ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్‌ | Om Shanti Shanti Shantihi Movie Now Streaming In OTT | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్‌

Mar 3 2026 9:03 AM | Updated on Mar 3 2026 9:11 AM

Om Shanti Shanti Shantihi Movie Now Streaming In OTT

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.  జనవరి 30న విడుదలైన ఈ సినిమా మేకర్స్‌ అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022లో విడుదలైన మలయాళ హిట్‌ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని  దర్శకుడు ఏఆర్‌ సజీవ్‌ తెరకెక్కించారు.

‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 4న స్ట్రీమింగ్‌కు రావాల్సిన ఈ మూవీ గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఈషా రెబ్బా చూపించింది.  

కథేంటంటే..
శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్‌ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని  అనుకుంటుంది.

అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్‌ భాస్కర్‌) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement