'గిరిబాబు చివరి కోరిక అదే'.. తనయుడు రఘుబాబు వెల్లడి | Tollywood Actor Raghu Babu about Giri Babu Last Desire | Sakshi
Sakshi News home page

Giri Babu: 'గిరిబాబు చివరి కోరిక అదే'.. తనయుడు రఘుబాబు వెల్లడి

Nov 15 2026 1:36 PM | Updated on Nov 15 2026 1:36 PM

Tollywood Actor Raghu Babu  about Giri Babu Last Desire

టాలీవుడ్‌లో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు గిరిబాబు ఈ రోజు కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.  కొన్ని దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుమారుడు, నటుడు రఘుబాబు ఫుల్ ఎమోషనలయ్యారు.

తన తండ్రి మరణం తర్వాత రఘుబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చివరి కోరిక కూడా మాతో ముందే చెప్పారని రఘుబాబు వెల్లడించారు. తన పార్థీవదేహాన్ని స్వగ్రామం రావినూతలకు తీసుకెళ్లమని మాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. నాన్నగారి చివరి కోరిక కూడా అదేనని రఘుబాబు తెలిపారు. తన చివరి కార్యక్రమం పుట్టిన ఊరిలోనే చేయాలని ఆయన పదేపదే చెప్పారన్నారు. అందుకే ఫిల్మ్ ఛాంబర్ వద్ద కేవలం రెండు మూడు గంటలే భౌతికకాయం ఉంచామని రఘుబాబు పేర్కొన్నారు. కాగా.. ఇవాళ ఆయన స్వగ్రామం రావినూతలలో అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా.. సుమారు 600కు పైగా చిత్రాల్లో గిరిబాబు నటించారు. ఈయనకు సూపర్‌స్టార్‌ కృష్ణతో ఎక్కువ అనుబంధం ఉండేది. తన సినీ ప్రయాణంలో  దాదాపు 150కి పైగా చిత్రాల్లో కృష్ణతో కలిసి నటించానని ఓ ఇంటర్వ్యూలో గిరిబాబు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement