సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు | Ramya Krishnan Intresting Comments On Casting Couch In Film Industry | Sakshi
Sakshi News home page

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Nov 17 2026 1:35 PM | Updated on Nov 17 2026 1:45 PM

Ramya Krishnan Intresting Comments On Casting Couch In Film Industry

చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌  ఉందనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. దీనిపై కొంతమంది తారలు బహిరంగంగా స్పందించారు కూడా. కొంతమంది తమకు అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెప్తే..మరికొంతమంది మాత్రం క్యాస్టింగ్‌  కౌచ్‌  ఉందని చెబుతూ..తమకు ఎదురైన ఛేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా దీనిపై సీనియర్‌  నటి రమ్యకృష్ణ కూడా స్పందించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘క్యాస్టింగ్‌  కౌచ్‌ అనేది అప్పుడూ ఉంది. ఇప్పుడూ కొనసాగుతుంది. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఈ విషయంలో నో చెప్పడానికి వీల్లేదు. దానికి ఓకే చెప్పాలా? నో చెప్పాలా? అనేది నీ చేతుల్లో ఉంది. బలవంతంగా, తప్పనిసరి పరిస్ధితుల్లోనో లేదంటే ఇష్టపూర్వకంగానే ఇది జరగొచ్చు. 

(చదవండి: అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన ఫోక్ సింగర్)

మా ప్రొఫెషన్ గ్లామర్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంటుంది.. ప్రజలు మా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ బయట చాలా చోట్ల జరుగుతోంది. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ, అన్ని రంగాల్లోనూ ఇది ఉంది. ప్రస్తుతం ఆడ, మగ తేడా లేకుండా జరుగుతోంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

(చదవండి: కాస్త ఒత్తిడిగా అనిపించింది... నో చెప్పలేకపోయాను : మమ్ముట్టి)

రమ్యకృష్ణ సినీ కెరీర్‌ విషయానికొస్తే..80, 90 దశకాలలో దక్షిణాదిలో అగ్రనటిగా వెలుగొందారు. చిరంజీవి, నాగార్జున,వెంకటేష్‌, రజనీకాంత్ ఇలా ఎంతో మంది స్టార్‌ హీరోలతో కలిసి పని చేశారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధన్యమున్న రోల్స్‌తో అలరించారు. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో వందలాది చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement