Sai Durga Teja
-
జోరుగా హుషారుగా...
సమ్మర్ హాలిడేస్ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్ కూల్‌గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.జన్వాడలో ఆటా పాటా హీరో మహేశ్‌బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ ఆయ్యారు. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్‌ని ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడవ షెడ్యూల్లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్‌గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ పాట షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ముచ్చింతల్‌లో జాతర హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని టాక్.ఇటీవల అరకులో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘మాస్ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి. గుహల్లో పరిశోధన హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్‌గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్ వేశారని టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్‌తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సెట్లో స్పెషల్ సాంగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్ తేజ్. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది.ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ పాటలో వరుణ్ తేజ్‌తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్‌చరణ్ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.ముచ్చింతల్‌లో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.తుక్కుగూడలో సంబరాలుహీరో సాయిదుర్గా తేజ్ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్‌గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండి యన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాచుపల్లిలో తెలుసు కదా!‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్‌గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్‌లో సూపర్ యోధబాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ‘హను–మాన్’ వంటి హిట్ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో తేజపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్ ఘట్టమనేని.పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
బ్రిటిష్ పాత్రలో...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా ఈ సినిమాలో బ్రిటిష్ అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. రగ్డ్ హెయిర్, బ్లాక్ కోట్తో బ్రిటిష్ పాత్రలో శ్రీకాంత్ లుక్ వినూత్నంగా ఉంది. ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. -
ఒకటికి రెండు
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్‌కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.ఉగాదికి రిలీజ్ హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు.కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్‌బాబు కెరీర్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం. వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.కోహినూర్ వజ్రం కోసం...‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.ఏటిగట్టు కథలు హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.స్వయంభూ నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సాహసాలు ‘హను–మాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
1000 మంది డ్యాన్సర్లతో మెగా మేనల్లుడి ఆట!
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu ). రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గతేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇప్పటికే విడుదలైన "కార్నేజ్" టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి గ్రిప్పింగ్ విజన్ తో సాయి తేజ్ పాత్రను లార్జర్ దెన్ లైఫ్ మేనర్ లో ప్రజెంట్ చేశారు. కార్నేజ్ వీడియో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని తెలియజేస్తుంది.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ టీం ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో పూర్తి చేశారు. చాలా రిస్క్ తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ని హీరో సాయి దుర్గ తేజ్ చాలా అద్భుతం చేశాడని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎంట్రీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో 1,000 మంది డ్యాన్సర్స్ కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం సరికాదు: మెగా హీరో
రాజకీయాల్లోకి రావడం అంత ఈజీ కాదంటున్నాడు హీరో సాయిదుర్గ తేజ్ (Sai Durga Tej). పాలిటిక్స్ అనేవి పెద్ద సబ్జెక్ట్ అని.. అందులో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తున్నాడు. బుధవారం నాడు నంద్యాల జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఈ క్షణంలో బతికే మనిషిని. రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకవసరం లేదు. ఇప్పుడు ఈ పూటకు భోజనం చేశానా? లేదా? నలుగురికి సాయం చేశానా? లేదా? అన్నదే చూస్తాను. తర్వాతి క్షణాల గురించి ఆలోచించను. రాజకీయాలనేవి చాలా పెద్ద సబ్జెక్ట్.రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదుచాలా నేర్చుకోవాలి. చాలా చదువుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో సినిమాల్లో ఫాలోయింగ్ ఉందని రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు. అనుకున్నంత ఈజీ కానే కాదు. జనాల సమస్యలు తెలుసుకోవాలి.. ఇంకా చాలా ఉంటాయి. దయచేసి నన్ను సినిమాల నుంచి దూరం చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయితేజ్.. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.చదవండి: బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి -
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం!
దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్ ఆఫర్ వరిస్తుంది. ఏ రేంజ్ ఆఫర్ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తీయనున్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. అలాగే సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.. -
Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇదని, "సత్య" షార్ట్ ఫిలిం చూసి ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా "సత్య" ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు. "సత్య" షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.For the first time ever, the world can watch Satya and bless us with your valuable vote 🇮🇳❤This story, so dear to our hearts, is competing for the People’s Choice Award at the Filmfare Short Film Awards 2024. We need your support to win—click the link, watch the film, and… pic.twitter.com/vrG0Ddsivn— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 24, 2024 -
వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు.. ఫోటోలు వైరల్
-
విభిన్నంగా శ్రీకాంత్ లుక్
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీకాంత్ లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు సాయి దుర్గా తేజ్. అలాగే శ్రీకాంత్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్. -
త్రిముఖ కొత్త ఒరవడి సృష్టిస్తుంది
‘‘త్రిముఖ’ చిత్ర దర్శకుడు రాజేష్ నాయుడు నాకెప్పటి నుంచో తెలుసు. ఆయన తీసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నేను విడుదల చేయటం హ్యాపీగా ఉంది. హీరో యోగేష్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. మంచి కథతో ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుంది’’ అని హీరో సాయిదుర్గా తేజ్ అన్నారు.యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా రాజేష్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రిముఖ’. నాజర్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణమోహన్, శ్రీవల్లి సమర్పణలో శ్రీదేవి మద్దాలి, హర్ష కల్లె నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను సాయిదుర్గా తేజ్ ఆవిష్కరించారు. ‘‘ఉత్కంఠభరితమైన సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో మంచి నటన కనబరిచే చాన్స్ దక్కింది’’ అని యోగేష్ తెలిపారు. -
ఆర్కాడీ ప్రపంచంలోకి...
సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). నూతన దర్శకుడు రోహిత్ కేపీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (అక్టోబరు 15) సాయిదుర్గా తేజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఇంట్రూడ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ’ (ఆర్కాడీ ప్రపంచంలోకి ప్రవేశించండి) అనే వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్డీటీ 18’. మునుపెన్నడూ చేయని పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు సాయిదుర్గా తేజ్. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఉషా పరిణయం చిత్రాన్ని ఆదరించాలి: సాయి దుర్గ తేజ్
‘‘విజయభాస్కర్గారి దర్శకత్వంలో నేను ‘ప్రేమకావాలి’ సినిమా చేయాల్సింది... మిస్ అయ్యింది. ఆది సాయికుమార్ ‘రేయ్’ చేయాలి... కానీ ‘ప్రేమ కావాలి’ చేశాడు. నేను ‘రేయ్’ చేశాను. విజయభాస్కర్‌గారు కొత్తవాళ్లతో చేసిన ‘ఉషా పరిణయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇలాంటి కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు హీరో సాయి దుర్గ తేజ.. శ్రీ కమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన చిత్రం ‘ఉషా పరిణయం’. కె. విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఎంతో ఆప్తుడైన సతీష్ అన్న కూతురు తాన్వీ ఆకాంక్షకి అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఈ మూవీ విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. విజయభాస్కర్ మాట్లాడుతూ– ‘‘14 ఏళ్ల క్రితం సాయి దుర్గ తేజ్‌ని నేనే హీరోగా పరిచయం చేయాల్సింది.. కానీ కుదరలేదు. మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ‘ఉషా పరిణయం’ నిర్మించాను’’ అన్నారు. శ్రీ కమల్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి (కె. విజయభాస్కర్) పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. -
ప్రేమ కావాలి సినిమా నేను చేయాల్సింది..
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం
టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.పావలా శ్యామలతో సాయిధరమ్ తేజ్ కూడా వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్ అయిన సమయంలో సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్‌కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్ ధరమ్ తేజ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.5 లక్షలు సాయిధరమ్‌తేజ్ విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.We extend our heartfelt thanks to the mega supreme hero, @IamSaiDharamTej Garu, for donating 5 lakhs to our @FilmJournalistsWe are grateful. As part of this donation, 1 lakh was given to senior artist #PavalaShyamala Garu through our association, keeping the promise made by you… pic.twitter.com/1FYiUAKoOL— Telugu Film Journalists Association (@FilmJournalists) July 26, 2024 -
పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో...
‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘పీరియాడికల్ హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఇందులో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రం కోసం నిర్మించిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం తొలి షెడ్యూల్ జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన తేజ్‌పై నిహారిక కామెంట్
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో ఆయన అన్‌ఫాలో చేశారు. దీంతో మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.తాజాగా ఈ వివాదం గురించి నిహారిక రియాక్ట్ అయింది. 'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది.కొత్త నటులను పరిచయం చేస్తూ 'కమిటీ కుర్రోళ్లు' అనే చిత్రాన్ని నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ద్వారా 11 మంది గొప్ప ఆర్టిస్టులను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర డైరెక్టర్ యధు వంశీ తెలిపాడు. ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించామని తెలిపింది. ఈ చిత్రంలోని ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారని ఆమె చెప్పింది. త్వరలో 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్ విడుదల చేస్తామని నిహారిక పేర్కొంది. -
అందుకే నా పేరులో మా అమ్మ పేరు పెట్టుకున్నా!
‘‘నేను సినిమా కెరీర్ప్రాంరంభించినప్పటి నుంచి మా అమ్మ పేరు (విజయ దుర్గ) మీద నిర్మాణ సంస్థ ఆరంభించాలని ఉండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గప్రో డక్షన్స్నుప్రాంరంభించి, ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌తో కలిసి ‘సత్య’ షార్ట్ ఫిలిం నిర్మించాను. మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి. అందుకే నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్‌గా మార్చుకున్నాను’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో సాయిదుర్గతేజ్, ‘కలర్స్’ స్వాతి జంటగా హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన షార్ట్ ఫిలిం ‘సత్య’. ఈ చిత్రం ప్రెస్మీట్లో సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘సత్య’ దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అవార్డులు కూడా వచ్చాయి’’ అన్నారు. ‘‘సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని చేసిన సినిమా ‘సత్య’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఇప్పటివరకు మా చిత్రానికి 25 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు నవీన్ విజయకృష్ణ. -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్‌కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్‌కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024