'ఈ బిడ్డ నా జీవితకాల కోరిక'.. బిగ్‌బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ | Bigg boss Shiva Jyothi Emotional Post after Blessed with Baby | Sakshi
Sakshi News home page

Shiva Jyothi: 'నా లైఫ్‌లో ఆ దేవుడిచ్చిన విలువైన బహుమతి'.. బిగ్‌బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్

Feb 15 2026 9:18 AM | Updated on Feb 15 2026 11:28 AM

Bigg boss Shiva Jyothi Emotional Post after Blessed with Baby

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, యాంకర్‌ శివజ్యోతి తన అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 12న బిడ్డ పుట్టగా..  శివజ్యోతి బర్త్‌డే సందర్భంగా ఈనెల 14 శుభవార్తను పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ ఈ జంటకు అభినందనలు తెలిపారు.

తాజాగా బిగ్‌బాస్‌ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ చేసింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రాసుకొచ్చింది.  నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం...నా స్వామి ఇచ్చిన మహా లక్ష్మి... వెంకటేశ్వర స్వామి నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతని ఇదేనని భావోద్వేగ పోస్ట్ చేసింది.  కుమార్తెను కనడం నా జీవితకాల కోరికని శివజ్యోతి వెల్లడించింది.

శివజ్యోతి తన ఇన్‌స్టాలో రాస్తూ..' బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల. అందులో ఒక కుమార్తెను కనడం నా జీవితకాల కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను ఎప్పుడూ భావించా. అత్యంత సరైన సమయంలో ఆయన నాకు ఆశీర్వాదాన్ని కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. కానీ.. మొదటి నెల నుంచే నా హృదయం ఆడపిల్ల కోసం బలంగా కోరుకుంది. కానీ నా మనస్సు అబ్బాయి కావచ్చని చెబుతూనే ఉంది. ఆ తర్వాత నా డెలివరీ గడువు తేదీకి కేవలం రెండు రోజుల ముందు అకస్మాత్తుగా నా హృదయంలో ఆ భావన మారిపోయింది.  మనకు ఆడపిల్ల పుట్టబోతోందని భావించా. ఈ రోజు, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రకృతి దయతో మాకు అందమైన ఆడపిల్ల పుట్టిందని' రాసుకొచ్చింది.

ప్రస్తుతం నా భర్త గంగూలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, అదృష్టవంతుల్లో ఒకరని తెలిపింది. ఆ జెంటిల్‌మెన్ స్వభావం, స్వచ్ఛమైన, దయగల హృదయం కారణంగానే మాకు ఆడపిల్ల పుట్టిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని తెలిపింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నామని పోస్ట్ చేసింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement