ఎర్ర దొంగలు
గంగవరం మండలానికి చెందిన ఇద్దరి అరెస్ట్ పలమనేరు మీదుగా కర్ణాటకకు సాగుతున్న ఎర్రచందనం రవాణా గతంలోనే బయటపడిన లింకులు
పలమనేరులోనూ
పలమనేరు: శేషాచలం అడవుల్లో ఉండే ఎర్రచందనానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటకకు చెందిన బడా స్మగ్లర్లు కూలీల ద్వారా ఎర్రచందనం వృక్షాలను నరికిస్తున్నారు. గతంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులను ముమ్మరం చేసి పలువురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో దుంగల రవాణా కొంతమేర తగ్గి నా కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులను దాటిస్తున్నారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా లో పలుచోట్ల అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో పలమనేరు వాసులకు ఉన్న లింకులు వెలుగుచూశాయి. తాజాగా అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి వద్ద పింఛానది సమీపంలో వాటర్ ట్యాంకర్‌లోకి ఎర్రచందనం దుంగలను కూలీలు లోడ్ చేస్తుండగా తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నలుగురు స్మగర్లను అరెస్ట్ చేశారు. 72 దుంగలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.65 కోట్లు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు కాగా మరో ఇద్దరు గంగవరం మండలానికి చెందిన వారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అప్పినపల్లి ఘటనలో పారిపోయిందెవరో..?
గత ఏడాది నవంబరు 14న ఎర్రచందనం దుంగలతో కారు పులిచెర్ల నుంచి పలమనేరు మీదుగా వస్తోందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. అధికారులు కాపుగాచినా కారును పట్టుకోలేకపోయారు. అప్పినపల్లి వద్ద గ్రామస్తులు కారును పట్టుకున్నారు. అప్పటికే స్మగ్లర్లు తప్పించుకున్నారు. వీరికి ఈ ప్రాంతంపై పట్టు ఉంటే గాని ఇది సాధ్య మయ్యే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు పట్టుబడిన వారు.. ఇటీవల కారును వదిలి పారిపోయినవారు ఇక్కటేనా అనే అనుమానం వస్తోంది.
నిందితులు మధుకుమార్, మహబూబ్ బాషా
అంతర్రాష్ట్ర ముఠాలతో లింకులు
వేలూరు జిల్లా అనైకట్టుకు చెందిన బూసి వెంకటేశన్, మళ్లవాడికి చెందిన ఏలుమలై రమేష్‌తో గంగవరం మండలం మర్రిమాకులపల్లికి చెందిన ముధుకుమార్(34), కీలపల్లి చెందిన మహబూబ్‌బాషా (33)కు లింకులు ఎలా ఏర్పడ్డాయన్న దానిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారించినట్టు తెలిసింది. గతంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఎర్రచందనం కేసుల్లో బడా స్మగ్లర్లతో కలిసి అరెస్టు అయ్యారు. తాజాగా అరెస్టు అయిన వారిలో ఒక వ్యక్తి ఇక్కడి టీడీపీ నాయకుడి కుమారుడు కావడం గమనార్హం. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలోనూ కొంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగినట్టు తెలుస్తోంది.
ఎర్ర దొంగలు
ఎర్ర దొంగలు
ఎర్ర దొంగలు


