
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే జెనీలియా, భూమిక, అన్షు, లయ, రంభ, మీనా, విజయశాంతి,సంగీత వంటి హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొంతమంది మెప్పించారు కూడా. అయితే, తాజాగా ముంబై బ్యూటీ కామ్న జెఠ్మలానీ( Kamna Jethmalani) టాలీవుడ్‌లోకి మరో ఛాన్స్ కోసం వచ్చేసింది. కిరణ్ అబ్బవరం సినిమా కె.ర్యాంప్‌తో ప్రేక్షకులను పలకరించనుంది.
2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణంతో బాగా పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత కింగ్, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా ప్రభావం చూపించలేదు. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే కనిపించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రానుంది.

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్‌ను వివాహం చేసుకుంది. సినిమా ఛాన్సుల కోసం ఈ విషయాన్ని కూడా ఆమె కొంత కాలం దాచింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆమె కె.ర్యాంప్‌తో వస్తుంది. అయితే, ఎంతమాత్రం విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.
రీసెంట్‌గా జూనియర్ సినిమాతో జెనీలియా మెప్పించింది. కానీ, తమ్ముడు సినిమాలో లయ పాత్ర అంతగా క్లిక్ కాలేదని చెప్పాలి. మరోవైపు సంగీత మాత్రం రీఎంట్రీలో చాలా సినిమాలతో అదరగొట్టేస్తుంది. అయితే.., భూమిక, మీరా జాస్మిన్, సదా వంటి స్టార్స్ ఇప్పటికే గట్టిపోటీ ఇచ్చేందుకు రేసులో ఉన్నారు.