తెలుగు బిగ్‌బాస్ షో ఓ మాదిరిగా సాగుతోంది. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. మంగళవారం ఎపిసోడ్‌లో నరేశ్, శ్వేత, వంశీ కుటుంబ సభ్యులు వచ్చారు. దీంతో హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో అటు ఎమోషన్‌తో పాటు లవ్ కూడా ఉండనుంది. ఈ మేరకు ఇంట్లో నిశ్చితార్థం చేసుకుని ప్రేమజంట షాకిచ్చారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్)
గతంలో ఏడో సీజన్‌లో పాల్గొని టాప్-5 వరకు వెళ్లిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్.. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఆడుతున్న తన ప్రియుడు శివ్ కోసం హౌస్‌లోకి వచ్చింది. షో చరిత్రలో తొలిసారి తాము నిశ్చితార్థం చేసుకోనున్నామని చెప్పి షాకిచ్చింది. ఈ మేరకు హౌస్‌మేట్స్ అంతా కలిసి ప్రియాంక-శివ్ ఎంగేజ్‌మెంట్ దగ్గరుండి జరిపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు వదిలారు.
గత కొన్నేళ్లు వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. చాలా రోజుల నుంచి వీరి వ్యవహారం డేటింగ్ దగ్గరే ఆగిపోయింది. పెళ్లి కాకుండానే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి కూడా వెళ్లారు. అక్కడ పెళ్లి టాపిక్ రావడంతో త్వరలోనే చేసుకుంటామని చెప్పారు. కానీ అధికారికంగా ఇంకా ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన ప్రియాంక.. నిశ్చితార్థం చేసుకుని అందరికీ సమాధానమిచ్చింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వంశీ భార్యని చూశారా? ఎమోషనల్ ఎపిసోడ్)


