంది. సర్వేలు కూడా పూర్తి చేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మా పరిస్థితి ఏంటో తెలియడం లేదు. – చక్రపాణిరెడ్డి, రైతు, దండికుప్పం నమ్మకం లేదయ్యా! విమానాశ్రయానికి 1,800 ఎకరాలు, పరిశ్రమలకు 243 ఎకరాల మేర సేకరించి పారిశ్రామిక వేత్తలకు అప్పగించింది. దీని ద్వారా కుప్పం యువతకు ఉపాధి దొరుకుతుందనే నమ్మకం లేకుండా పోతోంది. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఎలాంటి ఉపాధి అవకాశాలొస్తాయో అంతుపట్టడం లేదు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారనేది కచ్చితంగా చెప్పలేము. దీని వల్ల భూములు పోగొట్టుకుని ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిందే. – నారాయణప్ప, కీలకపోడు గ్రామం కుప్పం: కుప్పం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమల పేరుతో ఆర్భాటం సృష్టించిన బాబు ప్రభుత్వం భూములు లాక్కొని మిన్నకుండి పోతోంది. ఉన్న భూములు కోల్పోయిన రైతులు చేసేందుకు పనుల్లేక.. తినేందుకు మెతుకుల్లేక అల్లాడిపోతున్నారు. పరిశ్రమల యాజమాన్యం తమకు కేటాయించి స్థలాల్లో ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి వెళ్లిపోయారు. ఉద్యోగాలపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. భారీగా భూముల కేటాయింపు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏడు భారీ పరిశ్రమల స్థాపనకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ చర్యలు చేపట్టింది. వీటికి గాను గుడుపల్లె మండలం, పొగురుపల్లె వద్ద, కుప్పం మండలం, పలార్లపల్లి, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లి, రామకుప్పం మండలం, విజలాపురం వద్ద ఏడు పరిశ్రమలకు భూములు కేటాయించారు. దీంతో పాటు విమానాశ్రయం కోసం దండికుప్పం వద్ద సర్వేలు పూర్తి చేసి భూములు ఎంపిక చేశారు. విమానాశ్రయంతో సహా ఏడు పర్రిశమలకు 2243.12 ఎకరాలు కేటాయించారు. సకాలంలో పూర్తికాకపోతే? కుప్పంలోని యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పలు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫ్యాక్టరీల నిర్మాణానికి వ్యవసాయ భూములు సేకరించింది. నిర్వాహకులు సకాలంలో ఫ్యాక్టరీలు స్థాపించకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు మదనపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలొస్తాయనే ఆశతో భూములిచ్చామని, కానీ ఇప్పుడున్న పరిస్థితులు గమనిస్తే పరిశ్రమలు నెలకొల్పతారనే నమ్మకం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దండి చిత్తూరు ఎమ్మెల్యేపై జనసైనికుడి అసహనంచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో పారిశ్రామిక వేత్త ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శా ఖ డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తులను ఉద్దేశ పూర్వకంగా పెండింగ్ పెడితే చర్యలు తప్పవని హెచ్చ రించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరతిగతిన మంజూరు చేయాలన్నా రు. జిల్లాలో 2026 డిసెంబర్ నాటికి 220 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యతలో రాజీపడొద్దు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ 12 ప్రాజెక్టుల సీడీపీవోలు కచ్చితంగా 25 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి 5 అంగన్వాడీ కేంద్రాలకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో పిల్లల తల్లిదండ్రులను చేర్చి కార్యక్రమాల వీడియోలను పంపించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీవోలు అరుణశ్రీ, శామ్సుగుణ, వినితశ్రీ, అరుణశ్రీ, నిర్మల, శోభ, ఉమావాణి పాల్గొన్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్: చిత్తూరులో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతోంది. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడు గెలుపులో జనసేన కార్యకర్తల కృషిని ఆ పార్టీ నేతలు మరచిపోయారంటూ పలు సందర్భాల్లో సామాజిక వేదికల్లో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటికే భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి చెందిన వాళ్లను పట్టించుకోలేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా చిత్తూరు గంగనపల్లెకు చెందిన జనసేన కార్యకర్త రూపేష్‌కు బుధవారం రాత్రి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై జనసేనకు చెందిన ఏకే.శరవణ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జనసేన పార్టీలో వంద మందికి పైగా కార్యకర్తలకు సభ్యత్వం చేయించిన రూపేష్ టీడీపీలో చేరడం విచారకరమంటూనే.. అతడిని టీడీపీలోకి చేర్చుకోవడం మిత్ర ధర్మమా..? కూటమి ధర్మం ఇదేనా..?? అంటూ ప్రశ్నలు సంధించాడు. దీనికి చాలామంది జనసేన కార్యకర్తలు మద్దతు పలుకుతూ.. ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు. అయితే సంతపేట టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్గా ఉన్న వ్యక్తి తప్పిదమే కారణమంటూ ఎమ్మెల్యే వర్గం సమాధానాలిస్తోంది. ఇటీవల జనసేన పార్టీకి చెందిన దయారామ్ నాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేను ఏకంగా ఓ పోరంబోకు అని తిట్టి, ఆపై క్షమాపణ చెప్పడం తెలిసిందే. మొత్తానికి చిత్తూరులో టీడీపీ–జనసేన మధ్య వైరం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. విమానశ్రయం పరిస్థితి ఏమిటో? కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల వద్ద విమానాశ్రయం నిర్మించేందుకు పదేళ్లుగా చర్యలు చేపడుతున్నారు. 2014లోనే కార్గో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు 490 ఎకరాలు సేకరించేందుకు సర్వేలు చేశారు. కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టాక విమానాశ్రయంతో పాటు చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపించేందుకుగాను అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించి సర్వేలు జరిపారు. ఇప్పుడు విమానాశ్రయం కోసం ఏకంగా 1,800 ఏకరాలు సిద్ధం చేశారు. కార్గో ఎయిర్‌పోర్టుకు ఇన్ని ఎకరాలు అవసరమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో పరిశ్రమల స్థాపన సాధ్యమయ్యేనా? -
పటిష్టంగా పులుల గణన
– జీపీఆర్ఎస్ ఆధారంగా ప్రక్రియ పలమనేరు : అటవీ ప్రాంతాల్లో పులుల గణనను పటిష్టంగా చేపట్టాలని సీసీఎఫ్ యశోధబాయి ఆదేశించారు. శుక్రవారం పలమనేరు సమీపంలోని కుంకీ ఎలిఫెంట్ క్యాంపులో చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బందికి పులుల గణనపై అవగాహన కల్పించారు. సీసీఎఫ్ మాట్లాడుతూ నాలుగేళ్లకు ఒకసారి చేపట్టే గణన ఆధారంగానే వన్యప్రాణులు, వన్యమృగాల లెక్క పక్కాగా తేలుతుందన్నారు. ప్రాణుల వేలిముద్రల ఆధారంగా లెక్కింపు జరిగేదని, ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ఆధారంగా యాప్ సాయంతో సాగుతోందని వెల్లడించారు. డేటా సేకరణపై బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజర్లకు ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. 7శాతం పెరిగింది దేశంలో 2022 లెక్కల ప్రకారం పులుల సంఖ్య 3,167గా ఉండగా ఇప్పుడు7శాతం పెరిగినట్టు తెలుస్తోందన్నారు. ప్రతి 15కిలోమీటర్ల పరిధిలో పులి, చిరుతల పాదముద్రలు, జుట్టు, ఎముకలు, చెట్లపై రేక్ మార్కులు, పాగ్ గుర్తులను పరిశీలించాలని సూచించారు. అలాగే రేసుకుక్కలు, నక్కలు, తోడేళ్లు, గుంటనక్క, దుమ్ములగొండి, అడవి పిల్లి, చుక్కల దుప్పి, కణుజు, మనుబోతులు, జింకలు, కొండ గొర్రె తదితరాలను లెక్కించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌వోలు చక్రపాణి, శ్రీనివాసులు, సబ్ డీఎఫ్ఓ వేణుగోపాల్, ఎఫ్ఆర్ఓ నారాయణ, వైల్డ్ లైఫ్ పరిశోధకుడు రాకేష్కాల్వ పాల్గొన్నారు. -
గర్భకోశ వ్యాధులను నిర్మూలిద్దాం!
తవణంపల్లె: పాడి రైతులు పశుపోషణలో తగు మెలవకులు పాటిస్తే గర్భకోశవ్యాధులను సమూ లంగా నివారించవచ్చని పశుసంవర్థకశాక డీడీ డాక్టర్ ఆరీఫ్ తెలిపారు. గురువారం మండలంలోని ఈచనేరిలో ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో పాడి పశువులకు ఉచితంగా గర్భకోశవ్యాధి నివారణకు పశువైద్య శిబిరం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డీడీ డాక్టర్ ఆరీప్ మాట్లాడుతూ గర్భకోశవ్యాధి నివారణ కోసం లవణ మిశ్రమ(మినరల్ మిక్స్‌ర్) వాడాలని సూచించారు. పేయదూడల సంకరక్షణపై రైతులు దృష్టి సారించాలన్నారు. తిరుపతి ఏపీఎల్డీఏ ఈఓ డాక్టర్ రెడ్డికుమార్ మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం 35 పాడి ఆవులకు గర్భకోశవ్యాధులకు సంబంధించి పరీక్షలు చేయించి చికిత్స అందించారు. 210 ఆవులకు బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు మందులు పిచికారీ చేశారు. రైతులకు మినరల్ మిక్సర్, టానిక్‌లు పంపిణీ చేశారు. శువైద్యాధికారులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ లావణ్య, డాక్టర్ పినాకపాణి, సర్పంచ్ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
మేమున్నామని!
చౌడేపల్లె: గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయ కులు, ప్రజలు బాబు ప్రభుత్వ కుట్రలకు భయపడొద్దు. ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నాంఅని రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం మదనపల్లె పట్టణంలోని దేవతా నగర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధా న కార్యదర్శి మిద్దింటి కిషోర్‌బాబు ను మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పార్టీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్, మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతితో కలిసి పరామర్శించారు. కిషోర్‌బాబుకు ఇటీవల బైక్ ప్రమాదంలో కుడికాలు విరిగింది. చికిత్సలనంత రం ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న మిథున్‌రెడ్డి అతని ఇంటికి వెళ్లి ఆరోగ్యపరిస్థితులపై ఆరాతీశారు. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట మైనారిటీ నాయకుడు అమ్ము, మదనపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, నాయకులు కేశవరెడ్డి, మహేష్‌బాబు, వలసపల్లి నాగరాజరెడ్డి, ఖాదర్, సుగుణ, ఆంజనేయులు, రేవతి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ దొంగా!
కుప్పం: దొంగలు కొత్త రూటు ఎంచుకున్నారు. పొరుగునే ఉన్న పాండిచ్చేరిలో దొంగతనం చేసి అక్కడి నుంచి కుప్పం వచ్చి నివాసం ఉండడం అలవాటు చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి బండారాన్ని అక్కడి పోలీసులు బయటపెట్టా రు. స్థానికులు, పోలీసుల కథనం.. కుప్పం మండలం, మల్లానూరు గ్రామానికి చెందిన తిరుమలేష్, వళ్లెమ్మ, శారద కొత్త ఇండ్లు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గత మూడు నెలలుగా అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పాండిచ్చేరి పోలీసులు ఆకస్మికంగా గ్రామంలో తనిఖీలు చేపట్టారు. తిరుమలేష్ అద్దెకున్న ఇంట్లో రూ.7 లక్షల నగద, 48 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పాండిచ్చేరి పట్టణంలోని ఓ ఇంట్లో 224 గ్రాముల బంగారు ఆభరణాలు, లక్షా పది వేల రూపాయల నగదు దొగతనం జరిగింది. అక్కడికి కూలి పనులకు వెళ్లి తరుచూ తరుమలేష్ కుటుంబం దొంగతనాలకు పాల్పడి.. కుప్పంలోకి వచ్చి తలదాచుకునేది. బాధితుల ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. తిరుమలేష్, వళ్లెమ్మ, శారదను అదుపులోకి తీసుకు ని పాండిచ్చేరికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కొంత గందరగోళం నెలకొంది. పాండిచ్చేరిలో చోరీ.. కుప్పంలో మకాం! -
ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతి
గుడుపల్లె: ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొని ధనలక్ష్మి(28) అనే మహిళ బుధవారం రాత్రి మృతి చెందింది. గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు కథ నం... మండలంలోని గుండ్లసాగరం గ్రామానికి చెందిన ధనలక్ష్మి బుధవారం సాయంత్రం రోడ్డు పక్కన వాకింగ్ వెళ్తోంది. వెనుక నుంచి స్కూల్ పిల్లలను తీసుకుని కుప్పంకు చెందిన ఏవీఆర్ స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ధనలక్ష్మిని ఢీకొట్టింది. ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ధనలక్ష్మి మృతిచెందింది. గురువారం ఏవీఆర్ స్కూల్ బస్సు, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ధనలక్ష్మి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. ఈ మేరకు విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలను నియమించేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీఎల్వోలు అందరికి ఐడీ కార్డులు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 7,77,924 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో అనే కార్యక్రమాలపై 117 వినతులను స్వీకరించి 109 పరిష్కరించినట్లు వెల్లడించారు. డీఆర్వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు. -
నన్నే కొట్టి..నాపైనే కేసు పెట్టి!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తాను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాననే అక్కసుతో టీడీపీ సానుభూతిపరులు తనపై దాడి చేసిందేకాకుండా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని పెద్దపంజాణి మండలం, కొళత్తూరు పంచాయతీ, గుత్తివారిపల్లికి చెందిన బాధిత వలంటీర్ వెంకటరమణ గురువారం తెలిపారు. ఈ నెల 24న తన ఇంటి పక్కనే ఉన్న టీడీపీ నేత కుమార్ కావాలనే మరుగునీటిని తమ ఇంటివైపునకు పంపారన్నారు. దీనిపై తాను ప్రశ్నించగా తనపై దాడికి దిగాడని తెలిపారు. దీన్ని చూసి అక్కడే ఉన్న తమ మామ రామచంద్ర తలపై రాతితో కొట్టారన్నారు. దీంతో తామిరువురూ పలమ నేరులో ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లామని చెప్పా రు. ఆపై తమకు న్యా యం చేయాలని పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశాయగా.. ఆ ఫిర్యాదును పక్కనబెట్టిన పోలీసులు అధికార పార్టీ అండతో తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గంగవరం సీఐ పరశురామున్ని వేడుకోగా ఎస్సీలతో పెట్టుకుంటే ఇట్టే ఉంటుందని చెప్పి పంపించారని తెలిపారు. తమకు న్యాయం జరక్కుంటే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మెడికల్ కళాశాలలపై బాబు కుట్ర
పుత్తూరు: రాష్ట్రంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆరోపించారు. పుత్తూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలను సేకరించారు. ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కావాలనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో ఎంతో మంది పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని వాపోయారు. వైద్య విద్య అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లిపోతే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని, మధ్య తరగతి ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నాయకులు శ్రీనివాసులురెడ్డి, మునస్వామిరెడ్డి, దిలీప్ మొదలి, అన్నాలోకనాథం, లక్షణమూర్తి, దేవేందర్‌రెడ్డి, గోవిందస్వామిరెడ్డి, ఉదయ్, రామ్భత్తయ్య, మస్తాన్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గుడిపాల: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం.. గుడిపాల మండలం, పల్లూరు ఆదిఆంధ్రవాడకు చెందిన శ్రీలేఖ(37), బుజ్జి(45) చిత్తూరు నుంచి ఏపీ–03–టీహెచ్–0540గల షేర్ ఆటోలో వస్తున్నారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి సీఎంసీ ఆస్పత్రి ఆవరణలో వెనుక వైపు నుంచి వస్తున్న ఏపీ–37–టీసీ–5799గల టెంపో ట్రావెలర్ షేర్ ఆటోను గుద్దింది. శ్రీలేఖ ఆటోలో నుంచి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బుజ్జికి స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. రక్తం చూసిన వరి కుప్పలు పలమనేరు: బైపాస్ రోడ్డులో వేసిన వరికుప్పల కారణంగా రోడ్డు ప్రమాదం జరిగి బైక్‌పై వస్తున్న ఇద్దరు మైనర్లు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని జెండామఠానికి చెందిన సాధు(15), జైలూ(13) బైక్‌పై బైపాస్‌లో వెళ్తున్నారు. రోడ్డుపై రైతులు టార్పాలిన్ కప్పిన వరి ధాన్యాన్ని గమనించక దానిపై వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వీరిని 108 వాహనంలో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. కాగా ఇప్పుడు వరికోతల సీజన్ కావడంతో చాలామంది ధాన్యాన్ని ఎండబెట్టేందుకు స్థలం లేక రోడ్లపై ఆరబోస్తున్నారు. ఆపై సాయంత్రం అక్కడే కుప్పగాతోసి దానిపై టార్పాలిన్ కప్పి వెళ్లిపోతున్నారు. రాత్రి సమయంలో వీటిని గమనించకుండా చాలా మంది ప్రమాదాలబారిన పడుతున్నారు. మద్యం విక్రేతల అరెస్ట్ పుంగనూరు: అక్రమంగా 120 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సీఐ కథనం.. పట్టణానికి చెందిన మునిరాజ, అబ్రార్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లలో కర్ణాటక నుంచి 120 టెట్రాప్యాకెట్లను తీసుకు వస్తుండగా వనమలదిన్నె రోడ్డు క్రాస్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మద్యాన్ని, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అంతా కనికట్టు!
చిత్తూరు అర్బన్: జిల్లాలో ఇనుప తుక్కు, గ్రానైట్ రవాణా ఆధారంగా ఇన్పుట్ సబ్సిడీ క్రెడిట్ (ఐటీసీ) కొల్లకొడుతున్నారు. ఈ రెండింటినీ ఇతర రాష్ట్రాలకు విక్రయించాలంటే వాణిజ్య పన్నులశాఖ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తీసుకోవాలి. చిత్తూ రు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో కొందరు వ్యక్తులు బినామీ పేరిట ఆర్సీలు తీసుకుని ఆ పేర్లపై లావాదేవీలు జరిపినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అసలు ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే.. రూ.కోట్లు వెచ్చించి వాటిని వేలూరు, బెంగళూరు, గుజరాత్, రాజస్థాన్ వంటి పక్క రాష్ట్రాల్లోని డీలర్ల నుంచి కోనుగోలు చేసి అమ్మకాలు చేసినట్లు బిల్లులు పెడుతున్నారు. ఐటీసీ కోసం కొత్త దారులు తొక్కుతున్నారు. పులిచెర్ల, చిత్తూరు, అరగొండ, రేణిగుంట, తవణంపల్లె తదితర ప్రాంతాలకు చెందిన దిగువ మధ్యతరగతికి చెందిన కూలి, రోడ్లపై వ్యాపారాలు, పెయింటింగ్ పనులు చేసేవాళ్లను ఎంచుకుని వాళ్ల ఆధార్ కార్డుతో ఓ సిమ్‌కార్డు, బ్యాంకులో ఖాతా ఓపెన్‌చేసి చెక్‌బుక్, డెబిట్‌కార్డు తీసుకుంటారు. ఆపై జీఎస్టీ లైసెన్సు తీసుకుని రూ.కోట్ల లో వ్యాపారాలు చేస్తుంటారు. భారీగా ఐటీసీ కాజేసి న తరువాత మేల్కొనే అధికారులు.. లైసెన్సు దారుడికి నోటీసులు జారీ చేయడానికి వెళితే అప్పుడు వాళ్లు కూలి పనులు చేసుకునేవాళ్లుగా గుర్తిస్తున్నారు. లొసుగులే కాసులు సులభంగా డబ్బులు సంపాధించడానికి అలవాటుపడ్డ కొందరు వ్యాపారులు అధికారులకు సరికొత్త సవాళ్లు విసురుతున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇందులోని గూఢార్థాలు అర్థమయ్యేలోపు ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. పైకి పాత ఇనుప తుక్కు (స్క్రాప్), గ్రానైట్ రవాణా లాంటి వ్యాపారాలు ప్రధానంగా కనిపిస్తున్నా, లోలోపల ప్లాస్టిక్ కంపెనీలు, చైర్లు, వాటర్ బాటిల్స్ తయారీ ఇలా ఎన్నో వ్యాపారాలను అడ్డుపెట్టి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కళ్ల ముందు ఎలాంటి వస్తువు కనిపించకపోయినా.. కాగితాల్లో రూ.కోట్లలో వ్యాపారాలు చూపించి కొందరు ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ప్రభుత్వ నిధులకు ఎసరుపెట్టారు. వాణిజ్య పన్నుల శాఖ, జీఎస్టీ శాఖల్లో ఉన్న వెలుసుబాటు ఈ కుంభకోణానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మాస్టర్‌మైండ్‌ను పట్టుకోలేరా? డీలర్ల వద్ద కొనుగోలు చేసిన ఇనుప తుక్కు, గ్రానైట్‌కు సంబంధించిన బిల్లులు అన్నీ కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులే ప్రింట్ చేసుకుంటున్నారు. రూ.80 కోట్లు వెచ్చించి కొనుగోలుచేసిన తుక్కును ఓ లారీలో సరఫరా చేసినట్లు బిల్లుల్లో చూపించారు. లారీ నెంబరు పరిశీలిస్తే.. అది బైకు నెంబరుగా ఆన్లైన్లో చూపిస్తోంది. మరోవైపు 120 టన్నుల గ్రానైట్‌ను చిత్తూరుకు చెందిన వ్యాపారి మరో లారీలో తరలించినట్లు చూపించాడు. ఆ నెంబరు తనిఖీ చేస్తే, అది ఆటో నెంబరు. వీటికి భారీగా ఐటీసీని రాబట్టుకుని, తీరా కంపెనీ లావాదేవీలు నిర్వహించకపోవడంతో అసలు గుట్టు బయటపడుతోంది. దీని వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. -
కంటెంట్ నమ్మి తీసిన చిత్రం దేవగుడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): స్టార్స్‌ని కాకుండా కేవలం కథ, కంటెంట్‌ను నమ్ముకుని తీసిన చిత్రం మా దేవగుడి. రాయలసీమ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా తీసిన దేవగుడి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, కథానాయక, నాయికలు అభినవ్ సౌర్య, అనుశ్రీ కోరారు. గురువారం చిత్తూరులోని పలు ప్రాంతాల్లో దేవగుడి చిత్ర యూనిట్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కటెంట్‌ను తీసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషన్ డ్రామాగా సినిమా సాగుతుందన్నారు. డిసెంబర్ 19న ప్రేక్షకుల మధ్యకు రాబోతున్న ఈ సినిమాలో హైదరాబాద్‌కు చెందిన అభినవ్ సౌర్య హీరోగా, బీమవరానికి చెందిన అనుశ్రీ హీరోయిన్న్గా నటిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా సినీ రంగంలో అడుగుపెట్టిన వారికి ఆశీస్సులు అందించాలన్నారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టామని, మా డైరెక్టర్ బెల్లం రామకష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఈరోజు మీ ముందు నిలబడ్డామని హీరో,హీరోయిన్ తెలిపారు. విద్యార్థులకు అభినందనలు చిత్తూరు కలెక్టరేట్ : మాక్ అసెంబ్లీలో పాల్గొని ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటడం గొప్ప విషయమన్నారు. జిల్లాలోని 21 మంది విద్యార్థులు తమ దైన శైలిలో మాక్ అసెంబ్లీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు. -
ఇప్పటికీ కేసు లేదు!
ముఠాపై చర్యలు వద్దు దారి దోపిడీ ముఠాపై చర్యలు ఎక్కడ? సాక్షి, టాస్క్‌ఫోర్స్: దారి దోపిడీ ముఠాపై ఇప్పటికీ చర్యలు తీసుకోక ఖాకీలు మౌనం వహిస్తున్నారు. బాఽ దితుడు స్టేషన్‌కు వెళ్లినా ఇంటరాగేషన్ పూర్తిచేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓ టీడీపీ యువ నేత ఓ ప్రజాప్రతినిధి అండతో ఇలా రెచ్చిపోతున్నాడని, అతన్ని అరికట్టకపోతే పార్టీకి పరువుపో తుందని చిత్తూరు సీనియర్ టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఇతనిపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుడు టీడీపీ నాయకుడు కావడంతో అతనికి వారు నచ్చజెబుతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా కొంతమంది నాయకులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బాధితుడు మా త్రం తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజలను ఇంకేలా భయభ్రాంతులకు గురిచేస్తారోనని ఓ ప్రజాప్రతినిధి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీనిపై కేసు నమో దు చెస్తేనే మిగతా వారికి కూడా భయం ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. డ్రగ్స్ రవాణే టార్గెట్ డ్రగ్స్ రవాణే ఈ ముఠా టార్గెట్‌గా తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గం మొత్తం ఈ ముఠానే డ్రగ్స్‌ను సప్లై చేయడంతో పాటు తమిళనాడు ప్రాంతానికి కూడా చేరవేస్తున్నాట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలో ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో అధిక సంఖ్యలో ఆంధ్ర, తెలంగాణాకు సంబంధించిన యువకులు చదువుకుంటున్నారు. వీరందరికీ డ్రగ్స్ సరఫరాను ఈ ముఠానే అందజేస్తోందని సమాచారం. ఇందుకు చి త్తూరు, గుడిపాల కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇందుకు కొంతమంది యువకులను ఈ ముఠా ప్రోత్సహించి వ్యాపారాలు సాగిస్తున్నట్టు సమాచారం. చిత్తూరు యువనేత ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం జరిగిన హైజాక్ ముఠాపై చర్యలు తీసుకోవద్దని ఓ ప్రజాప్రతినిధి పోలీసులను ఆదేశించాడు. దీంతో పోలీసులు కుడా మౌనం వహిస్తున్నారు. ఒకవేళ కేసు పెడితే బదిలీలు చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. -
డ్రగ్స్ సమాచారమిస్తే రూ.25వేలు
చిత్తూరు కలెక్టరేట్ : యువత డ్రగ్స్ జోలికెళ్లకూడదని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో యాంటీ నార్కొటిక్ గ్రూప్ ఫర్ లాబి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్సీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్య నిర్మూలనపై వి స్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి పిల్లల ప్రవర్తన పై కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా జిల్లాలో డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఉండే షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేయిస్తామన్నారు. సింగిల్ పేరెంట్ పిల్లలు, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు గుర్తించామన్నారు. డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ పిల్లలకు చిన్నవయస్సు నుంచే చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలను తెలియజేయాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972, 8977781972 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, ఎంఈవోలు, హెచ్ఎంలు, పాల్గొన్నారు. -
29 నుంచి స్టేట్ బేస్‌బాల్ పోటీలు
పలమనేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 29 నుంచి అండర్–14 బాల, బాలికల రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు బాబు గురువారం తెలిపారు. ఆ మేరకు డిగ్రీ కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 400 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. 29న సీతమ్స్‌లో మెగా ఉద్యోగ మేళా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రానికి సమీపం మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 29న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీతమ్స్ మేజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పలు బహు ళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగమేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని ఆయన వెల్లడించారు. సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికయ్యే అభ్యర్థులకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బీసీ భవన్లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 9177429494, 8520004646 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ నుంచి సమాచారం అందినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీలంక తీరంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వర్షాల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు సహాయక చర్యలకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ‘అదిగో అక్కడో కంపెనీ. సుబ్రమణ్యం అనే వ్యక్తి యజమాని. 30 మంది పనిచేసే ఆ కంపెనీలో ఏటా రూ.20 కోట్ల టర్నోవర్. ఏడాది గడిచాక ఎలాంటి లావాదేవీలు జరగలేదు. తప్పుడు బిల్లులతో ఐటీసీ కొట్టేశారని గుర్తించి రూ.12 కోట్లు జరిమానా చెల్లించాలంటూ షోకాజ్ నోటీసులు. క్షేత్ర స్థాయిలో విచారిస్తే సుబ్రమణ్యం రోడ్డుపై తోపుడు బండిలో టమాటాలు అమ్ముకునే వ్యక్తి.’ చిత్తూరు నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి రూ.కోట్లు కొల్లగొడుతున్న క్రిమినల్స్ తెలితేటలకు అద్దం పడుతోంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. -
వ్యాధులు.. టీకాలు ఇలా...
● ప్రసవం నుంచి 24 గంటలలోపు టీబీ, జాండిస్ నుంచి రక్షణకు బీసీసీ, పోలియో, నివారణకు ఓపీవీ 0 డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్ టీకాలు వేయాల్సి ఉంది. ● 45 రోజులకు పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ ● 75 రోజులకు కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యుమోనియా నివారణకు పెంటా–1, 2, 3 టీకాలు వేయాల్సి ఉంది. ● 105 రోజులకు తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి నివారణకు ఆర్వీవీ–1, 2, 3 టీకాలు వేయాలి. ● 9–12 నెలల మధ్య తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఏ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫెవీవీ–3, అంధత్వ నివారణకు విటమిన్–22 టీకాలు వేయాల్సి ఉంది. ● 5–6 సంవత్సరాల మధ్య కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 వేయాల్సి ఉంది. అయితే ఈ మేరకు టీకాలు వేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
గంగవరం: చిత్తూరు జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎరువు లోడ్‌తో వెళుతున్న టిప్పర్, ఎదురుగా వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని బాలేపల్లి క్రాస్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న గోపి(34) పలమనేరు పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలో తన బావమరిది అయ్యప్పస్వామి మాలధారణ చేసి, ఇరుముడి కట్టుకుంటున్న నేపథ్యంలతో ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలోని బాలేపల్లి క్రాస్ వద్ద మలుపులో మాడి వైపు వెళుతున్న టిప్పర్, కారు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గోపికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించి స్థానికులు క్షతగాత్రుని చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గంగవరం అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో బైరెడ్డిపల్లి నుంచి అంబులెన్స్ గంట తరువాత ఘటనా స్థలానికి చేరుకుంది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా క్షతగాత్రునికి సమయానికి ఆక్సిజన్ అందక మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువకుడిపై దూసుకెళ్లిన గ్రానైట్ లారీ గంగాధర నెల్లూరు: ఓ గ్రానైట్ లారీ అతి వేగంగా వెళుతూ యువకుడుపై దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడీనెల్లూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు మండలంలోని ఎట్టేరి సమీపంలోని అప్పిరెడ్డికండ్రిగ వద్ద చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి అప్పిరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన హేమాద్రి (21) రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన గ్రానైట్ లారీ యువకుడిని ఢీకొంది. లారీ యువకుడిపై దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడీ నెల్లూరు పోలీసులు తెలిపారు. -
దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో విభిన్నప్రతిభావంతులకు జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే వ్యక్తులు విజయాలను సాధిస్తే, ప్రతికూలతలను అధిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలన్నారు. అనంతరం దివ్యాంగులకు షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్ పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత ఉన్న జట్లను ఖరారు చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర, కోచ్‌లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు!
సదుం: వైఎస్సార్ సీపీ పాలనను ప్రజలు మళ్లీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం సదుం మండలంలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేశారని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి, పేద విద్యార్థుల చదువులను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. సదుంలో సుబ్రమణ్యం స్వామి ఆలయానికి నూతన ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత వైఎస్సార్సీపీ నాయకులు సాకేత్ రెడ్డి కుమారై సౌమ్య, ఉదయ్ కుమార్ రెడ్డి నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం 79ఏ చింతమాకులపల్లె పంచాయతీ బొనుగుపల్లెలో సుబ్రమణ్యం రెడ్డి ఇంట్లో జరిగిన శుభ కార్యయానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీపీ ధనంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నారాయణరెడ్డి, గిరిధర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
భరోసా కల్పించి!
బాధ్యత తీసుకుని..వరదయ్యపాళెం : మరో మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, వెంటనే రాయలచెరువు ముంపునకు గురైన కళత్తూరు దళితవాడ, పాతపాళెం గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయించే బాధ్యత తనదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎంపీ గురుమూర్తి, వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తో కలసి కేవీబీపురం మండలంలోని కళత్తూరు దళితవాడలో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి కష్టనష్టాలను ఆరా తీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ వందలాది పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయని, 2వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని, రాళ్లురప్పలతో నిండి వ్యవసాయానికి యోగ్యత లేకుండా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రతి ఇంట్లో రూ. లక్ష పైగా విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయని వారు వాపోయారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అయితే పేదల ఇబ్బందులు చంద్రబాబు సర్కారుకు ఏ మాత్రం పట్టవని, అందుకే ఇంతటి విపత్తుకు తూతూమంత్రంగా సాయం చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరిగిన నష్టాలను మూడేళ్లలో రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తిగా తీరుస్తామని, అది తన బాధ్యతని, ఆ మేరకు మీకు మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తాం లోతట్టు ప్రాంతంలో దళితవాడ ఉన్న కారణంగా పూర్తిగా మునిగిపోయినట్లు గ్రామస్తులు తన దృష్టికి తెచ్చారని, మన ప్రభుత్వం రాగానే మిట్ట ప్రాంతంలో నూతన కాలనీ ఏర్పాటు చేయిస్తామన్నారు. వెయ్యి ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే ఏళ్లతరబడి ఇంటి స్థలాలకు సంబంఽధించి వివాదంగా మారిన అటవీ భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని వివరించారు. ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరారు. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రమాదం సంభవిచంఇన గంటల వ్యవధిలోనే పార్టీ శ్రేణులు స్పందించి తమవంతు సాయం చేశారన్నారు. వారి స్పూర్తితోనే తనవంతుగా విషయం తెలిసిన గంటలోనే ఎంపీ నిధుల నుంచి రూ. 20లక్షలను తక్షణ సాయంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. తర్వాత మరో రూ. కోటి కేటాయించినట్లు తెలిపారు. అలాగే నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వివరించారు. ప్రతి నష్టానికి పరిహారం వచ్చేంత వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. నూకతోటి రాజేష్ మాట్లాడుతూ ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. మూడేళ్ల తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే -
ఇరుముడికి వచ్చి.. మృత్యుఒడిలోకి
నీటి మునిగి మృతి చెందిన యువకుడు కార్వేటినగరం: మేనమామ అయ్యప్ప మాల ధరించి ఇరుముడి (పడి)పూజకు వచ్చిన యువకుడు నదిలో శవమై తేలాడు. ఈ సంఘటన మండలంలోని బట్టువారిపల్లి సమీపంలో ఉన్న కుశస్థలీనదిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు , చొక్కమడుగు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, హంస దంపతుల కుమార్తె భానుమతిని గంగాధరనెల్లూరు మండలం మహదేవ మంగళం గ్రామంలోని మురుగేష్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వారు కుమారుడు విజయకుమార్(23)తో కలిసి బెంగళూరులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో చొక్కమడుగు గ్రామంలోని విజయకుమార్ మేనమామ ఆరుముగం అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టేందుకు ఆదివారం వచ్చాడు. బుధవారం కుశస్థలీనదిలో స్థానానికి వెళ్లి ఎంతకీ రాక పోవడంతో కుటుంబసభ్యులు వెదుక్కుంటూ వెళ్లారు. నది గట్టుపై విజయ్‌కుమార్ దుస్తులు కనిపించడంతో దగ్గరికి వెళ్లి చూడగా సుమారు 25 అడుగు లోతు ఉన్న నదిలో శవమై కనిపించాడు. కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పుత్తూరులోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం ఇటీవల అనారోగ్యంతో విజయకుమార్ తండ్రి కన్నుమూశారు. తరువాత ఏడాదిలోనే కుటంబానికి పెద్ద దిక్కు కావాల్సిన కుమారుడు కూడా ఇలా మృత్యుఒడికి చేరడంతో ఆ ఇంటి ఇల్లాలు భానుమతి గుండెలు పగిలేలా రోదించింది. త్వరలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటాడనుకున్న సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదం నిండిపోయింది. -
ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు
చౌడేపల్లె: వైఎస్సార్ సీపీ కోసం పోరాటం చేస్తూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపునిచ్చి ఏకష్టమొచ్చినా ఆదుకుంటామని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలోని ఎంపీ స్వగృహంలో చౌడేపల్లె మండల నేతలు, కార్యకర్తలు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మమేకమై కష్ట సుఖాలపై చర్చించారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండలంలో జరిగిన దాడులు, ఇబ్బందులు, నష్టాలు, అరాచకాలన్నీ తనకూ తెలుసని, ఎవరూ అధైర్యపడొద్దని, వడ్డీతో సహా మనం చెల్లించే సమయం వస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపుతోపాటు పనిచేసే వారికి పదవుల్లోనూ న్యాయం చేస్తామన్నారు. గ్రామ కమిటీల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులు చే యాలని దిశానిర్దేశం చేశారు. మండలంలో ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు నేతలను జిల్లా కమిటీలో భాగస్వాములను చేసి మ రింత రెట్టింపు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఐకమత్యంతో అందరూ కలిసి పనిచేసి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, పార్టీ మండల కన్వీనర్ నాగభూషణరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకటరమణ, లడ్డూ రమణ, కోఆప్షన్ సభ్యుడు సాధిక్ బాషా, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. -
కారును ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు
పుత్తూరు: మండలంలోని పరమేశ్వరమంగళం వద్ద బుధవారం కారును బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం కంచి పట్టణానికి చెందిన ఐదుగురు కారులో శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పరమేశ్వరమంగళం వద్ద తిరుపతికి వెళుతుండగా వారి కారును చైన్నె ప్రభుత్వ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మలర్నిది(47), పన్నీర్‌సెల్వం(74), లక్ష్మి(68), రాహుల్(32), డ్రైవర్ కుమారగణేశన్(48) గాయపడ్డారు. వీరికి పుత్తూరులో ప్రథమ చికిత్స అనంతరం కంచికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైజాక్ ముఠా హల్చల్
టీడీపీ యువనేత ఆధ్వర్యంలో ● భారీ దారి దోపిడీకి స్కెచ్ సిద్ధం చేసిన పచ్చనేతలు ● ఎర్ర చందనం, గుట్కా, డ్రగ్స్ అక్రమ రవాణే ఈ గ్యాంగ్ టార్గెట్ సాక్షి టాస్క్‌ఫోర్స్: ఓ టీడీపీ యువనేత గుట్కా పేరుతో మస్కా కొట్టాలని చూశాడు. దారి దోపిడీకి సిద్ధపడ్డారు. ఎర్రచందనం, గుట్కా, డ్రగ్స్ సరఫరాపై స్కెచ్ వేశాడు. భారీగా దండుకోవాలని దారి దోపిడీ బ్యాచ్‌ను సిద్ధం చేశాడు. ఈ స్కెచ్ బెడిసికొట్టింది. సొంత పార్టీ నేతను హైజాక్ చేయడంతో దారి దోపిడీ ముసుగు తొలగింది. తొలగిన ముసుగును కప్పిపుచ్చేందుకు పార్టీ పెద్దలంతా అండగా నిలిచారు. విషయానికి వస్తే.. కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఓ వాహనంలో భారీగా గుట్కా చిత్తూరు మీదుగా వస్తోందని సోమవారం రాత్రి టీడీపీ ముఠాకు సమాచారం అందింది. గ్యాంగ్ లీడర్(టీడీపీ యువనేత) ప్లాన్ ప్రకారం ఇన్నోవా కారులో ముగ్గురు, ఇద్దరు ద్విచక్రవాహనంలో హైజాక్ దిగారు. తాగిన మైకంలో ముఠా గుట్కా తరలిస్తున్న వాహనాన్ని వదిలేశారు. అదే సమయంలో గుడిపాల మండలంలోని వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బెంగళూరుకు వెళ్లి వస్తుండగా వెంటబడ్డారు. ఈ నాయకుడు వస్తున్న కారు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉండడంతో.. ఇదే గుట్కా తరలిస్తున్న వాహనమని గుడిపాల వరకు వెంబడించారు. చీలాపల్లి సీఎంసీ వద్ద టీడీపీ నాయకుడి కారుకు పచ్చబ్యాచ్ అడ్డుపడింది. ఉలిక్కిపడిన ఆ టీడీపీ నేత కారును మళ్లించి వేగం పెంచారు. మళ్లీ ఈ పచ్చ బ్యాచ్ కల్వర్టు వద్ద అడ్డగించే ప్రయత్నం చేసింది. ఆ నాయకుడు అక్కడి నుంచి తప్పించుకుని ఇంకాస్త వేగం పెంచారు. ఇంతలో కారులో ఉన్న ఓ మహిళ మండలంలోని ఓ టీడీపీ కీలక నేతకు ఫోన్ చేసి.. తమను ఎవరో వెంబడిస్తున్నారని సమాచారం అందించారు. ఆ నాయకుడి సూచనల మేరకు గుడిపాల మండలంలోని హోటల్ వద్ద కారు ఆగింది. ఇంతలో స్థానికులు కూడా అక్కడికి రావడంతో ఆ పచ్చ బ్యాచ్‌కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘గుట్కా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది.. మేము చిత్తూరోళ్లం. లోకల్’’ అంటూ పచ్చబ్యాచ్ వారిని బెదరించే ప్రయత్నం చేసింది. ఆ టీడీపీ నేత ‘‘మేము కూడా పక్కా లోకల్.. మాది గుడిపాల’’ అంటూ ఆగ్రహానికి గురయ్యారు. ఇంతలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువత నాయకుడు (గ్యాంగ్ లీడర్) అక్కడికి వచ్చి కారును ఆపాడు. ఆపై కట్టుకథలు అల్లాడు. ఎంతకీ వారు వినిపించుకోకపోవడంతో గుడిపాల పోలీసులకు తెలియజేశారు. కాగా కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.మంగళవారం పంచాయితీ.. వైఎస్సార్ సీపీపై బురద జల్లేందుకు.. గ్యాంగ్ లీడర్ హైజాక్ విషయం బుధవారం సాయంత్రానికి గుడిపాల మొత్తం కంపు కొట్టింది. దీంతో ఓ నగరపాలక ప్రజాప్రతినిధి.. ఐడియా ప్రకారం వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు ప్లాన్ చేశారు. సామాజిక మాధ్యమం వేదికగా కొందరు వ్యక్తులను పార్టీకి అంటగడుతూ.. కేసును మళ్లించే ప్రయత్నం చేశారు. ఇంతలో దీనికి దీటుగా వైఎస్సార్సీపీ అదే సామాజిక మాధ్యంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. అసలైనా వ్యక్తి.. గ్యాంగ్‌లీడర్‌ను సామాజిక మాధ్యమం వేదికగా బయటపెట్టింది. దీంతో బుదర జల్లాలి అనుకున్న పచ్చ బ్యాచ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమార్జనే ధ్యేయం టీడీపీ చిత్తూరు తెలుగు యువత నాయకుడికి పదవి పొందిన నాటినుంచి అక్రమార్జనే ధ్యేయంగా దందాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గుట్కా హైజాక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు గుట్కా, డ్రగ్స్ అక్రమ రవాణాను కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం సీనియర్ నాయకులు అతనికి పదవి ఇవ్వకూడదని చెప్పినా ఓ ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడంతో తెలుగుదేశం పార్టీలో అక్రమ రవాణాకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. సోమవారం రాత్రి జరిగిన సంఘటనను గుడిపాల మండలంలోని టీడీపీ నాయకులు పలువురు ఈ విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాలను పిలిచి ఈ విషయం బయటికి పొక్కకుండా చేశారు. సర్దుబాటు చేయకపోతే పార్టీ పరువుపోతుందని భావించారు. ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఇదంతా చేయించడంటే వారికి దెబ్బపడుతుందని అనుకున్నారు. దీంతో విషయం బయటకురాకుండా తొలుత కేసు నమోదు చేయమని ఆ ప్రజాప్రతినిధే పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తర్వాత ఆ కేసు లేకుండా చూసేందుక పలు పంచాయితీలు నడిచాయి. తీరా పార్టీ నుంచి కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి టీడీపీలోని కొందరు గ్యాంగ్ లీడర్ విషయాన్ని అధిష్టానానికి పూసగుచ్చినట్లు వివరించారు. మరో రెండు రోజుల్లో గ్యాంగ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు ఆ గ్యాంగ్ లీడర్‌ను పార్టీ నుంచి తొలిగించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. -
శరవణ కంటి ఆస్పత్రి సీజ్!
పుత్తూరు: స్థానిక ఎంబీ రోడ్డులోని చైన్నె శరవణ కంటి ఆస్పత్రిని బుధవారం గోవిందపాళెం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి కేఆర్ రమేష్, సీహెచ్ఓ శివయ్యలు సీజ్ చేశారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ గుర్తింపు లేని కారణంగా చైన్నె శరవణ కంటి ఆస్పత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కంటి ఆస్పత్రిపై సమాచార హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి కె.మురగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, ప్రభుత్వ ఆనుమతులు లేని నేపథ్యంలో ఆస్పత్రిని సీజ్ చేయాల్సిందిగా జిల్లా వైద్యాధికారి ఆదేశించినట్లు వెల్లడించారు. హెల్త్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ శోభన్‌బాబు, వీఆర్వో బాబు, పోలీసుల సమక్షంలో సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
దాత ఔదార్యం వెలకట్టలేనిది
ఐరాల: దాత ఔదార్యం వెలకట్టలేనిదని, దాత సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. బుధవారం కాణిపాకం జెడ్పీ హైస్కూల్ ప్లస్‌కు ఏఎంఎంఏసీటీఎస్, ఏసీటీఎస్ సంస్థల సీఈఓ డాక్టర్ దశరథరెడ్డి పది కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై దాత చేతుల మీదుగా కంప్యూటర్ తరగతి గది ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ దాత తమ సొంత నిధులు రూ.5 లక్షల వ్యయంతో కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ చేయడం సంతోషదాయకమన్నారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సాంకేతిక విద్యనందించేందుకు విద్యార్థుల ప్రయోజనం కోసం కంప్యూటర్లును అందజేయడం గొప్ప విషయమన్నారు. దాత దశరథరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని పాఠశాలు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రుషేంద్రబాబు, హెచ్ఎం గోపీనాథ్‌రెడ్డి, వైస్ సర్పంచ్ విశ్వనాథరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ భానుప్రకాష్, ఉపాధ్యాయులు సురేంద్రబాబు, సోమశేఖర్‌నాయుడు పాల్గొన్నారు. -
కష్టాల శిబిరాలు !
దివ్యాంగులు వెళ్లలేక ఇబ్బందులు కుప్పం: దివ్యాంగులు, వృద్ధుల సహనానికి బాబు ప్రభుత్వం పరీక్ష పెడుతోంది. సహాయ పరికరాల గుర్తింపు కోసం సుదూర ప్రాంతాల్లోని శిబిరాలకు తరలించి కష్టాల్లోకి నెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులు అంతదూరం వెళ్లలేక నానాఅగచాట్లు పడాల్సి వస్తోంది. శిబిరాల ఎంపికలో వైఫల్యం దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ పరికారాల గురింపు కోసం ఏర్పాటు చేసిన శిబిరాల స్థలాల ఎంపిక అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా మారింది. కుప్పం పట్టణ కేంద్రాన్ని వదలి గుడుపల్లెను ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా నేడు జరగనున్న శిబిరం కూడా రామకుప్పం మండలం నుంచి దివ్యాంగులు 20 కి.మీ దూరంలోని శాంతిపురం మండలానికి వెళ్లాల్సి వస్తోంది. అవస్థలే..అవస్థలు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన దివ్యాంగులు, వృద్ధులకు రెండు మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం గుడుపల్లె హైస్కూల్లో గుడుపల్లె, కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రూరల్ మండలాల్లోని దివ్యాంగులు శిబిరాలకు హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 26న బుధవారం శాంతిపురం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన వారు రావాలని చెప్పారు. అయితే మంగళవారం గుడుపల్లె మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు హాజరయ్యేందుకు దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కుప్పం రూరల్ ప్రాతం నుంచి 50 కి.మీ ప్రయాణించి శిబిరానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆటోలు, బస్సుల్లో అంత దూరం ప్రయాణించలేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుప్పం పట్టణ కేంద్రాన్ని వదలి గుడుపల్లెను ఎంపిక చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
తూర్పు కనుమలపై ప్రత్యేక పరిశోధన
ఏర్పేడు:జీవ వైవిధ్యం, విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణమవుతున్న తూర్పు కనుమలకు గుర్తింపును తీసుకొస్తూ ప్రత్యేక పరిశోధన, పరిరక్షణపై మంగళవారం ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమల్లోని ప్రత్యేక భూగోళిక పరిస్థితులు, జీవరాశుల ఉనికి తదితర అంశాలపై విస్తృత పరిశోధనలు జరగాలని సెమినార్లో శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇండియా నేచురల్ డెవలప్మెంట్ అధికారి ఫరీదాటంపాల్ పడమటి కనుమలకు గుర్తింపు ఉన్నట్లే తూర్పు కనుమలకు గుర్తింపు వచ్చేలా చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సెమినార్లో ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, అటవీశాఖ తిరుపతి సీసీఎఫ్ సెల్వం, తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ అధికారి సాయి బాబా, స్టేట్ సెరికల్చరిస్ట్ బబితా, రాజమండ్రి సెరికల్చరిస్ట్ అధికారి శ్రీనివాసరావు, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పారావు, కాకినాడ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు, విశాఖపట్నం సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ జూపార్క్ జంతు జాలాల నమూనాలు ప్రదర్శన తూర్పు కనుమలపై పరిశోధనల కోసం తిరుపతి ఐసర్‌లో చేపట్టిన సెమినార్ సందర్భంగా తిరుపతి ఎస్వీ జూ పార్క్ ఆధ్వర్యంలో వివిధ జంతుజాలాల నమూనాలను ప్రదర్శించారు. శ్రీశైలం ఫారెస్ట్ స్టాల్ ప్రదర్శన ఐసర్ విద్యాసంస్థలోని విద్యార్థుల పరిశోధనకు అవగాహన కోసం అడవుల సంరక్షణ, పులుల పరిరక్షణ, పర్యావరణంలో అడవుల పాత్రపై ఈస్ట్రన్ గాడ్స్ పరిరక్షణ కార్యక్రమం కింద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ జి. విఘ్నేష్ అప్పారావు మాట్లాడుతూ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సైన్స్ పరిశోధన విద్యార్థులకు పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణ, వాతావరణంలో మార్పులకు అడవులు ఎలా దోహదపడతాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ శ్రీశైలం ఫారెస్ట్‌లో 87 పులులున్నాయని, వీటి సంఖ్య పెంచుతామన్నారు. -
లాఠీ నిరీక్షణ!
కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా పిలుపులేదే? బాబు చరిత్ర హీనుడు! కార్వేటినగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ప్రజల దృష్టిలో చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మంగళవారం సీడీ కండ్రిగ, టీకేఎం పేట పంచాయతీల్లో సర్పంచ్ ఆకుల మంగమ్మ, ఎంపీటీసీ నందిని ఆధ్వర్యంలో నిర్వహించి కోటి సంతకాల పత్రాలను పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వైద్య విద్యార్థుల జీవితాలను అందకారంలో నెట్టేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీ కరణకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ వారికి దోచి పెట్టడానికి చంద్రబాబు కుఠిల యత్నం చేయడం మంచిది కాదన్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఒక్క మెడికల్ కళాశాలను కూడా నిర్మించలేదని మండిపడ్డారు. జగనన్నకు ఉన్న జన బలాన్ని చూసి ఓర్వలేక కొన్ని పచ్చపత్రికలు అబద్ధాలను వండి వార్చుతున్నాయన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ కమిటీ అధ్యక్షుడు ఆకుల గోపి, నాయకులు ధన్‌రాజ్, వెంకటేష్, రంగయ్య, రాజారాం యాదవ్, బుర్ర వెంకటేష్, రెండు పంచాయతీల వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. కళ్లెదుటే కబ్జా! చౌడేపల్లె: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోకి వెళ్లే ప్రధాన గేటు పక్కనున్న ఖాళీ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేయడానికి యత్నించారు. మట్టితోలి చదును చేసి ఆక్రమణకు సిద్ధమయ్యారు. దీనిపై అధికారులెవ్వరూ తమకు సంబంధం లేదన్నట్టు మిన్నకుండిపోయారు. అసలు ఈ స్థలం తమదేనా..? అంటూ అధికారులే చర్చించుకోవడం కొసమెరుపు. ఈ విషయమై ఎంపీడీఓ లీలామాధవిని వివరణ కోరగా.. కార్యాలయం స్థలం వరకు చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేశామని బదులిచ్చారు. ఆ స్థలం ఆర్‌అండ్‌బీకి సంబంధించినదా..లేదా రెవెన్యూ స్థలమా తేలాల్సి ఉందన్నారు. చిత్తూరు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విడుదైన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు టీడీపీ సర్కారు వచ్చాక తుది మెరుగులు దిద్దింది. ఫలితాలు ప్రకటించి ఆ క్రెడిట్‌ను తన ఖాతాలోకి వేసుకుంది. కానీ ఫలితాలు విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఇప్పటి వరకు శిక్షణ ప్రారంభం కాలేదు. అసలు దీని గురించి ఆలోచించేవాళ్లే లేరని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. అలా.. బీజం 2022 నవంబర్‌లో అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో 240 కానిస్టేబుల్, 630 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. మొత్తం 870 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా 2023 జనవరిలో ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి, ఫలితాలు కూడా విడుదల చేసింది. ఆపై ఎమ్మెల్సీ ఎన్నికలు, హోంగార్డులు కొందరు కోర్టుకు వెళ్లడం, అటు తరువాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. అదే నోటిఫికేషన్‌కు కొనసాగించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు గతేడాది డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి, ఈ ఏడా ది జూన్‌లో తుది పరీక్షలు నిర్వహించి జూలై నెలాఖరున ఫలితాలు విడుదల చేసింది. జిల్లాలో 870 ఖాళీలకు గాను 850 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో కానిస్టేబుల్ సివిల్‌కు 223 మంది, కానిస్టేబుల్ ఏఎపీఎస్పీకు 627 మంది ఎంపికయ్యారు. వేతనం పోయినట్లేగా? ప్రభుత్వ ఉద్యోగాల్లో సీనియారిటీనే చాలా ముఖ్యం. పది నెలల శిక్షణ అనంతరం పోస్టింగులు ఇస్తే సీనియారిటీ వచ్చేది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ సీనియారిటీకి సైతం పోయినట్టే. ఇక ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమై ఉంటే స్టైఫండ్ కింద ఒక్కొక్కరికీ నెలకు సగటున రూ.18 వేలకు పైగా వేతనాలు ఇవ్వాలి. 850 మందికి నెలకు కనీసం రూ.1.53 కోట్ల చొప్పున నాలుగు నెలలకు కలిపి దాదాపు రూ.6 కోట్లకు పైనే వేతనాలు ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకు అసలు శిక్షణపై ప్రభుత్వం స్పందించకపోవడం, తమను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు చేసిచేసి! కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన పది రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుందంటూ ప్రభుత్వం నుంచి జిల్లా పోలీసుశాఖకు సమాచారం అందింది. దీంతో చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి బూజు దులిపి.. దులిపి అధికారులు అలసిపోయారే తప్ప.., ప్రభుత్వం నుంచి శిక్షణపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అభ్యర్థుల వసతి, తరగతి గదులు, సౌకర్యాలపై పలుమార్లు డీటీసీను సిద్ధం చేసి విసిగిపోయారు.


