
మెగా హీరోలంతా ఓకే చోట సందడి చేశారు. జిమ్లో చెమట్చోస్తూ కనిపించారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీకెండ్లో ఇలా అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది లుక్లో కనిపించడంతో అభిమానులు ఏకంగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పిక్ మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్నారు. సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టుకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.