చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ శుక్రవారం ఇట్లు అర్జున, గోట్(G.O.A.T), మాయ లేడీ, డార్క్ చాక్లెట్, దొంగ నా కొడుకు, చంద్రయాన్, జింగో పెన్ లాంటి అరడజనుకి పైగా తెలుగు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అన్నీ కూడా చిన్న సినిమాలే కావడంతో వీటిపై పెద్దగా బజ్ లేదు.
ఈ శుక్రవారం ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఈ ఫ్రైడే విజయ్ దేవరకొండ రణబాలి ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాంద్రా, దాయిరా లాంటి సినిమాలు ఓటీటీల్లో అలరించనున్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా రానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ శుక్రవారం ఓటీటీ మూవీస్ ఇవే..
నెట్‌ఫ్లిక్స్
దాయిరా (హిందీ మూవీ) - నవంబర్ 13
రణబాలి (తెలుగు సినిమా) - నవంబర్ 13
హార్ట్ ల్యాండ్ (కెనడియన్ సిరీస్) - నవంబర్ 13
మర్డర్ ఇన్ గెలిసియా(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 13
మస్ట్ డేట్ ఇన్ ప్లే బాయ్(తమిళ సిరీస్)- నవంబర్ 13
కంక్ ఆన్ సినిమా (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ) - నవంబర్ 15
అమెజాన్ ప్రైమ్
వైబ్ (హిందీ చిత్రం) - నవంబర్ 13
జియో హాట్‌స్టార్
అవెంజర్స్ ది ఎండ్ గేమ్ కాంకోర్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 13
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్ (హిందీ సిరీస్) - నవంబర్ 13
జీ5
బాంద్రా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 13
అఫ్రాతఫ్రీ (మరాఠీ చిత్రం) - నవంబర్ 13
మిర్గయ 1.5 (బెంగాలీ మూవీ) - నవంబర్ 13
ఆపిల్ టీవీ ప్లస్
12 12 12 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 13
బీయింగ్ హెయిమన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 13
సోనీ లివ్
పరివారిక్ మనరంజన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 13
మనోరమ మ్యాక్స్
ద థర్డ్ మర్డర్ (మలయాళ మూవీ) - నవంబర్ 13
సన్ నెక్ట్స్..
హ్యాపీ జర్నీ(తెలుగు సినిమా)- నవంబర్ 13
లయన్స్ గేట్ ప్లే..
క్రాలర్స్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 13
హెచ్‌బీవో మ్యాక్స్..
ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 13
ఆహా
కికు చిరంజీవి(తెలుగు సినిమా)- నవంబర్ 14


