breaking news
Chittoor District Latest News
-
బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
గంగాధర నెల్లూరు: మండలంలోని ముసలయ్యగారిపల్లి రోడ్డు సమీపంలో తర్చూ రు–బెంగళూరు హైవేపై గురువారం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలో ముసలయ్యగారిపల్లి రోడ్డు సమీపంలోని తర్చూరు–బెంగళూరు హైవేపై గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుని వెళ్తున్నాడు. అదే దారిలో చైన్నె వైపు బైక్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌లో వెళుతున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. అన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీలో ఉంచామని, అతని ఆచూకీ తెలిసిన వారు జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కృష్ణమోహన్ తెలిపారు. చిత్తూరులో పోలీస్ యాక్ట్ అమలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు సబ్–డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం గురువారం నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు డీఎస్పీ జె.వెంకటనారాయణ తెలిపారు. సబ్–డివిజన్ పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా, జి.డి.నెల్లూరు, బీఎన్ఆర్ పేట, పెనుమూరు, యాదమరి, గుడిపాల, తవణంపల్లి, కాణిపాకం, పూతలపట్టు, ఐరాల, కల్లూరు, రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య కార్వేటినగరం: ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. కేఎంపురం గ్రామానికి చెందిన పి.ముత్యాలు కుమారుడు పి.వేణు(28) డిగ్రీ, డైట్ విద్యనభ్యసించాడు. అతను ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం దొరకకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. గత నెల 28వ తేదీన విషపు ఆకు తిని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 30వ తేదీ రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కార్వేటినగరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మద్యం దుకాణాలకు ‘సిండికేట్’ సమస్య – 18 దుకాణాలకు 28 దరఖాస్తులు – ముగిసిన గడువు సాక్షి, చిత్తూరు: జిల్లాలో రెన్యువల్ చేసుకోకుండా మిగిలిపోయిన 19 మద్యం దుకాణాల నిర్వహణ కోసం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించగా.. సిండికేట్ సమస్య తలెత్తింది. గురువారం అర్ధరాత్రి వరకు గడువు ఉండగా, చివరి సమయానికి 28 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. అన్–రిజర్వుడు కేటగిరీలో 18 దుకాణాలకు 28 దరఖాస్తులు అందినట్లు సమాచారం. దీంతో ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్ తీస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించడంతో.. అన్ని దుకాణాలకు నాలుగు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లక్కీడిప్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు రానిపక్షంలో.. వాటికి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. -
మానవాళి సంక్షేమానికే అంతరిక్ష సాంకేతికత
చిత్తూరు కలెక్టరేట్ : మానవాళి సంక్షేమానికే భారత్ అంతరిక్ష సాంకేతికత అని ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్ తెలిపారు. చిత్తూరు నగర సరిహద్దులోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం అంతరిక్ష శాస్త్రంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంతరిక్ష రంగాన్ని ఎక్కువగా సైనిక అవసరాలకు ఉపయోగిస్తుంటే, భారతదేశం మాత్రం మానవాళి శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసమే అంతరిక్ష సాంకేతికతను వినియోగించిందన్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ దార్శనికత వల్లే భారత్ అంతరిక్ష రంగంలో దృఢంగా నిలబడిందన్నారు. ఆరంభంలో సాంకేతికతను నిరాకరించినా, స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ నుంచి నేటి వర్క్ హార్స్ పీఎస్ఎల్వీ వరకు ఇస్రో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. 300లకు పైగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిందని వివరించారు. చంద్రయాన్ నుంచి ఆదిత్య ఎల్1 వరకు చారిత్రాత్మక విజయాలు చంద్రయాన్–1తో చంద్రునిపై నీటి అణువులను గుర్తించి ప్రపంచ దృష్టిని ఆకర్షించామని కిరణ్‌కుమార్ తెలిపారు. చంద్రయాన్–3తో చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. హాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం కంటే తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే ‘మంగళయాన్’ మిషన్ విజయవంతం చేశామన్నారు. ప్రస్తుతం సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ను నిర్వహించామని తెలిపారు. స్పేస్ సైన్స్‌లో ఏఐ, ఎంఎల్ పాత్ర కీలకం భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), రోబోటిక్స్ పూర్తిగా మార్చివేయబోతున్నాయని కిరణ్‌కుమార్ చెప్పారు. ఉపగ్రహాల స్వయం ప్రతిపత్తి నావిగేషన్, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, గగన్‌యాన్‌లో స్పేస్ రోబోటిక్స్, రాకెట్ల ముందస్తు మెయింటెనెన్స్‌లో ఏఐ కీలకమవుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లకు విస్తరించడం వల్ల ట్రిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రాథమిక అంశాలపై దృష్టి సారించి పరిశోధనల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఏఐ అనేది శాస్త్రవేత్తల స్థానాన్ని భర్తీ చేయలేదని, నిర్ణయాలను మరింత వేగంగా, కచ్చితంగా తీసుకోవడానికి సాయపడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఇస్రో చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రంగనాథం, సీఈ నాగేంద్రప్రసాద్, అకడమిక్ అడ్వైజర్ నారాయణ, ఇన్చార్జి ప్రిన్సిపాల్ పళనివేల్, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే వెన్నెముక
పాలసముద్రం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక అందజేయనున్నట్టు తెలిపారు. ఆయన గురువారం పాలసముద్రంలో విలేకరులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఆ కుటుంబాలను పార్టీ తమ కుటుంబంగా భావించి అండగా నిలుస్తుందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ వివిధ కమిటీల్లో నియమితులై, పార్టీ గుర్తింపు కార్డులు పొందిన నాయకులు ప్రమాదవశాత్తు మృతిచెందితే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబాలకు కొంతమేర భరోసా కలుగుతుందన్నారు. ఆర్థిక సహాయం పొందేందుకు పార్టీ కమిటీలో నియమితులై ఉండడంతో పాటు పార్టీ గుర్తింపు కార్డు పొంది ఉండాలన్నారు. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు లేదా పంచనామా వంటి ధ్రువీకుణ పత్రాలను సమర్పించాలన్నారు. సంబంధిత గ్రామ లేదా వార్డు అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు సిఫార్సుతో ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మృతుడి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాల్చి ఉంటుందని వివరించారు. అదేవిధంగా మృతుని నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డును తప్పనిసరిగా జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ప్రతిపాదనలు పంపితే ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుంటే సంబంధిత పార్టీ నాయకులు ఆలస్యం చేయకుండా వివరాలు సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకర్తలే ప్రధాన బలమని నారాయణస్వామి పేర్కొన్నారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తల వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సేకరించి, అవసరమైన సందర్భాల్లో బాధిత కుటుంబాలకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
కుప్పం రూరల్ : కుప్పం పట్టణ సమీపంలోని తంబిగానిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఇండియా –1 ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. గమనించిన పక్కన ఉన్న వారు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. దుండగులు అప్పటికే డిస్ప్లేను తొలగించి ఏటీఎం వెనుక భాగాన్ని కొంతమేరకు ధ్వంసం చేసినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం విచారణ చేపట్టారు. ఏటీఎంలో ఎంత నగదు ఉంది? ఎంత చోరీకి గురైంది అనే విషయాలపై ఆరా తీశారు. కార్వేటినగరం సీఈఓ సస్పెన్షన్ – క్రిమినల్ కేసు నమోదుకు జిల్లా కలెక్టర్ ఆదేశం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్వేటినగరం సహకార సంఘం సీఈఓ ఎస్.దుష్యంత్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్వేటినగరం సహకార సంఘంలో సీఈవో దుష్యంత్ కుమార్ నిబంధనలను పక్కనబెట్టి పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా బంగారం, ఇతర రుణాలను రూ.కోట్లలో మంజూరు చేశారు. రైతులు చెల్లించిన నగదు, డిపాజిట్లను ఖాతాల్లో జమ చేయకుండా, పూర్తయిన రుణాలను మళ్లీ తెరిచి చూపించడం, అర్హతలేని వారికి రుణాలు ఇవ్వడం తదితర అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా కలెక్టర్ సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో జిల్లా సహకార శాఖ నుంచి సీనియర్ ఇన్స్పెక్టర్ సులోచన నేతృత్వంలో అధికారులు విచారణ చేపట్టారు. దుష్యంత్ కుమార్ విచారణకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అన్యాయాన్ని చెప్పడానికి వచ్చిన బాధితులు, రైతులను దూషిస్తూ దాడికి దిగారు. దీనిపై సీనియర్ ఇన్స్పెక్టర్ నివేదిక అందించడంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. జిల్లా స్థాయి సాధికార కమిటీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాజమాన్య మండలి సంయుక్తంగా తీర్మానం చేసి దుష్యంత్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో సహాయ కార్యనిర్వాహకుడు పి.నరే్ష్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సహకార శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
ఐరాల: విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోగాలు చేసి ఆలోచనా శక్తిని, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన గురువారం అగరంపల్లె, ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూళ్ల లో స్టెమ్ ల్యాబ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యా థ్స్)లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూత్ ఫర్ సేవా సంస్థ కృషితో సైక్రాప్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇంజినీరింగ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.8.70 లక్షలతో స్టెమ్ ల్యాబ్ మెటీరియల్‌ను 6, 9 తరగతుల విద్యార్థులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థు లు సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రయోగాలపై ప్రాక్టికల్స్ చేసి ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చన్నారు. మెటీరియల్ ఉపయోగాలను హైస్కూల్ ప్లస్ ఉపాధ్యా యిని మీనాకుమారి, స్టెమ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. తదుపరి బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.1,500, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.1,000 అందజేసి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ జయప్రకాష్‌నాయుడు, ఎంఈఓలు రుషేంద్రబాబు, భానుప్రసాద్, హెచ్ఎం తులసీరామ్, యూత్ ఫర్ సేవా సంస్థ ప్రతినిధి హరీష్, ఉపాధ్యాయులు సుధాకర్, జయంతి, కృష్ణవేణి, నిషా, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాణిపాకంలో ఇస్రో మాజీ చైర్మన్
కాణిపాకం: కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని గురువారం ఇస్రో మాజీ చైర్మన్, అంతరిక్ష పరిశోధన కమిషన్ సభ్యుడు ఏఎస్ కిరణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి శేషవస్త్రం కప్పి, చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్ల పంపిణీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని 8వ బెటాలియన్ ఏపీఎస్పీలో వివిధ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయనున్నట్లు బెటాలియన్ కమాండెంట్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో షార్ట్‌లిస్ట్ తయారుచేశామని వెల్లడించారు. ఆ జాబితాలోని అభ్యర్థులకు అక్టోబర్ 5, 6 తేదీల్లో హాల్ టికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఇరువారం గ్రామంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కమాండెంట్ కార్యాలయంలో నేరుగా హాజరై హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. నిర్ణీత తేదీల్లో హాల్ టికెట్లు తీసుకోకపోతే కార్యాలయం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం 9440456433, 9703545843 నంబర్లలో సంప్రదించాలని కోరారు. చిత్తూరు, తిరుపతిలో డీఎస్పీల బదిలీ సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్త గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్లో పనిచేస్తున్న శ్రీనివాసులును గుంతకల్లుకు, చంద్రగిరిలో ఉన్న బి.ప్రసాద్‌ను మదనపల్లెకు, పోస్టింగ్ కోసం వేచివున్న ఎస్.చంద్రశేఖర్‌ను నగరికి, బాపట్లలో పనిచేస్తున్న పి.జగదీష్ నాయక్‌ను చంద్రగిరికి బదిలీ చేశారు. -
బీసీలను మోసం చేశారు
జగనన్న హయాంలో బీసీలకు సముచిత స్థానం లభించింది. బీసీ కులాల కార్పొరేషన్లు, ఇతర పదవుల్లో అనేక మందికి స్థానం కల్పించారు. పక్కాగా రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలను అడ్డం పెట్టుకుని ఓట్లు కొట్టేయాలని టీడీపీ కుటీల యత్నానికి కోర్డు తీర్పు చెంపపెట్టులా మారింది. –చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్, బీసీనాయకులు, చిత్తూరుకోర్టుల్లో నిలబడదని తెలిసినా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆర్డినెన్స్, జీవోలు తీసుకురావడం ఓట్ల కోసమే అని తేలిపోయింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉంటే కోర్టు ల్లో నిలబడవని సుప్రీం కోర్టు తీర్పుల ద్వారా తెలిసినా, సరైన న్యాయ సలహాలు తీసుకోకుండా అడ్డగోలుగా జీవోలు ఇచ్చారు. కోర్టు కొట్టేయగానే చేతులెత్తేశారు. –జ్ఞానజగదీష్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం(జేఏసీ) అధ్యక్షుడు డ్రామా ఆడారు రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ఎందుకు అనుసరించలేదు? చట్టపరమైన ప్రాతిపదిక, సరైన డేటా లేకుండా జీవోలు ఇచ్చి బీసీలకు మేలు చేస్తున్నట్లు హంగామా చేశారు. కోర్టు కొట్టేస్తుందని ముందే ఊహించి, ఆ నిందను కోర్టులపై నెట్టేసేందుకు ఆడిన నాటకమిది. – త్యాగరాజులు, బీసీనాయకులు, చిత్తూరు బీసీల హక్కును కాలరాశారు రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ దక్కకుండా చేయడం బాధాకరం. ఎన్నికలు సకాలంలో జరపకుండా వాయిదా వేస్తూ వచ్చి, చివరికి కోర్టుల్లో నిలబడని జీవోలు తేవడం ద్వారా బీసీలకు దక్కాల్సిన రాజకీయ హక్కును కాలరాశారు. – నారాయణ, బీసీ నాయకులు, చిత్తూరు ● -
పింఛన్ల ఆశ.. తీరని నిరాశ!
ఎదురు చూపులే.. చిత్తూరు నగరం శ్రీనివాస కాలనీకి చెందిన సుకుమా ర్ చర్మకారుడు. 22 ఏళ్లుగా పీసీఆర్ సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతోనే తన పిల్లలు దీపిక (7వ తరగతి), చెర్రీ (5వ తరగతి), మహేంద్ర (3వ తరగతి)లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. రోజుకు వచ్చే రూ.300 ఆదాయం కుటుంబ పోషణకు చాలడం లేదు. చర్మకారుల కేటగిరీలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకటోతేదీన పింఛన్ డబ్బు వస్తుందని గంపెడాశతో ఎదురు చూశాడు. మీకు పింఛన్ రాలేదంటూ సచివాలయ ఉద్యోగి చెప్పడంతో నిరాశచెందాడు. దరఖాస్తే తీసుకోలేదు చిత్తూరు సంతపేటకు చెందిన సరోజ భర్త చంద్ర లారీ డ్రైవర్. అతను ఏడాదిన్నర క్రితం మృతిచెందాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా వారు తిరుపతిలో ఉంటున్నారు. సరోజ సోదరి రాజమ్మకు ఎవరూ లేకపోవడంతో ఆమె కూడా సరోజ వద్దే ఉంటోంది. రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. గతంలో ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వలేమంటూ సచివాలయ అధికారులు ఆమె పింఛను రద్దు చేశారు. ఐదు నెలల క్రితం రాజమ్మ మృతిచెందారు. తర్వాత తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని సరోజ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఆమె నాలుగు ఇళ్లలో పనిచేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తోంది. పింఛన్‌కోసం ఎదురుచూపులే ఈమె పేరు అమరజ్యోతి. గుడిపాల మండలం వసంతాపురం గ్రామం. ఈమె భర్త రెండున్నరేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఆమె భర్త గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదించి కుటుంబ పోషణ చూసుకునేవాడు. ప్రస్తుతం అతను లేకపోవడంతో ఇంటి పరిస్థితి ఏమాత్రం బాలేదు. కొత్త పింఛన్ ఒకటో తేదీన వస్తుందని చెప్పడంతో ఉదయం నుంచి ఆశగా ఉన్న జ్యోతికి పింఛన్ ఇప్పట్లో ఇవ్వడంలేదనే మాట నిరాశను మిగిల్చింది. సాక్షి, చిత్తూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన 28 నెలల తర్వాత కొత్త పింఛన్ల కోసం అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోవడానికి 12 రోజుల గడువు పెట్టింది. కులం సర్టిఫికెట్లు, ఆదాయం, స్థానిక సర్టిఫికెట్లు తీసుకోవడానికే కొందరికి సమయం చాల్లేదు. గడువు సమయం ముగిసే సమయానికి వందలాది మంది దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారు ఒకటో తేదీన పింఛన్ అందుతుందని గంపెడాశలతో ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇవ్వడంలేదని చెప్పేశారు. ఈ నెల నుంచి పింఛన్ డబ్బులు అందుతుందని ఆశ పడిన వారి ఆశలు అడియాశలయ్యాయి. అసలు దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ పింఛన్ వస్తుందా..? వేలాది మందికి పింఛన్ ఇప్పట్లో అందుతుందా..? అసలు పింఛన్ ఎప్పుడిస్తారు..? అన్నదానిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. భారీగా అనర్హుల జాబితా కొత్త పింఛన్ల కోసం గతనెల దరఖాస్తులు ఆహ్వానించడం, ఆపై జిల్లా వ్యాప్తంగా 43,767 మంది దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇందులో అత్యధికంగా 23,304 మంది వృద్ధులు ఉన్నారు. ఒక ఇంట్లో వికలాంగ పింఛన్ తీసుకుంటుంటే వృద్ధాప్య పింఛను దరఖాస్తులను అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. అన్ని కేటగిరీల్లోనూ ఒకే ఇంట్లో రెండో పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అసలు పింఛన్ వస్తుందో..? రాదో..? తెలియని పరిస్థితి. ఇలా దాదాపు 7 వేల మందికి పైగా దరఖాస్తులను తిరస్కరించినట్లు ప్రాథమిక సమాచారం. ఇది చాలదన్నట్లు కొత్త పింఛన్ల మంజూరు కోసం కొన్నిచోట్ల తమ్ముళ్లు దళారుల అవతారం ఎత్తారు. ఒక్కో పింఛన్‌కు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు జేబులో వేసుకున్నారు. మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలకు సర్టిఫికెట్లు ఇప్పించి, పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టించారు. మొత్తం 43,493 దరఖాస్తుల్లో జిల్లా స్థాయిలో 36,342 మాత్రమే ఆమోదించి.. 7,425 తిరస్కరించారు. మళ్లీ రాష్ట్రస్థాయి విచారణలో మరికొంత మంది దరఖాస్తులను తిరస్కరించనున్నారు. ఇలా పింఛన్ వస్తే తప్ప ఏదీ తెలియదు. ‘కోడ్’ కూస్తే ఏం చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దరఖాస్తులు ఆహ్వానించినా, అర్హులకు అక్టోబర్ 1వ తేదీనే పింఛన్లు ఇచ్చేసి ఉండొచ్చు. వెంటనే పింఛన్ ఇస్తే తమను మరచిపోయే ప్రమాదం ఉందని, పంచాయతీ–మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడినప్పుడు పింఛన్ పంపిణీ చేద్దామని పచ్చ ప్రణాళిక రూపొందింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపడంతో, పింఛన్ అందేలోపు మరో మూడు నెలల సమయం పట్టనుంది. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసే, కూటమి ప్రభుత్వం అభాగ్యుల భావోద్వేగాలతో పింఛన్ పేరు చెప్పి ఆడుకుంటోంది. ఏళ్లుగా నిరీక్షణే కుప్పం మండలం దాసేగానూరుకు చెందిన రత్నమ్మ భర్త 18 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొడుకు తిరుపతిలో ఉంటూ అక్కడి ట్రాన్స్‌కో సంస్థలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. తనకు పింఛన్ ఇప్పించాలని రత్నమ్మ ఎక్కని ప్రభుత్వ కార్యాలయ గడపలేదు. కరుణించమని అడగని అధికారిలేడు. తాజాగా కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఒకటో తేదీ ఇంటి వద్దకే వచ్చి నీకు పింఛన్ ఇస్తారు అని అధికారులు భరోసా ఇచ్చారు. కానీ రత్నమ్మకు ఒకటో తేదీన భరోసా అందలేదు. రెండేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ అందలేదు ఈయన పేరు షణ్ముగం. నగరి మండలం కావేటిపురం దళితవాడకు చెందిన వారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు తీసేశారు. దీంతో పనులు చేయలేక పూల దుకాణంలో ఆకులు కత్తిరించే పనిచేస్తున్నాడు. వచ్చే అంతంత మాత్రం డబ్బులతో బతుకు బండిని లాగుతున్నాడు. వికలాంగ పెన్షన్ కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కొత్తగా పెన్షన్ మంజూరైందని అధికారులు చెబుతున్నా నేటి వరకు పెన్షన్ ఇతనికి అందలేదు. జీవనాధారం లేకుండా పోయింది ఈమె పేరు అమరజ్యోతి. గుడిపాల మండలం వసంతాపురం గ్రామం. ఈమె భర్త రెండున్నరేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి పింఛన్‌కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా రాలేదు. ఆమె భర్త గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదించి కుటుంబపోషణ చూసుకునే వాడు. ప్రస్తుతం ఆయన లేకపోవడంతో జీవనాధారం లేకుండా పోయింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబర్ 1వ తేదీన పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎంతో ఆశ పడింది. కొత్త పింఛన్లు ఇవ్వలేదు. వెంటనే ఇచ్చే విధంగా చూస్తే బాగుంటుందని ఆమె పేర్కొంది. ఒకటో తేదీన పింఛన్ ఇస్తారని అభాగ్యుల ఆశలు జిల్లాలో కొత్త ఫించన్ల వివరాలు కేటగిరీ దరఖాస్తులు తిరస్కరణ వృద్ధులు 23,793 4,218 వితంతువులు 8,804 1576 దివ్యాంగులు 7,129 971 డప్పు కళాకారులు 3,816 311 చర్మకారులు 524 78 ఒంటరి మహిళలు 327 73 కళ్లు గీత కార్మికులు 127 33 చేనేత కార్మికులు 141 129 మత్స్యకారులు 77 34 ట్రాన్స్జెండర్లు 11 2 -
విహార యాత్రనా.. వినోద యాత్రా..?
పూతలపట్టు(యాదమరి): చదువుల తల్లి ఒడిలో నిశ్చింతగా గడపాల్సిన విద్యార్థులను ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఘాట్ రోడ్లు, లోయలతో కూడిన ప్రమాదకర ప్రాంతాలకు తీసుకెళ్లడం పూతలపట్టులో కలకలం రేపుతోంది. స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కొందరు ఉపాధ్యాయుల అత్యుత్సాహం ఆ విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నింపింది. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతులు తీసుకోకుండానే మంగళవారం తొమ్మిది, పదో తరగతికి చెందిన 60 మంది విద్యార్థులను ఊటీకి విహారయాత్రకు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విద్యాశాఖ అనుమతితో పాటు, రూట్‌మ్యాప్, విద్యార్థుల భద్రతపై హామీ పత్రం తప్పనిసరి. విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ఉపయోగపడే ఏ సైన్స్ సెంటర్లకో అనుమతులు ఇస్తారు. పూతలపట్టు జెడ్పీ హైస్కూల్ టీచర్లు ఈ నియమాలను తుంగలో తొక్కారు. గుట్టుచప్పుడు కాకుండా ఊటీకి తీసుకెళ్లారు. ప్రస్తుత అక్కడి వాతావరణం, ప్రమాదకర లోయల గురించి వింటున్న తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి మరీ.. ఈ యాత్ర వెనుక బలవంతపు వసూళ్ల పర్వం నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఊటీ వెళ్లడానికి ఒక్కొక్కరు రూ.3 వేలు కట్టాలని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో పిల్లలు ఇళ్లలో తల్లిదండ్రులను పీడించారు. పిల్లల మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని ఆర్థిక స్థోమత లేకపోయినా చాలా మంది అప్పు చేసి రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఇచ్చి పింపించినట్టు సమాచారం. ఈ నిబంధనల ఉల్లంఘన వ్యవహారం బయటకు పొక్కడంతో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఒక్కోలా వివరణ ఇచ్చారు. స్కూల్లోని ఒక ఉపాధ్యాయుడి ఒత్తిడి భరించలేకే తాము ఈ యాత్రకు ఒప్పుకోవాల్సి వచ్చిందని కొందరు ఉపాధ్యాయులు అంతర్గతంగా లబోదిబోమంటున్నారు. మరికొందరు మాత్రం మేమేం బలవంతం చేయలేదు, పిల్లలే ఊటీ చూడాలని పట్టుబట్టారు, వారి కోరిక మేరకే తీసుకెళ్లాం అంటూ తప్పును విద్యార్థుల పైకి నెట్టేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఈ అంశంపై డీఈఓ లక్ష్మీనారాయణను వివరణ కోరగా యాత్రకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నేడు స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రకటించింది. జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో కలెక్టర్ సుమిత్‌కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొని సంబంధింత శాఖల అధికారులకు అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో 5, జిల్లా స్థాయిలో 64 అవార్డులు ఇవ్వనున్నారు. జిల్లాలోని ఈ అవార్డులను స్వచ్ఛ మున్సిపాలిటీలు, పంచాయతీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, రైతు బజార్లు, బస్ స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, పరిశ్రమలు, హాస్టళ్ల సిబ్బందికి అందజేయనున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రూ.10.50 లక్షల విరాళం చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనకు చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య సభ్యులు, ఒక యువకుడు రూ.10.50 లక్షల విరాళం అందజేశారు. వారు గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీని కలిసి చెక్కులు అందజేశారు. అదే విధంగా తవణంపల్లి మండలం గొల్లపల్లికి చెందిన గుర్రం వెంకటసిద్ధార్థ అనే యువకుడు తనవంతుగా ఆస్పత్రికి రూ.50 వేల విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలోని ప్రసూతి, ఆర్థోపెడిక్ విభాగాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ముందుకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి ఆర్థిక సాయం ప్రకటించిన చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులను, దాత వెంకటసిద్ధార్థను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాల్లోకి మరిన్ని పరిశ్రమల ప్రతినిధులు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండ్ల పరిశ్రమల ప్రతినిధులు రఘురాం చౌదరి, కట్టమంచి బాబి, సిద్ధార్థ్, మనోహర్, సుదర్శన్, చంద్రమోహన్, ఈశ్వర్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
జీవవైవిధ్యానికి గ్రహణం
చిత్తూరు కార్పొరేషన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట వేటగాళ్లు ఉచ్చు బిగించి మూగజీవాల ప్రాణాలను తోడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జాతులు పూర్తిగా కనుమరుగు కాగా, మరికొన్ని అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జంతువులను ప్రతిఒక్కరూ ఆదరించాలని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. 1.75 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం చిత్తూరు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ముఖ్యంగా పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, గుడిపాల, పెనుమూరు, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి. వీటిలో సింహాలు మినహా అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ప్రధానంగా ఏనుగులు, హైనాలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, దేవాంగపిల్లి, దుప్పి, తోడేళ్లు, నక్కలు, అడవి కుందేళ్లు, పావురాలు, కోళ్లు, కొండచిలువలు, అటవిపిల్లి, వేటకుక్కలు, తాచుపాము, నీళ్లపాము, తాబేలు వంటి 50 రకాల జాతుల జంతువులు ఉన్నట్లు అటవీశాఖ అఽధికారులు గుర్తించారు. 357.62 చదరపు కిలోమీటర్ల కౌండిన్య కౌండిన్య అభయారణ్యం 357.62 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు రేంజ్‌లను కలిపి రాయల్ ఎలిఫెంట్ రేంజ్‌గా పిలుస్తారు. కుప్పం రేంజ్ నుంచి పలమనేరు వరకు కౌండిన్య అటవీ ప్రాంతంలో వన్యప్రాణి జంతువులు ఎక్కువగా ఉన్నట్లు అదికారులు గుర్తించారు. 2018లో జంతు గణన చేపట్టి జంతువుల కదలికలను గుర్తించారు. ఆ తర్వాత 2022 జనవరిలోనూ మరోసారి జంతుగణన చేపట్టారు. ఇక్కడ ఏనుగులతోపాటు ఇతర జంతువులు కూడా ఉన్నట్టు గుర్తించారు. వాటి సంరక్షణ కోసం బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక గస్తీ చేపట్టారు. కౌండిన్య అటవీ ప్రాంతంపచ్చటి చెట్ల నీడన ప్రశాంతంగా విహరించాల్సిన మూగజీవాల గుండెల్లో తూటాల భయం నిద్రపోనివ్వడం లేదు. ప్రభుత్వాలు కోట్లు కుమ్మరించి రక్షణ ప్రణాళికలు రచిస్తున్నా, అటవీ సరిహద్దుల్లో నిఘా కళ్లు కప్పి వేటగాళ్లు ఉచ్చు బిగిస్తూనే ఉన్నారు. ఒకవైపు అరుదైన వన్యప్రాణి జాతులు అంతరించిపోతుండగా, మరోవైపు ఉన్నవాటి సంఖ్య రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలిసన బాధ్యతను గుర్తు చేస్తూ నేటి నుంచి వన్యప్రాణుల వారోత్సవాలు మొదలవుతున్న వేళ.. ఈ వేడుకలు ప్రచార ఆర్భాటానికే పరిమితం కాకుండా మూగ జీవాల ప్రాణాలకు నిజమైన రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంరక్షిద్దాం అరణ్యంలో జీవించే వన్యప్రాణులకు మనుషులంటే భయం. వన్యప్రాణుల సంరక్షణ కోసం చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఏటా మూగ జీవాల్ని వేటాడటం మానడం లేదు. ఇక ఆహారం కోసం దారి తప్పి వస్తున్న జంతువులు విద్యుత్ షాక్‌తోపాటు ప్రమాదాలకు లోనై మరణిస్తున్నాయి. అడవి ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా నడపడం అలవాటు చేసుకోవాలి. రోడ్డు దాటుతున్న జంతువులను రెచ్చగొట్టడం, శబ్దాలు చేస్తూ వాటి పైకి వాహనాలు పొనివ్వడం కూడా అటవీ జంతువుల ప్రాణాలకు ప్రమాదంలో పడేస్తున్నాయి. జంతువులను ప్రేమించి వాటి సంరక్షణపై కనీస అవగాహన ఉంటే తప్ప అడవుల్లోని జీవజాతుల్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు. వేటగాళ్ల స్వార్థానికి అంతరించిపోతున్న వన్యప్రాణులు -
ప్రజాధనం దుర్వినియోగం
ప్రచారానికి ప్రజా ధనంచిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబు తన ప్రచారానికి ప్రజా ధనాన్నియథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని మాజీ వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తాము ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సేవలు అందిస్తుంటే తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబడుతున్నారు. రాత్రింబవళ్లు కష్టపడిన తమకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తేనే ప్రజాధనం వృథా చేస్తున్నారని గగ్గోలు పెట్టారని, ఇప్పుడేమో ప్రజాధనాన్ని ఇలా ప్రచారానికి వాడుకోవడం ఎక్కడి న్యాయమని మండిపడుతున్నారు.నీతి, మతిలేని చర్య ప్రజలకు విశేష సేవలు అందించిన వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల పొట్టకొట్టారు. లక్షలాది మందిని వీధుల పాలు చేశారు. ఇంటి ముంగిటే అందుతున్న సేవను సైతం దూరం చేశారు. నేడు కంటెంట్ క్రియేటర్ల పేరుతో ప్రభుత్వం ప్రచారం కోసం ప్రజాధనాన్ని దోచి పెట్టడం నీతి, మతి లేని చర్య. – జాకీర్, మాజీ వలంటీర్, చిత్తూరు కరోనా సమయంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సేవలు అందించారు. వేకువజామునే గడపగడపకూ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచింది. రూ.5 వేల గౌరవ వేతనంతోనే ప్రజాధనం దుర్వినియోగమైందని విమర్శించిన ఈ పాలకులు ఇప్పుడు సొంత డబ్బా కొట్టుకునేందుకు రూ.లక్షలు చెల్లిస్తామని జీవో విడుదల చేశారు. ఇది కాదా దుర్వినియోగం. – సుస్మిత్, మాజీ వలంటీర్, చిత్తూరు -
బడి ఎన్నికలు ఏకపక్షం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత, వివాదాల నడుమ ఏకపక్షంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతల జోక్యం మితిమీరడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మంగళవారం జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా మండల విద్యాశాఖ అధికారులు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకే బీఎన్‌ఆర్‌పేట పాఠశాల ప్రాంగణాన్ని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ముట్టడించాయి. ఎన్నికలను ఏకపక్షంగా తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నాయకులు వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కొందరు నేతలు పాఠశాల హెచ్ఎం గదిలోనే కాపు కాయడం, మరికొందరు ప్రాంగణమంతా మోహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక ఉపాధ్యాయుడిపై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. చేయి ఎత్తకున్నా లెక్కల్లోకి.. ఓటింగ్ సమయంలో ఉపాధ్యాయులు సైతం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభలో కొందరు సభ్యులు చేయి ఎత్తకపోయినప్పటికీ, వారు కూడా మద్దతు తెలిపినట్లే లెక్కలు రాసేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఎన్నికల రగడతో పాఠశాల వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్తగా 10 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. -
రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ పోటీలకు ఎంపిక
నగరి: స్థానిక డిగ్రీ కళాశాల కేవీకే స్టేడియంలో గురువారం 70వ ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి అండర్–17, అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఎంపికకు పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికై న క్రీడాకారులకు అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీలు ఎస్ఎం.లోకనాథం, త్రిలోకసుందరి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 10వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంఈవో 2 నమశ్శివాయం, పీసీఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెక్స్, అధ్యాపకులు వాసు, జిల్లా సెపక్తాకర కార్యదర్శి శరత్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు మణి, ప్రకాష్ తదితరులు క్రీడాకారులను అభినందించారు. -
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు 30 మంది ఎంపిక
నగరి: స్థానిక డిగ్రీ కళాశాల కేవీకే స్టేడియంలో బుధవారం జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీలు ఎస్ఎం.లోకనాథం, త్రిలోకసుందరి ఆధ్వర్యంలో అండర్–17, అండర్–19 బాలుర జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. వారిలో 30 మందిని ఎంపిక చేశారు. వారికి అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 10వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. పీసీఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెక్స్, అధ్యాపకులు వాసు, చిత్తూరు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు దేవానంద్, వ్యాయామ ఉపాధ్యాయులు శరత్, మణి, రాజా, దాము, ప్రకాష్, తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై వేధింపుల పర్వం సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ సీపీ శ్రేణులను వేధించి, భయబ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కొన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. చిత్తూరు నగరానికి చెందిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చక్రవర్తికి చెందిన మెడికల్ షాపుపై బుధవారం ఈగల్ బృందంలోని అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కలిసి దాడులు చేశారు. నగరంలో వందలాది దుకాణాలు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోనే వైఎస్సార్ సీపీకి చెందిన నేతల దుకాణాల్లో దాడులు చేస్తున్నారని చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో క్రియాశీలకంగా ఉన్న తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చేయని నేరానికి గతంలో కూడా చక్రవర్తిని తప్పుడు కేసులో రెండు నెలల పాటు జైల్లో ఉంచారని ఆరోపించారు. ఇటీవల విజయానందరెడ్డిపై ఏఐ వీడియోలు సృష్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారని, దీన్ని ప్రతిఘటిస్తూ కౌంటర్ పోస్టులు పెడుతుండడంతోనే ఈ దాడులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులను దించేసిన కండక్టర్ గుడిపాల: గుడిపాలలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు చిత్తూరు రెండో డిపో బస్సులో 10 మంది విద్యార్థులు, ఐదుగురు ప్రయాణికులు ఎక్కారు. అరకిలోమీటర్ వెళ్లిన తర్వాత టికెట్లు కొట్టే మెషిన్ పనిచేయలేదంటూ కండక్టర్ 15 మందిని దింపేశారు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది టికెట్ మెషిన్ పనిచేయకపోతే ప్రత్యామ్నాయంగా టికెట్లు ఇవ్వాలని కోరగా వారు స్పందించలేదు. మెషిన్ ఎందుకు పనిచేయలేదని అడగ్గా సరైన సమాధానం చెప్పకుండానే కిందకు దించేశారు. ఆర్టీసీ సిబ్బంది పనితీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జింగ్ లేకపోవడంతోనే ఇలా అయ్యిందని అర్టీసీ వర్గాలు తెలిపాయి. టికెట్ల మిషన్‌ను కూడా చార్జింగ్ పెట్టుకోలేనంత నిర్లక్ష్యం ఉండడంతో ప్రయాణికులను వేధించడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజల సొమ్ముతో పచ్చ భజన!
●సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. కూటమి ప్రచారానికి డప్పు కొట్టండి డబ్బులిస్తామంటూ ప్రకటించడంపై నిరుద్యోగ యువతలో ఆగ్రహం వెల్లుబుకుతోంది. వైఎస్సార్ సీపీ పాలనలో రాత్రింబవళ్లు కష్టపడిన సచివాలయ వలంటీర్లకు రూ.5 వేలు గౌరవ భృతి ఇస్తేనే ప్రజాధనం వృథా చేస్తున్నారని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో ప్రజాధనాన్ని ఇలా ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రజలు మండిపడుతున్నారు. ఎవడబ్బ సొమ్మని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలకు లక్షలు ఇస్తామంటున్నారని పెదవి విరుస్తున్నారు. – చిత్తూరు కలెక్టరేట్మహిళలకు ఎగనామం ఎన్నికల్లో మహిళలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ వరాల జల్లు కురిపించారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఆడబిడ్డ నిధి జాడ లేదు. ఒక పక్క అన్ని ఖర్చులూ పెరిగిపోతోంది. మహిళలకు ఇచ్చేందుకు లేని నిధులు ఇన్ఫ్లుయన్సర్స్ పాలసీ అని డప్పు కొట్టే బ్యాచ్‌కు ఇస్తామంటున్నారు. ఇదేనా మహిళలకు మంచి చేసే పాలన. ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు ఇస్తే ఆర్ధిక భారం పడదా? ఆదాయం సృష్టించడమంటే ఇదేనా? – కె.కవిత, దిగువ కావేటిపురం, నగరి మండలంఉపాధి అవకాశాలు ఏవి? ఏటా జాబ్ క్యాలెండర్, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే మార్గం చూపకుండా, పార్టీ కోసం డప్పు కొడితే డబ్బులు ఇస్తామనడం నిరుద్యోగులను గేలి చేయడమే. ఎవడబ్బ సొమ్మని ప్రజాధనాన్ని సోషల్ మీడియాలో డప్పు కొట్టేవారికి తగలేస్తున్నారు? సొంత పార్టీ ప్రచారానికి ప్రభుత్వ ఖజానాను వాడుకోవడం దుర్మార్గం. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టకుండా, యువతను ప్రచార కార్యకర్తలుగా మార్చాలని చూడటం సరికాదు. – రంజిత్, నిరుద్యోగివలంటీర్లను నడిరోడ్డుపై నిలబెట్టారు ‘గతంలో మేము కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రామీణ స్థాయిలో సేవలు అందించాం. నాడు మాకు ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనాన్ని ప్రజాధనం వృథా అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి మమ్మల్ని నడిరోడ్డులోకి తోసేశారు. ప్రజలకు సేవ చేసిన మాకు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, పార్టీ ప్రచారం చేసుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ధారాదత్తం చేయడానికి డబ్బులు ఉన్నాయా? ఇది ప్రజలను, సేవా దృక్ఫథాన్ని దారుణంగా అవమానించడమే. – అబ్దుల్లా, మాజీ వలంటీర్ -
స్కూల్ కమిటీ చైర్మన్ మాకొద్దు
వి.కోట: స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికై న చైర్మన్‌ను కొనసాగించకూడదని యాలకల్లు పంచాయతీ ఎర్రినాగేపల్లికి చెందిన గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు బుధవారం ఎర్రినాగేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారు మాట్లాడుతూ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో అవకవతకవలు జరిగాయన్నారు. కమిటీ చైర్మన్‌గా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎన్నుకున్నారని, దీనిపై తాము అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేిశారు. లేనిపక్షంలో తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయాలన్నారు. ఈ విషయంగా పాఠాశాల వద్ద కొంత సేపు ఉద్రిక్త వాతవరణం నెలకొంది. సమస్యకు అధికారులు తగిన పరిష్కారం చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నిబంధనలకు నీళ్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు నగరపాలక సంస్థలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా పారిశుద్ధ్య కార్మికుల వైద్య శిబిరం ప్రోటోకాల్ రచ్చకు నిలయంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అండదండలతో అధికార పక్షానికి చెందిన మాజీ మేయర్ ఆముద, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డిలను వేదికపై ఆశీనులను చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను అధికారులు మట్టిలో కలపడంపై స్థానికులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల హోదా లేని మాజీలకు అగ్ర స్థానం ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదవులు లేకపోయినా వేదికపైకి చేరేలా అధికారులే సహకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియమ నిబంధనలను పక్కనబెట్టి, ప్రొటోకాల్‌ను గాలికి వదిలేసిన అధికారుల వైఖరిపై విమర్శల పరంపర కొనసాగుతోంది. -
గుడిపాలలో పిడుగుల వర్షం
గుడిపాల: గుడిపాలలో బుధవారం సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో మండలంలోని శ్రీరంగంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక తాటిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. దీన్ని స్ధానికంగా ఉన్న యువకులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఉద్యానం అభివృద్ధిపై నేడు డ్రోన్ షో తిరుపతి అర్బన్: రాయలసీమ ఉద్యాన సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో డ్రోన్ షో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
కల్పవృక్షంపై గణాధిపుడు
కాణిపాకం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. విశేష అభిషేకాలు, దివ్య అర్చనలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం పట్టుపీతాంబరాలు, పరిమళభరిత సుగంధ పుష్ప మాలికలు, అమూల్యమైన ఆభరణాలతో స్వామివారిని దివ్యంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారిని కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. అంగరంగ వైభవంగా ఊరేగింపు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మంగళ వాయిద్యాలు, తబలా భజనలు, కోలాటాలు, కళాకారుల వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ కల్పవృక్ష వాహన సేవ ప్రారంభమైంది. స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు పట్టారు. -
సహిత విద్య బలోపేతమే లక్ష్యం
● అందరూ ప్రశస్త్ యాప్‌ను వినియోగించాలి ● సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సహిత విద్యను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈవోల)కు సహిత విద్యపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. నాలుగు రకాల అలవెన్సుల రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఆటిజం ఉన్న విద్యార్థులకు జిల్లాలో ప్రత్యేకంగా ఐదు ఆటిజం సెంటర్లను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సమగ్ర శిక్ష శాఖ అందిస్తున్న విభిన్న సేవలను అర్హులైన దివ్యాంగ విద్యార్థులందరూ వినియోగించుకునేలా ఎంఈవోలు చొరవ చూపాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 100 శాతం ప్రశస్త్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులోని ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రస్థాయి పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆరుగురు దివ్యాంగ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వారిని ప్రోత్సహిస్తూ ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డీవైఈవోలు ఉమామహేశ్వర్, ఇందిర, సహిత విద్య కోఆర్డినేటర్ మధు, ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి హేమాద్రి, ఎంఈవోలు పాల్గొన్నారు. -
పల్లె జీవనాడిపై మట్టి వేటు!
కూర్నిపల్లి చెరువులో చేపట్టిన తవ్వకాలు అగ్రహారం చెరువు దుస్థితి పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని చెరువుల్లోని మట్టిని కొందరు జేసీబీలతో యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. ఇప్పటికే సగానికి పైగా చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వడంతో అధ్వానంగా మారిపోయాయి. ఆ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లు, బిల్డింగ్లు, భూముల లెవలింగ్‌కు తరలిస్తున్నారు. నిర్ణయించిన మేర ఆ ప్రాంతంలోని పచ్చనేతలకు నగదు ముట్టజెప్పుతుండడంతో అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పది చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు పలమనేరు నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు వందకు పైగా ఉండగా చిన్నపాటి చెరువులు, కుంటలు 500 వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని చోట్లా మట్టి మాఫియా తవ్వకాలు చేస్తూనే ఉంది. పలమనేరు మండలంలోని బేలుపల్లి, టీఎస్ అగ్రహారం, కూర్మాయి, జల్లిపేట, కొత్తకుంట, బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి, గంగవరం మండలంలోని పది చెరువుల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఏం జరిగినా నో యాక్షన్ సాధారణంగా చెరువుల్లో మట్టిని తవ్వాలంటే సంబందిత పంచాయతీ అధికారుల ద్వారా అనుమతులు పొందాలి. అధికారులు సూచించిన మేరకు మట్టిని తవ్వుకోవాలి. ఇక మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబందించి మొత్తం అజమాయిషీ ఇరిగేషన్ అధికారుదే. పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల నుంచి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికారుల కళ్లముందే చెరువుల్లో జేసీబీలతో ఇష్టానుసారంగా తోడేస్తున్నా ఎవరూ అడ్డు చెప్పడంలేదు. అధికారపార్టీ నేతలు లోడు మట్టికి, ట్రాక్టర్‌కు ఇంత అని నిర్ణయించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. దీనిపై స్థానిక ఇరిగేషన్ డీఈ నాయక్ స్పందిస్తారునుకుంటే ఆయన ఇప్పటికే అధికారపార్టీ నేతలకు ఏజెంట్లా మారాడనే ఆరోపనులున్నాయి. జిల్లా స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చని పచ్చనేతలు నిరూపిస్తున్నారు. ప్రకృతి వనరులను తమ సొంత వనరుల్లా దోచుకుని దండుకుంటున్నారు. చెరువుల్లో మట్టి తవ్వకాలకు సొంతంగా అనుమతులు ఇస్తూ లోడుకు ఇంత అని వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు -
జోరుగా జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు
వడమాలపేట (పుత్తూరు) : వడమాలపేట పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్లో బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్– 17, 19 బాల బాలికల ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టును ఎంపిక చేశారు. అండర్–19 బాలుర విభా గంలో దుర్గాప్రసాద్, భువనేష్ (చంద్రగిరి), మణి, చరణ్‌తేజ (మంగళం ట్రెండ్స్), వినయ్‌కుమార్ (సదుం), యోగేశ్వర, శ్రావణ్ కుమార్, హర్షవర్ధన్ (వడమాలపేట), అండర్–19 బాలికల విభాగంలో నాగమ్మ(శ్రీకాళహస్తి), గీతిక, రేణుక (పాపానాయుడుపేట), మోహనప్రియ (పుత్తూరు), హేమనిధి, అనిత, మానస, సేదన (తిరు పతి), అండర్–17 బాలుర విభాగంలో సత్య(మంగళం) చైతన్య, సంతోష్‌కుమార్ (చంద్రగిరి), గౌతమ్, దినేష్ కుమార్, శశివర్ధన్ (తిరుపతి), అబ్దుల్‌ఖాదర్ (గేట్ పుత్తూరు), బాలు(వడమాలపేట), అండర్–17 బాలికల విభాగంలో యామిని, లతిక(పాపానాయుడుపేట), అనిషా, గగనశ్రీ (తిరుపతి), శ్రావణి, అన్నపూర్ణ (వడ మాలపేట), మోక్షిత (మంగళం ట్రెండ్స్), దివ్యశ్రీ (పుత్తూరు) ఎంపికయ్యారు. పాఠశాల హెచ్ఎం కరుణానవనీతం, ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ లోకనాథం, తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సాంబశివరావు, అమ్ములు, పీఈటీలు ప్రభాకర్, సురేష్, శంషుద్దీన్, పుష్ప వాణి, ప్రసన్న లక్ష్మి, కిరణ్మయి పాల్గొన్నారు. -
అక్రమాలపై విచారణకు సిద్ధమా?
పాలసముద్రం : ‘‘మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 1.50 లక్షల గ్రామ సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రాలేదు. మెగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మౌనంగా ఉంటున్నారు. డీఎస్సీలో భర్తీ చేసిన ఉద్యోగాలు, సచివాలయాల ఉద్యోగాలపై సీబీఐ విచారణకు సిద్ధమా’’ అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. ఆయన బుధవారం పాలసముద్రంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఆనాడు ఒక్క విమర్శ కూడా రాలేదని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను 2019 జూలై నుంచి సెప్టెంబర్ వరకు అంత్యంత పకడ్బందీగా చేపట్టామని పేర్కొన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సంద్భంగా కులం, మతం, పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు ఇచ్చి అధికారకంగా పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. అలాంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు శాంతియుతంగా చేపట్టిన ధర్నాపై పోలీసులతో లాఠీ చార్జీ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లడం బాధాకరమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధంగా గళం విప్పిన ఉద్యోగులను అణచివేయడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీలో 3,437 మందికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు ఇస్తే అందులో 801 మందికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. మోగా డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరినట్లు సీబీఐ విచారణకు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. -
రైల్వేస్టేషన్లో పనిచేయని సర్వర్
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్లో సర్వర్ మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజర్వేషన్ కౌంటర్ సిస్టం సమస్య వల్ల టికెట్లు జారీని నిలిపివేసినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పదుల సంఖ్యలో ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వచ్చి సర్వర్ సమస్య అని తెలియడంతో వెనుతిరుగుతున్నారు. గాంధీ జయంతి, తదుపరి సెలవు రోజులు, దసరా సందర్భంగా పలువురు రిజర్వేషన్ చేసుకోవడానికి స్టేషన్‌కు వచ్చారు. సర్వర్ సమస్యతో టికెట్లు జారీ చేయలేమని సిబ్బంది చెప్పడంతో అసహనంతో వెనుతిరుగుతున్నారు. రిజర్వేషన్ కౌంటర్ వద్ద సిస్టం ఫెయిల్యూర్ అనే బోర్డును ఏర్పాటు చేశారు. -
రెచ్చగొట్టినా స్పందించొద్దు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ నాయకులు, మహిళల మీద కూటమి నాయకులు, కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా కొంతమంది టీడీపీ నాయకులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఏఐ ద్వారా పోస్టులను సృష్టించి ఫేక్ అకౌంట్స్ ద్వారా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తాము శాంతిభద్రతలకు సహకరిస్తామని స్పష్టం చేశారు. కూటమి నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో ప్రణాళికాబద్దంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఎంతకాలమూ ఓపికగా ఉండలేమని పేర్కొన్నారు. అసభ్య పోస్టులను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌లో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై చర్చ జరగాలని, ఏదో ఒక వంకతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఇటువంటి సంప్రదాయం గతంలో ఎప్పుడూ లేదన్నారు. వారు ఎలాంటి పోస్టులు పెట్టినా పట్టించుకోవద్దని, వాటిని వారి విజ్ఞతకే వదిలేయాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. -
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పలువురు భక్తులు బుధవారం ఆందోళనకు దిగారు. తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అయితే ఈ విషయం తెలియక 1వ తేదీ గురువారం దర్శన.ం కోసం పలువురు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సిఫార్సు లేఖలు సమర్పించేందుకు ప్రయత్నించగా అధికారులు నిరాకరించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు అడిషనల్ ఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సిఫార్సు లేఖలు స్వీకరించాలని నినాదాలు చేశారు. అధికారులు భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. -
ప్రాంతీయ వనరులే కీలకం
తిరుపతి అర్బన్ : ఆర్థికాభివృద్ధికి ప్రాంతీయ వనరులే కీలకమని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్లో విజన్–2047 సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లు పాల్గొన్నారు. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ తిరుపతి ఎకనామిక్ రీజియన్‌్ లోని తొమ్మిది జిల్లాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 34 శాతం వాటా మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో రీజియన్ ఆర్థిక వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించాలని సూచించారు. అందుబాటులో ఉన్న భూమి, భవిష్యత్ అవసరాలకు కావాల్సిన ల్యాండ్, పెట్టుబడి అవసరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి వనరులను అనుసంధానం చేస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక అడ్వైజరీ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి ప్రధాన ఆర్థిక, పర్యాటక కేంద్రంగా ఉందని, ఈ ప్రాంత అభివద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. తిరుపతికి వచ్చే భక్తులు సగటున సుమారు 18 గంటలు మాత్రమే జిల్లాలో గడుపుతున్నారని, ఈ సమయాన్ని 36 నుంచి 48 గంటలకు పెంచే విధంగా సదుపాయాలను అభివద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలను పరిపాలనా పరంగా మూడు వేర్వేరు జిల్లాలుగా ఉన్నప్పటికీ, అభివద్ధి పరంగా ఒకే ప్రాంతంగా భావించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సుమారు 2వేల నుంచి 2,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జేసీ గోవింద రావు, డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. -
16 మంది మందుబాబుల అరెస్టు
శాంతిపురం: మండలంలోని రాళ్లబూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 16 మందిని అరెస్టు చేసి కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచినట్టు ఎస్ఐ ఐ.నరేష్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించి పట్టుకున్నామని పేర్కొన్నారు. న్యాయస్థానం వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్టు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టపగలే చోరీ పలమనేరు: పలమనేరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. మదనపల్లి రోడ్డులో జనసందోహం ఎక్కువగా ఉండే కోటక్ మహేంద్ర బ్యాంకు ముందు ఆపిన పాలక్యాన్ల ద్విచక్రవాహనం బుధవారం చోరీకి గురైంది. బాధితుడు తన వాహనం కనిపించలేదని లబోదిబోమంటుండగా అక్కడి సీసీ కెమెరాను కొందరు పరిశీలించారు. భిక్షాటన చేసుకునే వేషంలో ఉన్న వ్యక్తి ఏమాత్రం అనుమానం రాకుండా ఆ బండిని చోరీ చేసి నడుపుకుంటూ వెళ్లడం కనిపించింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒంటైపె సవారి యాదమరి: మండల కేంద్రమైన యాదమరిలో బుధవారం ఒక ఒంటె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో ఒంటెలు ఎక్కువగా ఉంటాయి. ఒక ఒంటెను యాదమరిలోకి తీసుకువచ్చారు. దీన్ని చూసేందుకు స్థానికులు, చిన్న పిల్లలు ఉత్సాహం చూపారు. చాలా మంది ఒంటెతో కలసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కొంతమంది తల్లిదండ్రులు నిర్వాహకులకు నిర్ణీత రుసుము చెల్లించి తమ చిన్నారులను ఒంటైపె కూర్చోబెట్టి సవారి చేయించి మురిసిపోయారు. ఒంటైపె స్వయంగా తాము సవారి చేయడంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి పెద్దపంజాణి: మండలంలోని పుంగనూరు–బైరెడ్డిపల్లి మార్గంలోని కత్తార్లపల్లి క్రాస్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పెద్దపంజాణి హెడ్‌కానిస్టేబుల్ శంకర్ నాయక్ కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ తాలూకా భద్రావతికి చెందిన గంగప్ప కుమారుడు బి.సుందర్(44) ప్రస్తుతం వాయల్పాడు మండలం నగిరిమడుగు పంచాయతీ పాతకోటపల్లిలో కాపురం ఉంటున్నాడు. మంగళవారం పెద్దపంజాణి మండలంలోని చిన్నవెలగటూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. పనులు చూసుకుని తిరిగి బయలుదేరాడు. మార్గమధ్యంలోని కత్తార్లపల్లి క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కిడికక్కడే మృతి చెందాడు. స్థాని కుల సమాచారంతో హెచ్‌సీ శంకర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మురకంబట్టులో గంజాయి స్వాధీనం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగర పరిధిలోని మురకంబట్టు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి దందాను బుధవారం తాలూకా పోలీసులు గుట్టురట్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు టౌన్ తోటపాళ్యానికి చెందిన వై.జయకుమార్ (27), సత్తువాచారికి చెందిన మహమ్మద్ ఆలీ (27) కూలి పనులు చేస్తూ గంజాయి అక్రమ రవాణాకు అలవాటు పడ్డారు. పూతలపట్టు మండలం బండపల్లి నుంచి 600 గ్రాముల గంజాయి తీసుకొస్తుండగా ముందుగా అందిన పక్కా సమాచారంతో తాలూకా ఎస్ఐ అశోక్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అరెస్టు చూపించారు. -
యువతతోనే దేశ భవిష్యత్తు
చిత్తూరు కలెక్టరేట్ : యువత దేశ భవిష్యత్తుకు కీలకమైన శక్తులని సెట్విన్ సీఈవో యశ్వంత్ తెలిపారు. చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి 15 నుంచి 29 ఏళ్లలోపున్న యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద నృత్యం, గీతాలు, పెయింటింగ్, కవితా రచన, నుక్కడ్ నాటక్ (వీధి నాటకాలు) తదితర పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సెట్విన్ సీఈవో యశ్వంత్ మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, కళలు, సామాజిక బాధ్యతల్లో యువత ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. యువత తమ నైపుణ్యాలను సమాజాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేనేజర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన వేదిక కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. పోటీల్లో పాల్గొనడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి మాట్లాడుతూ యువత పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో రాణించేలా ఆసక్తి చూపించాలన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన యువతకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారిణి లక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ రబ్బానిబాషా, మైభారత్ సూపర్వైజర్ శ్రీనివాసులు, విజయం ఇంజినీరింగ్ కళాశాల ఏవో రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
చెస్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) వారు మంగళవారం తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–17, 19 బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరచిన బాలబాలికల్లో మొత్తం 20 మందిని జిల్లా జట్లుకు, అలాగే మరికొందరిని స్టాండ్ బై కింద ఎంపిక చేశారు. వీరు అక్టోబరు 1, 2వ తేదీల్లో ఏలూరు జిల్లా, పెదవేగి గురుకుల పాఠశాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ చెస్ పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు తెలిపారు. కార్యక్రమంలో చెస్ కోచ్‌లు శివకేశవ, ఆనంద్, వేణు, పీఈటీలు సుబ్రమణ్యంరెడ్డి, కేశవులు, వెంకటేష్, రెడ్డి రాధిక, గోపి, మణి, మురళి పాల్గొన్నారు. -
రీసర్వేలో యథేచ్ఛగా అక్రమాలు
పాలసముద్రం మండలం శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో చేపట్టిన రీసర్వేలో అక్రమాలపై రైతులు మండిపడుతున్నారు.సమష్టి కృషితో బాలల హక్కుల రక్షణ చిత్తూరు కలెక్టరేట్ : బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ ఒకే లక్ష్యంతో, సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు వెంకట పద్మలత, డీఆర్ఓ మోహన్ కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. బాలల సంక్షేమం కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యత మాత్రమే కాదన్నారు. అన్ని శాఖలకూ ఇందులో సమాన భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో జిల్లా ఉండడం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్రియాశీలకంగా మారాలని స్పష్టం చేశారు. 0–18 ఏళ్ల పిల్లల సమాచారం, బడి మానేసిన వారి వివరాలు, బాల్య వివాహాల యత్నాలు, బాల కార్మికుల స్థితిగతులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్ సుమిత్ కుమార్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. డీఆర్వో మోహన్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలనూ సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను హాస్టళ్ల అభివృద్ధికి వినియోగిస్తున్నామని వివరించారు. -
ఇది ఆర్థిక భారం కాదా..?
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర వేశాం. రేషన్ కార్డుల నుంచి పింఛన్ల వరకు ఇంటింటికీ పంపిణీ చేశాం. అన్ని సమస్యలకు పరిష్కారాలు చూపుతూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచాం. అలాంటి మాకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తే ఆర్థిక భారం పడుతుందని తొలగించారు. ఇప్పుడు తమ ప్రభుత్వానికి వంత పాడే సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు చంద్రబాబు తెగబడుతున్నారు. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారం కాదా..?, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తే సర్కారుపై తిరగబడుతాం. – సాయికుమార్, మాజీ వలంటీర్, కార్వేటినగరం నమ్మించి మోసం చేశారు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పుడు నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. కోవిడ్ సమయలో మా సేవలను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. అధికారులు చెప్పిన పనులన్నీ చేశాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. ఇంత పని చేసినా మాకు రూ.5వేలు ఇస్తే కూడా తృప్తిగా పనిచేశాం. అప్పట్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసిన వారు, ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వారికి రూ.లక్షలు కేటాయించడం న్యాయమా. – బాలాజీ, మాజీ వలంటీర్, బైరెడ్డిపల్లె -
తమ్ముళ్లకు పంచిపెట్టి!
పేదల పొట్టకొట్టి..మా పొట్ట కొట్టారు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. అప్పుడు మా పొట్ట కొట్టి.. ఇప్పుడు సోషల్‌మీడియా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. మేము నెలకు కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో అహర్నిశలూ ప్రజలకు సేవ చేశాం. కోవిడ్ సమయంలో అందరూ భయపడి ఇంట్లో ఉంటే, మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరిగాం. అప్పట్లో మాకు ఇచ్చే రూ.5వేలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందంటూ విషం గక్కారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు డప్పు కొట్టే టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనం పంచిపెడుతున్నా రు. ఈ విషయంలో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. – మహమ్మద్, మాజీ వలంటీర్, చిత్తూరుమహిళలను వంచించారు ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి అని ఆశ పెట్టారు. గెలిచాక మహిళల ఖాతాలకు రూపాయి కూడా వేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ రూ.1,500 చొప్పున ప్రతి నెలా ఇస్తామనే మాటలు నమ్మి ఓట్లేశాం. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆడబిడ్డ నిధి జాడే లేదు. ఇప్పుడు పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు పెరిగిపోయి కుటుంబ నిర్వహణ భారంగా మారింది. ఆడపిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు ఆసరాగా ఉంటుందనుకుంటే ఒక్క పైసా ఇవ్వడం లేదు. మ హిళలను పూర్తిగా వంచించారు. పైగా సోషల్ మీడి యా ఇన్ఫ్ల్యూన్సర్స్ పాలసీ అని నగదు దోచిపెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. – సుజాత, గృహిణి చంద్రబాబు సర్కారు వ్యవహారశైలిపై ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నగదు పంపిణీ చేయాలనుకోవడంపై మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా ఆర్థిక భారమంటూ కథలు వల్లించి.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు పప్పుబెల్లాల లెక్కన నిధులు పంచిపెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటింటికీ వెళ్లి చిత్తశుద్ధితో సేవలందించిన వలంటీర్లకు ద్రోహం చేసి.. ఇప్పుడు సొంత డబ్బా కొట్టించుకునేందుకు ప్రజాధనం ఖర్చుపెడుతుండడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ -
నేటి నుంచి క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
నగరి : పట్టణలోని కేవీకే డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎస్ఎం లోకనాథం, త్రిలోక సుందరి మాట్లాడుతూ అండర్–17, అండర్–19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు బుధవారం ఉంటాయన్నారు. బాలికల ఎంపిక పోటీలు గురువారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఆర్గనైజర్‌గా తడుకుపేట జెడ్పీహెచ్ఎస్ పీడీ ఏఆర్ మణి వ్యవహరిస్తారని తెలిపారు. అర్హత గల క్రీడాకారులు తమ ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించారు. తిరుమలకు 12 టన్నుల కూరగాయలు పలమనేరు : తిరుమలలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి పలమనేరుకు చెందిన శ్రీవారి సేవకులు 12 టన్నుల కూరగాయలను వితరణగా అందించారు. మంగళవారం ఈ మేరకు ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపించారు. దాతలను డీఎస్పీ డేగల ప్రభాకర్ అభినందించారు. పూసల రవి పాల్గొన్నారు. ఎఫ్ఏ–2 వాయిదాకు డిమాండ్ చిత్తూరు కలెక్టరేట్:జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎఫ్ఏ–2 పరీక్షలను వాయిదా వేయాలని రాయలసీమ ఉపాధ్యాయుల సంఘం (రూటా) జిల్లా అధ్యక్షుడు మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎఫ్ఏ–2 పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ 11వ తేదీ నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమవుతుందన్నారు. దీంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఆగస్ట్‌లో సైతం టెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎఫ్ఏ–2 పరీక్షలను వాయిదా వేసిందన్నారు. దీంతో ఉపాధ్యాయులు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించారని వెల్లడించారు. దసరా సెలవుల అనంతరం ఎఫ్ఏ–2 పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు సైతం సెలవుల సమయంలో సిలబస్‌ను పూర్తిగా రివిజన్ చేసుకుని బాగా సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. -
ఇదెక్కడి న్యాయం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించాం. సర్కారుకు జనాలకు వారధిగా వ్యవహరించాం. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాం. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతోనే అహర్నిశలు శ్రమించాం. అలాంటి మమ్మల్ని చంద్రబాబు నిలువునా వంచించారు. బాబు సర్కారు మోసాలు ప్రజలకు కూడా అర్థమయ్యాయి. సోషల్ మీడియాలో తమకు వంత పాడేవారికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి న్యాయం. – సుబ్రమణ్యం, మాజీ వలంటీర్, బైరెడ్డిపల్లె ఆడబిడ్డ నిధి ఆచూకీ లేదు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఊదరగొట్టారు. రెండున్నరేళ్లు గడిచినా ఆడబిడ్డ నిధి ఆచూకీ లేదు. ఆర్థిక భారం కారణంగానే ఇవ్వలేకపోతున్నామని, పేద అరుపులు అరిచారు. ఇప్పుడు తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రజల డబ్బులను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు రాష్ట్రంపై ఆర్థిక భారం పడదా.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. – దేశమ్మ, ఎంఎం విలాసం, కార్వేటినగరం -
ప్రజాధనం దుర్వినియోగం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకు కేవలం రూ. 5వేల గౌరవ వేతనంతో పనిచేశాం. అందరికీ తలలో నాలుకలా వ్యవహరించాం. కార్యాలయాల చుట్టూ ఎవరూ తిరగాల్సిన అవసరం లేకుండా మేమే వారి ఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరించచాం. ముఖ్యంగా కోవిడ్ సమయలో మా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించాం. మాకు ఇచ్చే రూ.5వేల వృథా అని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు తమ సొంత ప్రచారం కోసం సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది కాదా ప్రజాధన దుర్వినియోగం. – వినోద్, మాజీ వలంటీర్, అనంతప్పనాయుడు కండ్రిగ సొంత డబ్బా కొట్టించుకునేందుకే.. ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు మభ్యపెట్టారు. పీఠం ఎక్కిన తర్వాత వలంటీర్ వ్యవస్థనే తీసేశారు. వారికి ఇచ్చే సొమ్ము వృథా అంటూ మా పనులన్నీ సచివాలయ ఉద్యోగులతో చేయించారు. అప్పట్లో ఇంటివద్దకే వెళ్లి అర్హులను గుర్తించి పథకాలు అందించే వాళ్లం. ఇప్పుడు పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఇస్తామని చెప్పేది సొంత డబ్బా కొట్టించుకునేందుకే. – జగదీశ్వరన్, మాజీ వలంటీర్, నగరి -
నిర్లక్ష్య వైఖరిపై నిరసన
ఐరాల : బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యపు వైఖరిపై విసుగు చెందిన ఖాతాదారులు మంగళవారం కాణిపాకం యూనియన్ బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ వివిధ పనుల మీద బ్యాంకుకు వచ్చే రైతులు, ఖాతాదారులు, మహిళలకు, వృద్ధులకు సరైన సేవలు అందించడం లేదని వాపోయారు. ప్రశ్నించిన వారితో దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు, మహిళలు, ఖాతాదారులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై యూనియన్ బ్యాంకు డిప్యూటీ ఆర్ఎం పరుశరామ్ ఖాతాదారులతో ఫోన్లో మాట్లాడారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే మేనేజర్‌ను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఖాతాదారులు నిరసన విరమించారు. -
సమన్వయంతోనే అభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరులోని జింకల పార్కు వద్ద సైన్ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. జిల్లా సైన్స్ మ్యూజియంలో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే పలు ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ప్రతి రోజు పలు పాఠశాలల నుంచి విద్యార్థులు సైన్స్ మ్యూజియాన్ని సందర్శించేలా చర్యలు చేపడుతున్నారు. అయితే మ్యూజియం ప్రాంగణంలో ముళ్ల కంపలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు సంచరిస్తుండడంతో జేసీబీ సహాయంతో వాటిని తొలగించేందుకు మ్యూజియం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ పనులను చేయకూడదంటూ అటవీ శాఖ రేంజర్ అడ్డుకోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన తనిఖీలు నిర్వహించారు. సైన్స్ మ్యూజియం ప్రాంగణంలో పనులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికీ అనుమతులు కావాలని చెప్పడం సబబు కాదన్నారు. అటవీశాఖ అధికారులు తీరు మార్చుకుని సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో విద్యాశాఖ అధికారులు చేపట్టే పనులకు ఆటంకం కలిగించకూడదని జిల్లా అటవీశాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ లక్ష్మీనారాయణ, మ్యూజియం క్యూరేటర్ జయంతి పాల్గొన్నారు. -
ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కుట్రలు
● వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవమైతే ఒప్పుకోని రౌడీమూకలు ● అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదావేయించిన పచ్చ నేతలు ● చాలా పాఠశాలల్లో కోరం లేక ఆగిపోయిన కమిటీ ఎన్నికలు ● తల్లిదండ్రుల ఆందోళనతో వెనకడుగు వేసిన సాక్షి ప్రతినిధి, తిరుపతి: విద్యాలయాల్లోనూ టీడీపీ నేతల రాజకీయ జోక్యం శ్రుతిమించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మంగళవారం జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికల్లో దౌర్జన్య కాండ సాగింది. చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు పలువురు తెగబడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను గ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు అనేక చోట్ల ఎన్నికల్లో పాల్గొనలేదు. ఫలితంగా కోరం లేక స్కూల్ కమిటీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఏకగ్రీవం అయిన చైర్మన్ ఎన్నిక చెల్లదంటూ టీడీపీ నేతలు కుట్రలకు తెరదీశారు. చిత్తూరు మండలం బీఆర్‌పేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఎన్నికల్లో టీడీపీ నేతలు తమ వారికే పీఠం కట్టబెట్టాలన్న దురాశతో.. ఏకంగా ఎన్నికల ప్రక్రియనే నీరుగార్చేశారు. నిబంధనల ప్రకారం ప్రారంభమైన ఎన్నికలను, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అర్థంతరంగా వాయిదా వేయించారు. విద్యాశాఖ అధికారులు అధికార పార్టీకి కీలుబొమ్మలుగా మారడంతో తల్లిదండ్రులు ధర్నాకు ఉపక్రమించారు. రోడ్డెక్కిన తల్లిదండ్రులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఉదయం కోరం లేదని చెప్పి, ఆ తర్వాత ఓటింగ్ జరపడంపై నిప్పులు చెరిగారు. పరిస్థితి చేయిదాటడంతో అప్రమత్తమైన ఇద్దరు మండల విద్యాశాఖాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో చర్చలు జరిపి శాంతింపజేశారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నామని, త్వరలోనే పూర్తి పారదర్శకంగా మరోసారి కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని వారు రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు సవ్యంగా జరిగేనా స్కూల్ కమిటీ ఎన్నికల్లోనే టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. రేపు మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూటమి నేతలు ఏ స్థాయిలో దౌర్జన్యాలకు దిగుతారోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం ఎన్నికలు నిర్వహించాల్సిన పాఠశాలలు 2,091 ఎన్నికలు జరిగినవి 2,077 పాల్గొనాల్సిన ఓటర్లు 1,03,000 కోరం లేక వాయిదా పడిన బడులు 04తల్లిదండ్రుల అనాసక్తి స్కూల్ కమిటీ ఎన్నికలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అనేక పాఠశాలల్లో స్కూల్ కమిటీ ఎన్నికలు కోరం లేక వాయిదాపడ్డాయి. అనేక పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ మంది హాజరు కావడంతో వాయిదా వేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు ప్రకటించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం మంగానెల్లూరు, తడ మండలం అక్కంపేట మోడల్ స్కూల్ కమిటీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. -
బైక్‌ను ఢీకొన్న లారీ
● ఇద్దరికి గాయాలు బైరెడ్డిపల్లె : బైరెడ్డిపల్లె చెక్‌పోస్టు కూడలిలో మంగళవారం ఓ బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. ఫూటుగా మద్యం తాగిన లారీ డ్రైవర్ మత్తులో ఇష్టం వచ్చినట్లు నడపడంతో ప్రమాదం జరిగింది. జంగాళఅగ్రహారం గ్రామానికి చెందిన ప్రదీప్, రాజేష్ బైక్‌పై వెళుతుండగా వెనుకనుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను బైరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులతో సైతం లారీ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. పట్టపగలే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చోరీ సాక్షి, చిత్తూరు: ఐరాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పనిచేస్తున్న బాబు ఇంట్లో చోరీ జరిగింది. చిత్తూరు నగరంలోని సాంబయ్యకండ్రిగకు చెందిన బాబు, ఐరాలలో పీడీగా పనిచేస్తున్నారు. హైదరాబాదులో ఉన్న తన కుమార్తెను చూడడానికి శనివారం వెళ్లిన ఆయన మంగళవారం ఇంటికి వచ్చారు. సాంబయ్యకండ్రిగలోని తన ఇంటి కిటికీ ఇనుప చువ్వలు కత్తిరించి, తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా రూ.75 వేల నగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ చిన్నపెద్దయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేనెటీగల దాడిలో ఒకరి మృతి నిండ్ర (నగరి) : నిండ్ర మండలంలోని అయ్యారు కండ్రిగలో తేనెటీగల దాడి చేయడంతో మునస్వామి యాదవ్ (62) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో మునస్వామి యాదవ్ తన మామిడి తోట వద్దకు వెళ్లగా చెట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. -
వంట గ్యాస్‌కు ఈకేవైసీ మంట
కాణిపాకం: వంటగ్యాస్ వినియోగదారులపై ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి మరో భారం మోపేందుకు యత్నిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత వచ్చి పడితే, మరోవైపు ఈ–కేవైసీ పేరుతో సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చి సామాన్య, మధ్యతరగతి ప్రజల గొంతు నులిమేందుకు కుట్ర చేస్తున్నాయి. గడువులోపు ఆధార్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేయలేదనే సాకుతో సబ్సిడీని ఎగ్గొటేందుకు సన్నద్ధమవుతున్నాయి. రాయితీ సిలిండర్లను సైతం కమర్షియల్ ధరలకు విక్రయించేందుకు బాటలు వేస్తున్నాయి. సర్కారు వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది మందికి తిప్పలు జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో దీపం కనెక్షన్లు 2,45,786, ఉజ్వల కనెక్షన్లు 20,212, సాధారణ ఎల్పీజీ కనెక్షన్లు 5,00,116 ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 2,980 వరకు ఉన్నాయి. ఈ గణాంకాల మేరకు జిల్లాలో లక్షలాది కుటుంబాలు గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమై ఓవైపు పొయ్యి వెలగడమే కష్టంగా మారితే, మరోవైపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తికాక జిల్లాలోని వేలాది కనెక్షన్లు బ్లాక్ అయిపోవడం ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇక కొత్తగా గ్యాస్ కనెక్షన్ కోసం సుమారు 80 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరికి వంట గ్యాస్ పంపిణీ చేయకుండా వివిధ కారణాలతో ఐదు, 10 కేజీల సిలిండర్ ను అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు గ్యాస్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఫ్రీ ట్రేడ్ లైసెన్స్ మెలిక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్తగా కనెక్షన్ కావాలన్నా లేదా ఈ కేవైసీ కాక పాత కనెక్షన్లు బ్లాక్ అయినా వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. కనెక్షన్ పొందేందుకు ఐదేళ్లు, పదేళ్లుగా నిరీక్షిస్తున్న పేద కుటుంబాలను, కొత్తగా కాపురం పెట్టిన దంపతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు.. వారిని ఫ్రీ ట్రేడ్ లైసెన్స్ కమర్షియల్ సిలిండర్ల వైపు నెడుతున్నాయి. ఎఫ్టీఎల్ కమర్షియల్ సిలిండర్ల (5 కిలోలు లేదా 10 కిలోలు) విక్రయాలకు ఎలాంటి ఆధార్, రేషన్ కార్డు లేదా స్థానిక నివాస ఆధారాలు అవసరం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. రూ. 976 చెల్లించి లేదా డిపాజిట్ ఇచ్చి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లవచ్చని మెలిక పెడుతున్నాయి. గృహ వినియోగానికి వాడే 14.2 కేజీల సాధారణ సిలిండర్ల సరఫరాకు ఆంక్షలు విధిస్తూ, చిన్న కమర్షియల్ సిలిండర్లను అంటగట్టి ప్రజల జేబులకు చిల్లు పొడుస్తున్నాయి. సాంకేతిక చిక్కులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30, 40 ఏళ్ల క్రితం ఇంట్లోని పెద్దల పేరిట తీసుకున్న పాత గ్యాస్ కనెక్షన్లు నేటికీ భారీ సంఖ్యలో ఉన్నాయి. ఆయా కనెక్షన్ల యజమానులు మరణించడం, వారి లీగల్ వారసుల పేరిట మార్చుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆయిల్ కంపెనీలు కనెక్షన్లను నిలిపివేశాయి. మైనర్ ఫ్యామిలీలుగా విడిపోయిన కుటుంబాలు, ఒకే ఇంట్లో వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నవారు సరైన ప్రూఫ్ చూపించలేక సతమతమవుతున్నారు. బ్లాక్ అయినవాటికి ఈకేవైసీ కాకపోవడంతో వేలాది గ్యాస్ కనెక్షన్లు బ్లాక్ అయిపోయాయి. దీంతో, జిల్లాలో సామాన్యులు పొయ్యి వెలిగించుకోవడానికి తంటాలు పడుతున్నారు. కొత్త నిబంధనలతో రాయితీ ఎగవేత నష్టాల భర్తీకే ఈ దోపిడీ? అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం కారణంగా, దిగుమతి వ్యయం పెరిగిందనే సాకుతో గృహ వినియోగ విభాగంలో తమకు వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకే చమురు సంస్థలు ఈ కుతంత్రానికి తెరలేపాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గృహ కనెక్షన్లకు కొత్తగా ఆమోదం తెలపకుండా నిలిపివేస్తూ, వినియోగదారులను కమర్షియల్ కేటగిరీకి మళ్లించడం ద్వారా లాభాలు దండుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు కొరత, ధరల భారంతో విలవిలలాడుతున్న సామాన్యుడిపై, ఇప్పుడు ఈకేవైసీ, కమర్షియల్ బాదుడు పేరుతో నిలువుదోపిడీకి దిగడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
రాష్ట్ర స్థాయి పోటీలకు తొడతర హైస్కూల్ విద్యార్థులు
తవణంపల్లె : వుండలంలోని తొడతర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోసాధ్యాయుడు ఖాతుంబీ తెలిపారు. తిరుపతిలోని తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్లో చిత్తూరు జిల్లా అథ్లెటిక్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. అండర్–14 విభాగం ట్రయాథ్లాన్ పోటీల్లో ఎన్.ధనుష్, అండర్–16 విభాగం పెంటాథ్లాన్ పోటీల్లో డి.ముకేష్‌కుమార్, అండర్–18 విభాగం డిస్కస్ త్రో పోటీలో బి.లోకేష్ ప్రతిభ కనపరచారని వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు విద్యార్థులను అభినందించారు. -
బడి వేళ.. ఏం‘టీ’ చాకిరీ!
చిత్తూరు కలెక్టరేట్: బడి గంట మోగింది.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి, విద్యార్థులు శ్రద్ధగా వినాలి. కానీ, చిత్తూరు కొంగారెడ్డిపల్లెలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఉదయం 10:49 గంటలకు పాఠశాల తరగతులు నిర్వహిస్తున్న సమయంలో, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థినులు చేతిలో ప్లాస్కులు పట్టుకుని రోడ్డుపై ఉన్న టీ స్టాల్‌కు వచ్చారు. ఆ యజమానికి ప్లాస్కులు ఇచ్చి టీ నింపుకుంటున్న సన్నివేశం చూసిన అక్కడున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. అటెండర్లు, సిబ్బంది చేయాల్సిన పనులను చదువుకోవడానికి వచ్చిన ఆడపిల్లలతో చేయించడమేంటి? అదీ రోడ్డు మీదకు పంపించి.. టీ తెప్పించడమేంటి? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రమేమిటంటే.. ఒకవైపు జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటన జరుగుతోంది. బాలల హక్కుల కోసం అధికారులు సమీక్షలు చేపట్టిన రోజే, పాఠశాల యాజమాన్యం విద్యార్థినులను ఇలా అటెండర్లుగా మార్చడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు డీఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి వెళ్లాయి. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన డీఈవో, సంబంధిత షర్మన్ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బందిని వెంటనే సాయంత్రం డీఈవో కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలతో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీఈవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమగ్రంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
అమ్మా.. అలసత్వం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లావ్యాప్తంగా చిత్తూరులో 7, నగరిలో 2, పలమనేరులో 2, కుప్పంలో 2 చొప్పున మొత్తం 13 అర్బన్ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ’హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకువచ్చింది. దీనిపై ఆగస్ట్ 27, 28 తేదీల్లో జిల్లా అధికారులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఆధార్‌తో లేని లింక్ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎనన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాలు, వార్డుల్లో సర్వే చేసి అర్హులైన దంపతుల సమాచారాన్ని ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. అనంతరం ఆధార్ సంఖ్యను ఐడీతో లింక్ చేయాల్సి ఉంది. ప్రతి గర్భిణివివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అలాగే వారికి అందిస్తున్న రక్తహీనత నివారణ ఐరన్ మాత్రలు, ఇతర పోషకాహార లోపాలను గుర్తిస్తూ ప్రతి నెలా 1వ తేదీ నాటికి హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో పూర్తి స్థాయి డేటాను అప్లోడ్ చేయాలి. కేవలం సంఖ్యల ప్రదర్శన అయితే, ఇవేమీ పట్టని చిత్తూరు నగరంలోని పలు అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గర్భిణుల పూర్తి వివరాలు నమోదు చేయకుండా, కేవలం ఏదో ఒక సంఖ్యను పోర్టల్‌లో చూపి తమ పని పూర్తయిందని చేతులు దులుపుకుంటున్నారు. చాలా చోట్ల గర్భిణుల అసలు వివరాలే రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. తనిఖీల్లో గుట్టురట్టు ఇటీవల చిత్తూరు నగరంలోని కాజూరు అర్బన్ హెల్త్ పరిధిలోని బాలాజీనగర్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా హెచ్ఎంఐఎస్ పోర్టల్ నమోదును పరిశీలించగా నివ్వెర పరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్టల్‌లో గర్భిణుల సంఖ్య మాత్రమే కనిపించడం, వారి వివరాలు ఏమీ లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. కేవలం పేపర్ మేకప్ కోసమే లెక్కలు చూపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డు స్థాయిలో పూర్తి వివరాలు ఉంటేనే సరైన చికిత్స, మందులు అందే అవకాశముంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డిజిటల్ పోర్టల్స్ నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారు. అంకెల గారడీతో పారదర్శకతకు మంగళం పాడుతున్నారు. పేద మహిళలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాల్సిన వ్యవస్థను నీరుగారుస్తున్నారు.జిల్లాలోని గర్భిణుల లెక్కల్లో నిర్లక్ష్యం -
రీసర్వేలో యథేచ్ఛగా అక్రమాలు
పాలసముద్రం : మండలంలోని శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో చేపట్టిన రీ సర్వేలో విలేజ్ సర్వేయర్ చేతివాటం ప్రదర్శించారు. ఓ మధ్యవర్తిని పెట్టుకుని గ్రామ సేవకుడు, వీఆర్ఓ లేకుండానే రైతుల భూములను ఆన్లైన్లో పెట్టాడు. తరువాత 9(2) నోటీస్‌ను రైతులకు ఇచ్చారు. అందులో భూముల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో రైతులు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సదరు సర్వేయర్ పట్టించుకోకుండా తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, తర్వాత జేసీ లాగిన్‌కి అప్డేట్ చేశాడు. ఇలా శ్రీకావేరిరాజుపురం పంచాయతీలో జరిగిన రీ సర్వేలో విలేజ్ సర్వేయర్ చేస్తున్న అక్రమాలు అంతులేదు. భూమి ఉన్నవారు ఆన్లైన్లో పెట్టాలని వస్తే, మీ పేరు మీద భూమి లేదంటున్నారు. తీరా భూమిపై ఉంటే మీ పేరుమీద రికార్డులు లేవంటున్నారు. కేవలం మధ్యవర్తి చెప్పివారి వివరాలనే ఆన్లైన్లో పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఎకరాకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విలేజ్ సర్వేయర్ చర్యలు తీసుకుని, శ్రీకావేరిరాజుపురంలో మళ్లీ రీసర్వే చేయించాలని రైతులు కోరుతున్నారు. రెండు బైక్‌ల ఢీ : ముగ్గురికి గాయాలు కుప్పంరూరల్ : పట్టణంలోని తంబిగానిపల్లె వాణిమహల్ వద్ద వద్ద మంగళవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగురాలి మృతిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరులో దివ్యాంగ మహిళ అదృశ్యమై, నదిలో మృతదేహంగా తేలిన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. జనవరిలో బాధితుల తరఫున ఫిర్యాదు అందినా పోలీసులు రొటీన్ మిస్సింగ్ కేసుగా భావించి ఎలాంటి ప్రొటోకాల్ పాటించలేదని కమిషన్ గుర్తించింది. ఈ ఉదాసీన వైఖరి కారణంగానే బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ, కమిషన్ సభ్యులు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాలుగు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఎస్పీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిపై చిత్తూరుకు చెందిన న్యాయవాది హర్షద్ అయుబ్‌ఖాన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఘర్షణ పాలసముద్రం : మండలంలోని నరసింహపురానికి చెందిన ఏడుగురు విద్యార్థులకు మంగళవారం టీవీఎన్ఆర్ పురం నుంచి చిత్తూరులోని కళాశాలకు బయలుదేరారు. టీవీఎన్‌ఆర్‌పురంలో బస్సు ఎక్కిన అక్కడి విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీనిపై టీవీఎన్‌ఆర్‌పురం విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శివశంకర్ స్పందిస్తూ ఒకే పంచాయతీకి చెందిన విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉండాలని, మరోసారి గొడవ పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు కేజీసీ విద్యార్థినులు
కుప్పంరూరల్ : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికై నట్లు కాలేజీ వైస్ చైర్మన్ ఎన్.సాగర్‌రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి హైజంప్, లాంగ్ జంప్‌లో వి.అర్చన, జావెలిన్ త్రోలో ఎస్.లావణ్య, 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో కె.దర్శిని, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో జి.సుచిత్ర, 200 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్‌లో వి.నందిని ఉత్తమ ప్రతిభను కనబరచినట్లు వెల్లడించారు. విద్యార్థినులకు ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. రగ్బీ పోటీలకు శశిరేష్మి పాలసముద్రం : పాలసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.శశిరేష్మి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం మీనాక్షి తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థినికి అభినందనలు తెలిపారు. -
ఉద్యానరంగం అభివృద్ధికి హార్టికల్చర్ హబ్
చిత్తూరు కలెక్టరేట్ : రాయలసీమ హార్టికల్చర్ హబ్‌తో ఉద్యానరంగం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం జిల్లాకు రూ.1,529.69 కోట్ల విలువైన ప్రతిపాదనలను కేటాయించారన్నారు. అక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారని వివరించారు. జీఓ416 ప్రకారం ప్రణాళికను జిల్లాలోని 27 మండలాల్లో, 20 క్లస్టర్ల పరిధిలో మూడేళ్ల పాటు మూడు విడతలుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 5 క్లస్టర్లు, 7 మండలాలు, రెండో విడతలో 8 క్లస్టర్లు, 9 మండలాలు, మూడో విడతలో 7 క్లస్టర్లు, 11 మండలాల్లో అభివృద్ధి పనులు చేపడతారన్నారు. రూ.620.40 కోట్లతో బిందు, తుంపర సేద్యపు పరికరాలు అందించనున్నట్లు వెల్లడించారు. రూ.383.74 కోట్లతో విదేశీ పండ్లు, ప్రత్యేక రకాల కూరగాయలు, పూలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామన్నారు. రూ.162.80 కోట్లతో పాత తోటల పునరుద్ధరణ, కత్తిరింపులు, సమగ్ర పోషక యాజమాన్య చర్యలు చేపడతారని తెలిపారు. రూ.84.96 కోట్లతో కోల్డ్ స్టోరేజీలు, రైపెనింగ్ చాంబర్లు, ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతారన్నారు. రూ.77.11 కోట్లతో కలెక్షన్ సెంటర్లు, గిడ్డంగులు, ప్యాక్ హౌస్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నాణ్యమైన నర్సరీల అభివృద్ధికి రూ.21 కోట్లు, స్టార్టప్‌లు, ఎఫ్పీఓల బలోపేతానికి రూ.23 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.17.21 కోట్లు, రైతులకు శిక్షణకు రూ.17.40 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. సాగు నుంచి మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల వరకు ప్రతి దశలోనూ రైతుకు విలువ ఆధారిత మద్దతు లభించేలా హార్టికల్చర్ హబ్ తోడ్పడుతుందని తెలిపారు. -
సీఈసీ పక్షపాత వైఖరి సరికాదు
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శ్రీరంగరాజపురం:కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ పక్షపాత వైఖరి సరికాదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం పుత్తూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ బీజేపీకి కొమ్ముకాయడం, వారికి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఓటింగ్ లేదా ప్రధానమంత్రి, సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని సూచించారు. రాష్ట్రంలో సైతం ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, సచివాలయ ఉద్యోగులపై లాఠీ చార్జి చేయించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగనన్న పాలనలో 1.50 లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని,చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ పేరుతో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వం రాగానే డీఎస్సీ నియామకాలపై విచారణ చేయిస్తామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా వ్యక్తులకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వడం ఎక్కడా చూడలేదన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడి యా వ్యక్తులకు జీతాలు చెల్లించాలని కేబినెట్లో తీర్మా నం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని విమర్శించారు. -
ఒంటరి ఏనుగు బీభత్సం
బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లె సమీపంలో ఒంటరి ఏనుగుల 15 రోజులుగా నానా బీభత్సం సృష్టిస్తోంది.మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026తిరుపతి అర్బన్: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు రెండేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనిఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా పదుల సంఖ్యలో సర్వేలు అప్పగించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, కొందరు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని మొత్తుకుంటున్నారు. ఇదే అంశాన్ని జిల్లాల వారీగా అధికారులకు మొరపెట్టుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. కొన్ని డిమాండ్లకు అయినా పరిష్కారం చూపుతారని ఆశపడ్డారు. అయితే ఏ ఒక్క డిమాండ్‌ను పరిష్కరించకపోగ...అధనపు పనిభారాన్ని మోపడంతో గత్యంతరం లేక న్యాయపోరాటానికి దిగారు. చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు సిద్ధమైంది. వేధింపులు మొదలయ్యాయి! చలో విజయవాడకు వెళ్లిన స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నిరసనలో పాల్గొన్న ఉద్యోగి పేరు, ఊరుతోపాటు వారి సతీమణి, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు తెలుసుకోవడమే కాకుండా వాళ్ల వృత్తి తదితర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తగత సమాచారాన్ని ఇవ్వడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. అయినప్పటికీ పోలీసులు పదేపదే అడుగుతుండడంతో పలువురు ఉద్యోగులకు తప్పడం లేదు. ఈ క్రమంలో వారంతా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. చలో విజయవాడ నిరసన ఫలితంగానే ఇదంతా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. వేధింపులు మానకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్లుగా అభ్యర్థిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నాం. అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. నాయకుల కాళ్లావేళ్లా పడ్డాం. కానీ ఏ ఒక్కరూ కనికరించలేదు. మేము కూడా భార్యాబిడ్డలు, కుటుంబాన్ని పోషించాలి. ఇలా.. ఎన్నాళ్లు ఓర్చుకోవాలి. అందుకే చలో విజయవాడకు పిలుపునిచ్చాం. నిరసన వ్యక్తం చేసినందుకు మాపై కూటమి ప్రభుత్వం కక్ష పెంచుకుంది. అత్యంత గోప్యంగా ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని పోలీసుల ద్వారా సేకరిస్తోంది. సమస్యలు పరిష్కరించకుండా ఇలా భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఇలాగే చేస్తే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుంది...’ అంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. -
కలెక్టరేట్ ఎదుట కన్నీటి నిరసన
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కోటేశ్వరి అనే మహిళ పింఛన్ మంజూరు కోసం నిరసన చేపట్టింది.గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. న్యాయమైన డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంచుతున్నాం. వాటికి పరిష్కారం చూపకుండా రెండేళ్లుగా కాలయాపన చేశారు. దీనిపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ఎవరికై నా హక్కు ఉంది. ఒక్క డిమాండ్‌కు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా సమస్యలకు పరిష్కారం లభించేవరకు పోరాటాలు చేయకతప్పదు. –విద్యాసాగర్, స్వర్ణ వార్డు ఉద్యోగి, తిరుపతి సమస్యలు పట్టించుకోండి స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సమస్యలను కాస్తా పట్టించుకోండి. రెండేళ్లుగా ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడంతోనే చలో విజయవాడ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. హక్కుల కోసం నిరసన చేపట్టడం నేరమా..?. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. దాంతోనే పనిభారం తీవ్రంగా మారింది. వలంటీర్లు ఇచ్చే పింఛన్ల పనులు మేమే చేస్తున్నాం. మాపైన ప్రభుత్వానికి కనికరం లేకుండా కేసులు పెట్టడం ఏ మాత్రం సరికాదు. –మునితేజ, స్వర్ణ వార్డు ఉద్యోగి, తిరుపతి -
వార్డెన్ వేధింపులపై ఫిర్యాదు
చిత్తూరు కలెక్టరేట్ : హాస్టల్ వార్డెన్ వేధింపులు తాళలేకపోతున్నానని, అందరి ముందూ కులం పేరుతో దూషిస్తూ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పదో తరగతి విద్యార్థి జశ్వంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం ఆ విద్యార్థి తన తండ్రి మురళితో కలిసి కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. ఇటీవల ఉన్నతాధికారులు పూతలపట్టు ఎస్సీ బాలుర హాస్టల్ తనిఖీకి వచ్చిన సమయంలో భోజనం బాగాలేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న వార్డెన్, అప్పటినుంచి తనను లక్ష్యంగా చేసుకుని విద్యార్థులందరి ముందూ కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వార్డెన్ వేధింపుల కారణంగా భయాందోళనకు గురైన సదరు విద్యార్థి, ప్రస్తుతం హాస్టల్‌కు వెళ్లేందుకు భయపడుతున్నట్లు చెప్పాడు. విద్యార్థి తండ్రి మాట్లాడుతూ ఇటీవలే తమ పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ శోకంలో ఉన్న తమ కుటుంబానికి ఇప్పుడు చిన్న కుమారుడిని వార్డెన్ ఇలా వేధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. హాస్టల్లో భోజనం బాగాలేదని ఉన్నతాధికారులకు నిజం చెప్పడమే తన కుమారుడు చేసిన తప్పా అని ప్రశ్నించారు. కుమారుడి భవిష్యత్తు పాడవుతుందేమోనని ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడైన వార్డెనన్ను సస్పెండ్ చేయాలని కోరారు. -
అనారోగ్య సమస్యలు తప్పవు
పేపర్ ప్లేట్లలో వేడి ఆహారం పెట్టుకుని తినడంతో కెమికల్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది మన శరీరంలోకి చేరడంతో ముఖ్యంగా నెర్వస్ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది. ఆపై లివర్, కిడ్నీ, గుండె, స్ట్రెస్, పలు రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహిళలల్లో హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌తో ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – మమతారాణి, సూపరిండెంటెంట్, ఏరియా ఆస్పత్రి, పలమనేరు పెను ప్రమాదం తప్పదు ఇటీవల పేపర్‌ప్లేట్ల వినియోగం ఎక్కువైంది. ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. వీటి వాడకంతో మనకు తెలియకుండానే ఎన్నో రకాల వ్యాధులను మనమే శరీరంలోకి ఎక్కించుకుంటున్నాం. వీటికి ప్రత్యామ్నాయంగా స్టీల్, మట్టి, పింగాణి ప్లేట్లను రీయూజ్గా వాడుకునే విధానాలకు జనం అలవాటు పడాలి. దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యత పాలకులపై ఉంది. – సోమచంద్రారెడ్డి, మేధావుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు -
ప్రాణాలు అరచేతిలో..
చిత్తూరు రూరల్ మాపాక్షి దళితవాడకు చెందిన శంకరయ్య తన నివాసం వద్ద ఉన్న ప్రమాదకర పరిస్థితిని వివరించారు. తన ఇంటి పైనుంచి వెళుతున్న విద్యుత్ లైన్ చేతికి అందేంత తక్కువ ఎత్తులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఏదైనా ప్రమాదం సంభవించకముందే ఆ విద్యుత్ లైన్‌ను తొలగించాలని వేడుకున్నారు. స్థానిక విద్యుత్ అధికారులకు విన్నవించినా కనీస స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ భూముల్లో అక్రమాలు ఎస్ఆర్ పురం మండలం, పెద్దకొండేపల్లెకు చెందిన గ్రామస్తులు కలెక్టర్‌ను కలసి అర్జీ అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని షెడ్యూలు భూములపై కొందరు తప్పుడు రికార్డులు సృష్టించి మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. గతంలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగిన విచారణలో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. మోసానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
బాలల హక్కుల రక్షణే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : బాలల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్య నారాయణ రాజు తెలిపారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయనకు చిత్తూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గిరింపేటలోని నగరపాలక హైస్కూల్లో నిర్వహించిన సమావేశంలో కమిషన్ సభ్యులు పద్మలతతో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి జీవించే, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ, భాగస్వామ్య హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన విద్య, పౌష్టికాహారం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించడం కమిషన్ బాధ్యతని వెల్లడించారు. బాలల రక్షణలో పాఠశాల స్థాయి నుంచే గుడ్ టచ్ బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలలో, సమాజంలో బాలల హక్కులకు భంగం వాటిల్లితే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమన్నారు. ప్రత్యేకించి బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బాల్య వివాహాలను అడ్డుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కమిషన్ సభ్యులు పద్మలత మాట్లాడుతూ బాలల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి సుబ్రమణ్యం, డీవైఈఓ ఇందిరా, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్ పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)కు అర్జీదారులు పోటెత్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు, నిరుపేదలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి, నివాస స్థలాలు, వైద్య సహాయం తదితర అంశాలపై అర్జీదారులు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలను అందజేశారు. ఉన్నతాధికారులు నేరుగా అర్జీలను స్వీకరించి, బాధితుల గోడును అడిగి తెలుసుకున్నారు. స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, నిర్దేశిత గడువులోగా సంబంధిత శాఖలకు పంపి వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై ఏమాత్రం అలసత్వం వహించకుండా పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వెంకటేష్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బస్సుల కోసం పడిగాపులు
కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కుప్పం నుంచి ఆర్టీసీ బస్సులను తరలించారు. ఒక్కసారిగా 38 సర్వీసులు వెళ్లిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. కళాశాల, పాఠశాల నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు సర్వీసులు లేకపోవడంతో పిల్లలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దీంతో కుప్పం నుంచి పలమనేరు వైపునకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులను సైతం నెల్లూరుకు పంపించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి బుధవారం వరకు కుప్పం డిపోకు చెందిన 38 బస్సులు అందుబాటులో ఉండని పరిస్థితి. నిత్యం సాయంత్రం వేళ పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులు కుప్పం డిపో నుంచి సకాలంలో నడవడం లేదు. దీనికి తోడు మూడు రోజుల పాటు 38 బస్సులు లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యేందుకు బస్టాండుకు వచ్చారు. అక్కడ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. దీనిపై డిపోలో సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో పిల్లలక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పెద్ద చెరువులో ఆదివారం రాత్రి మట్టి తరలించడానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. బాలగంగానపల్లె పంచాయతీ మేనటంపల్లెకు చెందిన కృష్ణారెడ్డి(60) వింజం పెద్ద చెరువులో ఆదివారం మట్టి తోలడానికి నిమిత్తం ట్రాక్టర్లో వెళుతుండగా రోడ్డు బాగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డిని వెంటనే 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కృష్ణారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 30 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువుచిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రూ.200 అపరాధ రుసుము చెల్లించాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను మీ సేవ, ఏపీఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసి సమన్వయ కేంద్రాల్లో అడ్మిషన్ పొందాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ అధికారులను సంప్రదించాలని కోరారు. ఒంటరి ఏనుగు బీభత్సం బైరెడ్డిపల్లె : మండలంలోని వెంగంవారిపల్లె సమీపంలో ఉన్న కొత్తచెరువు, మునినాయనచెరువు పరిసరాల్లో 15 రోజులుగా ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఒంటరి ఏనుగు పంటలను తొక్కినాశనం చేస్తోందని వాపోతున్నారు. సోమ వారం పట్టపగలే పంటలను విధ్వంసం చేస్తూ వెంగంవారిపల్లె సమీపంలోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్ అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోకుంటే ఒంటరి ఏనుగు కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదముందని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టెండర్లో అక్రమాలపై ఫిర్యాదు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షల అనంతరం సరఫరా చేసే కళ్ల జోళ్ల టెండర్ ప్రక్రియలో అక్రమాలు, సిండికేట్ వేధింపులపై తిరుపతికి చెందిన శివ్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి గంగాసింగ్, తమిళనాడులోని వేలూరుకు చెందిన మహా శివ్ ఆఫ్టికల్స్ ప్రతినిధి మహేంద్రసింగ్ ఫిర్యాదు చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్‌కు వారు విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు. డిమాండ్ డ్రాఫ్ట్ సాంకేతిక సాకులు చూపి తనను టెండర్ నుంచి తప్పించారని గంగాసింగ్ ఆరోపించగా, తమిళనాడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ సాకుతో అడ్డుకున్నారని మహేంద్రసింగ్ పేర్కొన్నారు. అలాగే తమను టెండర్ వేసేందుకు కార్యాలయ ప్రాంగణంలోకి రాకుండా భౌతికంగా అడ్డుకున్నారని వినతిపత్రంలో వెల్లడించారు. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు టెండర్లు దాఖలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం బాధితులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలిశారు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా నివేదిక తెప్పించుకుని, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి, పారదర్శకంగా తిరిగి టెండర్లు నిర్వహించాలని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ – నాలుగు స్కూటీలు స్వాధీనం బంగారుపాళెం: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని కాటప్పగారిపల్లె, నలగాంపల్లెల్లో ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం మండలంలోని తంబుగానిపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిత్తూరు, బంగారుపాళెం పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను వారు అపహరించినట్లు వెల్లడించారు. కాటప్పగారిపల్లె సమీపంలో మూసివేసిన ఓ ఫ్యాక్టరీ ఆవరణలో నిందితులు దాచిపెట్టిన నాలుగు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా, ఆంబూరు తాలూకావడపుదుపట్టు ఓల్ట్ కాలనీకి చెందిన విఘ్నేష్(20), పేర్నంబట్ తాలూకా పుదూర్‌కు చెందినచంద్రుభీమన్(24), పేర్నంబట్ తాలూకా ఎస్ఆర్ కుప్పంలో నివాసముంటున్న విజయ్(26)ను నిందితులుగా గుర్తించినట్లు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
మద్యం సిండికేట్లు
అధికారమే అండగా జిల్లాలో కొందరు ప్రజా ప్రతినిధులు సొంత లాభం కోసం, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు ఇవ్వడానికి ఆహ్వానించిన నోటిఫికేషన్‌కు ఒక్క దరఖాస్తు కూడా రాకుండా వ్యాపారులను సిండికేట్ చేసేశారు. ఇప్పటికే దుకాణాలు దక్కించుకుని, రెండేళ్ల పాటు సంపాదించుకున్న వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చేశారు. చివరి రోజునే అప్లికేషన్లు వేసి మొత్తం 18 వైన్‌షాపులను చేజిక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. చిత్తూరులోని ఓ మద్యం దుకాణంసాక్షి, చిత్తూరు : జిల్లాలో 113 మద్యం దుకాణాల రెన్యూవల్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది., ఇందులోని లొసుగు తెలియని 95 మంది సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించి రెన్యూవల్ చేసుకున్నారు. మిగిలిన 18 దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్‌కు వెళ్లకపోవడంతో కొత్తగా లైసెన్సులు ఇవ్వడానికి అధికారులు గురువారం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఒక దుకాణానికి రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ రుసుము కింద, కనీసం ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా పడితేనే లక్కీడిప్ తీస్తామని నిబంధన పెట్టారు. అంటే ఒక దుకాణం కోసం నాలుగు దరఖాస్తులు పడితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.12 లక్షలు. రూ.25 లక్షలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవడానికి బదులుగా, రూ.12 లక్షలు చెల్లించి తామే నాలుగు దరఖాస్తులు వేసుకుంటే సరిపోతుందని భావించిన వ్యాపారులు పాలసీలోని లొసుగును కనిపెట్టేశారు. రూ.12 లక్షలకంటే రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వెళ్లకుండా ఉండేందుకు కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. చివర్లో దరఖాస్తులు సిండికేట్ చెప్పినట్లే ఈనెల 30వ తేదీ వరకు ఎవరూ దరఖాస్తు చేయకూడదని తీర్మానం చేయడంతో.. ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. 30వ తేదీ, అక్టోబర్ 1వ తేదీన ఒకేసారి దరఖాస్తులు చేసుకోవాలన్న సిండికేట్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారు. వచ్చిన దరఖాస్తులను 5వ తేదీన చిత్తూరులోని కలెక్టరేట్లో లక్కీడిప్‌లో లైసెన్సులు కేటాయించడమే తరువాయి. అయితే అధికార పార్టీ నేతలే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు తెగబడడంపై ఆబ్కారీశాఖ అధికారులు, ప్రజలు నివ్వెరబోతున్నారు. జిల్లాలోని 18 వైన్ షాపులకు రాని దరఖాస్తులు నేతల అభయం ఈనెల 24వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్లో చిత్తూరు కార్పొరేషన్లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. అలాగే పెద్దపంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌడ్లలకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అక్కడ ఆ సామాజిక వర్గం లేపోవడంతో గత రెండేళ్లుగా లైసెన్సు ఎవరికీ ఇవ్వలేదు. కాగా, 18 దుకాణాలకు దక్కించుకోవడానికి కొందరు వ్యాపారులను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు తమ వద్దకు పిలిపించుకున్నారు. తమ చెప్పకుండా ఎవరూ దరఖాస్తులు వేయడానికి వీల్లేదని, అందరూ సిండికేట్‌గా ఏర్పడాలని ఆదేశించారు. రూ.12 లక్షలకే దుకాణం తీసుకుని, ఆపై వేలం పాట నిర్వహించి వచ్చే అదనపు ఆదాయాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి కొందరు నేతలు వాటాలు తీసుకుంటుండగా, మరికొందరు దుకాణాలను బినామీ పేరిట తామే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. -
ఇన్ సర్వీస్ దరఖాస్తుకు గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, పీఈటీ ఉపాధ్యాయులు ఇన్న్సర్వీస్లో బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేసేందుకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అర్హత, ఆసక్తి గల టీచర్లు దరఖాస్తులను సమర్పించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అర్హులైనవారు తమ దరఖాస్తు ప్రతిపాదనలను సంబంధిత డీడీఓలతో గడువులోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించమని స్పష్టం చేశారు. వీడియో మార్ఫింగ్‌పై ఫిర్యాదు విజయపురం (నగరి) : మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న వీడియోను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ విజయపురం మండలం నేతలు కోరారు. సోమవారం ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంజు బాలాజీ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం జిల్లా సెక్రటరీ జిల్లు, మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌రెడ్డి, శ్రీరాములు రెడ్డి, బాబు, యువజన నేత ప్రకాష్ పాల్గొన్నారు. డీటీల డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా విడుదల – అభ్యంతరాలకు అక్టోబరు 3 వరకు గడువు చిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ల (డైరెక్ట్ రిక్రూట్మెంట్, ప్రమోటీలతో సహా) స్థానిక కేడర్ కేటాయింపుల ప్రాతిపదికన డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు పభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు ఉత్తర్వులు పంపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్వహణ, కేటాయింపుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్ల (ప్రొబేషన్, సస్పెన్షన్, ఈఓఎల్, డిప్యుటేషన్, శిక్షణలో ఉన్నవారిని కలిపి) వివరాలతో జోనల్ సీనియారిటీ డ్రాఫ్ట్ జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. సంబంధిత జాబితాను ఈ నెల 28వ తేదీన జిల్లా స్థాయిలో ప్రచురించాలని ఆదేశించారు. అక్టోబరు 3వ తేదీ నాటికి అభ్యంతరాలను స్వీకరించాల్సిందిగా స్పష్టం చేశారు. ఈ డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితా కేవలం స్థానిక కేడర్ల కేటాయింపు అవసరాల కోసమేనని, ఇది ఉద్యోగుల సర్వీస్ సీనియారిటీకి ఎలాంటి హక్కును కల్పించదని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అభ్యంతరాలు ఉన్న ఉద్యోగులు తగిన ఆధారాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాధ్యతగా ఫిర్యాదుల పరిష్కారం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించకూడదని, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తిచేసి బాధ్యతగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ తుషార్ డూడీ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీతో పాటు నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఎస్ షాను, డీఎస్పీ జె.వెంకటనారాయణను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. -
‘ప్రభ’ల గణపతి
చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న వినాయకస్వామికాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం వినాయకస్వామివారు చంద్రప్రభవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా తొలుత మూలవిరాట్‌కు విశేషాభిషేకం జరిపించారు. చందన అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన ప్రాప్తి కల్పించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. సుగంధభరిత పుష్పాలు, పట్టుపీతాంబరాలతో అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం చంద్రప్రభవాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రప్రభ వాహన సేవలో భాగంగా ఉభయకర్తలు క్షీర కలశాలతో ఊరేగింపు చేపట్టారు. ప్రధాన ఆలయ కల్యాణ వేదికలో ఉత్సవమూర్తికి పాలాభిషేకం చేశారు. -
కుటుంబ కలహాలకు తండ్రి, కొడుకు బలి!
యాదమరి: ఆ పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చు రగిల్చాయి. క్షణికావేశంలో ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు. కన్న ప్రేమను మరిచి పదేళ్ల కుమారునికి విషమిచ్చి ప్రాణాలు తీశాడు. తర్వాత తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ హృదయ విచారకర ఘటన యాదమరి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని భూమిరెడ్డిపల్లి పంచాయతీ వెంకటాపురం దళితవాడకు చెందిన దొరస్వామి కుమారుడు బాబు(35) అమరరాజ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను తన భార్యతో కలిసి చిత్తూరులో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామమైన వెంకటాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బాబు తన కుమారుడితో వచ్చాడు. ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా పనులు ముగించుకుని వెంటనే వెళ్లే బాబు రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తాము తరచూ ఘర్షణ పడుతున్నామని బాబు తన స్నేహితుల వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు, ముందుగా తన కుమారుడు లోహిత్(10)కు విషం తాగించాడు. చిన్నారి ప్రాణాలు విడవడం చూసిన తర్వాత అతను కూడా అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ విచారణ చేపట్టారు. మృతుని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారని, వారి మధ్య తలెత్తిన వివాదాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని మృతుని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమాచారం బాబు భార్యకు తెలిసినా ఆమె రాకపోవడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక మిగిలింది రిజర్వేషన్లే!
ఎవరికెన్ని వార్డులంటే.. అధికారులు ప్రచురించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రకారం ఆయా వర్గాలకు ఎన్ని వార్డులు కేటాయించాలన్న దానిపై నిబంధలన మేరకు స్పష్టత ఉంది. మునిసిపాలిటీల్లో ఉన్న మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) వార్డులను రిజర్వు చేయాలి. అంటే చిత్తూరు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీలకు ఒక డివిజన్, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేస్తారు. మిగిలినవి అన్–రిజర్వు (ఓపెన్ కేటగిరీ) కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేస్తారు. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే తుది వాదనలు విన్న హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు వెలువరించే తీర్పు, ఎన్నికల నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలా..? ‘సర్’ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలా..? అనే దానిపై ఆధారపడుతుంది. అప్పటి వరకు ఉత్కంఠత తప్పేలా లేదు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక్కో అంశాన్ని అధికారులు పూర్తి చేస్తున్నారు. మునిసిపల్ కమిషనర్లు ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారి ఓటర్ల జాబితా ప్రచురించారు. తాజాగా జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ఆదివారం విడుదల చేశారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి మునిసిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు, పలమనేరు మునిసిపాలిటీలోని 36 వార్డులు, నగరిలోని 40 వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ప్రచురించారు. ఈ ప్రతులను స్థానిక మునిసిపల్ కార్యాలయతో పాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీలకు సైతం జాబితా పంపించారు. మొత్తం 136 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు ప్రాథమికంగా లెక్క కట్టారు. ఈ జాబితాపై సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలను ఆయా మునిసిపల్ కమిషనర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. రేపటి నుంచి విచారణ కులాల వారిగా ప్రచురించిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలు చేయాలంటే ఈ నెల 29, 30వ తేదీల్లో ఇంటింటా వెళ్లి విచారణ చేపడతారు. వచ్చిన అభ్యంతరాలపై విచారణ పూర్తి చేసి, సహేతుకంగా ఉన్న వాటిని ఆమోదిస్తారు. అక్టోబర్ 1వ తేదీన తుది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వార్డుల వారి జాబితాను ప్రచురిస్తారు. ఆపై దీన్ని రాష్ట్ర మునిసిపల్ సంచాలకులకు (డీఎంఏ) అందజేస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చిత్తూరు కలెక్టర్ గెజిట్ విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు జిల్లాలోని ఏయే మునిసిపాలిటీల్లో ఏయే వార్డులు రిజర్వు చేసారనే వివరాలను గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంటారు. తుదిగా మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను విడుదల కావడం, ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదల కావడమే తరువాయి. -
సైన్స్‌తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం
– మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చిత్తూరు కలెక్టరేట్ : సమాజంలో ఎదురయ్యే పలు సమస్యలకు సైన్స్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. స్థానిక విజయం ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నార్మన్ బోర్లాంగ్ పొట్టి రకాల వరి వంగడాలను రూపకల్పన చేయడంతో కోట్లాది మంది ఆకలి తీరిందన్నారు. భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సైన్స్ ఎంతో దోహదపడిందని గుర్తుచేశారు. రసవత్తరంగా సైన్స్ పోటీలు సైన్స్ పోటీల్లో జిల్లాలోని 28 మండలాలకు చెందిన 40 టీమ్‌లు పాల్గొన్నాయి. ఉదయం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పులిచెర్ల), ప్రైవేట్ పాఠశాలల విభాగంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ (చిత్తూరు) ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లు నవంబర్ 1, 2, 3 తేదీల్లో భీమవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పుస్తకావిష్కరణ, బహుమతుల ప్రదానం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు రచించిన ప్రయోగాలతో శాసీ్త్రయ దృక్పథం పుస్తకాన్ని విఠపు బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అందజేశారు. అనంతరం ఎం.వి.కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విజేత పాఠశాలలకు మెమెంటోలు ప్రదానం చేశారు. విజయం విద్యాసంస్థల అధినేత శైలజ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఫిలింఫేర్ ఖాన్, పిల్లారప్ప, వేణుగోపాల్, విజయ్ కుమార్, జయంతి, సుధాకర్, గిరిధర్ మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధార్థ విద్యార్థులు
నారాయణవనం: చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహింవిన పోటీలలో ప్రతిభ కనబరచిన సిద్ధార్థ కళాశాల విద్యార్థులు వెంకటమానస, దివాకర్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ట్లు కళాశాల పీడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వెంకటమా నస (బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ తృతీయ సంవత్సరం) డిస్కస్‌త్రో, ట్రిపుల్ జంప్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది. దివాకర్‌రెడ్డి (బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం) 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం విభాగాలలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాలను సాధించాడు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా రాణించాలన్నారు. ప్రిన్సిపాల్ జనార్దన్‌రాజు, పీడీ సుబ్రహ్మణ్యం విద్యార్థులను అభినందించారు. -
నిలబడదాం.. కలబడదాం
తిరుపతి రూరల్: రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోందని, గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి.. బలమైన అభ్యర్థులను బరిలోకి దించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 27 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలకు పాడెకడతాయన్నారు. తిరుపతిలోని తన నివాసం వద్ద ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలని, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికారుల ఒత్తిళ్లు, పోలీసుల దౌర్జన్యాలు చోటుచేసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. కుప్పం నుంచే కుట్రలకు శ్రీకారం చంద్రబాబు తన రాజకీయ కుతంత్రాలకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వర్షాలు లేక, సాగునీరు లేక, పెరిగిన ధరలతో తినడానికి తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళుతున్నారన్నారు. నిన్నటి వరకు మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తామని చెప్పి, ఇప్పుడు రెండింటినీ ఒకేసారి నిర్వహిస్తామని చెప్పడానికి కారణం కూడా అదేనన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా అన్ని చోట్లా పోటీ పెడతామన్నా రు. డీఎస్సీ నియామకాల విషయంలోనూ అవకతవక లు జరిగాయన్నారు. దీనిపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులే టీడీపీ గుండాలను వెనుకేసుకొచ్చి దాడులు చేయించి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు. స్థానిక పోరుకు వైఎస్సార్సీపీ రె‘ఢీ’ సచివాలయ ఉద్యోగుల పోరాటానికి మద్దతు గత ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరిన సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. బదిలీలు, అధిక పనిభారం పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేస్తున్నారని, వారిపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయా లను సరిదిద్ది, ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. చివరగా పుంగనూరులో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమ కోసం సుమారు 800 ఎకరాల భూమిని కేటాయించామని, వైఎస్సార్సీపీ ప్రభు త్వం తిరిగి అధికారం లోకి రాగానే పుంగనూరులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్న భారీ పరిశ్రమ ను తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ, సునీల్‌కుమార్, సమన్వయకర్తలు విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌తో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
తిరుపతి తుడా: తిరుపతిలో సచివాలయ ఉద్యోగులు కదంతొక్కారు. భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆదివారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని గళమెత్తితే పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో కొట్టడం దారుణమన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరుకాకుండా పలు ప్రాంతాల్లో, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులను మోహరించి అడ్డుకున్నారని మండిపడ్డారు. గత రెండేళ్ల నుంచి ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉద్యమం ఉధృతం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గత రెండేళ్లుగా ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని పలువురు మండిపడ్డారు. తక్షణం జీవో నం.11ను రద్దు చేసి, పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, సెలవు రోజుల్లో పనిభారం తగ్గించాలని, డిప్యూటేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ కేడర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ చానల్ ఇచ్చే క్రమంలో బేసిక్ పే రూ.30 వేలకు తగ్గకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు పుండరీ కాంక్ష, జయపాల్ నాయక్, రజనీకుమారి, మస్తానప్ప, కరుణాకర్, అమరావతి, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఈఎస్ఆర్ వేధింపులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 31,622 మంది వరకు అన్ని కేడర్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధు లు నిర్వహిస్తున్నారు. అధిక శాతం ఉపాధ్యాయులు 14,250 మంది వరకు ఉన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ఈఎస్ఆర్ నిబంధనల పేరుతో నిలువునా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. గతంలో ఇచ్చిన ఈఎస్ఆర్ డేటా ఏమైందో చెప్పకుండా మళ్లీ కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని ఒక్కో ఉద్యోగి ఈఎస్ఆర్ డేటా నమోదుకు రెండు రోజుల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కిందటి సర్వీస్ రికార్డులు దొరక్క ఉద్యోగ విరమణ అంచున ఉన్న సీనియర్లు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పాత డేటాను అనుసంధానించే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగులను వేధించడానికే సర్కారు ఈ పంతానికి పోతోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ వేళ అష్టకష్టాలు కొత్త ఈఎస్‌ఆర్‌లో పెట్టిన అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన నిబంధనల వల్ల ఒక్కో ఉద్యోగి సమాచారం అప్లోడ్ చేయడానికి కనీసం రెండు రోజులు పడు తోంది. దశాబ్దాల కిందటి సర్వీసు పుస్తకాలు, అర్హత పత్రాలు, ప్రమోషన్లు, జీతాల స్కేలు వివరాలు వెతికి పట్టుకోవడం గగనంగా మారింది. ముఖ్యంగా పదవీ విరమణ అంచున ఉన్న సీనియర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సాంకేతిక మెలికల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. నెట్ సెంటర్ల దోపిడీ ఒకవైపు సర్వర్ల మొరాయింపు, సాంకేతిక లోపాలు చుట్టుముట్ట గా, మరోవైపు ఈ పరిస్థితిని ఆస రాగా చేసుకుని నెట్ సెంటర్లు దోచుకుంటున్నారు. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డిమాండ్ చేస్తున్నాయి. బోధన ను పక్కనబెట్టి రోజంతా ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిర గాల్సి వస్తోందని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగులను అష్టకష్టాల పాలు చేయడానికే సర్కారు ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు అమలు చేస్తోందని, తక్షణమే ఈ వేధింపులను ఆపి, గడువు పెంపుతో పాటు పాత డేటాను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈఎస్ఆర్ నమోదుపై పంపిన మెసేజ్లుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఏదో ఒకసాకుతో వేధింపులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా ఈ సర్వీస్ రిజిస్టర్ (ఈఎస్ఆర్) పేరుతో ఇబ్బందులు పెడుతోంది. గతంలోనే రూ.వేలు వెచ్చించి, రాత్రింబవళ్లు శ్రమించి పూర్తి చేసిన ఈఎస్ఆర్ డేటాను బుట్టదాఖలు చేసి మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడికి లోను చేస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియను ముగించాలంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతోంది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం ఉపాధ్యాయులు 14,250 రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు 8498పోలీసులు 1400 నాల్గవ తరగతి ఉద్యోగులు 3297సచివాలయ ఉద్యోగులు 4177 మొత్తం ఉద్యోగులు 31,622మెసేజ్‌లతో మానసిక వేధింపులు ఈ నెలాఖరుకు నూతన ఈఎస్ఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు నయానా భయానా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫోన్లకు రోజూ హెచ్చరిక మెసేజ్‌లు పంపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో అప్లోడ్ చేసిన సర్వీసు వివరాలు, రికార్డులను గాల్లో కలిపేసి, ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ చేపట్టమనడం వెనుక ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. -
అర్ధగిరిలో చిత్తూరు ఎకై ్సజ్ కోర్టు జడ్జి
తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామిని ఆదివారం చిత్తూరు ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి జి.కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామికి అభిషేకం, అర్చనలు, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జడ్జిని స్వామి వారి ఆస్థాన మండపంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి, అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిని తీర్థం అందజేసి ఆశీర్వదించారు. రేపటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఆ మేరకు డీఈఓ కేవీఎన్.కుమార్, ఎస్జీఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శులు ఎస్.సాంబశివరావు, అమ్ములు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అండర్–17, 19 విభాగాల్లో చెస్ పోటీలు, వడమాలపేట జెడ్పీ హైస్కూల్లో అండర్–17, 19 విభాగాల్లో వెయిట్ లిఫ్టింగ్, 30వ తేదీన అవిలాలలోని బాక్సింగ్ అకాడమీలో అండర్–14, 17, 19 విభాగాల్లో బాక్సింగ్, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 17, 19 విభాగాల్లో తైక్వాండో, అకార్డ్ పాఠశాలలో అండర్–14, 17 విభాగాల్లో టెన్నిస్, అక్టోబరు 1వ తేదీన శ్రీకాళహస్తిలోని జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 17, 19 విభాగాల్లో టేబుల్ టెన్నిస్, 3వ తేదీన తిరుపతి మంగళం ట్రెండ్స్ జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 19 విభాగాల్లో జూడో, బుచ్చినాయుడుకండ్రిగ జెడ్పీ హైస్కూల్లో అండర్–17 విభాగంలో రగ్బీ జిల్లా జట్లు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆయా తేదీల్లో నిర్వహించే ఎంపిక పోటీలకు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 63001 12569, 99893 20511 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. నేడు చంద్రప్రభ వాహనం కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి సోమవారం చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. -
కాపర్ వైర్ల దొంగల అరెస్టు
– మూడు బైక్‌లు, 280 కిలోల రాగి వైరు స్వాధీనం కుప్పం: గుడుపల్లె మండలం పొగరుపల్లి ఇండస్ట్రియల్ ఏబీఐఎస్ కంపెణీలో కాపర్ వైర్లను చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసినట్టు కుప్పం ఏఎస్పీ హేమంత్ బోడ్డు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తు న్నా ఫ్యాక్టరీల్లో కాపర్ వైర్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సీసీ పుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులకు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 280 కేజీల రాగి వైర్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. నిందితులు కర్ణాటక రాష్ట్రం బట్లహళ్లి గ్రామానికి చెందిన మధు, సంతోష్, మురుగన్, విజయ్‌గా గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మల్లేష్‌యాదవ్, గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. 1న ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అక్టోబర్ ఒకటో తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో 2023 నుంచి 2026 లోపు డిప్లొమాలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు శ్రీసిటీ సహా 6 ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు హాజరై సుమారు 300 రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 6303578886లో సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి మూడు రోజులు బ్యాంకుల బంద్ కాణిపాకం : వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమర శంఖం పూరించారు. సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. వారం రోజుల పనిదినాలను 5 రోజులకు కుదించి, శనివారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంకర్లు గత 10 నుంచి 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, పీఎల్ఐ తదితర బకాయిలు చెల్లించాలని కోరుతూ సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు సమ్మె ప్రభావంతో జిల్లా పరిధిలో ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 250 శాఖలు మూతపడనున్నాయి. బ్యాంకు ఆఫీసర్లు, క్లర్కులు, ఇతర సిబ్బంది కలిపి సుమారు 400 నుంచి 500 మంది విధులకు దూరంగా ఉండి నిరసనలో పాల్గొంటున్నారు. మూడు రోజులు బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనుండడంతో జిల్లాలోని వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఈ–బస్ డిపో పరిశీలన తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి మంగళం ఆర్టీసీ డిపోను ఆదివారం జోన్–4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఆర్.కె.కిషోర్ సందర్శించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిప్యూటీ చీఫ్ డిపో మేనేజర్ బి.నిర్మల, ఏఈ (సివిల్) ప్రతాప్, ఏఈ (ఎలక్ట్రికల్) హరి పాల్గొన్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం : వ్యక్తి మృతి తిరుపతి క్రైం : కొర్లగుంట అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, కొండమిట్టకు చెందిన మర్రి హరికృష్ణ (54) తిరుపతిలో ఉంటూ శ్రీచక్ర ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హరికృష్ణ ఉంటున్న ఇంటి నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇంట్లో పరిశీలించగా హరికృష్ణ మృతి చెంది కనిపించాడు. -
సివిల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సివిల్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక స్పష్టం చేశారు. శనివారం న్యాయమూర్తులకు జిల్లా కోర్టు భవన సముదాయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసుల విచారణ చేపట్టాలన్నారు. సివిల్ కేసులు, డిక్రీలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు తదితర అంశాలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ జి.వి. సీతాపతి, జస్టిస్ ఎం.సీతారామమూర్తి వివరించారు.మొదటి, అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.హరిత, రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సూర్యనారాయణమూర్తి, మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీలత, తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కనులపండువగా విమానోత్సవం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామివారి విమాన వాహన సేవను కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా వేకువజామునే మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం పట్టుపీతాంబరాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. ఈ క్రమంలోనే ఊరేగింపుగా విమాన వాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళలు, కోలాటాలు, భజనబృందాల ప్రదర్శనలతో విమాన వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు సూర్యప్రభ వాహన సేవ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామికి ఆదివారం సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ యో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకం, రాత్రి సూర్యప్రభ వాహనసేవ ఉంటుందని వివరించారు. -
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
చిత్తూరు కలెక్టరేట్: విజయవాడ వేదికగా త్వరలో నిర్వహించనున్న 51వ జాతీయ మినీ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టు తరఫున చిత్తూరు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. శనివారం ఈ మేరకు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు టి. చెంగల్రాయ నాయుడు, కార్యదర్శి జి. సురేష్ బాబు, ఎన్పీ జయప్రకాష్ ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. వారు మాట్లాడుతూ బాలికల విభాగంలో హర్షిత, మనస్విని, సోనాల్, బాలుర విభాగంలో నాగసూర్య జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా వీరు జాతీయ జట్టుకు ఎంపికయ్యారని చెప్పారు. గతంలోనూ చిత్తూరు జిల్లా జట్లు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి సత్తా చాటాయన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్‌లు ఉదయభాస్కర్, బాబు, భాను, సంగీత, నటరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికై న క్రీడాకారులు -
మార్ఫింగ్ వీడియోపై మండిపాటు
నగరి : మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రోజా ఆలయం వెలుపలికి వస్తున్న సమయంలో మీడియా చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యక్తులు ఏఐ సాంకేతికతతో మార్పులు చేసి, ఆమె గుండు కొట్టించుకున్నట్లు కనిపించే విధంగా తప్పుడు వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నగరికి చెందిన నేతలు ఈ మేరకు సీఐ మల్లికార్జునరావు, నిండ్ర మండల నేతలు ఎస్ఐ మల్లికార్జునకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు పోస్టులు, రీల్స్, షేర్లు, ఫార్వర్డ్ రూపంలో ప్రచారం అవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో సమగ్ర దర్యాప్తు జరిపి, వీడియోను రూపొందించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్ఫింగ్ వీడియోలను ఎవరు మొదట రూపొందించారు, ఏ ఖాతా నుంచి తొలిసారిగా సోషల్ మీడియాలోకి తీసుకువచ్చారు, అనంతరం ఎవరెవరు షేర్, రీపోస్ట్, ఫార్వర్డ్ చేశారనే అంశాలను సాంకేతికంగా గుర్తించాలని పోలీసులను కోరారు. వీడియోలను తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా వైరల్ చేయడంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చాలని కోరారు. అత్యంత అభ్యంతరకరం ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాను వాస్తవానికి భిన్నంగా చిత్రీకరించి ప్రజల్లో తప్పుడు భావన కలిగించేలా వీడియోలను ప్రచారం చేయడం అత్యంత అభ్యంతరకరమని స్పష్టం చేశారు. సాధారణ రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా డిజిటల్ మార్పులతో తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడానికి తేడా ఉందని తెలిపారు. రాజకీయ విభేదాలతో ఒక మహిళా నాయకురాలి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. వీడియోల వెనుక టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు, వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసినా ఆధారాల మేరకు ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000తో పాటు దర్యాప్తులో వర్తించే ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగరి పట్టణ, రూరల్ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమల రెడ్డి, నేతలు కన్నాయిరం, గోపాల్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, మునివేలు, మురుగ, కృష్ణమూర్తి, ఆనందకుమార్, సలీం, యాకోబు, కన్నియప్ప, నాగభూషణం, వెంకటేశ్, రాజముత్తు, హరి, అముద, సంధ్యారాణి, శశికళ, పాండియన్, మేషాక్, భాస్కర్, రమేష్, పార్టీ నిండ్ర మండల కన్వీనర్ వేణురాజు, మాజీ ఎంపీపీ దీప, నేతలు అనిల్, విజేష్, మేరీ, రామచంద్రారెడ్డి, నవీన్, చెంచమ్మ పాల్గొన్నారు.వడమాలపేటలో.. తప్పుడు పోస్టులపై ఫిర్యాదుపుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన టీడీపీ అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ పుత్తూరు నేతలు ఎస్ఐ వెంకటలక్ష్మీకి ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి మాజీ మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, మాజీ వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, పార్టీ పుత్తూరు పట్టణ, రూరల్ అధ్యక్షులు ఏకాంబరం, భాస్కర్‌యాదవ్, నేతలు దిలీప్‌కుమార్, గోవిందస్వామిరెడ్డి, చక్రపాణి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్, శివ, రాంబత్తయ్య, బాబు, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు. వడమాలపేటలో.. మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వడమాలపేట ఎస్ఐ హరీష్‌కు వైఎస్సార్సీపీ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. సుబ్రమణ్యంరెడ్డి, సురేష్‌రాజు, మధన్‌మోహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గాంధీ, చంద్రరెడ్డి, ప్రతిమ, మంజులారెడ్డి, ఉమాపతి, భరత్, చంద్ర, పవన్, రాజేంద్రయ్య, కమలమ్మ, బత్తయ్య, బుచ్చిరెడ్డి, ధర్మయ్య పాల్గొన్నారు. -
వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్బంధం తిరుపతి అర్బన్ : సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు ఉద్యోగులు శనివారం సాయంత్రం బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆరో వార్డు సంక్షేమ కార్యదర్శి అమరావతి, 25వ వార్డు సంక్షేమ కార్యదర్శి రజినీకుమారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈస్ట్‌పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లులేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్ర మే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది. పవిత్రం.. పరిసమాప్తం చంద్రగిరి:తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శనివా రం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీపద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజ స్వామి వారు, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. వైభవోత్సవం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, పద్మా వతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించారు. టీటీడీ ఈఓ రవిచంద్ర, జేఈఓ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. -
లక్షల ఓట్లు.. ఔట్!
జిల్లాలో 1.36 లక్షల ఓటర్ల వివరాలు తొలగింపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఆరోపణల నేపథ్యంలో సర్ ప్రక్రియలో పారదర్శకతపై అందరిలో అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే ప్రచురించిన జాబితాలో ఏకంగా 1.36 లక్షల ఓట్లు తొలగించడంలో ఆంత్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, చిత్తూరు: సర్ ప్రక్రియలో భాగంగా తొలి జాబితా ప్రచురణ సమయంలో జిల్లా నుంచి 1,36,059 ఓట్లను అధికారులు తొలగించారు. ఈ సంఖ్య అసాధారణంగా కనిపిస్తోంది. దీనికి అధికారులు చెబుతున్న కారణాలు చనిపోయిన ఓటర్లు 42,337, ట్రేస్ కాని ఓటర్లు 18,622, వసల వెళ్లిపోయిన వాళ్లు 55,773, డబుల్ ఎంట్రీ 19,301, ఇతర కారణాలు 26 మంది ఓటర్లుగా చూపించారు. ఇందులో చనిపోయిన ఓటర్ల సంఖ్య తప్ప మిగిలినవన్నీ ‘సర్’ పేరిట అక్రమంగా తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మ్యాపింగ్ కాకపోవడం, పేర్లలో వ్యత్యాసం, అక్షర దోషాలు ఉన్నాయనే కారణాలతో జిల్లాలో ఏకంగా 1,34,307 మందికి నోటీసులు ఇవ్వడం కూడా సంచలనమే. అయితే ఇందులో ఇప్పటి వరకు 1,31,472 మంది క్లైయిమ్స్ను అధికారులు అంగీకరించారు. వీరందరికీ ఓటు హక్కును పునరుద్దరించారు. దాదాపు 2500 మంది ఓటర్లు అనర్హులుగా తేల్చడంతో.. తొలగింపు ఓట్లు 1.40 లక్షలకు చేరుకోనుంది. తప్పటడుగు అక్కడే.. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పిన సీఈసీ తొలి తప్పటడుగు అక్కడే వేసింది. జిల్లాలో చాలా మంది ఓట్లు అసలు 2002 జాబితాలో మ్యాపింగ్ కాలేదు. 24 ఏళ్ల తర్వాత ఇపుడు మ్యాపింగ్‌కు వెళితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో అసలు కనిపించలేదు. పైగా కుటుంబ సభ్యుల మ్యాపింగ్ ఏమాత్రం కుదరలేదు.‘సర్’ ప్రక్రియలో ఏకంగా తమ అభ్యంతరాలనే సీఈసీ 14 సార్లు పట్టించుకోలేదని తోటి కమిషనర్లు సీఈసీపై ఆరోపణలు చేశారు.. జిల్లాలో ప్రతిపక్ష నేతలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అసలు సర్ ప్రక్రియ సజావుగా సాగిందా..? లేదా..? అనే అనుమానం సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది. అసలు 2002లో సరైన ఓటర్ల జాబితా ఎందుకు రూపొందించలేదని ఓటర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తుది జాబితాపై కసరత్తు షెడ్యుల్ ప్రకారం మ్యాపింగ్ కాని, సవరణ చేయాల్సిన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 9వ తేదీన ప్రచురించాల్సి ఉంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. సీఈసీ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఓవైపు, నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారనే విమర్శల నడుమ అధికారులు తుది జాబితా ప్రచురణకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి కొత్తగా దరఖాస్తు తీసుకుని, జాబితాలో పేరును చేరుస్తామని చెప్పడం ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో నియోజకవర్గ వారీగా తొలగించిన ఓట్ల సంఖ్య పలమనేరు 29,381 చిత్తూరు 26,436 కుప్పం 24,418 నగరి 20,879 పూతలపట్టు 20,321 జీడీ నెల్లూరు 14,624 మొత్తం 1,36,059నమ్మశక్యంగా లేదు సార్వత్రిక ఎన్నికల సమయంలో చీకటి పడిన తర్వాత భారీగా ఓట్లు పోలవడంపై మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఎలాంటి సమాధనం చెప్పలేదు. ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో తోటి కేంద్ర ఎన్నికల కమిషనర్లు చెప్పిన అభ్యంతరాలనే సీఈసీ పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడం మా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. జిల్లాలో ఏకంగా 1.36 లక్షలకు పైగా ఓట్లు తొలగించడం అంటే నమ్మశక్యంగా లేదు. దీనిపై ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పి తీరాల్సిందే. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు -
ఫార్మసిస్టుల పాత్ర కీలకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్ఓ నాగశశి భూషణ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు గనరం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోగులకు మందులను ఏ మోతాదులో, ఎలా వాడాలనే దానిపై కౌన్సెలింగ్ ఇస్తూ ఫార్మసిస్టులు గొప్ప సామాజిక సేవ అందిస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏడుగురు సభ్యులను నూతనంగా ఎన్నుకున్నారు. జాతీయ స్థాయి పోటీలకు వెదురుకుప్పం విద్యార్థి వెదురుకుప్పం : జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చిన్మయ సాయి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు శివశంకరయ్య తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ మహారాష్ట్రలోని సి. శంభాజీనగర్‌లో ఆదివారం నుంచి 30 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకి చిన్మయ సాయి ఎంపికై నట్లు వెల్లడించారు. అనంతరం పుత్తూరు డీవైఈఓ మహేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో చిన్మయ సాయి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్‌ను అభినందించారు. అనంతరం విద్యార్థి చిన్మయ సాయి, ఉపాధ్యాయుడు రమేష్‌ను ఘనంగా సత్కరించారు. -
దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న పర్సన్ విత్ డిజేబుల్డ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లోకనాథం తెలిపారు. శనివారం నగరంలోని తపోవనం పాఠశాలలో సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా పి.లోకనాథం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్, జాయింట్ సెక్రటరీగా రవి, కోశాధికారిగా వేలు, అధికార ప్రతినిధిగా శేఖర్ నాయుడు, కార్యవర్గ సభ్యుడిగా చంద్రమోహన్న్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల బాధ్యులను ప్రకటించారు. పుంగనూరు బాధ్యుడిగా వెంకటరమణ, నగరికి మాతయ్య, పలమనేరుకు చంద్రమౌళి, కుప్పానికి నారాయణప్ప, పూతలపట్టుకి బాలయ్య, చిత్తూరు నియోజకవర్గ బాధ్యుడిగా సురేష్ నాయుడును ఎన్నుకున్నారు. సదరం వెరిఫికేషన్‌లో పారదర్శకత అవసరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల వైకల్య శాతం పునఃపరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియపై ప్రభుత్వం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యంతో పాటు నివాస గృహాలు మంజూరు చేయాలని సూచించారు. దివ్యాంగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారు సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ఫక్రుద్దీన్, సుగుణమ్మ పాల్గొన్నారు. -
వరసిద్ధునికి వెండి పుష్పమాల సమర్పణ
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం పలువురు భక్తులు భారీ విరాళాలు సమర్పించారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులు రూ.2.50 లక్షల విలువైన, సుమారు 1 కిలో బరు వు కలిగిన వెండి పుష్పమాలను బహూకరించారు. అలాగే నిత్య అన్నదాన ట్రస్టుకు రూ. ఒక లక్ష విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోమసత్య శ్రీనివాసరావు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ. ఒక లక్ష విరాళాన్ని ఆల య అధికారులకు అందించారు. దాతలకు ఆల య అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. సర్ సిబ్బందికి జీతాలు మంజూరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ కార్యక్రమంలో విధులు నిర్వహించిన సిబ్బందికి వార్షిక జీతాలు మంజూరు చేశారు. శనివారం ఈ మేరకు ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈఆర్ఓలకు రూ.30 వేలు, అదనపు ఈఆర్ఓలకు రూ.25 వేలు మంజూరు చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఈఆర్ఓ, 80 మంది ఏఈఆర్ఓలు, 1,708 మంది బీఎల్ఓలు, 176 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. బీఎల్ఓ, సూపర్వైజర్లకు రూ.6 వేల చొప్పున మంజూరు చేశారు. నేడు బధిరుల దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్: అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులశాఖ ఏడీ పుల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని బధిరుల సంఘాల ప్రతినిధులు, బధిర ప్రభుత్వ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. -
ప్రజాసేవే పరమావధిగా విధులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పోలీసులు ప్రజాసేవే పరమావధిగా విధులు నిర్వర్తించాలని, పోలీసు యూనిఫామ్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మహత్తర బాధ్యతకు ప్రతీకని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులను గౌరవిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తూ, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు భరోసానిచ్చేలా పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీకటి మూర్తి (బెస్ట్ ఆల్‌రౌండర్– అవుట్డోర్), వెంకటేష్ (ఇండోర్), వినయ్ (ఫైరింగ్), 5వ స్క్వాడ్ (బెస్ట్ స్క్వాడ్)కు మంత్రి, అధికారులు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ పాల్గొన్నారు. -
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు సరిగ్గా చెప్పకుండా అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఇటీవల చిత్తూరులోని గిరింపేట, సంతపేట నగరపాలక హైస్కూళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఈఓ వివరించారు. సాక్షి: ఇటీవల మీ ఆకస్మిక తనిఖీల్లో గమనించిన ప్రధాన అంశాలేమిటి? ఉపాధ్యాయుల పనితీరుపై మీ అభిప్రాయం? డీఈఓ:కొన్ని పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్థులు ఉన్నప్పటికీ నాన్ లాంగ్వేజ్ టీచర్లు పాఠాలు చెప్ప కుండా స్టాఫ్ రూమ్‌లో ఖాళీగా కూర్చోవడం గమనించాం. ఇది అత్యంత బాధాకరం. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు, శాఖాపరమైన చర్యలు తప్పవు. సాక్షి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈఓ: 2027 మార్చి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ’మిషన్ మార్చ్ 2027’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని 341 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో మొత్తం 13,989 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరి అభ్యసన సామర్థ్యాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నాం. సాక్షి: రాబోయే రోజుల్లో పాఠశాలల పర్యవేక్షణ, సమీక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి? డీఈఓ: త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన హెచ్ఎంలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నియోజకవర్గ, మండల, పాఠశాల స్థాయిల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కులను విశ్లేషిస్తాం. ముఖ్యంగా గత పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత సాధించిన 75 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సాక్షి: విద్యాబోధన నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? డీఈఓ: ఏదో పాఠం చెప్పామా, వెళ్లామా అన్నట్టు కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా లెసన్ ప్లాన్ సిద్ధం చేసుకునే బోధించాలి. పరీక్షల్లో విద్యార్థులు ఎందుకు తక్కువ మార్కులు సాధిస్తున్నారో బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలి. నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు చేపడతాం, బోధనలో వెనుకబడినా, అలసత్వం వహిస్తే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరుతున్నాం. -
కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం
నారాయణవనం: సాంకేతికతను అందిపుచ్చుకుని, కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో యువ ఇంజినీర్లు శ్రద్ధ చూపాలని తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో విజయవంత్ మాథుర్ సూచించారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ‘వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలు, అనువర్తనాలు, భవిష్యత్ అవకాశాలు’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ శనివారం ముగిసింది. స్మార్ట్ ఫార్మింగ్, డిజిటల్ వ్యవసాయం, జనరేటివ్ ఏఐ, మొక్కల వ్యాధుల గుర్తింపులో డీప్ లెర్నింగ్, డ్రోన్లు–రోబోటిక్స్, పంట దిగుబడి అంచనా, వాతావరణ అనుకూల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆహార నాణ్యత అంచనా, భద్రత, ఏఐ ఆధారిత తనిఖీ పద్ధతులు, నేల–నీటి వనరుల నిర్వహణపై సెషన్లు నిర్వహించారు. శనివారం జరిగిన సెమీనార్‌లో ముఖ్యఅతిథి విజయవంత్ మాధుర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల సమన్వయంతో వ్యవసాయరంగంలో సాంకేతిక పరిష్కారాలను అందుబాటులోకి తీసురావాలని సూచించారు.. ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడ, వ్యవసాయ–ఆహార రంగాల్లో ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కళాశాలలు శ్రద్ధ చూపాల ని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాళ్లు రమేష్‌కుమార్, జనార్ధనరాజు, వైస్ ప్రిన్సిపల్ మధు, ప్రోగ్రాం కన్వీనర్ మల్లిక, కో–ఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూలవిరాట్లకు పవిత్ర మాలాధరణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాధి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలు విశేష పూజాద్రవ్యాలను ఆలయ ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి తొలుత రంగుల గోపురం వద్ద ఉన్న వినాయకునికి పవిత్రమాల సమర్పించారు. అదేవిధంగా ఆలయంలో ఉన్న పరివార దేవతలకు కూడా పవిత్రమాలలు సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలలు సమర్పించారు. -
వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు
– 41 నోటీసు ఇచ్చి పంపి.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. సాక్షి టాస్క్‌ఫోర్స్ : వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల చిత్తూరు మండలంలోని నాయనిచెరువు, నగరంలోని దొడ్డిపల్లె ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్ గుట్టును వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను బీసీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ మండల నేత త్యాగరాజులు సైతం తనదైన శైలిలో గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు కుట్రపూరితంగా కేసు నమోదు చేయించేందుకు తెగబడ్డారు. పాత వీడియోలను తెరపైకి తెచ్చి, అక్రమంగా మద్యం పెట్టించి కేసు నమోదు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు.. పోలీసులు వైఎస్సార్సీపీ మండల నేత త్యాగరాజులకు మధ్యాహ్నం. 3.30 గంటలకు 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంరారు. మళ్లీ రాత్రి 8 గంటల ఫోన్‌చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. 24 గంటల స్టేషన్లోనే ఉండాలని ఆదేశించారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గే పోలీసులు మళ్లీ పిలిపించి స్టేషన్లో ఉంచారని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. బంగారు కుటుంబానికి అవార్డు కుప్పం : కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 బంగారు కుటుంబం కార్యక్రమానికి జాతీయ స్థాయిలోని గుర్తింపు లభించింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా)ను స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్ లో కడా పీడీ వికాస్ మర్మత్, పీకేఎం యుడా చైర్మన్ సురేష్ అవార్డులను అందుకున్నారు. -
చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఎం.మురుగన్ అలియాస్ రాము (52), కె.బాబు (43) గ్రామీణ ప్రాంతాలు, నిర్మానుష్య రహదారుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడేవారన్నారు. జూలై 11వ తేదీన పెనుమూరు మండలం మొరవకండ్రిగ, జూలై 30న చిన్నరాజుపల్లె, మే 12న జీడీ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లె సమీపంలో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారని వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు.. సీఐలు రామచంద్ర, సయ్యద్ హషం, ఎస్ఐలు పి.శ్రీకాంత్, మణికంఠేశ్వర రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఏఎస్ఐ దేవరాజులు రెడ్డి, క్రైమ్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తించారన్నారు. విశ్వసనీయ సమాచారంతో పెనుమూరు మండల కొత్త రోడ్డు సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఏ–1 నిందితుడు మురుగన్్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 16 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులను వేగంగా ఛేదించి, రికవరీ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. -
28, 29న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్య టిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సూర్య నారాయణరాజు, సభ్యు లు పద్మలత జిల్లాలో పర్యటిస్తారన్నారు. 28న మధ్యా హ్నం కమిటీ సభ్యులు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, బాలల సంరక్షణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తారని వివరించారు. మౌలి క వసతులు, బాలల రక్షణ చర్యలను పరిశీలిస్తారన్నారు. 29న ఉదయం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. కమిటీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదేం వైద్యం గురువా! పలమనేరు: ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు పాఠాలు చెప్పాలి కానీ, కొందరు అతిగా వ్యవహరించి అభాసుపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె మండలం కంచనపల్లెలో రెండు రోజుల క్రితం జరిగింది. పాఠశాలలోని ఓ టీచర్ ఆయుర్వేదంపై మక్కువతో కొన్నేళ్లుగా భోజ నం చేయకుండా కేవలం కొన్ని ద్రావణాలు తాగుతానని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ బడిలో ఓ ఆలయం నిర్మించాడు. అక్కడే నిత్యం పూజల్లో ఉంటారు. అక్కడితో ఆగకుండా తాను పాటిస్తున్నవిధానాలను పిల్లలపై రుద్దాడు. కొన్నాళ్లుగా విద్యార్థులకు కొన్ని ఆకులు, సుంగధ ద్రవ్యాలు తినిపిస్తున్నారు. గురువారం ఈ క్రమంలోనే పిల్లలు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆశా వర్కర్ ఇచ్చిన ఐరన్ మాత్రలు వేసుకుని అస్వస్థతకు గురయ్యారు. సదరు టీచర్ తినిపించిన నాటు మందుల కారణంగానే పిల్లలు అనారోగ్యానికి గురయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఈఓల పర్యవేక్షల లేకపోవడంతోనే టీచర్లు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.30 వేల అపహరణ పలమనేరు : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో శుక్రవారం కుప్పం బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడి జేబులోని రూ.30 వేలు అపహరణకు గురైంది. వివరాలు.. బైరెడ్డిపల్లెకు చెందిన టమాటా వ్యాపారి అశోక్ పలమనేరుకు సొంత పనికోసం వచ్చాడు. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కుతుండగా నగదు చోరీకి గురైంది. బాధితుడు ఈ మేరకు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం.. లాంఛనం!
కాణిపాకం : రెవెన్యూ కార్యాలయాలు ఉండేది ప్రజా సమస్యలు తీర్చేందుకా లేక, కాసులు పిండుకునేందుకా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, సర్వేల కోసం సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రజలు ఇచ్చే వినతిపత్రాలు నేరుగా చెత్తబుట్టల్లోకే చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన వీఆర్ఓలు, సర్వేయర్లు పలు చోట్ల వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. పర్యవేక్షించే అధికారులు స్పందించకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యవర్తులతో దందా! పూతలపట్టు నియోజకవర్గంలో ఐదు తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. ఈ ఆఫీస్‌లకు రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వస్తుంటారు. ప్రధానంగా బంగారుపాళ్యం, ఐరాల, యాదమరి, తవణంపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ కార్యాలయాల్లో కొన్ని అక్రమాలకు అడ్డాగా మారిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముడుపులు ఇవ్వందే ఫైళ్లు కదలండంలేదని ఆవేదన చెందుతున్నారు. చాలామంది రెవెన్యూ సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మధ్యవర్తులను పెట్టుకునిగా వసూళ్ల దందా నడుపుతున్నారని మండిపడుతున్నారు. అంగట్లో సర్కారు లాగిన్లు అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయంటే.. యాదమరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే కొందరు రెవెన్యూ అధికారుల ప్రభుత్వ లాగిన్ ఐడీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారిక లాగిన్లను దళారులకు అప్పగించి బహిరంగంగానే కాసులు గుంజుతున్నారని వెల్లడిస్తున్నారు. ఐరాల మండలంలో వన్ బీ, భూ మార్పులు, భాగ పరిష్కారాలు, సర్వే దరఖాస్తుల విషయంలో భూ యజమానులకు నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. బంగారుపాళ్యంలో అయితే కొందరు వీఆర్ఓలు పనులు చేయకపోగా.. తిప్పించుకుంటున్నారని, ఇదేమని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల కన్నుసన్నల్లోనే..? టీడీపీ నేతల కన్నుసన్నల్లో, వారి సిఫార్సులతోనే తహసీల్ధార్ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయని స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ దోపిడీపై సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీలోని కొంత మంది నాయకులు కూడా మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటమే ఈ అడ్డగోలు అవినీతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రెవెన్యూ శాఖలోని అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వసూలు పర్వం ఇలా.. భూ విలువను మేరకు రూ.5వేల నుంచి ఏకంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించి ఆన్‌న్‌లైన్ చేసేందుకు రూ. లక్షల్లో రేట్లు కుదుర్చుకుంటున్నారని వెల్లడిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సైతం రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆన్‌న్‌లైన్‌న్‌లో చలానా కట్టి దరఖాస్తు చేసుకున్నా అస్సలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. గొలుసు పట్టాలంటే రూ.10వేల నుంచి రూ.30వేల సబ్‌డివిజన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే భూమి విస్తీర్ణం, విలువను బట్టి ఏకంగా రూ.3లక్షల వరకు గుంజుతున్నారని వివరిస్తున్నారు.పూతలపట్టు నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాలను కొందరు అధికారులు అవినీతికి అడ్డాగా మార్చేశారు. ప్రతి పనికీ లంచం ఇవ్వడమనేది లాంఛనంగా తయారు చేసేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అడిగినంత చెల్లించాల్సిన దుస్థితిని కల్పించేశారు. మాట వినకుంటే కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని పరిస్థితి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. -
కళ్లజోళ్ల టెండర్లో గోల్మాల్!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పాఠశాల విద్యార్థులకు కళ్ల జోళ్లు పంపిణీ చేసేందుకు నిర్వహించిన టెండర్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ టెండర్లలో గోల్మాల్ జరిగిందని, అర్హులైన టెండర్‌దారులను కావాలనే పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 11,739 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 1,023 మందికి, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించి 51,047 మంది పిల్లలకు పరీక్షలు చేయగా 2,910 మందికి కంటి లోపాలున్నట్లు గుర్తించారు. అయితే వీరికి కళ్లజోళ్లు పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగుతోందని సాక్షి దినపత్రికలో ఆగస్ట్ 29వ తేదీన ‘‘ఆరిపోయిన వెలుగు’’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు 6 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కళ్ల జోళ్లు అందించేందుకు బుధవారం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. రూపాయి తేడాతో కోట్ ఒక్కో కంటి జోడుకు గరిష్ట ధరగా రూ.280 నిర్దేశించగా, మొత్తం ఆరుగురు టెండర్‌దారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నలుగురు ముందస్తు ప్రణా ళికతో సిండికేట్‌గా మారి కేవలం ఒక్క రూపాయి తేడాతో (రూ.278, రూ.279, రూ.279.50) కోట్ చేశారని మిగిలిన ఇద్దరు టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. కుట్రపూరితంగా తమను పక్కన పెట్టా రని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఓ టెండర్‌దారుడు మాట్లాడుతూ తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని, అక్కడి జీఎస్టీ ఇక్కడ చెల్లదనే సాకుతో తన దరఖాస్తును రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు తనకు టెండర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడే కొత్త నిబంధనలు తెచ్చారని వాపోతున్నారు. మరో టెండర్‌దారుడు మాట్లాడుతూ డీడీ పత్రంపై సాంకేతిక సాకులు చూపి టెండర్ ప్రకియకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు అధికారుల తోడ్పాటుతోనే ఈ సిండికేట్ వ్యవహారం నడిచిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డిని వివరణ కోరగా.. టెండర్ల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటానని వెల్లడించారు. -
నులి నిర్మూలనతో ఆరోగ్యం
చిత్తూరు కలెక్టరేట్ : నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్యం, ఏకాగ్రత లభిస్తుందని డీఈఓ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ శశిభూషణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు ఆల్బెండజోల్–400 మాత్రలను మింగించి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల బాల బాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలను అందజేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,10,910 మంది బాలబాలికలకు మాత్రలను వేయించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2102 అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 2 ఏళ్ల పిల్లలు (63,963 మంది)కి అర మాత్ర, 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్ర అందజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 2,248 పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 19 ఏళ్ల విద్యార్థులు (2,09,245 మంది) విద్యార్థులకు ఒక మాత్ర అందజేస్తున్నట్లు చెప్పారు. కడుపులో నులిపురుగులు ఉంటే పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల పోషకాల గ్రహణశక్తి, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా, చిన్నవిగా ఉంచుకోవాలని సూచించారు. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. కల్తీ లేని, శుభ్రమైన తాగునీటినే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో డీవైఈవో ఇందిర, ఆర్బీఎస్కే రాష్ట్ర అబ్జర్వర్ వినోద్, జిల్లా ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ గిరి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్, హసన్‌బాషా పాల్గొన్నారు. -
● తమలపాకుపై వాయుపుత్రుడు
స్పోర్ట్స్ కోటా బాధితులపై దాడి దారుణం చిత్తూరు రూరల్ (కాణిపాకం): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బాధితులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులపై ప్రభుత్వమే దాడులు చేయించడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై రౌడీలతో దాడి చేయించడం ప్రభుత్వ ప్లానన్డ్ టెరర్రిజంలో భాగమేనని ఆరోపించారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బెజవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జి చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ న్యాయవాది, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్‌పై తప్పుడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ అనైతిక చర్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు, లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి ఆత్మహత్య పలమనేరు : మండలంలోని ఎగువ కల్లాడు గ్రామానికి చెందిన ఉపేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉపేంద్ర కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గతంలో వీరి కుటుంబం బైరెడ్డిపల్లె మండలంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల బెంగళూరుకు వలస వెళ్లారు. దీంతో ఉపేంద్రను ఎగువ కల్లాడులోని అవ్వ వద్ద ఉంచారు. గురువారం రాత్రి ఏం జరిగిందో కానీ, ఆ బాలుడు గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. బిడ్డకు పాలిస్తుండగా దూసుకొచ్చిన కారు – భార్యాభర్తలకు తీవ్రమైన గాయాలు పెద్దపంజాణి: పుంగనూరు మండలం దిగువ కొండమీద పల్లెకు చెందిన మురళి(31) పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరుకు చెందిన మాధురి(27)ని వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెడ్డి మీనాక్షి, రెడ్డి లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు. ఈ నేపథ్యంలో బిడ్డలకు గ్రహ సంబంధం సోకిందని నాటు వైద్యం చేయించుకోవడానికి శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంలో ముత్తుకూరులోని అత్తగారి ఇంటికి వచ్చారు. వైద్య చేయించుకున్న అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గం మధ్యలోని పుంగనూరు– పలమనేరు హైవేపై పెద్దారికుంట బస్టాప్ వద్ద బైక్‌ను రోడ్డు పక్కన ఆపి బిడ్డకు మాధురి పాలిస్తున్నారు. అంతలోనే పుంగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొని ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన మురళి, లావణ్యను స్థానికులు చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల రెఫర్ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. -
ట్రైనీ కానిస్టేబుళ్ల పరేడ్ రిహార్సల్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరేడ్ మైదానంలో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్‌ను శుక్ర వారం నిర్వహించారు. శనివారం జరగనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్ కోసం ట్రైనీలు కవాతు, మార్చ్‌పాస్ట్ చేపట్టగా.. ఎస్పీ తుషార్ డూడీ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధాన పరేడ్ నిర్వహణ, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, సమన్వయంపై ట్రైనీలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం నిర్వహించే ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్ అతిథులుగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహబూబ్‌బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, డీటీసీ డీఎస్పీ జె.రాంబాబు, ఏఆర్ డీఎస్పీ రామకృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
● అక్రమంగా నగదు వసూలు చేస్తున్న టీడీపీ నేతలు ● వితంతువుల నుంచి డప్పు కళాకారుల వరకు తప్పని వేధింపులు ● ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల వరకు డిమాండ్ ● దరఖాస్తుల పరిశీలనలో అధికారులపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యేలు ● జిల్లాలో పింఛన్ల కోసం 43 వేలకు పైగా అప్లికేషన్ల
సాక్షి, చిత్తూరు : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 43 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో డప్పు కళాకారుల పేరిట 2,970 దరఖాస్తులు అందాయి. కానీ, జిల్లాలో ఇంత మంది లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టీడీపీకి చెందిన కార్యకర్తలకు డప్పు కళాకారుల వేషం వేసి, తప్పుడు సర్టిఫికెట్లతో ఆ కేటగిరీ నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేయించారు. ఇక ఆధార్ కార్డులో మార్పులు చేసి వృద్ధాప్య పింఛన్ కోసం 2 వేలకు పైగా టీడీపీ కార్యకర్తల డేటా ఆన్లైన్లో నమోదైనట్లు తెలుస్తోంది. ఓవైపు కార్యకర్తలకు నెలవారీ ఆదాయం ఇప్పించడం కోసం ఆయా కేటగిరీ వేషాలు వేయిస్తున్న టీడీపీ నేతలు.. ఇదే సమయంలో అర్హుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారనే డేటాను తెప్పించుకున్న కొందరు నాయకులు, వారి ఇళ్ల వద్దకే వెళ్లి మరీ బేరసారాలు సాగిస్తున్నారు. ఒక్కో పింఛన్ మంజూరుకు కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి ఇక పింఛన్ల మంజూరు కోసం అధికారుల గొంతుపై ప్రజా ప్రతినిధులు కత్తిపెడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 వేల దరఖాస్తులను ఆమోదించిన యంత్రాంగం, 30 వేల వరకు పెండింగ్‌లో ఉంచింది. తాము ఆమోదించిన పేర్లను వెంటనే అర్హుల జాబితాలోకి ఎక్కించాలని నేతలు పట్టుపడుతున్నారు. దీంతో ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులు..? అనేది తేల్చుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో స్వర్ణయుగం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పల్లె వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్న్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యామిలీ ఫిజిషియన్ విధానానికి జిల్లాను పైలెట్‌గా ఎంపిక చేసి విజయవంతంగా అమలు చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లే కేంద్రంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ముందుగానే సమాచారం అందించి 104 వాహనాలను గ్రామాలకు రప్పించేవారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు ఉంటే డాక్టర్లే నేరుగా వారి ఇంటికి వెళ్లి ఉచితంగా పరీక్షించి, రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో మందులు అందించేవారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్న వారిని సైతం ఇంటికెళ్లి పరామర్శించి వైద్యం చేసేవారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఉచిత వైద్యం అందక పల్లె ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి 104 వాహనాలకు మరమ్మతులు చేయించి, తగినన్ని మందులు అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన 39 సంచార వైద్య వాహనాల్లో ప్రస్తుతం కేవలం 29 మాత్రమే అరకొరగా తిరుగుతున్నాయి. మిగిలిన వాహనాలు వేర్వేరు మండలాల్లో అసలు కనిపించడమే మానేశాయి. గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, కార్వేటినగరం, నగరి, గంగవరం, పులిచెర్ల, వి.కోట, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాలకు చెందిన 10 వాహనాలు సేవలకు దూరమయ్యాయి. అవి మరమ్మతులకు గురవడంతో విజయవాడకు పంపించామని అధికారులు చెబుతున్నప్పటికీ, దాదా పు నెల నుంచి పల్లె సేవలను పూర్తిగా నిలిపివేయ డం గమనార్హం. ముఖ్యంగా గుడిపాల మండలంలో 104 వాహనం కేవలం షెడ్డుకే పరిమితమైంది. బొమ్మసముద్రం, గుడిపాల ప్రాంతాల్లో అసలు వాహనం రాకపోయినా, సేవలందించినట్లు కాగితాల్లో చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం రావడంతో హడావుడిగా రిపేర్ పేరుతో అధికారులు ఆ వాహనాన్ని విజయవాడకు పంపించి చేతులు దులుపుకున్నారు. బోగస్ ఓపీలు సంచార వైద్యం తూతూమంత్రంగా మారడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి అంతా బాగుందని చూపించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది బోగస్ ఓపీలను నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు రోగులను పరీక్షించకుండానే వందలాది పేర్లను రికార్డుల్లో ఎక్కించి సేవలు అందించినట్లు కథలు అల్లుతున్నారని పలువురు చెబుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే ఈ బోగస్ డ్రామాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఉండాల్సినవి ఇవీ.. 104 వాహనంలో విధిగా ఉండాల్సిన జ్వరం మాత్రలు (పారాసిటమాల్ 500 ఎంజీ), గ్యాస్ ప్రాబ్లమ్ మాత్రలు (పాంటోప్ 40 ఎంజీ), ఒళ్లు నొప్పుల బిళ్లలు (డిక్లోఫెనాక్), బీపీ మాత్రలు (అటెనలాల్ 50 ఎంజీ, అమ్లోడిపిన్), యాంటీబయోటిక్స్ (అమాక్సిలిన్ 500 ఎంజీ, సెఫిక్సిమ్)తో పాటు చిన్నపిల్లలకు ఇచ్చే జ్వరం, దగ్గు, విరేచనాల టానిక్‌లు అసలు సరఫరా కావడం లేదు. దీంతో పాటు మరికొన్ని మాత్రలు, మందులు కూడా లేవని పలువురు సిబ్బంది చెబుతున్నారు. మందులు లేవని స్థానిక సిబ్బంది అధికారులకు నివేదికలు పంపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. నామమాత్రంగానే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు తప్పనిసరిగా 104 వాహ నంతో పాటు పల్లెలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం జిల్లాలో పలు చోట్ల డాక్టర్లు పల్లెలకు వెళ్ల డం లేదు. కేవలం ఏఎన్‌న్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మాత్రమే నామమాత్రంగా పల్లెలకు వెళ్లి ఏదో మొక్కుబడిగా హడావుడి చేసి వస్తున్నారు. వాహనంలో ఏయే మందులు ఉన్నాయో, ఏ రోగానికి ఏ మాత్ర ఇవ్వాలో కూడా తెలియకుండానే చికిత్స పేరిట రోగులకు మందులు ఇచ్చి పంపించేస్తున్నారు. సాధారణ జ్వరం, బీపీ, షుగర్, ఒళ్లు నొప్పులకు ఇచ్చే ప్రాథమిక మందులు కూడా కరువయ్యాయి. -
జెడ్పీ ఉద్యోగుల పునర్విభజన పూర్తి
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలను మూడో రోజు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.చిత్తూరు కలెక్టరేట్ : గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న జెడ్పీ పునర్విభజన కసరత్తు ఈనెల 24 వ తేదీతో పూర్తయింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేశారు. నూతనంగా ఏర్పడిన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌లకు మొత్తం 88 మంది ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా పోస్టుల వారీగా సిబ్బందిని మూడు జెడ్పీలకు కేటాయిస్తూ జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల విభజన చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జెడ్పీకి 38 మంది కేటాయింపుల్లో చిత్తూరు జెడ్పీకి అత్యధికంగా 38 మంది, తిరుపతి జెడ్పీకి 27 మంది, అన్నమయ్య జెడ్పీకి 23 మంది ఉద్యోగులు కేటాయించారు. పరిపాలనా అధికారుల విభాగంలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 3, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 16 మందిని కేటాయించారు. డ్రైవర్లు మూడు జెడ్పీలకు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు 13, అన్నమయ్యకు 8, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 30 మందిని కేటాయించారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్లో చిత్తూరుకు 6, అన్నమయ్యకు 3, తిరుపతికి నలుగురు చొప్పున మొత్తం 13 మందికి కేటాయించారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు ఇద్దరు, అన్నమయ్యకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున నలుగురిని కేటాయించారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు 8, అన్నమయ్యకు 5, తిరుపతికి 6 మంది చొప్పున మొత్తం 19 మందిని కేటాయించారు. టైపిస్టు పోస్టుల్లో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 2, తిరుపతికి ముగ్గురు చొప్పున 9 మందిని కేటాయించారు. దీంతో జిల్లాల పునర్విభజన అనంతరం మూడు జిల్లా పరిషత్‌లకు అవసరమైన సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. -
కిక్కు ఐడియా ఫలించినట్టే !
సాక్షి, చిత్తూరు: మద్యం దుకాణాల లైసెన్సులను తీసుకోవడంలో ఇప్పటికే ఆరితేరిన కొందరు వ్యక్తుల ఐడియా ఫలించినట్టే. మద్యం దుకాణాల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో టెండర్లు పిలవకుండా.. రెన్యూవల్ పేరిట తమ కార్యకర్తలకు ఉపాధి చూపించాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రెన్యూవల్ ప్రతిపాదనకు తెరతీసింది. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలోని 18 దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్‌కు వెళ్లకుండా.. వేసిన ప్రణాళిక అమల్లోకి వచ్చేసింది. రీ–నోటిఫికేషన్ జిల్లాలోని 113 మద్యం దుకాణాల్లో, 95 దుకాణాలు రెన్యూవల్స్ తీసుకున్నారు. మిగిలిన 18 మంది లైసెన్సీలు రెన్యూవల్ చేసుకోలేదు. ఫలితంగా చిత్తూరు కార్పొరేషన్లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు జిల్లా ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే పెద్ద పంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌండ్లలకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. గురువారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 1వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను 3వ తేదీ వరకు పరిశీలించి, 5వ తేదీన చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు లక్కీడిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామన్నారు. రూ.3 లక్షల నాన్–రీఫండబుల్ దరఖాస్తు రుసుం, అలాగే ప్రతి దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా దాఖలు కావాలనే నిబంధన ఉంచారు. లక్కీడిప్‌లో లైసెన్సులు పొందిన వాళ్లు ఏడాది పాటు దుకాణాలను నిర్వహించుకోవచ్చు. జిల్లాలో 19 మద్యం దుకాణాలకు రీ–నోటిఫికేషన్ అనుకున్నదే.. మద్యం దుకాణాలను రెన్యూవల్ చేసుకుంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించాలి. అదే లక్కీడిప్‌కు వెళితే నాలుగు దరఖాస్తులు దాఖలు చేసినా, రూ.12 లక్షల వ్యయం మాత్రమే అవుతుంది. ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు దరఖాస్తు చేయకుండా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రూపొందించిన ప్రణాళికపై మూడు రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమయ్యింది. ప్రభుత్వం కనీసం పది దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్ తీస్తామనే నిబంధన ఉంచినట్లయితే.. ఖాజాను గండిపడేదికాదు. కానీ ఇపుడు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. పచ్చ కార్యకర్తల జేబులు నింపేలా తయారయ్యింది. -
కుర్చీ ఇస్తారా? ఎంతైనా ఖర్చు పెడతాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎవరికి వారు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం పైరవీలు, బేరసారాలు మొదలు పెట్టేశారు. కుర్చీ కోసం ఎన్ని కోట్లయినా పెట్టుకుంటామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగారు. అధికారం చేజిక్కించుకున్నాక పాలనా వ్యవహారాలు, పదవులు, పనుల పంపకాల్లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘మేము లేకపోతే మీరు గెలిచే వారు కాదు, పదవులు అనుభవించేవారు కాదు’ అంటూ మూడు పార్టీ శ్రేణులు నువ్వెంత అంటే.. నువ్వెంత అని మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ బలాన్ని నిరూ పించుకోలేకపోతే అధికారంలో ఉన్నన్ని రోజులు మా దయా దాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్నారని ఎత్తిపొడుస్తూనే ఉంటారని కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అధిష్టానం నుంచి కూడా సంకేతాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమేరకు జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీచేయకపోతే పరువు పోతుందని బీజేపీ భావిస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో బరిలో దిగాలని భావిస్తోంది. పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయోనని ఎవరికి వారు బృందాలను ఏర్పాటు చేసి సర్వేలు చేయించుకుంటున్నారు.తిరుపతి, చిత్తూరు మేయర్ స్థానాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్ పీఠాల కోసం టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కుర్చీలు కావాలంటే భారీగా ఖర్చు అవుతుందని ముఖ్య నాయకులు చెబితే.. అందుకు సరే పెట్టుకుంటాం అంటూ స్పష్టం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తిరుపతి మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ కోసం బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తన కుమారుడి కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మరో బీజేపీ నేత కూడా మేయర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ల కుర్చీ కోసం పోటీ పడుతున్న టీడీపీ, జనసేన పార్టీలో ఐదుగురు నాయకులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు పెట్టేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా తమ పార్టీ కార్యకర్తలు కూడా వార్డుల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నగరి, పలమనేరు, కుప్పంలోనూ జనసేన నేతలు కొందరు పోటీ చేయాలని ఆశపడుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా రిజర్వేషన్లు ఖరారు అయ్యాక మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమిలో కుమ్ములాట అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా కొట్టాం.. అధికారం తెచ్చాం.. అని సంబరపడిన కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అసలు రంగు బయటపడుతోంది. నగరపాలక పీఠంపై జెండా పాతేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు కత్తులు నూరుకుంటున్నారు. మా బలం లేకపోతే మీరు గెలిచేవారా? అంటూ ఒకరికొకరు ఎత్తిపొడుపులకు దిగుతున్న నేతలు, కుర్చీ కోసం కోట్లు కుమ్మరించడానికై నా వెనుకాడబోమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీల మార్క్ చూపించుకోకపోతే భవిష్యత్తు శూన్యమనే భావన క్యాడర్లో బలంగా నాటుకు పోయింది. మిత్ర పక్షాల ముసుగులో సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
ఆకాశంలో అద్భుతం
– చంద్రుడి చుట్టూ కాంతి వలయం! కాణిపాకం : ఆకాశంలో ఒక అరుదైన, సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి వేళ చందమామ చుట్టూ దివ్య వలయం ఏర్పడి ప్రజలను అబ్బురపరిచింది. నింగిలో జాబిల్లికి రత్నాల ఉంగరం తొడిగినట్లున్న ఈ దృశ్యాన్ని చిత్తూరు నగరంలో పలువురు తిలకించి, తమ ఫోన్లలో బంధించారు. ఎత్తులో ఉన్న మేఘాల్లోని మంచు స్పటికాల గుండా చంద్రకాంతి ప్రయాణించినప్పుడు ‘వక్రీభవనం’ చెందడం వల్లే ఈ కాంతి చక్రం ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఇది పూర్తిగా సహజమైన భౌతిక ప్రక్రియ మాత్రమేనని వివరించారు. -
వ్యవస్థాగత మనుగడకు ముప్పు
ప్రభుత్వాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఇప్పటికే బడ్జెట్ నిధులతో నడిచే సమాచార పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) అనే శాఖ ఒకటి ఉంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయకుండా, పబ్లిసిటీ పేరుతో ప్రయివేటు ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు ప్రజాధనం చెల్లించడం వల్ల జవాబుదారీతనం దెబ్బతింటుంది. ఆర్థిక లోటున్న రాష్ట్రంలో ప్రాధాన్యత రహిత ప్రచారాల కంటే విద్య, వైద్యం, ఉపాధి కల్పన, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టడం తక్షణ అవసరం. – వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి. చట్టపరమైన నిబంధనలు, పక్షపాత ముప్పు ప్రభుత్వ నిధులతో నిర్వహించే ప్రచారాల్లో ఎలాంటి పక్షపాతం, రాజకీయరంగు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే, ఇది అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది. – విజయసింహారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, అడ్వకేట్. హామీలను విస్మరించారు ‘ప్రభుత్వం తమ సొంత సెల్ఫ్ డబ్బా’ కోసం లక్షలాది రూపాయలను సోషల్ మీడియా ప్రచారకర్తలకు ధారపోయడం సమంజసం కాదు. ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగ భృతిని పునరుద్ధరించడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, సంక్షేమ పింఛన్ల విస్తరణపై దృష్టి పెట్టాలి. ప్రచారాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం సరైన విధానం కాదు. – మనోజ్‌రెడ్డి, యువత. చిత్తూరు. ఆర్థిక శ్రేయస్సు, నిధుల దుర్వినియోగమే రాష్ట్రం తీవ్రమైన అప్పులు, ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారాలకు ప్రత్యేక బడ్జెట్ అవసరమా? ఏటా పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయాలు ధారపోయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రత్యేక్ష ప్రయోజనం చేకూరదు. – సోను, యువత, ఐరాల. ఐటీడీపీకి దోచిపెట్టే యత్నం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీను అమలు చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు శ్రీకారం చుట్టడం అన్యాయం. ఈ ప్రక్రియతో ప్రైవేట్ వ్యక్తులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ప్రజాధనాన్ని పంచిపెట్టడం దారుణం. ఇది కేవలం ఎన్నికల ముందు టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఐటీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియా విభాగాలకు బహుమానంగా ప్రజాధనాన్ని దోచిపెట్టే పక్షపాత చర్య తప్ప మరొకటి కాదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. -
40 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పుత్తూరు: రైలులో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) 40 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుత్తూరు ఆర్పీఎఫ్ సీఐ కేపీ సెబాస్టియన్ తెలిపారు. గురువారం వివిధ రైళ్లలో ఎస్ఐ విజయ్‌నాయక్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 40 బస్తాల్లోని 1000 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తమిళనాడు రాణిపేట ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి అందజేసినట్లు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధికారి కృష్ణమోహన్ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు నూతన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక పాఠకులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కార్యదర్శి శర్మ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మొత్తం 3,10,910 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. తొలిరోజు మాత్రలు అందుకోలేకపోయిన వారి కోసం అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘మిస్సింగ్ డే’ నిర్వహించి మాత్రలు అందజేస్తామన్నారు. 1–2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర నీటిలో కలిపి, 2–19 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్రను భోజనం తర్వాత చప్పరించి మింగేలా చూడాలన్నారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న లెప్రసీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. ముగిసిన జాతీయ సదస్సు కుప్పంరూరల్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ, ఐఈఈఈ బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు 450 పరిశోధనా పత్రాలు వచ్చినట్లు వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్‌రాజ్ తెలిపారు. సంస్కృతి, సాంకేతిక, వినోద కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. పరిశోధనల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 60 వేల రూపాయలు బహుమతిగా అందజేశామన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిశోధనా సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌బాబు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి శ్రీకాళహస్తిరూరల్(తొట్టంబేడు) : తొండమనాడు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం మేరకు.. లక్ష్మణ్ (25) అనే యువకుడు బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వస్తున్నాడు. శేఖర్ అనే వ్యక్తి రాంగ్ రూట్లో వస్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వస్థలం విశాఖపట్నం. ఇతను ఏర్పేడు మండలం ఐసర్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడ్డ దారిలో వచ్చి ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాంమ్మా.. అసలు గుట్టు ఇదేనా..?
సాక్షి, చిత్తూరు: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హాం) పేరిట నాలుగు రోజుల క్రితం కుప్పంలో చంద్రబాబు వర్చువల్ విధానంలో మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లు శంఖుస్థాపన చేశారు. దీనివల్ల పట్టణాల రూపురేఖలు మార్చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరేమీలేదు. పైగా మునిసిపాలిటీలను అప్పుల ఊబిలో దింపడమే ఈ ‘హాం’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అసలు మతలబు.. ‘హాం’ కింద జిల్లాలోని చిత్తూరు మునిసిపల్ కార్పొరే షన్‌కు రూ.60 కోట్లు, పలమనేరు మునిసిపాలిటీకు రూ.25 కోట్లు, నగరికి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 40 శాతం నిధులను ప్రభుత్వం, 60 శాతం నిధులు ప్రైవేటు డెవలపర్లు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి 40 శాతం నిధులు ఆయా మునిసిపాటీలకు చెందిన డబ్బులే. భవన నిర్మాణ సమయంలో ప్రతి మునిసిపాలిటీకి ప్రజలు చెల్లించే రుసుములు పట్టణ–గ్రామీణ ప్రణాళిక సంచాలకత్మం (డీటీసీపీ) ఖాతాలో జమ అవుతుంది. ఇలా దాదాపు పదేళ్ల పాటు మునిసిపాలిటీలకు జమ కావాల్సిన భవన నిర్మాణ అనుమతి ఫీజులన్నీ డీటీసీపీ వద్ద ఉండిపోవడం, వాటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగిపోయింది. తాజాగా ‘హాం’ కింద ఈ 40 శాతం నిధులు మునిసిపాలిటీలకు సమకూరుస్తూ, మిగిలిన 60 శాతం డెవలపర్లు అప్పుగా ఇవ్వనున్నారు. కాంట్రాక్టర్లు కనుమరుగు.. ఇందులో మరో మతలబు కూడా ఉంది. ప్రైవేటు డెవలపర్ల ప్రమేయంతో మునిసిపాలిటీలో చిన్నా, చితక పనులు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల ఉనికి ‘హాం’తో పూర్తిగా కనుమరుగు కానుంది. కేవలం బడా కార్పొరేట్ కంపెనీలు, పేరుమోసిన సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొంటాయి. సామాన్య కాంట్రాక్టర్లు అంత మొత్తం పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు నుంచి రూ.వందల కోట్ల రుణాలు పొందడం అసాధ్యం. ఫలితంగా రూ.పది లక్షల లోపు పనులు చేసుకునే కాంట్రాక్టర్లు భవిష్యత్తులో మునిసిపాలిటీల్లో కనిపించకపోవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీలను అప్పుల్లో దింపడమే లక్ష్యం -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన గురువారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు, అర్చకులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
రసాయన రహిత మామిడితో ఆదాయం
తిరుపతి కల్చరల్: రైతులు రసాయన అవశేషాలు లేని, నాణ్యత కలిగిన మామిడి ఉత్పత్తులు పండించినప్పుడే మంచి గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు మామిడి ఉత్పత్తులు ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చని రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.వెంకటరత్నం తెలిపారు. రాస్, రాస్ కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో కోకాకోలా ఇండియా పౌండేషన్, న్యూడిల్లీ వారి సహకారంతో గురువారం రాస్ సేవా నిలయంలో మామిడిలో సుస్థిర ఆదాయ మె లకువలపై రైతులకు శిక్షణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం యాజమాన్య పద్దతులు పాటించి, జీవన ఎరువులు ,సూక్ష్మ పోషకాలు వాడాలని తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతి మ్యాంగో ప్రాజెక్టులో భాగంగా ఇది వరకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త పీఎస్.సుధాకర్ మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలలో యూరియా 10 గ్రాము లు, సూఓ్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే త్వరగా కొత్త చిగురు పెరిగి పూత తొందరగా వస్తుందని తెలిపారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టిరియా, పొటాషియం మొబిలైజింగ్ బాక్టీరియాల మిశ్రమాన్ని వినియోగించటం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త రాముకుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆహార ఉ ద్యాన పంటలలో ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, వ్యవసాయ డ్రోన్ సాంకేతికత గురించి వివరించారు. ఈ సందర్భంగా వంద మంది మామిడి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ కోసం ఎన్పీకే జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం, మ్యాంగో స్పెషల్ పంపిణీ చేశారు. మిలటరీ స్కూల్స్‌లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు తిరుపతి అర్బన్: రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో 2027–28 సంవత్సరంలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైనట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత ఎన్.విశ్వనాథ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 20 వరకు గడువు ఉందని చెప్పారు. డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందని తెలిపారు. నిర్దేశిత వయోపరిమితి, అర్హతలకు అనుగుణంగా ప్రస్తుతం 5 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు, పరీక్షా విధానం, శిక్షణ, మాక్ టెస్టుల వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లను తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు. -
23 మంది విద్యార్థులకు అస్వస్థత
బైరెడ్డిపల్లె: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గురువారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. చిక్కనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి రోజు ఆయుర్వేద వైద్యం పేరుతో కొన్ని ఆకులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారు. గురువారం కూడా విద్యార్థులు ఆకులు, ద్రవ్యాలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఆశా వర్కర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అస్వస్థతకు కారణం ఏమైందో తెలియదు గానీ గ్రామస్తులు విషయం తెలుసుకుని 108 వాహనానికి సమాచారం అందించి బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో దేశమ్మ బైరెడ్డిపల్లె పీహెచ్సీ చేరుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నట్టు తెలిపారు. -
సిఫారసుల్లేని పాలన
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : తమ పాలనలో జెడ్పీ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు, జిల్లాల విభజనలో ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా నిర్ణయాలు తీసుకున్నామని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ తమ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా సీనియారిటీ ప్రకారమే ఉద్యోగోన్నతులు, కారుణ్య నియమకాలు చేపట్టామని తెలిపారు. జిల్లాల పునర్విభజనలో ఉద్యోగుల విభజన అనివార్యమైందన్నారు. ఇందులోనూ ఎలాంటి సిఫార్సులకు తావివ్వకుండా సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయించా మని తెలిపారు. తనవల్ల ఏ ఉద్యోగి అయినా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. గురువారంతో ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన చివరి ప్రసంగం భావోద్వేగభరితంగా సాగింది. అనంతరం జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఉద్యోగుల సమక్షంలో సీనియారిటీ జాబితా ఆధారంగా వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రజా ధనం..
హామీల అమలెక్కడ బాబు ? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి కోసం జిల్లా వ్యాప్తంగా 4.15 లక్షల మంది యువత ఎదురుచూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను హామీ అమలు కాలేదు.ఈ హామీ కోసం జిల్లాలో 2.58 లక్షల మంది ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ముందు ఇచ్చిన నెరవేర్చలేని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రజా ధనంతో విచ్చలవిడిగా ప్రచారాలు చేసుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, తమ సొంత ప్రచారానికి ‘సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్’ను నియమించుకునేందుకు విచిత్రమైన పాలసీకి శ్రీకారం చుట్టింది. పాలసీకి కేబినెట్ సైతం ఆమోదం తెలపడంపై జిల్లాలోని ప్రజలతో పాటు పలువురు మేధావులు, యువత, విద్యార్థి సంఘ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాధనం ఐటీడీపీ కార్యకర్తల పాలేనా? – రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నజరానా ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు వేల రూపాయిల ప్రజాధనాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు పంచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఫాలోవర్ల సంఖ్యను బట్టి నెలకు రూ.25 వేల నుంచి ఏకంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. టీడీపీ శ్రేణులకు ఈ నిధులను దోచిపెట్టేందుకు ఈ విచిత్ర పాలసీని తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు గాలికి.. జిల్లాలో రైతులు, పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టుకోవడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు ధారపోస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలు నెరవేర్చని ప్రభుత్వం, విమర్శలను అణచివేసేందుకు, అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ చేయడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు, యువత, విద్యార్థి సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. విచిత్ర పాలసీకి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
యాదమరి: అతివేగం.. అజాగ్రత్తగా వాహనం నడపడం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. రహదారిపై మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. యాదమరి మండలంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి(21) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి రాంప్రసాద్ తన స్నేహితుడైన చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన సురేష్ కుమారుడు ధనుష్(21)తో కలసి ద్విచక్రవాహనంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళళ్లారు. అక్కడ నుంచి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధి వరిగపల్లి జంక్షన్ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తగాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ధనుష్‌ను 108 అంబులెన్సు ద్వారా చితూరు ప్రభుత్వాసుపత్రికి తరలిలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంజినీరింగ్ చదివి గొప్ప వాడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంప్రసాద్ ఆసుపత్రిలో విగతిజీవిగా ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రహదారి భద్రతా నియమాలు విధిగా పాటించి ప్రమాదాల బారీన పడకుండా విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ సూచించారు. -
● అధికార నందివాహనంపై గణనాథుడు
అధికార నంది వాహనంపై ఊరేగుతున్న వరసిద్ధి వినాయకుడుప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా గురువారం కాణిపాకంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి అధికార నంది వాహనంపై కటాక్షించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా మూలవిరాట్ అభిషేక పూజలు చేయించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి వళ్లువర్ వంశస్తుల ఆధ్వర్యంలో అధికార నంది వాహన సేవను నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తిని అలంకరించి నంది వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు పట్టి తరించారు. – కాణిపాకం -
చెరువు భూమి కబ్జా
పలమనేరు: పట్ణణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకుని ఉన్న టీఎస్ అగ్రహారం కొత్త చెరువు గట్టుపై చెరువు భూమిని కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే జేసీబీ వాహనాలను పెట్టి చెరువు పోరంబోకు మూడెకరాలను ఆక్రమించేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసలు పట్టించుకోలేదు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చెంగప్ప, క్రిష్ణప్ప, రమేష్, మహేష్ ఈ చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. తమకు స్థానిక ఎమ్మెల్యే చెప్పారని ఆక్రమణదారులు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీకి ఏజెంట్లా మారాడనే మాట వినిపిస్తోంది. కనీసం రెవెన్యూ ఉన్నత అధికారులైనా దీనిపై చర్యలు తీసుకుంటారా అనుకుంటే వారు కూడా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లను భరించలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా చెరువుకు సంబంధించిన లక్షల రూపాయల విలువజేసే భూమి పరులపాలు కానుంది. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా చొరవచూపి వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం కావాలి
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న కుల వివక్షను రూపుమాపేందుకు ఆదివాసీలు, దళితులు ఐక్యమత్యంగా పోరాటాలు చేయాలన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పంచాయతీ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో భీమ్ ఆర్మీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్థసారథి, మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి, అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష యాదమరి: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ బుధవారం చిత్తూరు ఆరవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరిత తీర్పు చెప్పారు. యాదమరి ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. మండల పరిధి రామభద్రాపురం గ్రామానికి చెందిన సతీష్‌కు కళైవాణి అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నంగా రూ.50 వేలు తీసుకురావాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో వేధింపులకు తాళలేక కళైవాణి 2015 జనవరిలో అదే గ్రామంలోని ఓ చెరువు పాకలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రఘుపతి కేసు నమోదు చేయగా, డీఎస్పీ లక్ష్మినాయుడు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. విలేజ్ సర్వేయర్‌కు పాముకాటు గుడిపాల: గుడిపాల మండలంలో రీ–సర్వే విధులు నిర్వహిస్తున్న విలేజ్ సర్వేయర్ భవ్య బుధవారం పాముకాటుకు గురయ్యారు. ఆమె 190 రామాపురం రెవెన్యూ పరిధిలో రీసర్వే పనులు చేస్తున్నారు. పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సహోద్యోగులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడిపాల ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే పనులు చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. -
నేటి నుంచి ప్రత్యేక ఉత్సవం ప్రారంభం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం స్వామికి అభిషేకం ఉంటుందన్నారు. రాత్రికి స్వామి అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారని పేర్కొన్నారు. ఇందుకు కాణిపాకం పళ్లువర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వాలని డీఈఓకు వినతి చిత్తూరు కలెక్టరేట్: హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు బుధవారం డీఈఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పెండింగ్ జీతాలు మంజూరు, మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణకు జూన్ నుంచి బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రతి నెలా జరుగుతున్న సీఆర్సీ సమావేశాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాలేకపోతున్నారని, పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలపతిరావు, గిరిబాబు, నాయకులు చంగల్రాయమందడి, దేవానంద్, ధనుంజయలు పాల్గొన్నారు. చురుగ్గా ఎస్ఐఆర్ ప్రక్రియ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ నెల 22వ తేదీ నాటికి మొత్తం 1,34,307 నోటీసులు జారీ చేసి విచారణ పూర్తి చేశామన్నారు. 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు జిల్లాలో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో మొత్తం 2,22,096 ఫారాలు నమోదైనట్లు చెప్పారు. వీటిలో పరిశీలన అనంతరం 2,10,466 ఫారాలు రోల్ అప్డేట్కు ఆమోదం పొందాయన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు (ఫారమ్–6)లో 31,931 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 24,684 దరఖాస్తులు ఆమోదం పొందినట్టు పేర్కొన్నారు. 3,055 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పకడ్బందీగా ఫొటో నాణ్యత పరిశీలన జిల్లా వ్యాప్తంగా ఫొటో నాణ్యత పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 12,04,067 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 10,52,741 ఫొటోలు అప్లోడ్ అయ్యాయన్నారు. బీఎల్వోల పరిశీలనలో 9,20,404 ఎస్ఐఆర్ ఫొటోలు ఆమోదం పొందాయన్నారు. బీఎల్వోల వద్ద పెండింగ్ లేవని, ఈఆర్వో, ఏఈఆర్ఓ స్థాయిలో 2.14 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా, అర్హులందరికీ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం క్షేత్రస్థాయి పరిశీలనలో తమ సూచనలు అందించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి విజయసింహారెడ్డి, ఉదయ్, ఆమ్ఆద్మీ పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, బీఎస్పీ నుంచి సురేంద్రబాబు, బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, సీపీఐ నుంచి వాడ గంగరాజు పాల్గొన్నారు. ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ మణికొండకు చెందిన కొండూరు రాజేశ్వరి, సుబ్రమణ్యం దంపతులు రూ.10 లక్షల విరాళం అందజేశారు. సోమవారం టీటీడీ చైర్మన్న్ బీఆర్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాత దంపతులకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆగని తుమ్మింద గ్రానైట్ దందా!
చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో గ్రానైట్ అక్రమ తవ్వకాల దందా హద్దు మీరుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన బంధువుల అండ చూసుకుని గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోపిడీ చేస్తోంది. క్వారీ నిర్వాహకుల నుంచి రూ.కోట్లు మామూళ్లు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు దిగి క్వారీలనే హస్తగతం చేసుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. సాక్షి టాస్క్‌ఫోర్స్: తుమ్మింద ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ ఎంతో నాణ్యమైనది. దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. రూ.కోట్లు విలువ చేసే నల్ల బంగారం కావడంతో దీనిపై ప్రజాప్రతినిధి బంధువు కన్ను పడింది. క్వారీ నిర్వాహకుడిని పిలిపించి రూ.3 కోట్లు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేనని సదరు నిర్వాహకుడు చేతులెత్తేయడంతో బెదిరింపుల పర్వం మొదలైంది. దౌర్జన్యంగా క్వారీ స్వాధీనం..? మామూళ్లు రాకపోవడంతో కక్ష పెంచుకున్న ఆ ప్రజాప్రతినిధి బంధువు దౌర్జన్యానికి దిగాడు. క్వారీ నిర్వాహకుడిని బెదిరించి పక్కకు నెట్టేసి, క్వారీ నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నాడు. యంత్రాలు పెట్టి రాత్రింబవళ్లు చట్టవిరుద్ధంగా గ్రానైట్ రాళ్లను తోడేస్తున్నాడు. కొన్నాళ్లు బంద్.. మళ్లీ షురూ సదరు ప్రజా ప్రతినిధి బంధువు వేధింపులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బాధితుడు గతంలో ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధి బంధువు చేస్తున్న అక్రమాల చిట్టాను వారి ముందుంచాడని సమాచారం. ఈ విషయం తెలిసి ఆ బంధువు కొన్నాళ్ల క్రితం ఆ అక్రమ క్వారీని బంద్ చేయించాడు. అధికారుల తనిఖీలు సడలడం, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో గడిచిన నెలరోజులుగా మళ్లీ అక్కడ అక్రమ క్వారీ దందా ముమ్మరంగా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో నల్ల బంగారాన్ని సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ వ్యవహారం మళ్లీ జిల్లా కలెక్టర్ చెవిలో పడడంతో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు ఇవ్వాలని క్వారీ నిర్వాహకుడికి బెదిరింపులు కూటమి నేతల భగ్గు.. ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు, అనుచరుల హద్దుమీరిన అక్రమాలు, దౌర్జన్యాలపై సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం తెచ్చిన మంచి పేరును ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు తమ స్వార్థం కోసం నాశనం చేస్తున్నారని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను బెదిరించి, క్వారీ నిర్వాహకులను లొంగదీసుకుంటూ సాగిస్తున్న ఈ మాఫియా రాజ్యాంగంపై కూటమిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందాలపై పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో పంపుతున్నారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
చిత్తూరు కార్పొరేషన్: ఒక యువకుడు ఫోన్ మాట్లాడుతూ రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. రైల్వే ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. స్థానిక బండపల్లెలో జరిగిన చావుకు డప్పు కొట్టడానికి జీడీనెల్లూరు మండలం ఎస్ఎస్ కొండ గ్రామానికి చెందిన మంజునాథ(22) బృందంతో పాటు వచ్చాడు. సమీపంలోని అంగడికి వెళ్లి వస్తువులు కొనుక్కొని తిరిగి వచ్చే సమయంలో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అటువైపు వస్తున్న తిరుచిరాపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్టు ఎస్ఐ తెలిపారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం పవిత్ర ప్రతిష్ట, శుక్రవారం పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి చేపడతారు. భక్తులు ఒక్కొక్కరు రూ.750లు చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేయనున్నట్లు తెలిపారు. -
ముగిసిన వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపి త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కనుల పండువగా వసంతోత్సవం త్రిశూల స్నానం అనంతరం వసంతోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రంగు నీళ్లు చల్లుకుంటూ దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా ఊరేగించారు. అనంతరం యాగశాలలోని పర్యవేక్షణ యాగమూర్తికి ముగింపు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు చేశారు. మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు. -
శాస్త్రోక్తం.. చక్రస్నానం
తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఉదయం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, మహా పూర్ణాహుతి చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. అనంతరం పుష్కరణి సంప్రోక్షణ, హారతి సమర్పించారు. సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలోకి తీసుకువెళ్లి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దంపతులు, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. లోక సంక్షేమం కోసం.. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వెన్నంటి ఉండి వాహన సేవలు, వైదిక క్రతువుల్లో పాల్గొన్న చక్రతాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. లోక సంక్షేమం, భక్తుల సుఖశాంతులను కాంక్షిస్తూ ఈ పవిత్ర క్రతువును నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్ విహరించారు. యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి, కుంభజలంతో గర్భాలయంలో సంప్రోక్షణ చేపట్టారు. సాయంత్రం 7 నుంచి 9గంటల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి. అందరి సహకారంతోనే.. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గ్రామస్తులు, భక్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆలయ సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా ముగిశాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఎమ్మెల్యే పీఏ సర్వీస్ రూల్స్ ధిక్కరణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారిక పీఏ కుమారస్వామి సర్వీస్ రూల్స్ ధిక్కరించారంటూ వైఎస్సార్ సీపీ 12వ డివిజన్ అధ్యక్షుడు కిషోర్‌యాదవ్ ఆరోపించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో మోహన్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే పీఏగా వ్యవహరిస్తూ, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న పల్లెబోయిన కుమారస్వామి యాదవ్ ఈ నెల 22న నిర్వహించిన విలేకరుల సమావేశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్ నిర్వహించడమే కాకుండా, సర్వీస్ రూల్స్‌ను బేఖాతరు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు మండలం నాయనిచెరువులో క్వారీ నిర్వహణకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు కుమారస్వామి ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి కలెక్టర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశం పెట్టడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం. టీడీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిష్పాక్షిక విచారణ జరపాలి ఎమ్మెల్యే పీఏ నిర్వహించిన ప్రెస్‌మీట్ వీడియో పుటేజ్, పేపర్ క్లిప్పింగ్‌లను పరిశీలించి, ఆయన నియామక వివరాలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర నిష్పాక్షిక విచారణ జరిపించాలని కిషోర్ యాదవ్ డీఆర్వోను కోరారు. ప్రాథమిక విచారణ ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
● పవిత్రం.. పునీతం
శ్రీవారి పుష్కరిణికి పోటెత్తిన భక్తులు (ఇన్సెట్) చక్రస్నానం నిర్వహిస్తున్న వేద పండితులుతిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.. విశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. ఈ క్రమంలోనే వేకువజామున శ్రీవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు.అభిషేకానంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్యప్రబంధ పాశురాలను పఠించారు. అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏమి మా భాగ్యము.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ భువి వైకుంఠంలో అడుగిడిన మా జీవితము ధన్యము.. చక్రత్తాళ్వార్‌ను స్పృశించిన పవిత్రజలములో స్నానమాచరించిన మాదే కదా పుణ్యము.. ఉభయ దేవేరీ సమేతంగా కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారి తిరుమంజన సేవ వీక్షణంతో తరించెను మా జన్మము.. అంటూ భక్తజనులు పరవశించారు. వైకుంఠనాథుని వైభవోత్సవంలో పాలుపంచుకుని పులకించారు. ఆనందనిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుని దివ్యతేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. -
వీడని హత్యకేసు మిస్టరీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ మంగాపురంలో జరిగిన ఆనందరావు (50) దారుణ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. నెలన్నర రోజులు గడిచినా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. కేసును నీరుగార్చడంలో భాగంగానే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ మందగించడంతో అసలు కేసును మర్చిపోయారా అనే విమర్శలు వస్తున్నాయి. దోపిడీ కాదు.. పక్కా స్కెచ్? హత్య జరిగిన తొలినాళ్లలో ఇది దొంగల పని అని అందరూ భావించారు. ఇంటి అద్దాలు పగులగొట్టేందుకు నాటు బాంబులు వాడారన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో నాటు బాంబుల కోసం వాడిన టపాసుల బాక్సు, సమీపంలోని పొలంలో కత్తి, ఒక బ్యాగు లభించాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తూ వచ్చారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడు వరకు వెళ్లి పలువురు అనుమానితులను విచారించాయి. గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా దొంగల ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఇది దొంగతనం కోసం వచ్చిన దొంగల పని కాదని, పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సమాధానం లేని ప్రశ్నలు పోలీసుల తీరుపై స్థానికుల్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దొంగల పని కాకపోతే ఒక ఇంటి పని మనిషిని మాత్రమే ఇంత దారుణంగా గొంతు కోసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ దోపిడీ దొంగలే అయితే ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదా నగదును తాకకుండా ఎందుకు వెళ్లిపోతారు? గొంతును 80 శాతం వరకు కోసి అంత కక్షపూరితంగా చంపడానికి ఆనందరావు చేసిన తప్పేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే.. ఈ హత్యకు సంబంధించి గ్రామస్తుల్లో కొన్ని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోలీసులు ఆ కోణంలో లోతుగా విచారణ జరిపేందుకు జంకుతున్నారనే చర్చ నడుస్తోంది. స్థానిక పోలీసుల విచారణ నెమ్మదించడంతో ఈ కేసును ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావని అభిప్రాయపడుతున్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఆనందరావు హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముగిసిన విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: విశ్వగురు సంకల్పం సిద్ధించాలని, దైవబలం చేకూరాలని స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ‘భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం‘ పూర్ణాహుతితో బుధవారం ముగిసింది. ఉదయం ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సర్వ దేవత మూల మంత్ర హోమం, మహా శాంతి యాగం నిర్వహించారు. కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నేత రమేష్ నాయుడు తదితరులు పాల్గొని హోమ గుండంలో పూర్ణాహుతి సమర్పించారు. యాగ నిర్వాహకులు అశోక్ రాజు దంపతులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సర్వశక్తులనూ ప్రసాదించాలని, భారత దేశం విశ్వగురుగా నిలవాలనే సంకల్పం నెరవేరాలని ఈ యాగం తలపెట్టినట్లు వివరించారు. తొమ్మిది రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సుదర్శన, ధన్వంతరి, మహాలక్ష్మి, ఆయుష్యు, అకల్మష, శాంతి, సంకల్పసిద్ది హోమాలను, వెంకటేశ్వరస్వామి, సీతా రాముల కల్యాణం, సుందరకాండ పారాయణంతో పాటు ప్రముఖుల ధార్మిక ప్రవచనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయమైదని వెల్లడించారు. -
గ్రానైట్ లారీ స్వాధీనం
సాక్షి టాక్స్ ఫోర్స్: బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ దిమ్మెలు తరలిస్తున్న లారీని బుధవారం జీడీ నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పోలీసులు బుధవారం జీడీ నెల్లూరులో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒక లారీ గ్రానైట్ దిమ్మెలతో వస్తుండగా సీఐ కృష్ణమోహన్ తనిఖీ చేశారు. ఎట్టేరి ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వేల్కూరులో మరో ఫ్యాక్టరీ నుంచి లోడింగ్ చేసి ఉత్తరాఖండ్‌కు గ్రానైట్ దిమ్మెలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వాటికి బిల్లులు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనంచేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ వద్ద బిల్లులు ఉన్నాయని బుకాయిస్తూ అక్కడి నుంచి వెళ్లినట్టు సమాచారం. గతంలో పట్టుకుని వదిలేశారు కొద్దిరోజుల క్రితం జీడీ నెల్లూరు పోలీసులు అక్రమ గ్రానైట్ దిమ్మెల లారీని పట్టుకున్నారు. ఆ లారీ కూటమికి చెందిన బడా నేతదని, తమ లారీనే పట్టుకుంటారా అంటూ వారు నానా దుర్భాషలాడినట్టు సమాచారం. సాయంత్రానికల్లా బిల్లులు పుట్టించుకుని లారీని అక్కడ నుంచి పంపించేశారు. కూటమి నేతల లారీ పట్టుకున్న సందర్భంగా జీడీ నెల్లూరు సీఐని బదిలీ చేశారు. దొంగ బిల్లులతో అక్రమ గ్రానైట్ రవాణాతో ప్రభుత్వానికి తీవ్రంగా గండిపడుతున్న పట్టించుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పచ్చ తమ్ముడు బరితెగింపు
● 20 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారి మూసివేత ● పట్టా భూమి అంటూ రోడ్డుపై రాతి కంచె వేసి దౌర్జన్యం పూతలపట్టు(యాదమరి): బెంగళూరులో వ్యాపారాలు సాగిస్తున్న మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఆ పార్టీ సానుభూతిపరుడు రెచ్చిపోయాడు. 20 ఏళ్లుగా గ్రామంలో రాకపోకల కొనసాగిస్తున్న దారికి ఫెన్సింగ్ వేశాడు. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం బి.రామాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు 15 కుటుంబాల వారు ఉన్నారు. వీరు 20 ఏళ్లుగా గ్రామ కంఠం భూమిలో ఉన్న దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. రాజవీధిలో కొంత భూభాగం తమదే అని అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు గ్రామస్తులతో ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగక రాతి స్తంభాలతో ఫెన్సింగ్ వేసాడు. దీనిపై ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగాడు. తాము 20 ఏళ్లుగా ఈ దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నామని, ఇప్పుడు పట్టా భూమి అనడం ఎంతవరకు సమంజమని గ్రామస్తులు వాపోతున్నారు. రాజకీయ అండ చూసుకుని ఆక్రమణకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిని మూసివేయడంతో తాగునీటి ట్యాంకర్లు లోపలికి రాలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల తాగునీరు దొరకక నరకయాతన అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర సమయాల్లో వృద్ధులు, రోగులు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ విషయంపై తహసీల్దార్, చిత్తూరు ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. దీనిపై తహసీల్దార్ ఉదయ్ సంతోష్‌ను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రావడంతో క్షేత్ర స్థాయిలో విచారణ చేశామన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించగా విఫలమైనట్టు పేర్కొన్నారు. మరోసారి చర్చించి దారి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. -
‘విశ్రాంతి’లో అశాంతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యుల్లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఇంతకాలంగా అంతర్గతంగా నెలకొన్ని విభేదాలు బహిర్గతం కావడంతో సంఘ అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఇంటి స్థలాల కేటాయింపులో చోటు చేసుకున్న పరిణామాలు రాజీనామాల పర్వానికి తెర తీసిందనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు సంఘంలో కీలకంగా ఉన్న కోశాధికారి దాస్ కూడా అదే బాటలో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంఘం పూర్తిగా రద్దయినట్టేనని చర్చనడుస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే టీటీడీలో విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సంక్షేమ సంఘంలో 8,500 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరు పదవీ విరమణకు ముందే సర్వీసులో ఉన్నపుడు చాలావరకు సీనియారిటీ కలిగిన వారున్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మార్కెట్ ధరకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలం, పల్లం గ్రామ పరిధిలో ఒక్కొక్కరికీ 50 అంకణాల చొప్పున 3,500 మంది విశ్రాంత ఉద్యోగులకు స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే అప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో చాలామంది సీనియర్లు ఉన్నా అలాంటి వారికి స్థలాల కేటాయింపు ప్రక్రియలో నిరాశ ఎదురైంది. అయితే స్థల విస్తీర్ణం, ప్లాట్లు వంటివి కేటాయించాలనే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది కాస్తా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదు సర్వీసు ఉద్యోగులకు ఊరట కాగా అదే సమయంలోఅప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు వడమాలపేట మండలం పాదిరేడు, పల్లం గ్రామ పరిధిలో 432.27 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి స్థలాలను కేటాయించి ప్లాట్ల రిజిష్టేషన్ కూడా చేయించింది. ఆ తర్వాత ప్రబుత్వం మారడంతో టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పలుమార్లు ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎట్టకేలకు ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఇటీవల నిధుల మంజూరుకు అనుమతి పొందింది. అసలు సమస్య ఇక్కడే సర్వీసులో ఉన్నపుడు తమకు సీనియారిటీ ప్రాతిపదికన ఇంటి స్ధలాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదనే అంశాలపై క్రింది స్థాయిలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉన్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం బాహటంగా వినిపిస్తోంది. అయితే ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఇంకా నాలుగు వేల మందికి పైగా ఇంటి స్థలాలు పొందలేని వారున్నారు. ఇంత కాలం అంతర్గతంగా రగిలిపోతున్న వారిలో వ్యతిరేక స్వరం బహిర్గతం కావడంతో సంఘ పెద్దలకు సమస్యగా మారింది. సర్వీసులోని ఉద్యోగులు పొందిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఆయా సంఘాల నాయకుల కృషిని గుర్తుచేస్తూ విశ్రాంత సంఘంలో ఆ విధమైన కృషి సంఘ పెద్దలు ఎందుకు చేయలేదంటూ ఘాటుగా ప్రశ్నించడం వంటి పరిణామాలు కలకలం రేపడంతో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేయాల్సి వచ్చినట్టు సమాచారం. నాలుగేళ్లుగా రెన్యూవల్ పెండింగ్ టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతి ఏటా రెన్యూవల్ చేయించాలనే విషయాన్ని పక్కదారి పట్టింది. నాలుగేళ్లు అవుతున్నా రెన్యూవల్ చేయించాలనే దిశగా ఆలోచన చేయకపోవడం ఏమిటని పలువురు సంఘ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘ బైలా ప్రకారం కార్యవర్గ కమిటీలో 15 మంది మాత్రమే ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరుకోవడంతో రెన్యూవల్ చేయించడంతో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో నాలుగేళ్లుగా పేరుకే సంఘం ఉన్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు టీటీడీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
‘1980 ట్రెండ్’తో అప్రమత్తం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుతం 1980 ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బడి పిల్లల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు 1980 ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు...1980 కాలానికి చెందినవిగా ఆకర్షణీయంగా వస్తున్నాయి. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ట్రెండ్‌కు విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ఫొటోలను సైతం అప్లోడ్ చేసి చూసుకుని మురిసిపోతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాల వల విసురుతున్నారు. అందుకు గాను 1980 ట్రెండ్ పేరుతో ఉచిత యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారి పర్సనల్ డేటాకు యాక్సెస్ ఇస్తే...ఇక అది మన నియంత్రణలో ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. యాప్‌లను ఇన్స్టాల్ చేసేటప్పుడు అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అవసరమైన అనుమతులకు మాత్రమే ఓకే చేయాలని వెల్లడిస్తున్నారు. అనుమానస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, యాప్స్‌లో ఫొటోలు, కాంటాక్ట్స్, ఫైల్స్, కెమెరా, లొకేషన్ అన్నింటికీ యాక్సెస్ అడుగుతారని, వాటన్నింటికీ అనుమతిస్తే కష్టాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో 1980 ట్రెండ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మోసపోయిన తర్వాత బాధపడేకంటే ముందే జాగ్రత్త పడడం శ్రేయస్కరమని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 16 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన 1,608 ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన పోలీసులు రూ.4.01 కోట్ల నగదును హోల్డ్ చేయించి, అందులో రూ.2.15 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించినట్లు వెల్లడించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, కార్డు వెనుక ఉన్న సీవీవీ ఎవరితోనూ పంచుకోవద్దని, డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 హెల్ప్‌లైన్, లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేసే అవకాశముంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. 25న నులి పురుగుల నిర్మూలన దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీన జాతీయ నులి పురుగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అధికారులను ఆదేశించామన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, ఐఐటీ, కళాశాలల్లో కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. 1 నుంచి 2 ఏళ్ల వారికి సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వారికి ఒక మాత్ర ఇవ్వాలని సూచించారు. -
కలకలం రేపిన ప్రెస్‌మీట్
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం నాయని చెరువులో ఎమ్మెల్యే పీఏ అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు ఎమ్మెల్యే పీఏ కుమారస్వామి మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజకీయపార్టీ నేతలతేఓ కలిసి వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగిపై ఆరోపణలు వస్తే అధికారిక ప్రకటన ద్వారా ఖండించడం లేదా జిల్లా పరిపాలనాధికారి ముందస్తు అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్ పెట్టడం పరిపాటి. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్‌మీట్ నిర్వహించడం సర్వీస్ నిబంధనలను ధిక్కరించడమేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపైఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
అబద్ధమే బాబు అస్త్రం
బైరెడ్డిపల్లె : ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధాలనే అస్త్రంగా వాడుకుంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం బైరెడ్డిపల్లెలో ఆయన వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్పష్టంగా వివరించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ఒక్క రూపాయి కూడా విదిల్చిన పాపాన పోవడం లేదని మండిపడ్డారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని మోసం చేశారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేకుంటే నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని స్పష్టం చేశారు. ప్రజల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, దీంతో కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ఇంటి వద్దనే అర్హులను గుర్తించి పింఛన్లు అందించామని వెల్లడించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుతూ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కో–ఆప్షన్ సభ్యుడు పైజుల్లాసాబ్, రెడ్డి వీనస్, వెంకట్ తేజ, పీరూసాబ్ పాల్గొన్నారు. -
ఆపదలో ఉన్నా.. ఆదుకోండి!
పలమనేరు : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భార్యాభర్తలు చిన్నపాటి హోటల్‌ను నడుపుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకునేవారు. ఇంతలో విధి వక్రించింది. ఇంటి ఇల్లాలుకు వచ్చిన చిన్నపాటి వ్యాధికోసం చికిత్సకు వెళితే అది ప్రాణాలను మింగేసే రోగంగా తేలింది. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు అప్పులు చేసి రూ.9 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే రోగం మాత్రం నయం కాలేదు. మానవత్వం ఉన్న దాతలెవరైనా ఆదుకుంటారేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. వివరాలు.. పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన కళైవాణి, బాలాజీ దంపతులకుఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు. డిగ్రీ, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలు చదువుల్లో టాపర్లుగా ఉన్నారు. గ్రామంలోని బడిలో చదివే కుమారుడు కూడా చదవరే. బాలాజీ అదే గ్రామంలో చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఉండగా ఏడాది క్రితం అతడి భార్య కళైవాణి(42)కు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని పలమనేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో తిరుపతిలోని ఓమెగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా టెస్ట్‌లు చేసి వైద్యులు ఆమె లివర్ దెబ్బతిందని తేల్చారు. లివర్‌కు సంబందించిన ఆపరేషన్ చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రిలో తమవల్ల కాదమటూ బాధితులు తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు లివర్ క్యాన్సర్‌గా తేల్చారు. ఆపరేషన్ చేసేందుకు సైతం వీలుకాదని 70 శాతం దాకా లివర్ దెబ్బతిందని నిర్ధారించారు. అదే సమయంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేయించుకునేందుకు రోజుల తరబడి ఎదురు చూశారు. అయితే అనుమతులు రాకపోవడంతో బాలాజీ తన భార్య కష్టం చూడలేక ఇంటిని తనఖా పెట్టి, అప్పులు చేసి దాదాపు రూ.9లక్షలు ఖర్చుపెట్టాడు. ప్రస్తుతం చికిత్సకు డబ్బుల్లేక ఆమె ఇంట్లో మంచానికే పరిమితమైంది. తమ తల్లికిలా అయిందనే బెంగ పిల్లలకు పట్టుకుంది. తల్లి పరిస్థితిని తెలుసుకున్న మధు కళాశాల యాజమాన్యం ఇద్దరు ఆడపిల్లలకు ఫీజులు కూడా తీసుకోవడం లేదు. తమ తల్లి వైద్యానికి దాతలెవరైనా సాయం చేయాలని ఆ బిడ్డలు, భర్త వేడుకుంటున్నారు. ఎవరికై నా సాయం చేయాలనిపిస్తే వారి నంబర్:9505803100ను సంప్రదించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందించాలని విన్నవిస్తున్నారు. -
వైభవంగా విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో మంగళవారం ఉదయం ఆకల్మష హోమం, సాయంత్రం చతుర్వేదాల నడుమ వైభవంగా మహా పుష్పయాగం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్యాత్మిక, ఆధునిక పోకడలపై ఉపన్యసించారు. ఉదయం 8 గంటలకు హోమశాలలో 108 హోమ గుండాలలో రిత్వికులు ఆకల్మష యాగాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి క్రతువులో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో ముఖ్యవ్యక్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలు, 2047 వరకు ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధి, వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు ఈ నవాహ్నిక దీక్షలు చేపట్టారని తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు మహాయాగంలో పాల్గొన్నారు. మనుష్యుల్లో కల్మషాలు తొలగి ఐక్యత పెరగడానికి ఆకల్మష హోమం, యాగ నిర్వహణలోని లోటుపాట్ల నివృత్తికి, ఉపశమనానికి మహా పుష్పయాగం నిర్వహించినట్లు అశోక్ రాజు తెలిపారు. నవాహ్నిక యాగాలలో చివరి రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొనాలని అశోక్‌రాజు కోరారు. -
డిప్ ఐడియా ఫలించేనా..?
ఇక జిల్లాలో 30 వరకు దుకాణాల నిర్వాహకులు లైసెన్సుల పునరుద్ధరణను పట్టించుకోలేదు. పైగా ఓ ఐడియా రచించి, దాన్ని అమలు చేయడానికి టీడీపీ నేతలే సలహా ఇచ్చారన్నది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పాత లైసెన్సు పునరుద్ధరించుకోవాలంటే రూ.25 లక్షలు చెల్లించాలి. కా, లక్కీడిప్‌కు వెళితే..?! ఒక్కో దరఖాస్తు రుసుము నాన్–రీఫండబుల్ ఫీజు కింద రూ.3లక్షలు చెల్లించాలి. నాలుగు దరఖాస్తుల నిబంధన పెట్టినా రూ.12 లక్షలకే లైసెన్సు కొట్టేయొచ్చని కొందరు నిర్వాహకులు పథకం వేశారు. ఫలితంగా 30 వరకు దుకాణాలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపై వచ్చిన దరఖాస్తుల్లో లక్కీడిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఇక్కడే టీడీపీ నేతలు సిండికేట్‌గా మారారు. ముందుగా మాట్లాడుకుని ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు అప్లికేషన్ వేయకూడదని చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డా పర్లేదు.. అధికారం ఉండగానే కిక్కు ద్వారా సంపాదించుకోవాలని తీర్మానం చేసుకున్నారు. టీడీపీ నేతలు మద్యం మాఫియాగా మారిపోయారు. రెండేళ్లుగా రాత్రింబవళ్లు విక్రయాలు సాగిస్తూ ప్రజల రక్తం తాగేశారు. లైసెన్స్ రెన్యూవల్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు తెలుగు తమ్ముళ్లు తమ తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. రెన్యూవల్ కంటే లక్కీడిప్‌లో వైన్‌షాపు తీసుకుంటే తక్కువ ఫీజుతో సరిపోతుందని పన్నాగాలు పన్నారు. అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా సుమారు 30 మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరించుకోకుండా మంత్రాంగం నడుపుతున్నారు. అధికార పార్టీ నేతలే సిండికేట్‌గా మారి గంపగుత్తగా వైన్‌షాపులను కై వసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షి, చిత్తూరు : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలకు ఉపాధి చూపించడానికి మద్యం దుకాణాల లైసెన్సులు ప్రైవేటుపరం చేసింది. రెండేళ్ల పాటు ఇందులో సమకూరిన భారీ ఆదాయాన్ని చూసిన కొందరు వ్యాపారులు అతితెలివిని ప్రదర్శించి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలని సిద్ధపడిపోయారు. జిల్లాలో మద్యం దుకాణాల రెన్యూవల్ కోసం ఇచ్చిన గడువు బుధవారం అర్థరాత్రితో ముగియనుంది. ఇప్పటికి దాదాపు 83 దుకాణాల వరకు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోగా.. 30 దుకాణాల నిర్వాహకులు మాత్రం లక్కీడిప్ దిశగానే మొగ్గుతున్నారు. పునరుద్ధరణతో రూ.20 కోట్ల ఆదాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా చూడకుండా, ప్రజలు మత్తుకు బానిస కాకుండా ఉండాలని ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీను తీసుకువచ్చారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని భారీ ఆదాయ వనరుగా పరిగణించి.. తమ కార్యకర్తల చేతికి మద్యం దుకాణాల లైసెన్సులను అప్పగించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సు పొందిన నిర్వాహకులకు మళ్లీ మరో ఏడాది పాటు లైసెన్సును కట్టబెట్టడానికి రెన్యూవల్ పేరిట కొత్త ఎత్తు వేసింది. రెండు శ్లాబుల్లో ఉన్న మద్యం దుకాణాలకు రూ.23 లక్షలు, రూ.27 లక్షలు చెల్లించాలని పేర్కొంది. అంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షల వరకు రెన్యూవల్ రుసుము చెల్లించాలి. ఇప్పటి వరకు జిల్లాలో 113 దుకాణాలకు గానూ దాదాపు 83 దుకాణాల నిర్వాహకులు లైసెన్సులను రెన్యూన్యువల్ చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం లభించింది. కొన్నింటికే రెన్యూవల్ జిల్లాలో ఎనిమిది ఎకై ్సజ్ పోలీస్ సర్కిళ్లు ఉన్నాయి. అందులో చిత్తూరు అర్బన్‌లో 9, రూరల్ 4, పుంగనూరు 5, నగరి 1, పలమనేరు 4, కుప్పం 1, పులిచెర్లలో 7 మద్యం దుకాణాలను రెన్యూవల్ చేసుకోలేదన్నది అధికారుల మాట. కార్వేటినగరం సర్కిల్లో మాత్రం పది దుకాణాలను రెన్యూవల్ చేసుకున్నారు. మద్యం దుకాణాల పునరుద్ధరణ ఆటలో ఎవరి ఐడియా ఫలిస్తుంది..? ఎవరికి అసలైన కిక్కు దక్కుతుందో వేచి చూడాలి. జిల్లాలో 83 వైన్‌షాపుల లైసెన్స్ రెన్యూవల్ -
గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ
బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయ రహదారిలోని కై గల్ దుముకురాళ్ల బస్‌స్టాప్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. వివరాలు.. కుప్పం నుంచి చిత్తూరు వైపు గ్రానైట్ బండలతో లారీ వెళుతుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెలోకి వెళ్లింది. అయితే డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గంగాధర నెల్లూరు : మండలంలోని పద్మాపురంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వాసు (32) పశువులకు దాణా వేసేందుకు షెడ్లులోకి వెళ్లగా వాటికి విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి ఆత్మహత్య కుప్పంరూరల్ : మండలంలోని గుల్లేపల్లె వద్ద మంగళవారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పసుపు రంగ టీషర్టు ఉందని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాలకు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్య చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వేలాది మంది అర్హులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఈ సమస్యను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వివాహం జరిగినప్పుడు, వారిని పాత కుటుంబం నుంచి విడదీసి కొత్త కుటుంబంగా మార్చాల్సి ఉంటుంది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారితో పాటు జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉన్న వారికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఫ్యామిలీ స్పిట్ (కుటుంబం నుంచి వేరు) చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో చేర్పులు, మార్పులు లేకపోవడంతో వేలాది మంది పథకాలు పొందలేక నష్టపోతున్నారు. చాలా కుటుంబాల్లో రేషన్ కార్డులు వేర్వేరుగా జారీచేసినా, ఆన్లైన్లో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లో ఒకే కుటుంబంగా చూపిస్తున్నారు. దీంతో పలు రకాల నిబంధనలతో పథకాలకు అర్హత ఉన్నా అనర్హులుగా మిగిలిపోతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పెండింగ్ ఉండడంతో జిల్లాలో ప్రస్తుతం వేలాది మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తామేమి చేయలేమని అంతా ప్రభుత్వమే చేయాలని తెగేసి చెప్పేస్తున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్య పరిష్కరిస్తే జిల్లాలో వేలాది మందికి న్యాయం జరుగుతుందని పలువురు కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 3 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరా త్రి వరకు 65,223 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,112 మంది భక్తులు తలనీలా లు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. -
అక్రమ కేసులకు భయపడం
తిరుపతి లీగల్: కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఎదురుదాడి చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవలు అందడం లేదని తిరుపతి వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్‌తో పాటు మరికొంతమంది తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారన్న అభియోగం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు, ఓ మీడియా ప్రతినిధి తిరుపతి సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మంగళవారం భూమన అభినయ్ స్థానిక సబ్ జైల్లో వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియామకాల పట్ల సీబీఐ దర్యాప్తు చేయాలని జగనన్నతోపాటు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే కూటమి నాయకులు వారిపై ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, నరహరరెడ్డి, దొరబాబు, కొత్తపల్లి విజయకుమార్, రాజశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. స్థిరత్వ విశ్లేషణపై వర్క్‌షాప్ ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం తిరుపతి ఐఐటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) ఉద్యోగుల కోసం ‘అధిక పునరుత్పాదక ఇంధన వినియోగంతో స్థిరత్వ విశ్లేషణ’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాస కార్యక్రమానికి తిరుపతి ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ – అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల, ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.పి.నవీన్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఎన్.శామ్యూల్ రాజు, ఐఐటీ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ విఘ్నేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, వివిధ విభాగాలకు చెందిన సుమారు 30 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల తలెత్తే విద్యుత్ వ్యవస్థ స్థిరత్వ సమస్యలపై అవగాహనతో పాటు ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాన్ని అందించేలా కార్యక్రమం జరిగింది. -
రిజర్వేషన్లకు కసరత్తు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఓ కార్పొరేషన్‌తో పాటు రెండు పురపాలక సంఘాల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురితమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను నిర్దారించే పని మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. అనతరం వార్డులతోపాటు మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే మొత్తం ప్రక్రియలో హైకోర్టు బుధవారం వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఈ మేరకు పురపోరుపై పూర్తి స్పష్టత రానుంది. సాక్షి, చిత్తూరు : వార్డుల పునర్విభజన ఇప్పటికే పూర్తి కావడంతో చిత్తూరులో 60 డివిజన్లు, పలమనేరులో 36, నగరిలో 40 వార్డులు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు ప్రచురించారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పులకు మరో మూడు రోజుల అవకాశం కల్పించారు. పనిలో పనిగా బుధవారం నుంచి వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, నిర్ధారణ చేపట్టనున్నారు. ఈనెల 25వ తేదీకి ఈ ప్రక్రియను పూర్తిచేసి, 26న వార్డులవారీగా ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అనంతరం 27,28వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 29, 30వ తేదీల్లో అభ్యంతరాలపై విచారణ, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురించి, రాష్ట్ర మున్సిపల్ సంచాలకులకు అందజేయనున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే వార్డులను ఏయే సామాజికవర్గాలకు రిజర్వు చేసామనే వివరాలను కలెక్టర్ గెజిట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తర్వాత మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను ప్రకటించడం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం తరువాయిగా ఉంటుంది. వార్డుల వారీగా ఇలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఏయే వార్డు కేటాయించాలనే దానిపై నిబంధనల ప్రకారం కలెక్టర్ తుదిగా ప్రచురిస్తారు. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) ఉండనుంది. అంటే చిత్తూరు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీకి ఒక డివిజన్, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేయనున్నటు తెలుస్తోంది. మిగిలినవి ఓపెన్ కేటగిరీ కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కోర్టు తీర్పుపై ఉత్కంఠ షెడ్యుల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిలో బుధవారం రాష్ట్ర హైకోర్టు వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రకారం ఓటర్లు తేలితే రిజర్వేషన్లు ఖరారు చేయాలని, మరోవైపు రిజర్వేషన్లు 50 శాతం మించ కూడదని కోర్టులో దాఖలైన పిటిషన్లపై వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనని రాజకీయ పార్టీలు, అధికారులు ఉత్కంఠంగా చూస్తున్నారు. పిటిషన్లు కొట్టేస్తే మున్సిపల్ ఎన్నికలు షెడ్యుల్ ప్రకారం జరుగుతాయి. పిటిషన్లలోని అంశం సమంజసంగా ఉందంటే మాత్రం పురపాలక సంఘాల ఎన్నికలకు బ్రేకులు పడనున్నాయి. -
ప్రత్యేక టెట్‌లో మార్పులు అవసరం
చిత్తూరు కలెక్టరేట్:ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో మార్పులు అవసరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తాము నిత్యం బోధిస్తున్న సబ్జెక్టులు కాకుండా, ఇతర సబ్జెక్టులతో టెట్ నిర్వహించడం సరికాదన్నారు. దీంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మనుగడకు గొంతుపై కత్తిలా మారిన టెట్ అర్హత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. స్పెషల్ టెట్ అని చెబుతున్నప్పటికీ, అందులో ఉపాధ్యాయులకు ప్రయోజనకరమైన అంశాలేవీ లేవని, ఇదంతా మభ్యపెట్టడమేనని విమర్శించారు. అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు, అర్హత, ఉత్తీర్ణత మార్కుల్లో తేడాలు చూపడం అన్యాయమని స్పష్టం చేశారు. అందరికీ 40 శాతం మార్కు లతో ఒకే రకమైన ఉత్తీర్ణత ప్రామాణికం ఉండాలని విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం సబబు కాదన్నారు. టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. -
కృష్ణమ్మకు సీఎం జల హారతి
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆయన శాంతిపురం మండలం గుండి శెట్టి పల్లి వద్ద హంద్రీ–నీవా ద్వారా వచ్చిన కృష్ణా నీటికి జల హారతి ఇచ్చారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ పూల సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా హంద్రీ–నీవా ద్వారా రెండో దశ కింద కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చామన్నారు. కుప్పం ప్రాంత వాసులు చిరకాల ఆకాంక్ష అయిన కృష్ణా జలాల రాకతో సాగుకు, తాగునీటి అవసరాలకు కీలక అడుగు పడిందన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపుతామని వెల్లడించారు. -
● అర్హత లేకపోయినా అండగా నిలుస్తున్న టీడీపీ నేతలు ● కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు ● విచారణలో వెలుగులోకి వాస్తవాలు ● వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాగైనా పింఛన్ పొందాలనే లక్ష్యంతో పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు డబ్బులు సైతం డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు ఆమోదం పొందితే నెలనెలా పింఛను వస్తుంది.. పోతే రూ.30 వేల వరకు పోతుందనే ఉద్దేశంతో చాలామంది నగదు ఇచ్చేందుకు వెనకాడడం లేదు. ఇలా గ్రామాలు, పట్టణాల్లో పలువురు దరఖాస్తుదారులు అక్రమంగా టీడీపీ నేతలతో సిఫార్సు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వివిధ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 10 నుంచి 25 శాతం వరకు అనర్హులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్‌లో మార్పులు చేయించి.. వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు పలువురు ఉన్నట్లు సమాచారం. వీరు ఆధార్ కార్డులో వయసు మార్పు చేయించుకుని పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒంటరి మహిళల పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో సైతం పలువురు అనర్హులున్నట్లు చర్చ సాగుతోంది. వీటన్నింటిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు కోరుతున్నారు. పచ్చనేతల అండతోనే బోగస్ దందా కొత్త పింఛన్ల దరఖాస్తును ఆసరాగా చేసుకుని అన్ని సౌకర్యాలు ఉన్నవారు, భారీగా ఆస్తులున్న వారు, అర్హత లేని వ్యక్తులు సైతం పింఛన్ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగి నకిలీలకు కొత్త పింఛన్లు ముట్టజెప్పేందుకు చర్యలు చేపడుతున్నారు. తమ అనుచరులకు, తాము చెప్పిన వారికి ఎలాగైనా పింఛన్లు మంజూరు చేయించేందుకు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు అన్ని వృత్తుల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. చేనేత, డప్పు, చర్మకారులు, దివ్యాంగుల పింఛన్ల కేటగిరీల్లో అర్హత లేని వ్యక్తుల నుంచి నకిలీ పత్రాలు తయారు చేయిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నా యి. నకిలీ పత్రాలు దరఖాస్తు చేయించడంలో టీడీపీ నాయకులే కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. జిల్లా సమాచారం పింఛన్ విభాగం అందిన దరఖాస్తులు డప్పు కళాకారులు 2,970 దివ్యాంగులు 7,673 మత్స్యకారులు 64 వృద్ధులు 23,304 ఒంటరి మహిళలు 250 కల్లుగీత కార్మికులు 104 చర్మకారులు 372 ట్రాన్స్జెండర్లు 11 చేనేత కార్మికులు 116 వితంతువులు 8,629 మొత్తం 43,493సొసైటీల చేతివాటం పింఛన్ల మంజూరులో భాగంగా 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఈ విభాగంలో పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారి ప్రధాన జీవనోపాధి చేనేత వృత్తిగా ఉండాలి. సొసైటీలో సభ్యత్వం ఉండాలి. ఆయా సొసైటీలు ఇచ్చిన గుర్తింపు పత్రంతో చేనేత, జౌళి శాఖకు దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌్ మంజూరుకు కావాల్సిన ధ్రువీకరణపత్రం ఇస్తారు. దీంతో పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలామంది నేత కార్మికులు కాకపోయినప్పటికీ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చేనేత సొసైటీలు నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు పత్రాలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. డప్పు కళాకారుల పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారిలోనూ కొందరు అనర్హులున్నట్లు తెలుస్తోంది. -
శ్రీహరి రాజసం
ప్రభల తేజసం..ఘటాటోపం నీడన చంద్ర ప్రభ వాహన సేవ(ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో మలయప్పతిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు అంగరంగ వైభవంగా సాగుతున్నా యి. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్య ప్రభపై తేజోమయంగా, రాత్రి చంద్ర ప్రభపై చల్లని వెన్నెల కాంతుల్లో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా ఊరేగుతూ కనువిందు చేశారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణకాంతులు వెదజల్లుతూ భక్తకోటిని కటాక్షించిన స్వామివారు.. రాత్రి చంద్ర ప్రభపై శ్వేతవర్ణ పుష్పాలంకరణలో సాక్షాత్తు చల్లని చంద్రుడిని తలపించారు. వాహన సేవకు ముందే వర్షం రావడంతో ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ సాగింది. స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మహారథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవల ముందు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్ వాలా’ ఒప్పందం
చంద్రగిరి: మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’, మోహన్‌బాబు యూనివర్సిటీల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో ఛాన్స్లర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్స్లర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్స్లర్ పి.వి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఛాన్స్లర్ మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్‌బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటి సారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మాట్లాడుతూ.. తానూ ఒకప్పుడు యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చి కోచింగ్ ఫీజులు భరించలేక, హైదరాబాద్, కోటి వంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఉచితంగా యూట్యూబ్‌లో బోధన ప్రారంభించి, నేడు అత్యంత తక్కువ రుసుముతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. అనంతరం ఎంఓయూలను చేసుకున్నారు. -
సూర్య తేజం.. చంద్ర వికాసం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై అనంత తేజోమయుడిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి చంద్రప్రభ వాహనంపై చల్లనయ్యగా కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా సరిగ్గా 6.45 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకిన సమయంలో అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయాయి. చంద్రప్రభపై.. చల్లనయ్యగా.. సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవకు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, రాయలపురం, తిరుపతి రూరల్ మండలం నుంచి గాంధీపురం గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. చంద్రప్రభ వాహన సేవకు రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు, సొరకాయలపాలెం, దేసూరికండ్రిగ, సి.రామాపురం, పి.వి.పురం గ్రామాలకు చెందిన భక్తులు సారె సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వాహన సేవల్లో పాలు పంచుకున్నారు. నేడు రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు రథంపై ఆశీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. -
హృదయమనే కోవెలలో..
తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణం పోసింది. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. ఎస్పీసీహెచ్సీకి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, శ్యామ్‌బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దీపేష్ త్రివేది నేతృత్వంలో కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మధుయాదవ్‌తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, వైద్య బృందం విజయంతంగా బాలికకు గుండె మార్పిడి చేసి ప్రాణం పోశారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కుప్పం : కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలో రూ.184 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భూమి పూజ చేశారు. రూ.13కోట్లతో నిర్మించనున్న ఏఎస్పీ, ఆర్డీఓ కార్యాలయ భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. పది ఎకరాల విస్తీర్ణంలో మల్లానూరు జూనియర్ కళాశాల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. 3.30 కోట్లతో నిర్మించనున్న సమగ్ర ఘన వ్యర్థాల నిర్వాహణ ప్లాంట్ల పనులను ప్రారంభించారు. అలాగే రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. 35 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. తంబిగానిపల్లె వద్ద నూతనంగా నిర్మించనున్న రైతు బజారుకు భూమి పూజ చేపట్టారు. కుప్పంమార్కెట్ యార్డులో 2.5 కోట్లతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.16 కోట్ల వ్యయంతో బీటీ, సీసీ రోడ్లు నిర్మించేలా హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార బలంతో ఆక్రమణ చిత్తూరు రూరల్ (కాణిపాకం):అధికార బలంలో టీడీపీ నేతలు సాక్షాత్తు ఆంజనేయస్వామి ఆల య భూమికే ఎసరు పెట్టారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటుంటే దేవదాయ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో పచ్చమూక ఆలయ భూములను సైతం వదలడం లేదని ఆరోపించారు. పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పు వైపున ఉన్న విలువైన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా మురుగు వ్యర్థాలు ఆలయ ప్రాంగణంలోకి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పనులను మానుకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
సిద్ధార్థలో వైభవంగా సీతారాముల కల్యాణం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న నవాహ్నిక‘మహా సంకల్పసిద్ధి మహాయాగం’లో భాగంగా సోమవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఉదయం సుందరకాండ సంపూర్ణ పారాయణం, సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితరాజు దంపతులు, మాజీ శాసన సభ్యులు జీవీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రేయస్సును కోరుతూ, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అశోక్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం వేళ సీతారామ పట్టాభిషేకం, శ్రీరాముల వరి పల్లకీ ఉత్సవం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామ మూల మంత్ర యజ్ఞం సాగింది. -
రమణీయం.. రథోత్సవం
కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం అత్యంత రమణీయంగా రథోత్సవం నిర్వహించారు. సర్వాలంకార భూషితుడై, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు రథంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. గణేశుని వైభవాన్ని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామునే మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం ఉత్సవమూర్తుల ను అన్వేటి మండపానికి వేంచేపు చేసి విశేష సమర్పణ లు చేపట్టారు. పుణ్యాహవాచనం, వాస్తు పూజ, రథసా రథి ప్రతిష్టతో పాటు రథబలి, కూష్మాండ బలి పూజల ను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఆల యం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఉభయకర్తలు సమర్పించిన ఉభయం అనంతరం రథానికి ప్రత్యేక పూజలు జరిపించారు. జయజయధ్వానాల నడుమ.. ఆలయ అధికారులు మధ్యాహ్నం రథోత్సవాన్ని ప్రారంభించడంతో స్వామి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో కాణిపాకం క్షేత్రం మార్మోగింది. వివిధ కళారూపాలు, దివ్య మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శనలు రథోత్సవానికి మరింత శోభను తీసుకువచ్చాయి. రథంపై అధిరోహించిన స్వామివారు కాణిపాక పురవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు అభయమిచ్చారు. అశేష భక్తజనుల నడుమ రథోత్సవం ఉప్పొంగిన భక్తిభావం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవంలో భక్తిభావం ఉప్పొంగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5:45 గంటలకు వైభవంగా ముగిసింది. అయితే రథోత్సవం సాగుతుండగానే సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథం వెంటే సాగారు. -
చిన్నారులకు అరుదైన చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు అరుదైన క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రెండేళ్ల బాలిక కడుపులో అసాధారణంగా మాస్ గుర్తించడంతో తల్లిదండ్రులు చిన్నారిని స్విమ్స్‌కు తీసువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి కుడి కిడ్నీలో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించి డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం చిన్నారికి నాలుగు సైకిళ్ల కీమోథెరపీ చికిత్సను పూర్తి చేశారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెండేళ్ల బాలుడు విల్మ్స్ ట్యూమర్‌తో స్విమ్స్‌లో చేరారని, మూడు నెలల క్రితం ఈ చిన్నారికి మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ భార్గవి బృందం కీమోథెరపీ అందించగా, అనంతరం సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. -
ఆనవాళ్లు లే‘కొండ’!
నగరి : నగరిలో క్రషింగ్ మాఫియా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రూ.కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టేస్తోంది. అనుమతులు ఇచ్చేశాం ఇక మనకేం పని అంటూ అధికారులు కళ్లుమూసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు కంకరను తరలించుకుపోతున్నారు. మండలంలోని గుండ్రాజుకుప్పంలోనే కొండలు ఎక్కువగా ఉండడంతో క్రషింగ్ మాఫియా కన్ను ఈ పంచాయతీపై పడింది. జాతీయ రహదారి పనులు వీరికి కలసి వచ్చాయి. దీంతో ఎడాపెడా కొండలను పిండి చేసేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే మొత్తం దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క బిల్లుతోనే.. నగరి పట్టణం తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో కంకర తరలింపు జోరుగా సాగుతోంది. ఒకే బిల్లుపై మూడు, నాలుగు ట్రిప్పర్ల కంకరను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అరికట్టాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండి పడడంతో పాటు ప్రకృతి సంపద తరించుకుపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రషింగ్ నడిపేవారిలో తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లే ఎక్కువగా ఉండంతో తరలింపు సులభతరంగా మారుతోంది. ఏపీఎండీసీ భూముల్లో సైతం.. ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) భూములను కూడా మైనింగ్ మాఫియా వదలిపెట్టడం లేదు. ఆ భూముల్లో సైతం రిగ్గులు వేసి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సమీప గ్రామాలు సైతం అదిరిపడుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే ఉన్న కొండల్లో పెట్టే బ్లాస్టింగ్ల కారణంగా దారి మొత్తం పొగ కమ్ముకుంటోంది. రాత్రి వేళ పేలుళ్ల కారణంగా జనం నిద్రకు సైతం దూరమవుతున్నారు. సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉండే కొండలకు మాత్రమే బ్లాస్టింగ్ అనుమతులు ఇవ్వాలి. అయితే ఇళ్ల సమీపంలోని కొండలపై కూడా యథేచ్ఛగా బ్లాస్టింగ్ జరుగుతోంది. దీనిపై మైనింగ్‌శాఖ, విజిలెన్సు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం
తిరుపతి రూరల్: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. డయల్ యువర్ సీఎండీకి 103 వినతులు ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియో గదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. నేటి నుంచి పవిత్రోత్సవాలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రుయాలో హోమ్ కేర్ నర్సింగ్ కోర్సు తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్ కేర్ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు. -
చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి
పలమనేరు/పెద్దపంజాణి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అసలు స్వరూపం బయటపడిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవ ని సీబీఐ తేల్చిందన్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్ల లోని నిల్వలను మారు పేరు తో ఆగస్టు 2024లో చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత మళ్లీ టీటీడీకి సరఫరా చేసినట్లు సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలు, కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మీరు చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తారా? అని నిలదీశారు. జంతు కొవ్వు ఉందని ఆరోపణలతో వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. టీటీడీకి వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకుని నాణ్యత పరీక్షలు చేస్తారని జగన్ ముందే చెప్పారని గుర్తు చేశారు. లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఎలా ప్రకటించారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందుకు చంద్రబాబు బేషరుతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు తేలకముందే ప్రాయశ్చిత్త దీక్షలు, సభలు, ప్రకటనలతో భక్తులను మరింత రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. -
ఐరావతారూఢుని వైభవం
కాణిపాకం: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు మహాగజ వాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు విఘ్న వినాశకుని మంగళరూపాన్ని తిలకించి పరవశించిపోయారు. వేకువజామునే మూలమూర్తికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం చేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గజవాహనంపై కొలువుదీరిన గణాధిపతి స్వామివారికి రాత్రి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, ఉభయదారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి, మహాగజ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, జానపద నత్యాలు. పలు ఆధ్యాత్మిక సాంస్కతిక ప్రదర్శనల నడుమ గజవాహన సేవ అత్యంత అంగరంగ వైభవంగా, నేత్రపర్వంగా సాగింది. పురవీధుల్లో స్వామివారు విహరిస్తుంటే ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః జై గణేశా అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో కాణిపాక క్షేత్రం మారుమోగింది. -
‘ఒమేగా’లో క్యాన్సర్‌కు ఉచిత వైద్యం
తిరుపతి సిటీ : ఒమేగా హాస్పిటల్లో ప్రజలకు అధునాతన క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ తెలిపారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం గాంధీపురం సమీపంలోని వకుళమాత ఆలయం వద్ద ఉన్న ఒమేగా హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద పూర్తి స్థాయి సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాయలసీమ ప్రజలకు మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం తిరుపతిలో ఒమేగా హాస్పిటల్ ప్రారంభించామన్నారు. క్యాన్సర్‌కు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందించనున్నట్లు చెప్పారు. చైన్నె, తిరుపతిలోఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలు, డిజిటల్ పెట్ సిటీ, ట్రూ బీమ్ రేడియేషన్ చికిత్స ఓమెగాలో ఉందని, నిపుణులైన సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండడంతో వంద శాతం సక్సెస్ రేట్‌ను సాధించగలుగుతున్నామని వివరించారు. ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, బీఎస్ఎన్ఎల్, ఇండియన్ రైల్వేస్ ఉద్యోగులకి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రథమ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వెల్లడించారు. ఏ స్థాయిలో ఉన్న క్యాన్సర్‌నైనా గుర్తించగలిగే అధునాతన పరికరాలు ఒమేగా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తామని వివరించారు. సమావేశంలో సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శివనాథ్‌రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అలేఖ్య, డాక్టర్ వర్షిత, జీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మూడు నెలల చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారి బండి జియారెడ్డి పొడవైన సహజ జుట్టుతో యంగెస్ట్ బేబీ డాక్యుమెంటెడ్ విత్ ఎక్సెప్షనల్లీ లాంగ్ నేచురల్ హెయిర్ అట్ త్రీ మంత్స్ అనే టైటిల్‌కు సంబంధించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బండి శివకుమార్, అలేఖ్యను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో చిన్నారి బండి జియారెడ్డిని ఆశీర్వదించడంతో పాటు, చిన్నారి తల్లిదండ్రులను సైతం అభినందించారు. -
స్కానింగ్ కన్నింగ్
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా కేంద్రంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆడో.. మగో చెప్పి రూ.వేలకు వేలు గుంజుతున్న ఈ ముఠా వెనుక కూటమికి చెందిన ఓ కీలక బీసీ నేత ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆ కార్యాలయాన్నే ఈ అక్రమ స్కానింగ్ సెంటర్‌కు ప్రధాన అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టానికి, పోలీసులకు భయపడాల్సిన చోట.. ఏకంగా అధికార పార్టీ నేత ఆఫీసులోనే ఈ దందా సాగుతుండడం గమనార్హం. కమీషన్ల కోసం కోవర్టులు ఈ అక్రమ ముఠా అత్యంత ప్రణాళికతో, విస్తృతమైన నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. గ్రామాలు, స్థానిక ప్రాంతాల్లో ఏజెంట్లుగా ఉండే కోవర్టుల ద్వారా గర్భిణులను గుర్తిస్తున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి, తమ ఆటోల ద్వా రా నేరుగా సదరు బీసీ నేత కార్యాలయానికి తరలిస్తున్నా రు. అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, రహస్యంగా స్కానింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. కడుపులో ఉన్నది ఆడపిల్లా లేక మగపిల్లా అని నిర్ధారించి చెప్పడానికి ఏకంగా రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. రోజు కు పదుల సంఖ్యలో గర్భిణులను తీసుకొచ్చి ఈ దందా నడిపిస్తూ అక్రమార్కులు కాసుల వర్షంలో తడుస్తున్నారు. పాత నిందితులు ఉన్నా సరే... గతేడాది చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌కాలనీలో జరిగిన అక్రమ స్కానింగ్ దందాపై జిల్లా కలెక్టర్ స్వయంగా దాడి చేసి, విచారణ జరిపి బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితులుగా ఉన్న కొందరు కన్నుగప్పి మళ్లీ తెరపైకి వచ్చారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దందాకు పాత నిందితులు, ఓ కానిస్టేబుల్, ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు గ్యాంగ్‌గా ఏర్పడ్డారనే విమర్శ లు వస్తున్నాయి. వీరికి సదరు కూటమి బీసీ నేత తోడు కావడంతో చిత్తూరు నడిబొడ్డున మళ్లీ ఈ పాపపు వ్యాపారాన్ని ప్రారంభించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టచ్ చేసే దమ్ము ఎవరికుంది? కూటమి నేత ఇచ్చిన పొలిటికల్ అభయంతోనే ఈ అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారని ఈ అక్రమల చిట్టా తెలిసిన కొందరు వ్యక్తులు ఈ అక్రమాలను బహిరంగం చేస్తున్నారు. అధికారుల దాడి భయం లేకుండా, ఎవరైనా అధికారులు వచ్చి అడ్డొస్తే అన్నీ నేను చూసుకుంటా.. రాష్ట్ర స్థాయిలో ఒక్క ఫోన్ కాల్ కొట్టిస్తే చిత్తూరులో మమ్మల్ని తాకే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ ఆ నేత భరోసా ఇవ్వడంతో, ఈ ముఠా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే చర్యలు తీసుకోకుంటే తీవ్ర ముప్పు నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల దందాపై జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ, సీఐడీ పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ నేత నీడన సాగుతున్న ఈ రాకెట్‌ను వెంటనే అణచివేయకపోతే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ గ్యాంగ్‌ను, వారికి కొమ్ము కాస్తున్న కూటమి నేతను, సహకరిస్తున్న పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధిని కలవాలన్నా భయమే ఈ అక్రమ దందాకు లొంగని వారిపై, ఎదురు తిరిగిన వారిపై ఈ ముఠా వేధింపుల పర్వానికి తెరలేపింది. ప్రశాంత్ నగర్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఓ మహిళను టార్గెట్ చేసి ఆమెను ఆ నేత తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్ర మ కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఈ దందాలు, వేధింపులపై స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి ఫిర్యాదు చేద్దామని బాధిత మహిళలు ప్రయత్నించినప్పటికీ.. కూటమి నేతల బెదిరింపులు, ఎమ్మెల్యే వద్దకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయాందోళనల కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమాచారం. -
● కూటమి ప్రభుత్వంలో తగ్గిపోయిన 102 సర్వీసులు ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన వాహనాలు ● అరకొర సేవలపై ఆస్పత్రుల వద్ద బాలింతల నిరీక్షణ ● తప్పని ప్రైవేటు వాహనాల బాదుడు ● కనుమరుగైన హైరిస్క్ గర్భిణుల రవాణా సదుపాయం ● పట్టించుకోని అధికార యంత్ర
కాణిపాకం: చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 2 జిల్లా ఆస్పత్రులు, 98 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 22 అర్బన్ హెల్త్ సెంటర్లు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 9 ఏరియా ఆస్పత్రులు విస్తరించి ఉన్నప్పటికీ, వాటికి అనుసంధానంగా ఉండాల్సిన రవాణా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చాలీచాలని వాహనాలు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులైన అనంతరం బాలింతలను సురక్షితంగా, ఉచితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు గత ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉచితంగా ఇంటి వద్ద దింపి వచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఈ సేవలపై నిర్లక్ష్యం చూపుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో 16 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 11 ఉన్నాయి. రోజూ 25 నుంచి 30 మంది బాలింతలను మాత్రమే ఇళ్లకు చేరుస్తున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో గతంలో 19 వాహనాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 16కు తగ్గించారు. అక్కడ రోజువారిగా 30 నుంచి 40 మంది తల్లులను మాత్రమే ఇళ్లకు తీసుకెళ్తున్నారు. హైరిస్క్ సేవలు ఏవీ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హైరిస్క్ గర్భిణుల కోసం ప్రత్యేకంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను విస్తరించారు. ఒక కాల్ చేస్తే చాలు.. ఇంటి నుంచే వాహనాన్ని బుక్ చేసుకుని గర్భిణిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం హైరిస్క్ రవాణా సేవల గురించి పట్టించుకోలేదు. పల్లె ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో నేటికీ సరైన బస్సు సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ గర్భిణులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆస్పత్రులకు రావాల్సి వస్తోంది. ఈ సేవలు అందించే విషయంలో స్థానిక ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ చేతులెత్తేస్తున్నారు. అధికారులు సైతం ఈ సేవలను పట్టించుకోవడం మానేయడంతో హైరిస్క్ గర్భిణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు పేరుకే మిగిలిపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వాహనాల సంఖ్యను పెంచి, పాత పద్ధతిలోనే రవాణా సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఉమ్మడి జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అరకొర సేవలే జిల్లాల్లో తల్లీబిడ్డ వాహనాలు పరిమితంగా తిరుగుతుండటంతో అందరికీ ఉచిత రవాణా అంద డం లేదు. బాలింతలు ఉదయం డిశ్చార్జ్ అయి నా సాయంత్రం వరకు వాహనం రాదని సిబ్బంది తేల్చిచెబుతున్నారు. దీంతో బాలింతలు పసిపాపలతో ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించా ల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు డిశ్చార్జ్ అయితే ఎవరిని తీసుకెళ్లాలో తెలియక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో వేచి ఉండలేక బాధితులు సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటు ఆటోలు, టాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. -
వైభవంగా వెంకన్న కల్యాణం
– శాస్త్రోక్తంగా వరుణ యాగం నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో చైర్మన్ అశోక్‌రాజు నిర్వహిస్తున్న నవాహ్నిక విశ్వగురు మహా సంకల్ప సిద్ధి యాగంలో భాగంగా ఆదివారం వైభవంగా వెంకన్న కల్యాణం, వరుణ యాగం నిర్వహించారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల పాటు నిర్వహించిన అరుణ పారాయణం, సూర్య యంత్ర పూజల్లో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యాగ ఫలితంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సంతోషంగా జీవించడానికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ కల్యాణం– వైశిష్ట్యతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం 5 గంటలకు శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి రెండు గంటల పాటు వేద పండితులు విశేష వరుణ యాగం చేపట్టారు. అశోక్‌రాజు మాట్లాడుతూ వరుణ యాగంతో వర్షాలు కురిసి, నదులు ప్రవహించి, చెరువులు, కుంటలు నిండి ప్రజల తాగునీటి సమస్యలు తీరడంతో పాటు వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు వివరించారు.


