సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి | Sivakumar Says He Denied Suriya Love with Jyothika | Sakshi
Sakshi News home page

జ్యోతికతో లవ్‌.. కుదరదన్న సూర్య తండ్రి.. హీరో ఏం చేశాడంటే?

Feb 14 2026 3:00 PM | Updated on Feb 14 2026 5:17 PM

Sivakumar Says He Denied Suriya Love with Jyothika

ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్‌ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

జీవితాంతం ఒంటరిగానే..
శివకుమార్‌ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.

ఎలా ఉండేవాడు?
వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్‌కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్‌ సరదాగా చెప్పుకొచ్చాడు.

ప్రేమ- పెళ్లి
సూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్‌' మూవీ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్‌ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్‌ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.

చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్‌

Advertisement
 
Advertisement
Advertisement