మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో సినిమా 'అవెంజెర్స్: డూమ్స్ డే'. వచ్చే నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ మన దగ్గర కూడా మొదలుపెట్టేశారు. ముంబై, హైదరాబాద్ లాంటి అర్బన్ సిటీలతో పాటు తెనాలి లాంటి లోకల్ ప్రాంతాల్లోనూ టికెట్స్ సేల్ చేస్తున్నారు. కానీ రేట్లే.. సినీ ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.
(ఇదీ చదవండి: తెలుగు హీరోకి రూ.3.5 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత)
ఆంథోనీ రుస్సో-జో రుస్సో సోదరులు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. థండర్ బోల్ట్స్ కథ జరిగిన 14 నెలల తర్వాత మొదలవుతుంది. మూడు యునివర్స్‌లకు చెందిన ఫెంటాస్టిక్ ఫోర్, వకండా యోధులు, ఎక్స్ మెన్, అవెంజర్స్ అందరూ ఒకేచోట కలుస్తారు. ఇన్నాళ్ల ఐరన్ మ్యాన్‌గా కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్.. ఇందులో డాక్టర్ డూమ్‌గా సందడి చేయబోతున్నారు. ఇతడు చేయబోయే విధ్వంసాన్ని అడ్డుకోవడానికి సూపర్ హీరోలందరూ ఏం చేశారనే దాని మీద అవెంజర్ డూమ్స్ డే నడుస్తుంది.
అయితే ఈ చిత్రానికి మన దేశంలో టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టగా ఏకంగా ఒక్కొక్కటి రూ.4500 పైగానే విక్రయిస్తున్నారు. నేవి ముంబై ప్రాంతంలోని ఓ మల్టీప్లెక్స్‌లో ఈ రేట్లు దర్శనమిచ్చాయి. రూ.500 నుంచి మొదలుపెట్టి ఒక్కో చోట ఒక్కోలా రూ.1000, రూ.2000, రూ.3000 ఇలా టికెట్లని అమ్ముతున్నారు. జనాలు కూడా పెద్దగా ఆలోచించకుండానే వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతింత రేట్లు పెడితే భారతదేశం నుంచే వేల కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: లెక్కలు మార్చేసిన 'ఆదర్శ కుటుంబం' ఫ్లాప్!)


