పకడ్బందీగా అభయ నిస్వార్థ ప్రవేశ పరీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అభయ నిస్వార్థ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తమరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్ 60 అభయ నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్ష నిర్వహించామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరైనట్టు పేర్కొన్నారు. ఇందులో అర్హత సాధించిన వారు అనంతపురంలో నిర్వహించే రెండవ లెవల్ పరీక్షకు హాజరువుతారని పేర్కొన్నారు. అక్కడ ఎంపికయ్యే వారికి అనంతపురంలో ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు షబ్బీర్, దుర్గాప్రసాద్, దేవరాజులురెడ్డి, దామోదరరెడ్డి పాల్గొన్నారు.
అందరికీ వాటాలిస్తున్నాం..
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేత ప్రజాప్రతినిధిగా ఎన్నికై న నాటి నుంచి ప్రకృతి వనరులను ఆ పార్టీ నేతలు కొల్లగొడుతున్నారు. తాము చెప్పినట్లు తలలు ఊపే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుని, అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. స్థానిక చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ మట్టి మాఫియాకు అడ్డాగా నిలిచింది. కాలనీలోని చివరి ప్రాంతంలో ఉన్న కొండగుట్టను ధ్వంసం చేస్తూ విలువైన ఎర్రమట్టిని దోచుకుపోతున్నారు. కొద్ది రోజులుగా గుట్టుగా చేస్తున్న ఈ దందాపై స్థానికులు తిరగబడడంతో విషయం బయటకు పొక్కింది. మట్టి మాఫియా మాత్రం తాము అధికార పార్టీ నేతలు, అధికారులకు వాటాలు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.800ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు వందకు పైగా ట్రిప్పులు వెళ్తున్నాయంటే మాఫియా అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
రెవెన్యూలోని కీలక అధికారికి ముడుపులు
మట్టి, ఇసుక అక్రమ రవాణాపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా రెవెన్యూ అధికారులు ఏడాదిన్నరగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదు చేసిన వెంటనే అ నుమతులు ఇవ్వలేదని రెవెన్యూలోని కీలక అధికారి స్పష్టం చేస్తున్నారు. అక్రమాలపై ఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు.
పకడ్బందీగా అభయ నిస్వార్థ ప్రవేశ పరీక్ష


