సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా గత నెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి అలా బోలెలో అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో పూర్ణ తన స్టెప్పులు, డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మరో ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాట ఫుల్ వీడియోను పంచుకున్నారు. బిందాస్ అంటూ సాగే ఈ సాంగ్‌లో బాలీవుడ్ భామ నోరా ఫతేహీ తన గ్లామర్, స్టెప్పులతో ఆలరించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియోను మీరు కూడా చూసేయండి. గతంలో జైలర్‌లో తమన్నా డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్టయింది.


