సర్వేల మయం!
మానసిక ఒత్తిడితో ఉద్యోగుల సతమతం పెరిగిపోతున్న పనిగంటలు సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు బాబు సర్కారుపై నిరసన సెగ
సచివాలయం..
బాబు నయా మోసం
సచివాలయ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాబు సర్కారు పెట్టే సర్వేలతో ముప్పుతిప్పలెదుర్కొంటున్నారు. అలివిగాని పని ఒత్తిడితో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కుటుంబాలకు దూరమై మానసికంగా..శారీరకంగా కుంగిపోతున్నారు. ఊపిరుంటే చాలు.. అనే నిశ్చయానికి వచ్చేస్తున్నారు. కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకోలేక.. కుటుంబాలను వీధిన పడేయలేక పోరాటాలకు సిద్ధమవుతున్నారు. సర్వేలతో వేధిస్తున్న బాబు ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు. కసితీరా కడిగేసేందుకు సమాయత్తమవుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వే ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. నిరంతర సర్వేలు, అర్ధరాత్రి వరకు యాప్‌ల అప్‌లోడింగ్‌లు, పై అధికారులు టార్గెట్ల మధ్య విలవిల్లాడుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న తోటి ఉద్యోగుల మరణాలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక చేసుకుంటున్న ఆత్మహత్యలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
వేధింపులే పనితీరుకు కొలమానమా?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులపై వేధింపులు పెరిగిపోయాయి. సర్వేల కోసమే సచివాలయ ఉద్యోగులను యంత్రాల్లా వాడుకుంటున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్నా...రావాల్సిన అరియర్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. విద్యావంతులైన తమను వలంటీర్లుగా మార్చి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జీవో నం.11 వల్ల తమ భవిష్యత్తు నాశనమవుతోందని వాపోతున్నారు.
సచివాలయ ఉద్యోగులే వెన్నెముక
గత వైఎస్సార్‌సీపీ సర్కారు ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, సచివాలయ వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు సర్కారు ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి ప్రస్తుతం మోసానికి తెగబడింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సచివాలయ ఉద్యోగులే వెన్నెముక లాంటి వారు. అలాంటి వారి పట్ల చులకన భావనతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
కుప్పంలోని గ్రామ సచివాలయం
సచివాలయ ఉద్యోగుల ఆక్రందన
జిల్లా సమాచారం
రూరల్ సచివాలయాలు 504
అర్బన్ సచివాలయాలు 108
గ్రామ సచివాలయ ఉద్యోగులు 5,040
వార్డు సచివాలయ ఉద్యోగులు 1,080
మొత్తం ఉద్యోగులు 6,120
సర్కారుకు సవాల్
‘గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో పుట్టిన ఈ వ్యవస్థను, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది?. ఉద్యోగోన్నతులు లేవు, బకాయిల నిధులు చెల్లించడం లేదు. కేవలం టార్గెట్‌లు మాత్రమే మిగిలాయా ?..’ అంటూ చంద్రబాబు సర్కారును సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధం. ప్రభుత్వం స్పందించి జీవో 11 ను రద్దు చేయకపోతే త్వరలో అమరావతిని చుట్టుముట్టడం ఖాయం అని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరిస్తోంది.
సర్వేలకే పరితమవుతున్న సచివాలయాలు
సర్వేల మయం!
సర్వేల మయం!
సర్వేల మయం!
సర్వేల మయం!
సర్వేల మయం!


