దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ సినిమాపై అంచానాలు పెంచేస్తోంది. ‘పంది మంది నవ్వితే ఏంటి.. ఒక్కరు నమ్మితే చాలదా కృష్ణగారు’ అనే డైలగ్ ఆకట్టుకుంటోంది.


