పాక్‌లో ధురంధర్‌ సీడీలు.. ఇంత చీప్‌గా దొరుకుతున్నాయా? | Dhurandhar Pirated DVD Being Sold in Pakistan for Rs16 | Sakshi
Sakshi News home page

రూ.16కే ధురంధర్‌ సీడీ.. పాకిస్తాన్‌లో బ్యాన్‌ ఉన్నా ఆగని పైరసీ!

Feb 13 2026 1:38 PM | Updated on Feb 13 2026 1:44 PM

Dhurandhar Pirated DVD Being Sold in Pakistan for Rs16

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ గతేడాది ధురంధర్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్‌ అవకుండా బ్యాన్‌ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.

సీడీల అమ్మకం
అంతేకాదు, పాక్‌లో ధురంధర్‌ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్‌ కార్ల్‌ రాక్‌ షేర్‌ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్‌బో సెంటర్‌ పైరసీ కంటెంట్‌కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్‌ సినిమా సీడీలను 50 పాకిస్తాన్‌ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్‌లో ఇండియన్‌ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్‌ ధురంధర్‌ సీడీ చూపించాడు.

అటు బ్యాన్‌.. ఇటు పైరసీ
ఇది చూసిన జనాలు.. పాకిస్తాన్‌ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్‌పై బ్యాన్‌ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్‌ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్‌ ఖన్నా, ఆర్‌. మాధవన్‌, సారా అర్జున్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్‌ 2 మార్చి 19న విడుదలవుతోంది.

 

 

చదవండి: అర్జున్‌తో వివాదం.. విశ్వక్‌ ఏమన్నాడంటే?

Advertisement
 
Advertisement
Advertisement