నటిగా పలు సినిమాలు చేసిన శ్రీదేవి.. 'కోర్ట్' సినిమాతో హీరోయిన్‌గా హిట్ కొట్టింది. తర్వాత తెలుగులోనే కొన్ని మూవీస్ చేసింది. మరోవైపు తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలానే చేసిన ఓ ప్రేమకథ కొన్నిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
శ్రీదేవి తమిళంలో చేసిన తొలి సినిమా 'హైకూ'. ఏగన్, ఫెమినా జార్జ్ ఇతర కీలక పాత్రలు చేశారు. అక్టోబర్ 23న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు. తెలుగు, తమిళంలో రిలీజైంది గానీ ఎందుకనో జనాలకు కనెక్ట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం నెల తిరిగేసరికల్లా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని ప్రకటించారు. ఈ శుక్రవారం (నవంబర్ 20) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
'హైకూ' విషయానికొస్తే.. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన మనోహర్ (ఏగన్).. సిటీలోని వేరే కాలేజీల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో లేడీస్ నుంచి కో-ఎడ్యుకేషన్‌గా మారిన కాలేజీలో చేరతాడు. అక్కడ పవళకుడి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళ్తాడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ వల్ల మనో-కుడి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? వాళ్ళిద్దరూ విడిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి?
కుడి మరో పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటి? చెన్నైలో ఇంటర్న్‌గా పనిచేసే నివేదా(ఫెమినా జార్జ్)తో మనో ప్రేమ, సహజీవనంలో ఏం జరిగింది? మనోకి దూరం కావాలని నివేదా ఎందుకు నిర్ణయించుకుంది? చివరికి కుడిని కలిశాక మనో ఏం తెలుసుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా కికు చిరంజీవి)


