వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన తాజా చిత్రం శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాకు వినయ్‌రత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీకి చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరు వదిలి విదేశాలకు వెళ్లాలనుకున్న యువకుడికి ఓ యువతి పరిచయం కావడంతో ఏం చేశాడనే ఆసక్తికర కథనంతో ఈ మూవీ తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా' అనే డైలాగ్ ఎమోషనల్ వింటే ఎమోషనల్‌గా స్టోరీగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.


