బిగ్‌బాస్ 10లో 66వ రోజు కొందరు కంటెస్టెంట్లకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతులను మిగిల్చింది. ముఖ్యంగా ముకేశ్, శివకుమార్‌లకు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. బుధవారం నాటి ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఓవైపు ముకేశ్ తల్లి ఎంట్రీ ఇచ్చి కొడుకును ఆనందంలో ముంచెత్తగా.. మరోవైపు శివకుమార్‌కు కాబోయే భార్య ప్రియాంక జైన్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు.. హౌస్‌మేట్స్ సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. మరి నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి..
తల్లిని చూసి ఎమోషనల్ అయిన ముకేశ్
బిగ్‌బాస్ హౌస్‌లోకి ముకేశ్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అడుగుపెట్టగానే అతడు భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకును ఆప్యాయంగా హత్తుకున్న ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం ఇంటి సభ్యులందరినీ ప్రేమగా పలకరించింది. ఈ క్రమంలో ముకేశ్, అతడి తల్లి, వర్షిణి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బిగ్‌బాస్‌లో తన ప్రవర్తనను చూస్తున్నప్పుడు ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా అని తల్లిని ముకేశ్ అడిగాడు. అందుకు ఆమె నీ కోపమే నీలో ఉన్న ప్రధాన లోపమని చెప్పింది. అయితే తన కోపాన్ని వర్షిణి చాలా వరకు తగ్గించిందని ముకేశ్ బదులిచ్చాడు. అయినప్పటికీ ఇంకా కోపాన్ని తగ్గించుకోవాలని తల్లి సూచించింది.
ఆ తర్వాత తన తల్లి గొప్పతనం గురించి ముకేశ్ తోటి కంటెస్టెంట్లతో పంచుకున్నాడు. తన తండ్రికి స్ట్రోక్ వచ్చిన సమయంలో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైన ఆయనకు తల్లి ఒక్కరే సేవలు చేశారని తెలిపాడు. ఆ సమయంలో ఆమె ఎప్పుడూ విసుక్కోవడం తాను చూడలేదని చెప్పాడు. తల్లిని చూసే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
ముకేశ్ తల్లి తర్వాత అమన్ తండ్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు. ఇంటి సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన.. కొడుకుతో కొంతసేపు సరదాగా గడిపారు. కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో ఆనందం వెల్లివిరిసింది.
శివకుమార్‌కు ప్రియాంక జైన్ సర్‌ప్రైజ్
ఇక ఈ ఎపిసోడ్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటి ప్రియాంక జైన్ ఎంట్రీ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె.. ప్రస్తుతం పదో సీజన్‌లో ఉన్న శివకుమార్‌కు కాబోయే భార్య. శివకుమార్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆమెను శివకుమార్‌తో పాటు మిగతా కంటెస్టెంట్లు కూడా వెంటనే గుర్తుపట్టేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లోనే నిశ్చితార్థం
చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్న శివకుమార్, ప్రియాంక జైన్ ప్రేమగా హత్తుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య రొమాంటిక్ క్షణాలు చోటుచేసుకున్నాయి. అనంతరం హౌస్‌మేట్స్ సమక్షంలో శివకుమార్, ప్రియాంక జైన్‌ల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ప్రత్యేకమైన దుస్తుల్లో కాబోయే దంపతులు ఇద్దరూ ఎంతో అందంగా కనిపించారు. ఇలా 66వ రోజు ఎపిసోడ్‌లో ఒకవైపు తల్లి ప్రేమ, మరోవైపు ప్రేమజంట నిశ్చితార్థంతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది.
(ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్)


