సినిమా రిజల్ట్‌ను ఒక్కముక్కలో తేల్చేయడం ఈజీయేమో కానీ సినిమా తీయడం మాత్రం చాలా కష్టం. దాని వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. దర్శకుడు, హీరో దగ్గరి నుంచి సెట్ బాయ్ వరకు అందరి కష్టం దాగుంటుంది. అయితే కొందరు ఇక్కడిలా తీయాలి.. అక్కడ అలా చేస్తే బాగుండేదని లేనిపోని సలహాలు ఇస్తుంటారు.
అడగకపోయినా సలహాలు
అలాంటి వారిపై తన అభిప్రాయాన్ని చెప్పాడు డైరెక్టర్ కమ్ హీరో తరుణ్ భాస్కర్. అతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్ మూవీ 'జయజయజయహే'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సినిమాలో ఇలా చేస్తే బాగుంటుంది, అది ఇది అని కొందరు అడగకపోయినా సలహాలు ఇస్తుంటారు.
దర్శకుడికే తెలుసు
ప్రతి దర్శకుడికి కచ్చితంగా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. సినిమా మీద ఉత్సాహం, ప్రేమతో వారు సలహాలిస్తారు. అయితే వాళ్లు చెప్పేది కేవలం ఆ సన్నివేశం వరకే బాగుండొచ్చు. ఓవరాల్‌గా సినిమాలో అదెంతవరకు అవసరమనేది దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచితే బెటర్.
చెప్పుతో కొట్టాలనిపించేది
చాలామంది సెట్‌కు గెస్టులా వస్తుంటారు. వచ్చీరాగానే హాయిగా కూర్చుని ఆ సీజన్ క్లోజప్ పడితే బాగుంటుంది అని చెప్తారు. వాళ్లలా అన్నప్పుడు నా చెప్పు నీ మూతి మీద పడితే బాగుంటుందని రిప్లై ఇవ్వాలనిపించేది. కానీ అదంతా మనసులోనే అనుకుని పైకి మాత్రం కూల్‌గా ఓకే అనేవాడిని అని చెప్పుకొచ్చాడు.
చదవండి: తెలుగు బుల్లితెర నటి ఇంట విషాదం


