అల్లు అర్జున్‌ సతీమణికి కీలక బాధ్యతలు | Allu Arjun Wife Allu Sneha Reddy Appointed As Chairperson Of Culture And Heritage At Baoli Art Sangam, Check Post Inside | Sakshi
Sakshi News home page

Sneha Reddy: అల్లు అర్జున్‌ సతీమణికి కీలక బాధ్యతలు

Nov 12 2026 5:13 PM | Updated on Nov 12 2026 5:25 PM

Allu Arjun Wife Allu Sneha Reddy as a Bavoli art Sangam Chairman

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు తీసుకుంది. ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషం.

మనదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచనున్నారు. దీంతో పాటు మన సంస్కృతి మూలాలను గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనున్నారు.  బావోలి ఆర్ట్ సంగం ఈవెంట్ 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement