లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి హీరోగా చేసిన రెండో సినిమా 'దొంగ నా కొడుకు'. సెన్సార్ సమస్యల వల్ల టైటిల్‌ని 'డీఎన్‌కే' అని మార్చారు. ఈ నెల నవంబర్ 13న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కామెడీ జానర్‌లో వచ్చిన ఈ మూవీ సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో డీఎన్‌కే మూవీ వసూళ్లపరంగా రాణిస్తోంది.
ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.7.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ కారణంగా కలెక్షన్స్ రాబడుతోంది కాగా.. ఈ సినిమాకు శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఈ సినిమాకు సింజిత్ ఎర్రమిల్లి సంగీతమందించారు. ఈ మూవీలో సుష్మిత శెట్టి, అలీ, రజిత కీలక పాత్రలు పోషించారు.
The BLOCKBUSTER LAUGHS all over ❤️ #DNK grosses 7.25 CRORES WORLDWIDE in 2 days 💥💥 Book your tickets now! 🎟️ https://t.co/G0zjTckuv9 ROBBERY • CRIME • COMEDY #DongaNaaKoduku https://t.co/jPSXO5fl11
— Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2026


