శేఖర్ మాస్టర్‌ కారుని ఢీకొన్న వ్యాన్‌! | Shekhar Master Car Accident Near Muchinta | Sakshi
Sakshi News home page

Shekhar Master: శేఖర్ మాస్టర్‌ కారుని ఢీకొన్న వ్యాన్‌!

Nov 12 2026 11:14 AM | Updated on Nov 12 2026 11:22 AM

Shekhar Master Car Accident Near Muchinta

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ఈ రోజు(గురువారం) ఉదయం ప్రమాదం జరిగింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న చిరంజీవి ‘కాక’ సినిమా షూటింగ్‌ను ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శేఖర్ మాస్టర్ బృందం వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement