ఆ రోజు తండ్రికి కొడుకే పోటీ.. నెగ్గేదెవరో..? | Mammootty Dulquer Films Release Same Day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు అటు తండ్రి.. ఇటు కొడుకు... నెగ్గేదెవరో..?

Nov 16 2026 4:09 PM | Updated on Nov 16 2026 4:18 PM

Mammootty Dulquer Films Release Same Day

సినిమా ఇండస్ట్రీలో తండ్రీకొడుకుల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అరుదు. అయితే ఇప్పుడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్  విషయంలో అదే జరిగింది. వీరు వేర్వేరుగా నటించిన సినిమాలు నవంబర్ 20 న థియేటర్లలోకి రాబోతున్నాయి.

మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన 'ఓ.o', దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఆకాశంలో ఒక తార' ఒకే రోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే 'ఓ.o'లో ధనుష్ ప్రధాన హీరోగా నటిస్తున్నారు. వీరిలో విజయం ఎవరు సాధిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓం విషయానికి వస్తే..
తమిళ స్టార్ హీరో ధనుష్‌, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓ.o’(O.M) ఈ చిత్రం నవంబర్ 20న  విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి పోలీస్‌ అధికారిగా కనిపించనుంది. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఆకాశంలో ఒక తార..
దుల్కర్‌ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్‌ మీడియా బ్యానర్లపై సందీప్‌ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం కూడా నవంబర్ 20న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకి డైరెక్టర్‌ పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. ఇందులో శ్రుతిహసన్‌ కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: అమితాబ్‌ పోస్ట్‌.. ఆ రెండు పదాల వెనుక కారణమేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement