చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్‌ | Kenishaa Francis Says She Did not get Recognition | Sakshi
Sakshi News home page

నాకు కనీస గుర్తింపు లేదు, తను వచ్చాక ప్రపంచమే మారిపోయింది!

Feb 13 2026 6:56 AM | Updated on Feb 13 2026 8:34 AM

Kenishaa Francis Says She Did not get Recognition

గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్‌ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్‌, నటి ఇలా పలు టాలెంట్స్‌ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్‌ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్‌కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్‌, కెనిషా జంటగా తిరున్నారు.

రవి మోహన్‌పై పొగడ్తలు
ఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్‌ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్‌ హీరో అయినా విలన్‌ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్‌ గ్రీన్‌ రవిమోహన్‌ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

రవితో బర్త్‌డే సెలబ్రేషన్స్‌
రవిమోహన్‌కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్‌ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. 

ప్రపంచమే మారిపోయింది
తాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్‌ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్‌కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement