దుల్కర్‌కి ఈ సినిమా ఓ మైల్‌ స్టోన్‌: అల్లు అర్జున్‌ | Allu arjun Speech Aakasamlo oka tara movie | Sakshi
Sakshi News home page

దుల్కర్‌కి ఈ సినిమా ఓ మైల్‌ స్టోన్‌: అల్లు అర్జున్‌

Nov 15 2026 9:30 PM | Updated on Nov 15 2026 9:30 PM

Allu arjun Speech Aakasamlo oka tara movie

దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా  ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ..
‘దుల్కర్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి గారి అబ్బాయి అయినప్పటికీ చాలా హంబుల్‌గా ఉంటారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. అదే ఆయనకు మంచి సక్సెస్‌ను తీసుకొస్తుంది. ‘ఆకాశంలో ఒక తార’ ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది . హీరోయిన్‌గా పరిచయమవుతున్న సాత్వికకు ఆల్ ది బెస్ట్.

పవన్ సాధినేని తొలి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చాలా అద్భుతంగా తీశాడు. తను చాలా టాలెంటెడ్ డైరెక్టర్. సరైన సమయం వచ్చినప్పుడు తన టాలెంట్‌ను నిరూపించుకుంటాడని అనిపించింది. ఈ సినిమాలో ఆ ఎనర్జీ కనిపిస్తోంది.ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

(ఇదీ చదవండి: ఆ టైంలో మొదట ఫోన్ చేసింది బన్నీ అన్నే: పవన్ సాధినేని)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement