ప్రాణాలు పోతున్నాయని ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నాయని ఫిర్యాదు

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

– నైల్‌ కంపెనీపై చర్యలకు వినతి

వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం గాజులమండ్యం ఎస్టేట్‌లోని నైల్‌ కంపెనీపై కల్లురు వాసులు గురువారం తిరుపతిలోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నైల్‌ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ జలాలు, పొగ కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని ఆరోపించారు. గుండె, ఊపిరితిత్తులు, పెరాలసిస్‌ వ్యాధులు సోకి కొందరు మృత్యువాత పడ్డారని వెల్లడించారు. నైల్‌ కంపెనీతో పాటు ఇండోమెమ్‌, స్టీవెలిస్‌, విజయం బయోటెక్‌ ఫ్యాక్టరీల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆయా కంపెనీలను సందర్శించి, కాలుష్యాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన పొల్యూషన్‌ అధికారి గాజులమండ్యం ఎస్టేట్‌లోని ఫ్యాక్టరీలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మోహన్‌నాయుడు, రామానాయుడు, కుమారస్వామి మొదలి, వాసు, మధు, రోహిత్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement