'నా కెరీర్‌లో ఇదే ఫస్ట్‌ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్! | Peddi Movie Chikiri Chikiri Song Lyricist Balaji Interesting Comments | Sakshi
Sakshi News home page

Chikiri Chikiri Song: 'ఒక మొరటోడికి అందమైన అమ్మాయి కనిపిస్తే'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్

Nov 12 2025 9:49 PM | Updated on Nov 12 2025 9:51 PM

Peddi Movie Chikiri Chikiri Song Lyricist Balaji Interesting Comments

రామ్‌చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ  పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్‌ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు  బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్‌లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్‌తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్‌ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.

ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్‌ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement