కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
A journey filled with heart. ❤️
The teaser of #VishwanathAndSons is on its way.🥳
Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎
In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026


