అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Allari Naresh Alcohol Release Date Announced | Sakshi
Sakshi News home page

అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’.. వచ్చేది అప్పుడే..

Nov 12 2026 2:27 PM | Updated on Nov 12 2026 2:28 PM

Allari Naresh Alcohol Release Date Announced

హీరో అల్లరి నరేశ్‌ నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో గుర్తింపు పొందిన మెహర్ తేజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18 న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

కాగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించగా, రుహానీ శర్మ, నిహారిక ఎన్ఎం కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది.  దర్శకుడు మెహర్‌ తేజ్‌ మంచి కామెడీ టైమింగ్‌ పంచ్‌లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ‘రామాయణం’పై మహేశ్‌బాబు కొడుకు రివ్యూ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement