ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి 2026– 27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రాంరభమైనట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం చిత్తూరులోని బాపుబాలభవన్‌ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యలో చదువు మానేసిన వారు, డ్రాపౌట్లు ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. విద్యాప్రమాణాల పెరుగుదలకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, హెచ్‌ఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లని విద్యార్థులను గుర్తించి ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఓపెన్‌ స్కూల్‌పై అవగాహన పోస్టర్‌ ఆవిష్కరించారు. జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ జయప్రకాష్‌నాయుడు, ఎంఈఓలు సెల్వరాజ్‌, మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement