breaking news
Om Shanti Shanti Shantihi Movie
-
ఒక్కరోజు ముందే ఓటీటీలో 'ఓం శాంతి శాంతి శాంతిః' స్ట్రీమింగ్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న విడుదలైన ఈ సినిమా మేకర్స్ అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 2022లో విడుదలైన మలయాళ హిట్ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ సజీవ్ తెరకెక్కించారు.‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 4న స్ట్రీమింగ్కు రావాల్సిన ఈ మూవీ గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి వచ్చేసింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఈషా రెబ్బా చూపించింది. కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది.అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే. -
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)నెట్ఫ్లిక్స్విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06అమెజాన్ ప్రైమ్తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05హాట్స్టార్విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06ఆహాఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04సోనీ లివ్లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. అధికారిక ప్రకటన
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?) -
ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)
-
ఆ ఆనందమే వేరు: తరుణ్ భాస్కర్
‘‘యాక్టర్‌గా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ నా ప్రయారిటీ డైరెక్షనే. ఒక క్రియేటివ్ థాట్‌తో కథ రెడీ చేసుకుని, ఆ కథను స్క్రీన్‌పై చూసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వీటి తర్వాత దర్శకత్వంపై మరింత ఫోకస్ పెడతాను’’ అని తరుణ్ భాస్కర్ చె΄్పారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్ ఫిల్మ్ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న విడుదలైంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఇదొక ఒరిజినల్ సినిమాలానే ఫీలవుతున్నారు. కథకు కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ఓంకార్ నాయుడు పాత్ర చేశాను. యాక్టర్‌గా నేనిప్పటివరకు చేసిన రోల్స్‌లో నాకు ఇది చాలెంజింగ్. నేను పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. కానీ ఓంకార్ నాయుడు పాత్ర గోదావరి యాస మాట్లాడాలి.నా మిత్రుడు వర్మ, లాంగ్వేజ్ కోచ్ వినోద్గార్ల సహాయంతో ఈ రోల్ చేశాను. డైలాగ్స్ లేకుండా ఎమోషన్ చూపించడం టఫ్. ఈషా ఈ పాత్రను అద్భుతంగా చేసింది. ఈ సినిమా క్రెడిట్ అంతా సజీవ్దే. ‘ఈ నగరానికి ఏమైంది?’ పార్టు 2 చిత్రీకరణ జరుగుతోంది. 30 ఏళ్లు దాటిన తర్వాత అబ్బాయిలకు ఉండే సమస్యలు, టెన్షన్స్‌తో ఈ సినిమా కథ సాగుతుంది. వెంకటేశ్‌గారు హీరోగా నా డైరెక్షన్‌లోని సినిమాకు ఇంకా వర్క్ చేయాలి’’ అని చెప్పారు. -
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం ఇంతేనా?
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మలయాళ హిట్ సినిమా జయ జయ జయ జయహే రీమేక్‌గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా నేడు జనవరి 30న విడుదలైంది. మాలయాళంలో రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జయ జయ జయ జయహే మూవీ ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు ఆడియోతోనూ జియోహాట్‌స్టార్‌లో ఉంది. దీంతో చాలామంది సినిమా చూసేశారు. అయితే, ఇదే చిత్రాన్ని రీమేక్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ప్రేక్షకులను మెప్పించేంత కంటెంట్ ఏమైనా కొత్తగా ఉందా అంటే సినిమా చూడాల్సిందే.స్త్రీలను మాతృమూర్తులుగా, ఆదిశక్తి స్వరూపులుగా భావించి గౌరవంగా చూసుకోవాలని మన శాస్త్రాలు చెప్తాయి. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని వింటూనే ఉన్నాం. స్త్రీలను గౌరవించని చోట అక్కడ చేసే పనులన్నీ ప్రయోజనం లేనివిగా మారిపోతాయి. ఇదే కాన్సెప్ట్‌తో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఉంటుంది. (Om Shanti Shanti Shantihi Movie Review)కథేంటంటే..శాంతి(ఈషా రెబ్బా) చిన్నప్పటి నుంచే తనకు నచ్చినట్లు ఉండాలని అనుకునే అమ్మాయి. మంచి చదువు, ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కంటూ పెరుగుతుంది. ఇంటర్ తర్వాత పట్నం వెళ్లి చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ, తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో ఇంటికి దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో డిగ్రీలో చేరుతుంది. తను చదువుకే కాలేజీలో జరిగిన ఒక సంఘటన వల్ల చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతలో తల్లిదండ్రులు శాంతికి పెళ్లి సంబంధం చూస్తారు. కానీ, తను మాత్రం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. అయితే, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నాయుడు (తరుణ్ భాస్కర్) వస్తాడు. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత నాయుడులోని పురుషాహంకారం బయటకు వస్తుంది. చీటికిమాటికి శాంతిపై చేయి చేసుకుంటాడు. దీంతో శాంతి కన్నీళ్లు పెట్టుకుని తన తల్లిదండ్రులతో చెబితే సర్దుకుపోవాలని సూచిస్తారు. ఒకరోజు రాయుడిపై శాంతి తిరగబడుతుంది. చేయిచేసుకున్న భర్తను శాంతి చితకబాదుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి జంట మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి..? విడాకులు తీసుకుందామంటే ఎలాంటి చిక్కులు వచ్చాయి..? ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శాంతి తన మనసు ఎందుకు మార్చుకుంది..? అనేది తెలియాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే:నేటి సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూసే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి. మగపిల్లలను చూసిన తీరు ఆడపిల్లల పట్ల కనిపించదు. చిన్నతనంలోనే కట్టుబాట్ల పేరుతో పెంచుతారు. స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా వారి చిన్న చిన్న సరదాలను కూడా అడ్డకట్ట వేసి బంధిస్తారు. ఆడపిల్లకు కూడా మనసు ఉంటుంది అనే విచక్షణ మరిచిపోతుంటారు. ఈ కథలో శాంతి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. తన చిన్నతనం నుంచే కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రేమ, సహకారం అందదు. అయినప్పటికీ చదువులో రాణిస్తుంది. మంచి మార్కులతో పాస్ అవుతుంది. గొప్ప చదువులు చదివి ఉద్యోగం సాధించాలనే తపనతో శాంతి ఉంటుంది. శాంతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఇలాంటి అమ్మాయి ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కనిపిస్తూనే ఉంటుంది కదా అనే ఫీల్ కలుగుతుంది. అత్తారింటికి వెళ్లిన శాంతి అక్కడ పడే ఇబ్బందులు మనం చూస్తే చాలామంది ఆడపిల్లల జీవితాలు కళ్లముందు మెదులుతాయి. పెళ్లి తర్వాత చదివిస్తానని మాట ఇచ్చిన భర్త.. ఆ తర్వాత దానిని దాటేస్తూ ఉంటాడు. ఈ సమస్య చాలామంది ఆడబిడ్డలకు ఎదురై ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల్లోనే 21 సార్లు చేయి చేసుకున్న భర్త పదేళ్లలో ఎన్నిసార్లు కొడతాడు.. ఆ లెక్కన 40 ఏళ్లలో ఎన్నిసార్లు దెబ్బలు తినాలి అంటూ శాంతి ప్రశ్నిస్తుంది. దీనికి కుటుంబ సభ్యులతో పాటు అత్తగారింటి నుంచి కూడా సరైన సమాధానం ఉండదు. ఇలా ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట జరిగే పలు సంఘటనలే కథలో కనిపిస్తాయి. వాటిని చక్కగా దర్శకుడు తెరకెక్కించాడు.ఫస్టాఫ్ అంతా బాగా కథ నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో కాస్త నిరాశపరిచాడనిపిస్తుంది. గృహహింస విషయంలో నేటి సమాజం ఆలోచన తీరు ఎలా ఉందో చాలా చక్కగా చూపించాడు. భర్తను భార్య కొట్టిందంటే అవమానం అంటారు. అలాంటప్పుడు భార్యను భర్త కొట్టడం ఎవరికీ తప్పు అనిపించదా..? అనేది శాంతి పాత్ర బలంగా ప్రశ్నిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వరకు ఎలాంటి బోర్ లేకుండా సినిమాను చూసేయవచ్చు. సంసార జీవితంలో ఒక అమ్మాయికి ముఖ్యంగా ఉండాల్సిన మూడు విషయాలు ఇవే అంటూ.. ఒక భర్త నుంచి ప్రతి భార్య కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అని, అవన్నీ కూడా ఆడపిల్ల పుట్టకతోనే వస్తాయని జడ్జి చెప్పిన తీరు ఆలోచింపచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో హీరో ఈషా రెబ్బా అని చెప్పాల్సిందే. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్లు తన నటనతో మెప్పించింది. ఓర్పు, సహనం, ప్రేమ ఇలా అన్ని కోణాలు ఆడపిల్ల జీవితంలో ఉంటాయని చూపింది. సహనం కోల్పోయిన తర్వాత ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో పవర్‌ఫుల్‌గా కూడా కనిపించింది. రాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ అదరగొట్టేశాడు. తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని గుర్తుచేశాడు. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సెటిల్డ్‌గా చూపించాడు. సంక్రాంతి తర్వాత కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఒక సినిమా చూడొచ్చు అనేలా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఉంటుంది. -
చెప్పుతో వాడి మూతి మీద కొట్టాలి: తరుణ్ భాస్కర్
సినిమా రిజల్ట్‌ను ఒక్కముక్కలో తేల్చేయడం ఈజీయేమో కానీ సినిమా తీయడం మాత్రం చాలా కష్టం. దాని వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. దర్శకుడు, హీరో దగ్గరి నుంచి సెట్ బాయ్ వరకు అందరి కష్టం దాగుంటుంది. అయితే కొందరు ఇక్కడిలా తీయాలి.. అక్కడ అలా చేస్తే బాగుండేదని లేనిపోని సలహాలు ఇస్తుంటారు.అడగకపోయినా సలహాలుఅలాంటి వారిపై తన అభిప్రాయాన్ని చెప్పాడు డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్. అతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్ మూవీ 'జయజయజయహే'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సినిమాలో ఇలా చేస్తే బాగుంటుంది, అది ఇది అని కొందరు అడగకపోయినా సలహాలు ఇస్తుంటారు. దర్శకుడికే తెలుసుప్రతి దర్శకుడికి కచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. సినిమా మీద ఉత్సాహం, ప్రేమతో వారు సలహాలిస్తారు. అయితే వాళ్లు చెప్పేది కేవలం ఆ సన్నివేశం వరకే బాగుండొచ్చు. ఓవరాల్‌గా సినిమాలో అదెంతవరకు అవసరమనేది దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచితే బెటర్.చెప్పుతో కొట్టాలనిపించేదిచాలామంది సెట్‌కు గెస్టులా వస్తుంటారు. వచ్చీరాగానే హాయిగా కూర్చుని ఆ సీజన్ క్లోజప్ పడితే బాగుంటుంది అని చెప్తారు. వాళ్లలా అన్నప్పుడు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుంటుందని రిప్లై ఇవ్వాలనిపించేది. కానీ అదంతా మనసులోనే అనుకుని పైకి మాత్రం కూల్‌గా ఓకే అనేవాడిని అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు బుల్లితెర నటి ఇంట విషాదం -
తెలుగమ్మాయి ఈషా రెబ్బా కొత్త ఫోటోలు అదుర్స్
-
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ సీన్స్‌లో నా కన్నీళ్ళు నిజం: ఈషా రెబ్బా
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్ ఫిల్మ్ ‘జయ జయ జయ జయహే’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శాంతి అనే పాత్ర చేశాను.ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను. నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను. ఈ సినిమాలో నేను చెంపదెబ్బలు తిన్న సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్‌లో నా కళ్ళలో వచ్చిన నీళ్ళు రియల్. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఈ సీన్లో తరుణ్ భాస్కర్‌కి, నాకూ దెబ్బలు తగిలాయి. సంజీవ్ క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
తరుణ్‌తో డేటింగ్? తొలిసారి స్పందించిన హీరోయిన్
తెలుగు దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయజయజయహేకి రీమేక్‌గా తెరకెక్కింది.తర్వాత చెప్తాతాజాగా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్- ఈషా.. రియల్ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. ఆమె రూమర్స్‌ను ఖండించనూ లేదు, ఒప్పుకోనూ లేదంటే సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉన్నట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గట్టిగా కొట్టాడుఇక సినిమాలో తనను తరుణ్ నిజంగా కొట్టాడంది ఈషా. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్ నన్ను గట్టిగా కొట్టాడు. అది నేను ఊహించలేదు. ఆ దెబ్బకు నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. సీన్ అయిపోగానే సారీ చెప్పాడు. కానీ చివర్లో నేను కూడా గట్టిగానే కొట్టాను అని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాకర్ కొడుకును కాకపోయుంటే ఎన్నో సినిమాలు చేసేవాడిని


