డైరెక్టర్‌ వేధింపులు.. చేసేది ఏమీ లేక.. : స్టార్‌ నటి | Swara Bhasker About Harassment | Sakshi
Sakshi News home page

Swara Bhasker: ‘డైరెక్టర్‌ వేధింపులు.. గుర్తించలేకపోయా’

Nov 15 2026 7:58 PM | Updated on Nov 15 2026 7:58 PM

Swara Bhasker About Harassment

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సినిమాలతోనే కాకుండా సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తను వెడ్స్ మను' సినిమాతో
2011లో 'తను వెడ్స్ మను' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వర భాస్కర్.. అప్పటికే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 56 రోజుల పాటు జరగాల్సిన ఈ షెడ్యూల్ ప్రారంభమైన కొద్ది రోజులకే దర్శకుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందట. ఆ తర్వాత ఆయన నుంచి వేధింపులు మొదలయ్యాయని స్వర గుర్తుచేసుకున్నారు.

శారీరక స్పర్శ జరగకపోవడంతో..
‘అప్పట్లో నాకు ఎదురైన పరిస్థితి లైంగిక వేధింపుల కిందకు వస్తుందనే విషయం కూడా తెలియదు. నాపై ఎలాంటి శారీరక స్పర్శ జరగకపోవడంతో పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులుగా దాన్ని గుర్తించలేకపోయాను. అప్పట్లో నాకు ప్రత్యేక బృందం లేదు. సాయం కోరేందుకు పరిశ్రమలో పెద్దగా పరిచయాలు కూడా లేవు. దీంతో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను.  ఈ ఘటన కోసం ‘మీటూ’ ఉద్యమంలో ఇతర మహిళల అనుభవాలు చదివినప్పుడు.. దేవుడా, నాకు జరిగింది కూడా కచ్చితమైన వేధింపే కదా అని తెలిసొచ్చింది’ అని అన్నారు.

(ఇదీ చదవండి: నాన్నగారి బయోపిక్‌ తీస్తానంటే.. నిర్మాతగా ఉంటా: మహేశ్‌బాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement