breaking news
Rajesh Danda
-
ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు: నిర్మాత రాజేశ్ దండ
‘‘నిర్మాతగా ‘కె–ర్యాంప్’ నాకు ఆరవ సినిమా. నా గత ఐదు చిత్రాల్లో ఎక్కడా ఇబ్బందికరమైన పదాలు లేవు. ఒక్కో సినిమా కథ ఒక్కోలా ఉంటుంది. అంతే కానీ కావాలని కొన్ని పదాలు పెట్టి, ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలని అనుకోను. అలాంటి సినిమాలు నేను తీయను. ‘కె–ర్యాంప్’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు’’ అని చె΄్పారు నిర్మాత రాజేశ్ దండ. కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కిరణ్‌గారు కుమార్ అబ్బవరం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విని ఎగై్జట్ అయ్యాను. మా సినిమాకు సెన్సార్ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది ఇందులో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చూసి ఎవరైనా ఆడియన్స్ ప్రేరణ పొందుతారేమోనని ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు... అంతే. వల్గారిటీ లేదు. ఇక ‘కె–ర్యాంప్’ సినిమా కిరణ్‌గారి వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ. ప్రస్తుతం మా బ్యానర్లో హీరోయిన్ సంయుక్తతో ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘అల్లరి’ నరేశ్‌గారితో ఓ సినిమా ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టార్గెటెడ్ ట్రోలింగ్ గురించి బన్నీ వాసుగారు మాట్లాడిన విషయాలను నేను ఫాలో కాలేదు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’’ అని చె΄్పారు. ‘‘కిరణ్గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శివ బొమ్మకు. -
డబుల్ మజాకా ఉంటుంది: రాజేష్ దండా
‘‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత త్రినాథరావుగారి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మజాకా’. ఈ సినిమాని ఆయన బాగా తీశారు. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. ‘మజాకా’ కి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో ఈ మూవీ చివరలో ‘డబుల్ మజాకా’ అనే టైటిల్ కూడా వేస్తున్నాం’’ అని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించారు.బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రేపు(బుధవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజేష్ దండా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘త్రినాథరావు, రైటర్ ప్రసన్నగారి శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్ ‘మజాకా’. భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం కూడా ఉంటుంది. మా మూవీ రిలీజ్ డేట్‌కి తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ కొత్తగా ΄్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ సుంకరగారు లైవ్ షూటింగ్ ఐడియా చెప్పారు.ఆయనతో నా భాగస్వామ్యం కొనసాగుతుంది. వచ్చే ఏడాది మా కాంబినేషన్లో ఓ స్టార్ హీరోతో బిగ్ మూవీ చేయబోతున్నాం. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్లతో నా అనుబంధం ప్రత్యేకమైనది.. వారితో మళ్లీ సినిమాలు చేస్తాను. ఇకపై వినోదాత్మక సినిమాలే చేస్తాను. ‘సామజవరగమన’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా, హీరోయిన్ సంయుక్తతో ఓ చిత్రం చేస్తున్నాను’’ అని చెప్పారు. -
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాను: రాజేష్ దండా
‘‘మా హాస్య మూవీస్‌లో ‘ఇట్లు మారేడుమిల్లి, ఊరిపేరు భైరవకోన, సామజవరగమన’ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాను. ‘అల్లరి’ నరేశ్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు, కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాను. నాకు కాంబినేషన్ కాదు.. కథే ముఖ్యం. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. సోమవారం రాజేశ్ దండా విలేకరులతో మాట్లాడుతూ–‘‘స్వామి రారా’ చిత్రంతో పంపిణీదారునిగా నా ప్రయాణం మొదలుపెట్టి దాదాపు 82 సినిమాలు రిలీజ్ చేశాను. అనిల్ సుంకరగారితో కలిసి ‘సామజవరగమన, ఊరిపేరు భైరవకోన’ వంటి చిత్రాలు నిర్మించా. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌తో తీస్తున్న ‘బచ్చలమల్లి’ 50 శాతం పూర్తయింది. అలాగే సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా ఉంది. చిరంజీవిగారి కోసం ప్రసన్నకుమార్ బెజవాడ రెడీ చేసిన కథతోనే సందీప్ కిషన్ మూవీ తీస్తున్నాం అనడంలో వాస్తవం లేదు. ఇక ఓ స్టార్ హీరోతో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నా. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు.