‘కపుల్‌ ప్రెండ్లీ’పై ప్రభాస్‌ రివ్యూ | Prabhas Review On Couple Friendly Movie | Sakshi
Sakshi News home page

నాకు ‘వర్షం’లా, సంతోష్‌కి ‘కపుల్‌ ప్రెండ్లీ’ : ప్రభాస్‌ ప్రశంసలు

Feb 15 2026 9:23 AM | Updated on Feb 15 2026 11:34 AM

Prabhas Review On Couple Friendly Movie

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. 

సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.

కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement