ప్లీజ్‌.. ఇంకెప్పుడు ఇలా ఈవెంట్‌కి రావద్దు సార్‌: ధనుష్‌ | Hero Dhanush About Mammootty | Sakshi
Sakshi News home page

Dhanush: ఇంకెప్పుడు ఇలా ఈవెంట్‌కి రావద్దు సార్‌: ధనుష్‌

Nov 17 2026 3:12 PM | Updated on Nov 17 2026 3:18 PM

Hero Dhanush About Mammootty

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఓం’. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ-రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.  ధనుష్, మమ్ముట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.  

నాదొక చిన్న విన్నపం..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ధనుష్ మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి గారూ.. నాదొక చిన్న విన్నపం. ఈసారి ఈవెంట్‌కు వచ్చేటప్పుడు మీ గడ్డంలో కనీసం కొన్ని తెల్ల వెంట్రుకలైనా ఉండేలా చూసుకోండి. లేదంటే మీ పక్కన నేను మరీ పెద్దవాడిలా కనిపిస్తున్నాను’ అని సరదాగా అనడంతో మమ్ముట్టితో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వేసారు. అలాగే చేద్దాం అంటూ ముమ్ముట్టి కూడా నవ్వుతో సమాధానం చెప్పారు.

కాగా.. ఈ చిత్రంలో సాయిపల్లవి పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement