హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్‌సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


