ఆది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. హాస్య మూవీస్ అధినేత, రైజింగ్ ప్రోడ్యూసర్ రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆది హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆదిని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు రాజేష్ దండా.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ–‘‘మా హాస్య మూవీస్‌పై ‘ఊరిపేరు భైరవకోన, సామజవరగమన, మజాకా, కె–ర్యాంప్’ వంటి పలు హిట్ సినిమాలు నిర్మించాను. అలాగే మా బ్యానర్‌లో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ మూవీ ఆదితో ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని తెలిపారు.


