ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడొచ్చు: నిర్మాత రాజేశ్‌ దండ | Producer Rajesh Danda about K-Ramp movie | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడొచ్చు: నిర్మాత రాజేశ్‌ దండ

Oct 15 2025 12:18 AM | Updated on Oct 15 2025 12:18 AM

Producer Rajesh Danda about K-Ramp movie

‘‘నిర్మాతగా ‘కె–ర్యాంప్‌’ నాకు ఆరవ సినిమా. నా గత ఐదు చిత్రాల్లో ఎక్కడా ఇబ్బందికరమైన పదాలు లేవు. ఒక్కో సినిమా కథ ఒక్కోలా ఉంటుంది. అంతే కానీ కావాలని కొన్ని పదాలు పెట్టి, ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలని అనుకోను. అలాంటి సినిమాలు నేను తీయను. ‘కె–ర్యాంప్‌’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడొచ్చు’’ అని చె΄్పారు నిర్మాత రాజేశ్‌ దండ. కిరణ్‌ అబ్బవరం, యుక్తీ తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్‌’. జైన్స్‌ నాని దర్శకత్వంలో రాజేశ్‌ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేశ్‌ దండ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కిరణ్‌గారు కుమార్‌ అబ్బవరం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా కథ విని ఎగై్జట్‌ అయ్యాను. మా సినిమాకు సెన్సార్‌ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది ఇందులో ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయని కాదు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చూసి ఎవరైనా ఆడియన్స్‌ ప్రేరణ పొందుతారేమోనని ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు... అంతే. వల్గారిటీ లేదు. ఇక ‘కె–ర్యాంప్‌’ సినిమా కిరణ్‌గారి వన్‌ మ్యాన్‌ షోలా ఉంటుంది. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ బ్లాస్ట్‌ అవుతుంది.

ఈ సినిమాతో నిర్మాత శివతో నాకు మంచి ప్రయాణం మొదలైంది. నా మీద నమ్మకంతో  కథ వినకుండానే ఈ సినిమాలో భాగమయ్యారు శివ. ప్రస్తుతం మా బ్యానర్‌లో హీరోయిన్‌ సంయుక్తతో ఓ సినిమా చేస్తున్నాం. అలాగే ‘అల్లరి’ నరేశ్‌గారితో ఓ సినిమా ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టార్గెటెడ్‌ ట్రోలింగ్‌ గురించి బన్నీ వాసుగారు మాట్లాడిన విషయాలను నేను ఫాలో కాలేదు. పూర్తి విషయాలు తెలిసిన తర్వాత స్పందిస్తాను’’ అని చె΄్పారు. ‘‘కిరణ్‌గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శివ బొమ్మకు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement