పలమనేరు : మున్సిపాలిటీలో అన్ని అనుమతులు పొంది ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు నిబంధనలు పాటించలేదంటూ నోటీసులు జారీ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు సోమచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో ఉన్నాననే అధికారులు టార్గెట్ చేసి తన ఇంటికి సెట్ బ్యాక్ లేదని నోటీసు ఇచ్చారని ఆరోపించారు. ఇదే మున్సిపల్ అధికారులు గతంలో అనుమతులు ఇచ్చి, ఇప్పు డు కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు. పట్టణంలో టౌన్‌ప్లానింగ్ నిబంధనలు పాటించని వారెందరో ఉన్నారని, వీధులను ఆక్రమించుకున్న వారిని వదిలిపెట్టి తమను వేధించేందుకే నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని తెలిపారు.
కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్త్ క్యాంప్
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌నకు విశేష స్పందన లభించిందని డీఆర్‌ఓ మోహన్‌కుమా ర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని వివిధ శాఖలకు చెందిన దాదాపు 300 మంది ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా జనర ల్ మెడిసిన్, నేత్ర వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు ఉద్యోగులకు వైద్య సేవలందించాని వివరించారు. రక్తం, మూత్ర పరీక్షల తో పాటు షుగర్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అగర్వాల్‌ఐ ఆస్పత్రి వైద్యులుసుమంత్, మోహ న్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.


