కాబోయే భార్యకు సాయి దుర్గాతేజ్‌ ప్రేమలేఖ.. ఒకే మాటతో.. | Sai Durgha Tej Write Simple Love Letter To His Fiance Kiran, X Post Goes Viral | Sakshi
Sakshi News home page

తొలిసారి కాబోయే భార్యతో సాయి దుర్గాతేజ్‌.. మెగా హీరో పోస్ట్‌ వైరల్‌

Nov 7 2026 12:05 PM | Updated on Nov 7 2026 12:15 PM

Sai Durgha Tej Write Simple Love Letter To His Fiance Kiran, X Post Goes Viral

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. చిరంజీవి మేనల్లుడు, హీరో  సాయిదుర్గా తేజ్‌ (Sai Durgha Tej), కిరణ్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నవంబరు 5న హైదరాబాద్‌లోని హిల్టన్‌ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ కొణిదెల, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, అల్లు బాబీ, నీలా షా, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, వారి కుమారుడు వాయువ్‌ తేజ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.  

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను రామ్‌ చరణ్‌తో పాటు మెగా హీరోలంతా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వీరి పెళ్లి విషయం బయటకు తెలిసింది. అయితే సాయిదుర్గా తేజ్‌ మాత్రం నిశ్చితార్థం రోజు ఎలాంటి ఫోటోలను షేర్‌ చేయలేదు. దీంతో ఆయన కాబోయే భార్యను ఎలా పరిచయం చేస్తాడా అనే ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది.  ఎట్టకేలకు నేడు తన ప్రేమ, పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఎంగేజ్‌మెంట్‌లో కిరణ్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేశాడు. ఇలా సింపుల్‌ ప్రేమలేఖతో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 

కాగా, కిరణ్‌, సాయిదుర్గా తేజ్‌ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి చిన్న్నప్పటి నుంచి పరిచయం ఉంది. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరిద్దరు..కొన్నాళ్ల తర్వాత ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. 
ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సాయిదుర్గా తేజ్‌ పెళ్లి డేట్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా పెళ్లి డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్‌ 10న హైదరాబాద్‌లో‍ వీరి వివాహం జరగనుంది.  ఈ వేడుకకి మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement