కావ్యమారన్‌తో వివాహం.. అనిరుధ్ కీలక నిర్ణయం | Anirudh takes break until January 2027 after wedding with Kavya Maran | Sakshi
Sakshi News home page

Anirudh: కావ్యమారన్‌తో వివాహం.. అనిరుధ్ కీలక నిర్ణయం

Nov 15 2026 12:16 PM | Updated on Nov 15 2026 12:17 PM

Anirudh takes break until January 2027 after wedding with Kavya Maran

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి వేడుక గ్రీస్‌లో ఫుల్ గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి ఆత్మగౌరవం అనే సంప్రదాయంలో జరిగింది. అంటే పురోహితులు ఎవరు లేకుండానే కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో రింగ్స్, దండలు మార్చుకోవడమే ఈ పెళ్లి పద్ధతి. దీంతో ఈ పెళ్లి గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.

ఇక పెళ్లి సంగతి పక్కనపెడితే.. అనిరుధ్ రవిచందర్‌ తన ప్రాజెక్టులకు బిగ్ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత దాదాపు మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది జనవరి వరకు గ్యాప్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. కావ్య మారన్‌తో వివాహం జరిగిన తర్వాత అనిరుధ్ రవిచందర్ తన వర్క్‌ లైఫ్‌కు విరామం ఇవ్వనున్నారు. ఈ వార్తలు నిజమైతే కొత్త ఏడాదిలోనే తన మొదటి ప్రాజెక్ట్ 'సండియార్'కు పని చేయనున్నారు.

ప్రస్తుతం అనిరుధ్ తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కమల్ హాసన్ మూవీ 'సండియార్' గా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదల ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే అనిరుధ్ అక్టోబర్ తర్వాత కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తన ప్రణాళికల గురించి చిత్రనిర్మాతలకు చాలా ముందుగానే తెలియజేశారు. అనుకున్న ప్రకారం 'సండియార్' టీజర్ రాకపోవడానికి ఈ విరామం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. నిర్మాతలు మొదట నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజున టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పూర్తి చేయకపోవడంతో కేవలం సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మాత్రమే విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement