Tollywood
-
పవర్ఫుల్ సావిత్రి
కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్ పేర్కొంది. -
స్టైల్ మార్చిన శోభిత.. చీరలో మానస
కొత్త హెయిర్ స్టైల్‌తో అక్కినేని కోడలు శోభితచీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసిఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందుఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టిపాత హీరోయిన్ లుక్‌లో దుషారా విజయన్ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా.. హీరోయిన్గా తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ
తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.(ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)'జబర్దస్త్' కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ) -
చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!) -
'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్
మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్ని కొనసాగించేలానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అసభ్య ప్రవర్తన..!
టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026 -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026 -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ మదర్..!
కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుశ్‌తో ఓ సినిమా చేస్తోంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ వైరల్‌గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్లో శ్రీలీల-తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్‌లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్ డాక్టర్ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌పై డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో వచ్చే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
అదితి అదరహో...
ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో హాలీవుడ్ సినీ తారలతో పాటు భారతీయ సినీ తారల హంగామా జోరందుకుంది. హీరోయిన్స్ హ్యూమా ఖురేషీ, అదితి రావ్ హైదరీ, దిశా మదన్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. గ్రీన్ కలర్లో అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అదితీ రావ్ హైదరీ కనిపించారు. బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు హ్యూమా ఖురేషి. హాలీవుడ్ స్టార్, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలు డెమి మూర్ బార్బీ లుక్‌తో సందడి చేశారు.జేమ్స్ గ్రే డైరెక్షన్‌లోని ‘పేపర్ టైగర్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా డెమి మూర్ రెడ్ కార్పెట్ పై వాక్ చేశారు. స్పానిష్ దర్శకుడు రోడ్రిగ్ తెరకెక్కించిన ‘ది బిలవ్డ్’ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించగా, ఈ యూనిట్ హంగామా ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే క్రిస్టెన్ స్టీవర్ట్ ఓ లీడ్ రోల్ చేసిన ‘ఫుల్ ఫిల్’ సినిమా ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. -
బ్లాక్మెయిల్ ఆరంభం
వరుణ్ సందేశ్, సురేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘బ్లాక్మెయిల్’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, రచయిత–నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. సురేష్ తల్లి ఎం. వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు మంచి కంటెంట్‌తో సినిమా రాబోతోందని అర్థమైంది’’ అని అన్నారు.‘‘నన్ను నమ్మి ఈ సినిమాను నా చేతిలో పెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు శ్రీనివాస్ గుండ్రెడ్డి. ‘‘నేను హీరోగా నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు సురేష్. ‘‘200 కుటుంబాలకు పని కల్పించవచ్చనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నా సినిమాకు వచ్చే లాభాల్లో 10 శాతం మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్‌కు ఇస్తాను’’ అని తెలి΄ారు అవినాష్. ఈ చిత్రానికి సంగీతం: మల్లిక్ తేజ. -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
'తిమ్మరాజుపల్లి టీవీ'లో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం: ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. -
అంజలి నెవ్వర్ బిఫోర్ లుక్.. డోస్ పెంచిన నేహాశెట్టి
బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న అంజలిగ్లామర్ డోస్ పెంచేసిన నేహా శెట్టిపచ్చని ఔట్ఫిట్లో అదితీ హొయలువర్కౌట్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేశ్గ్లామర్తో మాయ చేస్తున్న రాశీ సింగ్రకుల్ ప్రీత్ సింగ్ రోజు గడుస్తుందిలా View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్ మాల్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ.. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది. పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.పర్సనల్ లైఫ్..కాగా.. మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్లో కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. -
‘త్రికాల’గా వస్తున్న శ్రద్ధాదాస్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న మనోజ్
హీరో మంచు మనోజ్ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.అలాంటి వారికోసం..ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.మానవత్వం కోసం..ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..కొత్త ఆశఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్ చేశాడు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు. Before celebrating birthdays, me and my wife @BhumaMounika wanted to begin with service.Life’s journey has taught us that beyond every high and low, what truly matters is humanity and the people who stand beside us.This spirit of service did not begin today. It has always… pic.twitter.com/p6gg3HqljP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 17, 2026 చదవండి: పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే.. -
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి. అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.(చదవండి: రామ్ చరణ్ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్!)తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.ఏడాదిగా రూమర్స్.. శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. -
రామ్ చరణ్‌కు మరో ఆపరేషన్.. ?
రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పాటు నిర్మాత కూడా చరణ్ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్‌కు తగిలిన గాయాల గురించి వివరించాడు.‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్ ఉంది. షూటింగ్ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్ గ్యాప్‌లో జిమ్ చేసి వచ్చేవాడు. కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
మేం అమ్మనాన్న అయ్యాం.. కమెడియన్ పోస్ట్
జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రారంభంలో అవినాష్‌తో కలిసి స్కిట్స్ చేసిన ఇతడు తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రవీణ్‌తో కలిసి షోలో కనిపిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు కార్తీక్ వెల్లడించాడు.(ఇదీ చదవండి: అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?)మేం అమ్మనాన్న అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది అని కెవ్వు కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.కార్తిక్‌తో స్కిట్స్ చేసిన అవినాష్ కూడా రెండు మూడు రోజుల క్రితమే తండ్రయిన విషయాన్ని బయటపెట్టాడు. కొడుకు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లాడి ఫొటోలని పంచుకున్నడు. మరోవైపు కార్తిక్‌తో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్న ప్రవీణ్.. రీసెంట్‌గానే నటి వంశీతని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
'ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది'.. నటికి డైరెక్టర్ కౌంటర్
టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్‌కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్‌కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. షూట్లో లేకుండా మీరు షాపింగ్‌కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్ వరకు వచ్చాక మీరు షూటింగ్ లోకేషన్లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్ఎక్స్లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మెప్పించింది. -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్‌కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్‌ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్‌లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
తప్పు తనదే అన్నాడు.. చరణ్‌లా ఏ హీరో ఒప్పుకోరు : ఫైట్ మాస్టర్
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేసిన నబా కాంత్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ–‘‘మాది మణిపూర్. నా చిన్నప్పుడే నాన్నగారు హైదరాబాద్ వచ్చారు. నాన్నగారి స్ఫూర్తితో ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నాను. స్టంట్స్‌లో నాకు 18 ఏళ్ల అనుభవం ఉంది. విజయ్, రామ్–లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా వర్క్ చేశాను. ‘పుష్ప’ చిత్రంతో యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాను. ఆ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి, ‘మా పేరు నిలబెట్టావ్’ అని రామ్–లక్ష్మణ్ మాస్టర్లు అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పుష్ప 2, మన శంకర వరప్రసాద్‌గారు, డెకాయిట్’ సినిమాలకు వర్క్ చేశాను. తాజాగా ‘పెద్ది’ సినిమా చేశాను. ఫస్ట్ గ్లింప్స్‌లో సరికొత్త బ్యాటింగ్ స్టైల్‌తో చరణ్‌గారు సిక్సర్ కొట్టే షాట్‌ను నేనే కంపోజ్ చేశాను. మా గురువుగారు రామ్–లక్ష్మణ్మాస్టర్లు ఈ సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్‌కి గాయమైంది. ఓ రోల్ మూమెంట్లో తనకి పొరపాటున అలా జరిగింది. ఆ క్షణంలో నేను ఏడ్చేశాను. కానీ, చరణ్ మాత్రం పొరపాటు తనవైపే ఉందని చెప్పారు. నిజంగా ఏ హీరో అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కి ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్‌కి వచ్చేశారు. నేనైతే షాక్ అయిపోయా.ఇందులో కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్గారి నాన్నగారు శ్యామ్ కౌశల్‌ను సంప్రదించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ‘పెద్ది’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రౌడీ జనా ర్ధన’, చిరంజీవి–బాబీ, సల్మాన్‌ఖాన్–వంశీగార్ల సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్‌కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
చిరంజీవి-బాబీ, రామ్ చరణ్-సుకుమార్.. హిట్ కాంబినేషన్ రిపీట్
ఓ సినిమా హిట్ అయిందంటే ఆ చిత్రకథానాయకుడు–దర్శకుడు, హీరో–హీరోయిన్... వీరిది ‘హిట్ కాంబినేషన్’ అనే ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఓ హీరో–ఓ డైరెక్టర్ కాంబినేషన్లో ఒక హిట్ మూవీ వచ్చిందంటే చాలు.. వారి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో పని చేయడానికి హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ హీరో–డైరెక్టర్ కాంబోని రిపీట్ చేసేందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే హిట్ కాంబినేషన్లో మరో మూవీ వస్తోందంటే బిజినెస్ పరంగానూ నిర్మాతలకు బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం చిరంజీవి–బాబీ, వెంకటేశ్, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి, బాలకృష్ణ– గోపీచంద్ మలినేని, రామ్‌చరణ్–సుకుమార్, నాని–శ్రీకాంత్ ఓదెల, విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్, శ్రీ విష్ణు– రామ్ అబ్బరాజు వంటి హీరోలు–డైరెక్టర్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’కి సీక్వెల్‌గా ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ 2’, ఎన్టీఆర్–కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ వంటి సీక్వెల్ సినిమాలు కూడా రానున్నాయి. ఆ విధంగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లే. అయితే సీక్వెల్స్‌తో కాకుండా డైరెక్ట్ మూవీస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి హిట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయనున్న హీరోలు–దర్శకుల సినిమాల గురించి తెలుసుకుందాం. రెండోసారి... హీరో చిరంజీవి–డైరెక్టర్ బాబీ కొల్లిలది (కేఎస్ రవీంద్ర) హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో హీరో రవితేజ నటించడం విశేషం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి– బాబీ కొల్లి కాంబినేషన్లో రెండో సినిమాకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రమిది. ‘చిరుబాబీ2’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేసినట్లు ఏప్రిల్ 28న చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘చిరుబాబీ2’ మరో ప్రతిష్టాత్మక ్ర΄ాజెక్ట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమాలో పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్‌లో చిరంజీవి కనిపించబోతున్నారు. మాస్ ఎంటర్టైన్మెంట్ను తనదైన స్టైల్లో అద్భుతంగా అందించే బాబీ ఈసారి చిరంజీవి కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. ఈ కాంబినేషన్ నుంచి ఓ భారీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ నెల చివరి వారంలో ఈ సినిమాని ప్రారంభించి జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో శరవేగంగా తెరకెక్కించనున్నారట బాబీ. క్రేజీ మల్టీస్టారర్ హీరో వెంకటేశ్–డైరెక్టర్ అనిల్ రావిపూడిలది క్రేజీ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. ఈ మూవీలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. 2019 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో వినోదాల జల్లులు కురిపించింది. ‘ఎఫ్ 2’ వంటి హిట్ మూవీ తర్వాత వెంకటేశ్–వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ 2022 మే 27న రిలీజై విజయం సాధించింది. వెంకటేశ్ సోలో హీరోగా అనిల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు... వెంకటేశ్ తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్లో చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ వెంకీ గౌడ అనే కీలకమైన పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... హీరోలు వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీని ప్రకటించారు అనిల్ రావిపూడి. ‘పటాస్’ (2015) సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశారు కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతుండటం విశేషం. ‘‘ఈ కొత్త చిత్రాన్ని క్లీన్, టిపికల్ ఎంటర్టైనర్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూ΄÷ందించనున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్లా ఉంటుంది. అనిల్ ట్రేడ్ మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో రూపొందించనున్న మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ–్ర΄÷డక్షన్ దశలో ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.పవర్ఫుల్ జడల్ హీరో నాని పూర్తి స్థాయి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన చిత్రం ‘దసరా’. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే నాని వంటి క్లాస్ హీరోని ఊర మాస్ లుక్‌లో చూపించి, హిట్ అందుకున్నారు దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా 2023 మార్చి 30న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. ‘దసరా’లో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’లో అంతకు మించి అన్నట్లుగా రా రస్టిక్ పాత్రలో చూపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన ΄ాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో ΄ాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానుంది.మరోసారి... హీరో బాలకృష్ణ– డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘వీర సింహారెడ్డి’. 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ‘వీర సింహారెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూ΄÷ందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిపిన షెడ్యూల్స్‌తో సుమారు 30 శాతం పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి, దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్బీకే 111’లో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆర్సీ 17 కోసం... రామ్ చరణ్ కెరీర్‌లోని హిట్ మూవీస్‌లో ‘రంగస్థలం’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ‘చిరుత’ (2007) ‘ధృవ’ (2016) వరకూ లవర్ బాయ్‌గా, స్టైలిష్ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన్ను ‘రంగస్థలం’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ లుక్‌లో చూపించారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రత్యేకించి ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లో రామ్‌చరణ్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్– సుకుమార్ కాంబినేషన్లో రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) వంటి సినిమాలు తెరకెక్కించి, పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు సుకుమార్. ఈ చిత్రాల తర్వాత రామ్ చరణ్ హీరోగా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్) చేయనున్నారు సుకుమార్. ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా కావడంతో ప్రకటనతోనే ‘ఆర్సీ 17’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ‘ఆర్సీ 17’ షూటింగ్లో పాల్గొంటారట రామ్ చరణ్. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని సమాచారం. జూన్ 25 నుంచి ఈ మూవీ షూటింగ్ ్ర΄ారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సుకుమార్ ఒక వినూత్నమైన ΄ాయింట్ను ఎంచుకున్నట్లు తెలిసింది.ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. వాస్తవ ఘటనలతో... హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’. 2017 నవంబరు 17న విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న భారీ ΄ాన్ ఇండియా మూవీ ఇది. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందుతోంది. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని హార్స్ రైడింగ్ సన్నివేశాల కోసం స్టాలియన్ బ్రీడ్ గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ ఎలాంటి కఠినమైన శిక్షణ తీసుకున్నారు? ఈ క్రమంలో గాయాల్ని తట్టుకుని ఎలా విజయవంతంగా స్వారీ చేశారు? అన్నది ఈ గ్లింప్స్‌లో చూపించారు. ‘‘రణబాలి’లో ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి. అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ΄ాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. రణబాలి పాత్రలో విజయ్ హార్స్ రైడింగ్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలుస్తాయి. సెప్టెంబరు 11న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్‌ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్‌కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
కాన్స్ లో మెరిసిన భారత సినీ తారలు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ తారలు మెరిశారు. గత ఏడాది ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ తొలిసారిగా ఈ చిత్రోత్సవాల్లో మెరిశారు. ఈ ఫెస్టివల్ కోసమే అదితీ రావు హైదరి, డయానా పెంటీ ఫ్రాన్స్‌లో ఉన్నారు. నటి తారా సుతారియా కూడా తొలిసారిగా ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ వేదికపై తారా సుతారియాకు ప్రత్యేక సత్కారం జరిగింది. సంగీతం, థియేటర్ ఆర్ట్స్, నటిగా బహుముఖ ప్రతిభ చూపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం లభించింది. ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా’ కార్యక్రమంలో హ్యూమా ఖురేషి సందడి చేశారు. ఇంకా అభినవ్ గోమటం, స్వాతీ శర్మ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తెలుగు చిత్రం ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ టీజర్, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వేణు నక్షత్రం దర్శకత్వంలో అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జాన్ అబ్రహాం దర్శకత్వంలోని మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అమ్మ అరియాన్’ రీస్టోర్డ్ 4కే వెర్షన్‌ను ‘కాన్స్ క్లాసిక్’ విభాగంలో ప్రదర్శించారు. ఈ ఏడాది ఈ విభాగంలో ఎంపికైన ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు అమి విర్క్, రూపీ గిల్ లీడ్ రోల్స్‌లో నటించిన పంజాబీ సినిమా ‘చర్దోకలా’ ప్రదర్శితమైంది. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా రూపీ గిల్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న తొలి పంజాబీ సినిమా ‘చర్దోకలా’ కావడం విశేషం. గుజరాతీ నటి–నిర్మాత మానసీ పారేఖ్, సింగర్–నిర్మాత పార్దివ్ గోహిల్, చందు పటేల్ గుజరాతీ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హాజరై, సందడి చేస్తున్నారు. ఈ నెల 23 వరకూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
స్పెషల్ ఎంట్రీ
టాలీవుడ్‌కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. హవీష్ హీరోగా నటించిన ‘నేను రెడీ’ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇదే. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించారు. ‘‘నేను రెడీ’ సినిమా రీ–రికార్డింగ్ పనులతో సహా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. జూన్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం. హవీష్‌కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్. -
కొత్త అనుభూతినిచ్చేలా...
నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్ లొకేషన్లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
చిరు లీక్స్.. 'పెద్ది' ట్రయిలర్‌కి ముందే పెంచేసిన హైప్
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్ ట్రయిలర్లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్ చూశాక కంట్రోల్ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు. అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్ ట్రయిలర్‌పై ఉన్న హైప్‌ను అమాంతం పెంచేశారు. ఈ నెల 18న రిలీజ్ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. -
సన్నగా మారేందుకు సర్జరీ? క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేశ్
బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)'2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్‌పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్‌తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది''2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్‌ను బ్యాలెన్స్‌గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నా''అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మహేశ్ సినిమా.. నేను అది తీసుకోలేకపోయాను
భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్‌గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్‌లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్‌లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్‌ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్‌పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే) -
దీనస్థితిలో పావలా శ్యామల.. అండగా నిలిచిన దిల్ రాజు!
అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటి పావలా శ్యామలకు నిర్మాత దిల్ రాజు అండగా నిలిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. తన మేనేజర్ల ద్వారా అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.కాగా, గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, డబ్బులు లేవని ఆమెను బయటకు పంపించేశారు. క్యాబ్ డ్రైవర్ ఆమెను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, ‘శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.కన్నీళ్లు పెట్టుకున్న శ్యామలదిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా చాలా సార్లు దిల్ రాజు సహాయం చేశాడని..మరోసారి తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని శ్యామల పేర్కొంది. పావలా శ్యామలకు అండగా దిల్ రాజుProducer #DilRaju stepped in to ensure she received proper care. He immediately sent his team to the hospital to assess her condition and coordinate with doctors.#PavalaShyamala pic.twitter.com/lOJOcejaWL— Milagro Movies (@MilagroMovies) May 16, 2026 -
సమంతని ఇలా చూసుండరేమో.. హన్సిక జీరో సైజ్!
షాకింగ్ లుక్‌లో కనిపించిన సమంతనడుము అందాలతో హన్సిక పోజులుబీచ్లో నోరా ఫతేహి గ్లామరస్ డ్యాన్స్పూల పక్కన మెరిసిపోతున్న నయనతారకళ్లద్దాలతో రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మకొత్త హెయిర్ స్టైల్‌తో ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Savleen kaur manchanda (@savleenmanchanda) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) -
అది నా అదృష్టం.. గర్వంగా ఉంది : రాగ్ మయూర్
‘నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా నటుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది’ అని రాగ్ మయూర్ అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. ఇండస్ట్రీకి వచ్చి ఈ శుక్రవారం(మే 15)తో ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 👉 సినిమా బండి రిలీజ్ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ప్రముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’కు రీమేక్‌గా వచ్చిన ‘సివరాపల్లి’ నటుడిగా మరింత గుర్తింపు తెచ్చింది.👉 ‘సివరాపల్లి’ సూపర్‌హిట్ తర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చింది. చాలా మంది దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకుని పాత్రలను రాశామని చెప్పారు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయటం అనేది నటుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావటంతో నటనలో విభిన్న కోణాలను అన్వేషించే అవకాశం దక్కింది. అది నా నటనను మరింత మెరుగు పరిచింది.👉 ‘శుభం’లో క్యామియో రోల్ చేశా. అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు. 👉 ప్రస్తుతం డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న ‘గరివిడి లక్ష్మి’లో బుర్రకథ కళాకారుడి పాత్ర చేశా. ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నటించాను.👉 నా ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను’ అని అన్నారు. -
త్రిషకు నేనంటే ప్రాణం.. నా వల్ల కాదు అని ఏడ్చేసింది
అప్పడెప్పుడో 1999లో సినిమాల్లోకి వచ్చిన త్రిష.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్ని కవర్ చేస్తోంది. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గెలవడం మాటేమో గానీ సోషల్ మీడియాలో ఈమెనే ట్రెండ్ అయిపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)'మహేశ్ బాబు 'అర్జున్' కోసం త్రిషని ఆడిషన్ చేశారు కానీ ఎందుకో ఈ అమ్మాయి సెట్ అవ్వదని దర్శకుడికి అనిపించింది. మహేశ్ దగ్గర ఆ ఫొటోలని చూసి ఆమెని కలవాలనుకున్నాను. ఆ టైంకి ఛాన్సులు రాకపోవడంతో కొంచెం నిరాశలో ఉంది. నా నుంచి ఫోన్ రాగానే తెగ ఆనందపడింది. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లి చూసి ఓకే అనుకున్నాక 'వర్షం'లో హీరోయిన్గా సెలెక్ట్ చేశా. షూటింగ్లో 75 రోజుల పాటు వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేసింది. ట్రైన్ నుంచి దూకే సీన్స్ చేయలేక నా వల్ల కాదు అని ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో నేను కచ్చితంగా చేస్తానని అంది. ఈ మూవీ రిలీజైన తర్వాత త్రిష మా ఇంటిలో మనిషి అయిపోయింది. అందుకే ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని''త్రిషకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది. నాపై ఆమెకు అంత నమ్మకం ఉండేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరోయిన్ని ఇంకా ఎవరిని అనుకోలేదు. కానీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసింది. భోజనం చేసి తన డేట్స్ బుక్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పింది. ఇక 'ఆట'లో ఇలియానాని హీరోయిన్గా పెట్టినందుకు నాపై అలిగింది. నేను షూటింగ్‌కి వచ్చేస్తానని వరసపెట్టి ఫోన్లు చేస్తూనే ఉంది. షూటింగ్ మొదలైపోయింది. ఆపడం కుదరదు అనే చెప్పడంతో శాంతించింది' అని ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.వీళ్లిద్దరి కాంబినేషన్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వీటిలో తొలి రెండు సూపర్ హిట్ కాగా మూడోది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. అప్పట్లో స్టోరీ అందించి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దర్శకుడిగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన 'అగధ' విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లలోనే త్రిషతో తన బంధం గురించి చెప్పారు.(ఇదీ చదవండి: శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2') -
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.2021లో పెళ్లిఅయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్‌లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్‌న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు. విషాదంతెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఇంత సీక్రెట్2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్ -
నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి
గత కొంతకాలంగా హీరో జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్‌పై పుకార్లు ఎక్కువయ్యాయి. సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన రిలేషన్లో ఉండడం.. విడాకులకు ఆమెనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్ చేశారు. అయితే తాజాగా సింగర్ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జయం రవి మీడియా ముందుకు వచ్చాడు. ఈ వివాదాలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు.నరకం చూశా.. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతుందని.. ఇన్నేళ్లు ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తాను.. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. ‘పెళ్లైయిన మొదటి రోజు నుంచే బ్లాక్ మెయిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్ లేకుండా చేశారు. ఎంతో ఇష్టంగా కోట్లాది రూపాయలకు కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే(ఆర్తి) స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. స్కూల్‌కి బాడీగార్డ్స్‌ని పెట్టి పంపిస్తున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను నాపై ట్రోలింగ్ చేస్తున్నారు. నా బిడ్డల భవిష్యత్తు కోసమే అన్నీ భరించా.(చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!)చేతబడి చేశారు.. ఇంట్లో ఉన్నప్పుడు నేను వారి చెప్పుచేతుల్లో ఉండడానికి నాపై చేతబడి చేశారు. నన్ను పూర్తిగా అనచివేయడానికి ఇలా చేశారు. ఆ చేతబడి ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా హింసించి నన్ను చంపేయాలని కుట్ర చేస్తున్నారు. అయితే అందరి సంగతి తేల్చేవరకు నేను పోరాడుతూనే ఉంటా. అప్పటి వరకు నటించను45 ఏళ్ల వయసులో అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడే తాను, ఆడవారి గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని లక్షలు పెట్టి చదివించాను. అయినా కూడా వాళ్లపై నాకు ప్రేమ లేదని రాయించారు. అవి ఎంత భాదిస్తాయో తెలుసా? ఇన్నాళ్లు నన్ను అర్ధం చేసుకుని తోడుగా నిలిచిన కేనీషాను కూడా టార్గెట్ చేసి వేధింపులు చేసి ఆమెను పంపించేశారు. మూడక్షరాల ఇడ్లీ నటి నా జీవితాన్ని నాశనం చేసింది.. నాతో పాటు ఎన్నో కుటుంబాలను ఆమె కూల్చింది. నా వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకుని .. నా భార్యతో విడాకులు తీసుకున్నాకే తిరిగి సినిమాలలో నటిస్తా, అప్పటి వరకు నటించనని జయం రవి వెల్లడించారు. View this post on Instagram A post shared by Sun News Tamil (@sunnews) -
కేన్స్ వేదికపై మన సినీ ప్రమోషన్!
ఫ్రాన్స్‌లో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవం ఈసారి కూడా సందడిగా సాగుతోంది. మే నెల 12న మొదలైన ఈ ఏటి 79వ కాన్ చలనచిత్రోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఫ్రెంచ్ పీరియడ్ – కామెడీ చిత్రం ‘ది ఎలక్ట్రిక్ కిస్’తో ఆరంభమైన ఈ వేడుకలో భారత ప్రభుత్వం సైతం మన దేశీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయంగా మరింత మందికి చేరువ చేసేందుకు ‘భారత్ పెవిలియన్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్’, అలాగే వందేళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) సమష్టిగా వివిధ భారతీయ సినిమాల ప్రమోషన్‌కు ఈ ‘భారతీయ పెవిలియన్’ ద్వారా వేదికను కల్పిస్తున్నాయి.తెలుగు నుంచి సోషియో - ఫ్యాంటసీగా...వివిధ దేశాల సినీ రంగాలకు ఏర్పాటు చేసిన పెవిలియన్ల లానే భారతీయ సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘భారత్ పెవిలియన్’లో మే 15, శుక్రవారం ఓ తెలుగు సినిమా ప్రమోషన్ కూడా జరగడం విశేషం. ‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ (ఆటాడిన పాట) అనే తెలుగు చిత్రం టీజర్, పోస్టర్ విడుదల అక్కడ జరిపారు. నక్షత్రం ప్రొడక్షన్స్ పతాకంపై అవంతిక నక్షత్రం ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రముఖ కథా, నవలా రచయిత వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. కాన్ ఫిలిం ఫెస్టివల్లో ‘లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ (ఎల్ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అయిన క్యారీ సాహ్ని చేతుల మీదుగా ఈ సినిమా టీజర్, పోస్టర్‌ను ఆవిష్కరించి, సభికులకు ప్రదర్శించారు. సోషియో- ఫ్యాంటసీ జానర్లో రూపొందిన ఈ ‘ఆటాడిన పాట’లో అభినవ్ గోమఠం, స్వాతీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.“ఇదో వినూత్న ప్రయోగం. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అయింది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాం” అని రచయిత, దర్శకుడు వేణు నక్షత్రం తెలిపారు. ఈ చిత్రానికి రాహుల్ మాచినేని ఛాయాగ్రహణం, టి.ఆర్. సెల్వకుమార్ కూర్పు, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ‘భారత్ పెవిలియన్’లో జరిగిన ఈ చిత్ర కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ఆసక్తిగా గమనించారు. టీజర్‌ను ఆవిష్కరించిన క్యారీ సాహ్ని సహా పలువురు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు సహకరించిన డైరెక్టర్ శర్వి, తదితర మిత్రులు, ఆహూతులకు వేణు నక్షత్రం ధన్యవాదాలు తెలిపారు.గుజరాతీ చిత్ర పరిశ్రమ సైతం...వివిధ భారతీయ భాషా చిత్రాలు అంతర్జాతీయంగా తమను తాము మార్కెట్ చేసుకొనేందుకు కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పెవిలియన్ వేదికను కల్పిస్తోంది. ఇప్పటికే పలు భారతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. హిందీ టీవీ నుంచి గుజరాతీ చిత్రసీమలో ప్రముఖ నటిగా ఎదిగి, గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్ ప్రెస్’ (2023) ద్వారా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న మానసీ పారేఖ్ ఈసారి కాన్‌లో గుజరాతీ సినిమా పక్షాన జోరుగా ప్రచారం చేస్తూ, రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలు దిగుతూ, అందరినీ ఆకర్షిస్తున్నారు. నిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముఖ్య పాత్రగా చేసుకొని, అతి తక్కువ బడ్జెట్లో నిర్మాణమై, కనివిని ఎరుగని వసూళ్ళతో గుజరాతీ సినీ పరిశ్రమ వైపు దేశమంతా తిరిగి చూసేలా చేసిన సోషియో-ఫ్యాంటసీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్ర దర్శకుడు సహా పలువురు ఆ పరిశ్రమ నుంచి అక్కడ సందడి చేస్తున్నారు. ఈ మే 23 వరకు మరో వారం రోజుల పాటు ఈ కాన్ చలనచిత్రోత్సవం సాగనున్నందున తెలుగు చిత్రసీమతో పాటు ఇతర భారతీయ భాషల నుంచి మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. అటు వృద్ధాప్య సమస్యలు, ఇటు అనారోగ్యం ఆమెను మరింత కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి అస్వస్థతకు లోనవగా చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. దీన స్థితిలో నటికానీ చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఓ క్యాబ్ ఎక్కించి ఆమెను బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్‌పల్లిలోని ఓ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకటిలో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయింది. ఆస్పత్రిలో చికిత్సకాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు.. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్‌కు సమాచారమివ్వడంతో వారు తనను సనత్‌నగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఒకప్పుడు తన నటనతో ఎంతోమందిని నవ్వించిన నటి ఇప్పుడిలా రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించడం చూసి సినీప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. సాయం చేయడం కోసం తన టీంను ఆసుపత్రికి పంపినట్లు సమాచారం.చదవండి: సూర్యకు భారీ పారితోషికం.. మరి త్రిషకెంతో? -
రామ్‌చరణ్ చేతికి గాయం? హీరోకు ఏమైంది?
గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్న రామ్‌చరణ్ ఈసారి పెద్దితో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది. అయితే అప్పటివరకు గ్యాప్ లేకుండా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. బ్యాండేజ్‌తో చరణ్?మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రమోషన్స్ జర్నీ మొదలు కానుంది. పలు నగరాల్లో అనేక ఈవెంట్లను ఏర్పాటు చేశారు. చివరగా జూన్ 2న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై వెళ్లిన రామ్‌చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. శుక్రవారం నాడు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లాడు చరణ్. చరణ్‌కు ఏమైంది?అనంతరం బయటకు వస్తుండగా అతడి కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చరణ్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే షూటింగ్లో చరణ్ చేతికి చిన్న గాయమైందని, దాన్నుంచి త్వరగా కోలుకోవడానికే ఈ బ్యాండేజ్ ధరించాడని తెలుస్తోంది. #RamCharan - MAINTAINING HOLLYWOOD STAR LEVEL OF LOOKS - and Ram Charan is absolutely owning that long hair look🔥#ramcharan 💥 pic.twitter.com/SJ5IW73K9j— ROYAL BHARAT (INDIAN)🇮🇳 (@royal_mogile) May 16, 2026 చదవండి: స్క్రిప్ట్ చదివే అలవాటే లేదు: సల్మాన్ ఖాన్ -
పవర్ఫుల్ లీలావతి
విరాట్ కర్ణ హీరోగా నటించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నభా నటేష్, ఐశ్వర్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా జూలై 3న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలో లీలావతి పాత్రలో అనసూయ నటించినట్లు వెల్లడించి, ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అనసూయ పాత్ర పవర్‌ఫుల్‌గా, కీలకంగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
కొత్త ప్రయాణం
బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో రామ్ పోతినేని. దర్శకుడిగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారాయన. శుక్రవారం (మే 15) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా రామ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆయన దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఇదే. రామ్ కెరీర్‌లోని ఈ 23వ సినిమాను రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వీర అనే పాత్రలో నటించనున్నారు రామ్. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్ . ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ లో ప్రారంభించి, డిసెంబరులో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో వీర పాత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో రామ్ కనిపిస్తారు. ఒంటరితనం, మానసిక సంఘర్షణలతో నిండిన కొత్త పాత్ర ఆయనది’’ అని యూనిట్ పేర్కొంది. కాగా తన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం రామ్ రచయితగా మారి తొలి పాట రాయడంతో పాటు పాటలు పాడారు. -
రెడ్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ.. కేన్స్‌లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్‌లో అనన్య పాండే..జిమ్‌లో బిగ్‌బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్‌లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న వీకే నరేశ్.. ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. Live life King Size like Naresh pic.twitter.com/PaChEpGm9A— Journalist Nishant (@NishantOpinions) May 15, 2026 -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండుదర్శకత్వం: మధుదీప్ చెలికానినిర్మాత: అరవింద్ మండెంఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుసంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు విడుదల తేది: మే 15, 2026కథేంటంటే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ చూడగానే ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు ఆర్గానిక్ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఉన్నంతలో ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్ ఎపిసోడ్ పర్వాలేదు. కానీ సెండాఫ్లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.ఎవరెలా చేశారంటే..అరవింద్ పాత్రకి త్రిగుణ్ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. సబ్ కమిటీ ఏర్పాటు
టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్ కమిటీ ఛైర్మన్‌గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు. ఈ సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.ఎగ్జిబిటర్స్ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. -
ది రాజాసాబ్‌పై కామెంట్స్.. సప్తగిరి క్షమాపణలు!
టాలీవుడ్లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈవెంట్‌కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి. -
‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: వీరభద్రుడునటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులునిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభురచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీసినిమాటోగ్రఫీ : జికె విష్ణుసంగీతం : సాయి అభ్యంకర్ఎడిటర్ : ఆర్.కళైవానన్విడుదల తేది: మే 15, 2026సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే..ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది. మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
కరుప్పు మూవీ.. పూనకంతో ఊగిపోయిన డైరెక్టర్..!
సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్గా త్రిష కనిపించింది.ఇవాళ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్ సీన్లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #RJBalaji - HUGGED TRISHA AFTER A BLOCKBUSTER RESPONSE - Of #Karuppu Film 🔥🔥🔥🔥This Man Deserves this SUCCESS.pic.twitter.com/LmeMv8q3Fv— GetsCinema (@GetsCinema) May 15, 2026 -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
వివాదంలో రాజీవ్ కనకాల.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్ ఫంక్షన్‌కు హాజరైన ఆయన పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్ అందజేశారు. అయితే ఈ ఈవెంట్‌కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్‌కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్‌కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. రాజీవ్ కనకాల ఓ స్కూల్ వివాదంలో ఇరుక్కున్నారు10th lo highest marks vachina students ki Rajeev Kanakala garu shields andincharu. Sanmana karyakramam jarugutunna samayam lo Nav Telangana Vidyarthi Shakti (NTVS) organization members okkasariga protest chesaru. Aa school ki… pic.twitter.com/45jhHyXQZK— Milagro Movies (@MilagroMovies) May 15, 2026 -
పర్సంటేజీ సమస్య.. ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్) -
మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే
మహేశ్ బాబు ఇప్పటివరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేశాడు. హిందీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆసక్తి చూపించలేదు. ఈ విషయం గురించి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడా టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ గురించి ఇతడు చేసిన కామెంట్స్ షాకింగ్‌గా అనిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)మహేశ్ బాబు గతంలో ఓసారి మాట్లాడుతూ.. 'బాలీవుడ్ వాళ్లు నన్ను భరించలేరు' అన్నారు కదా దానిపై మీ స్పందన ఏంటి? అని యాంకర్ అడగ్గా.. రాహుల్ దేవ్ నవ్వుతూనే ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తెలుగులో దర్శకుడు త్రివిక్రమ్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో కమర్షియల్ హంగులతో పాటు ఓ అర్థం ఉంటుంది. త్రివిక్రమ్‌తో మహేశ్ చేశారు. ఇలాంటి మూవీస్ హిందీలో ఉండవు. అక్కడంతా రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు తీసే టైపు సినిమాలు లేదంటే హాలీవుడ్ రీమేక్సే ఉంటున్నాయి. నిజం చెప్పాలంటే ఆయనకు(మహేశ్) భాష రాదు అదే అసలు కారణం' అని రాహుల్ దేవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ నటుడు ఏ ఉద్దేశంతో మహేశ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడనేది అర్థం కావట్లేదు.మహేశ్ గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు హిందీలో చాలా ఆఫర్లు వచ్చాయి. గర్వంగా అనిపించొచ్చు కానీ వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. తెలుగు సినిమాల్లో నాకు దొరుకుతున్న స్టార్డమ్, అభిమానం చూసిన తర్వాత మరో పరిశ్రమకు ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. ఇక్కడే మూవీస్ చేస్తానని, అది పెద్ద హిట్ అవుతాయని నమ్మాను. ఇప్పుడు నా నమ్మకం నిజమవుతోంది' అని అన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' మూవీ.. హిందీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?) -
హీరో రామ్.. ఈ సాహసం ఎందుకు చేస్తున్నట్లు?
తెలుగులో ప్రస్తుతమున్న స్టార్ హీరోలు నటించడం తప్పితే మిగతా విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. కానీ నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంటి వాళ్లు మాత్రం నటిస్తూనే రైటింగ్‌లో ప్రతిభ చూపించారు. విశ్వక్ సేన్ లాంటి ఒకరిద్దరు డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరో చేరాడు. అతడే రామ్ పోతినేని. ఇప్పటివరకు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తన 23వ మూవీ కోసం దర్శకుడిగా మారిపోయాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)పుట్టినరోజు సందర్భంగా రామ్.. డైరెక్టర్‌గా మారిన విషయాన్ని బయటపెట్టాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వీర పాత్రకు సంబంధించిన బ్యాక్ సైడ్ లుక్‌ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హీరో కమ్ దర్శకుడిగా రామ్ వ్యవహరిస్తుండగా.. నిర్మాతగా రామ్ సోదరుడు కృష్ణ ఉన్నారు. అంటే నిర్మాణంలోనూ రామ్ హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది.రీసెంట్ టైంలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే రామ్‌కి మరో హిట్ అనేది లేదు. ఇది సక్సెస్ అయిందని వరసగా మాస్ మూవీస్ చేసుకుంటూ వెళ్లాడు. వీటిలో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో రూటు మార్చేసి 'ఆంధ్రా కింగ్ తాలుకా' అని క్లాస్ టచ్ మూవీ చేశాడు. టాక్ బాగానే వచ్చింది గానీ కలెక్షన్స్ రాక ఇది కూడా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో ఓ పాట రాసిన రామ్.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా మారడం ఆశ్చర్యం కలిగించింది.హీరో-దర్శకుడిగా ఈ బరువు బాధ్యతల్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులోనే థియేటర్లలో రిలీజ్ అవుతుందని కూడా ప్రకటించాడు. అంటే ఆరు నెలల్లోనే మూవీ పూర్తి చేసి రిలీజ్ చేస్తాడనమాట. ప్రయత్నం మంచిదే అయినా ఎందుకీ సాహసం చేస్తున్నాడనేది ఇక్కడ ప్రశ్న.(ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)An exciting journey begins with all your love & blessings. 🖤Introducing "𝙑𝙀𝙀𝙍𝘼" in #RAPO23 🔥-the story of a Lone Wolf. 🐺Genre: Psychological Action Thriller.Written & Directed by #𝙍𝘼𝙋𝙊Produced by Krishna PothineniA @RAPO_Cinematics Production.December 2026… pic.twitter.com/m9dkC0XMb7— RAm POthineni (@ramsayz) May 15, 2026 -
‘దూరదర్శని’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ వారం కూడా టాలీవుడ్లో చిన్న సినిమాల సందడే ఉంది. ఈ రోజు మూడు, నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘దూరదర్శని’. . కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. సువిక్షిత్, గీతికా రతన్ హీరోహీరోయిన్లుగా నటించారు. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. హరి(సువిక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన గొప్పింటి అమ్మాయి వాణి(గీతికా రతన్) అంటే అతని చాలా ఇష్టం. వాణి కూడా హరిని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమకి పేకబాబు(భాస్కర్) ఇల్లు అడ్డా అవుతుంది. ప్రతి రోజ రాత్రి టీవీ చూసేందుకు పేకబాబు ఇంటికి వెళ్లేవారు. హరి,వాణిల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే విషయం పేకబాబుకి తెలుస్తుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు..ఎలాగైన ఆమె నుంచి హరిని దూరం చేయాలనుకుంటాడు. అందుకోసం వాణి అన్నయ్య పరశురామ్(విజయ్ కృష్ణారెడ్డి)ని పావుగా వాడుతాడు. అతనికి లేనిపోనివి చెప్పి.. ఊర్లో కులాల చిచ్చు పెడతాడు. కొన్నాళ్ల తర్వాత వాణి, హరి ప్రేమించుకుంటున్నారనే విషయం పరశురామ్‌కి తెలుస్తుంది. తన చెల్లి తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిదనే విషయం తెలిసిన తర్వాత పరశురామ్ ఏం చేశాడు? పేక రాజు చేసిన కుట్రకి ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమను దక్కించుకునేందుకు హరి, వాణిలు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు వీరి ప్రేమ కథ విషాదంగా ముగిసిందా లేదా సుఖాంతం అయిందా ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ప్రస్తుతం టాలీవుడ్లో వింటేజ్ లవ్‌స్టోరీ ట్రెండ్ నడుస్తోంది. 80-90ల నాటి ప్రేమ కథలను తెరపై చూపిస్తూ.. ప్రేక్షకులకు అప్పటి రోజులను, తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. దూరదర్శని చిత్రం కూడా ఆ కోవకు చెందిన కథే. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదేమి కాదు. తక్కువ కులానికి చెందిన హీరో, పెద్ద కులానికి చెందిన హీరోయిన్ని ప్రేమించడం.. హీరోయిన్ ఫ్యామిలీ వీరి ప్రేమకు అడ్డుపడడం.. ఇద్దరి మధ్య సంఘర్షణ..చివరకు హీరోహీరోయిన్లు ఒక్కటవ్వడం..ఇలాంటి నేపథ్యంతో నైంటీస్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ కథను ఎంత సహజంగా చూపిస్తే.. అంత గొప్పగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే కథతో ప్రయాణం చేస్తాడు. ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయకుండా..చాలా నిజాయితీగా ఓ మంచి ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే కథ రొటీన్‌గా ఉండడం.. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఇటీవల వచ్చిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. హీరో హీరోయిన్లు టీవీ చూసేందుకు ఒకరి ఇంటికి వెళ్లడం.. ప్రేమకి కులం అడ్డురావడం..ఇవన్నీ ఆ చిత్రాన్ని గుర్తు చేస్తాయి.ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ కథ చుట్టే సాగుతుంది. ఇద్దరు కలిసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్స్ చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఎంటర్టైనింగానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సీరియస్‌గా సాగుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం పరశురాంకి తెలియడం.. హీరోపై దాడి చేయడం.. ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇక చివరిలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు ఎమోషనల్‌కి గురి చేస్తుంది. కథ, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సినిమాలో నటించిన వారంతా పెద్ద అనుభవం లేనివాళ్లే. అయినా కూడా బాగానే నటించారు. హరి పాత్రకి సువిక్షిత్ న్యాయం చేశాడు. ఆయన హవభావాలు అచ్చం అప్పటి పల్లెటూరి యువకుడిలాగానే ఉన్నాయి. పల్లెటూరి అమ్మాయి వాణిగా గీతికా రతన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పేకబాబు పాత్రలో భాస్కర్ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ అన్నయ్యగా విజయ్ కృష్ణారెడ్డి చాలా బాగా నటించాడు. హీరో ఫ్రెండ్స్ గా తేజ విహాన్, బాలరాజు పులుసు, పాండు నవ్వించారు. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?
ప్రస్తుతం టాలీవుడ్లో ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. థియేటర్లు రన్ చేస్తున్న ఎగ్జిబిటర్లు.. సింగిల్ స్క్రీన్లలో రెంట్ పద్ధతికి బదులు పర్సంటేజీ ఇవ్వాలని పట్టుబడుతుండగా.. నిర్మాతలేమో ఇప్పటికిప్పుడు అంటే కష్టం, తర్వాత చూసుకుందాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అయితే సమస్య పరిష్కరించుకోవడం సంగతి పక్కనబెట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేంత వరకు వచ్చారు. అసలు ఈ వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారు?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య జరుగుతున్న వివాదం గురించి చాలామంది ప్రేక్షకులు సరిగా తెలియదు. సింపుల్‌గా దాని గురించి చెప్పుకోవాలంటే ఓ మూవీని తీసిన నిర్మాత.. దాన్ని ఓ థియేటర్లో ప్రదర్శించుకునేందుకు ఎగ్జిబిటర్ అనే వాడికి కొంత మొత్తం చెల్లిస్తాడు. అయితే సింగిల్ స్క్రీన్స్‌లో మూవీ వేసినందుకు అద్దె చెల్లిస్తుండగా.. మల్టీప్లెక్స్‌లో మాత్రం వచ్చిన డబ్బుల్లో పర్సంటేజీ చెల్లిస్తున్నాడు. అయితే ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకేలా పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు ఇప్పుడు అంటున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తొలుత ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధలు చెప్పుకోగా తర్వాతి రోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున కొందరు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి తమ వాదన వినిపించారు.ఇన్నాళ్లు వాళ్లవరకే పరిమితమైన సమస్యని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కలిసి అందరి ముందు పెట్టారు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ నిర్మాత నాగవంశీ.. ఆసియన్ సునీల్‌ని ఉద్దేశిస్తూ మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉన్న ఈయనకు సింగిల్ స్క్రీన్ బాధలేం తెలుస్తాయని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సునీల్.. నాగవంశీని ఉద్దేశిస్తూ విగ్ పెట్టుకుంటాడు అంటూ బాడీ షేమింగ్ చేసేలా మాట్లాడారు. అలా సమస్య కాస్త పక్కదారి పట్టి వేరే వైపు వెళ్లిపోయింది. మరోవైపు 'పెద్ది' రిలీజ్ టైంలో కావాలనే ఎగ్జిబిటర్ శిరీష్ ఇలా చేస్తున్నారని నిర్మాతలు ఆరోపణలు చేశారు. స్పందించిన శిరీష్.. తాము ఎప్పటినుంచో పర్సంటేజీ గురించి అడుగుతున్నామని 'పెద్ది'ని టార్గెట్ చేయట్లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. తెలుగు ఫిలిం ఛాంబర్లో సురేశ్ బాబు ఆధ్వర్వంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరగనున్నాయి. సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిర్మాత సి.కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారా? అంటే ఎవరివైపు లేరు. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ పర్సంటేజీ, రెంట్ లాంటి వాటి గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఉండదు కూడా! ఓ మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్‌కి వెళ్లి చూడటం మాత్రమే ఆడియెన్స్‌కి తెలుసు. కానీ సరైన మూవీస్ తీయడం, టైంకి రిలీజ్ చేయడం మానేసి వాళ్లలో వాళ్లే గొడవపడి టాలీవుడ్ అంటేనే విరక్తి వచ్చేలా చేస్తున్నారు.అసలు థియేటర్లు నడిచేవే హీరోలు, ప్రేక్షకుల వల్ల. ఆ విషయాన్ని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మర్చిపోతున్నారేమో అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతమున్న గొడవ పూర్తిగా సద్దుమణగాలంటే తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ లాంటి రిలీజ్ చేసి మభ్య పెట్టకుండా గ్రాస్, నెట్, షేర్ కలెక్షన్స్‌లో పారదర్శకత పాటించాలి. ఒకరిని ఒకరు నిందించుకోకుండా హీరోల రెమ్యునరేషన్, ఓటీటీ బిజినెస్ లాంటి వాటిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి. పెద్ద మూవీ అని టికెట్ రేట్లు ఎడాపెడా పెంచేయకుండా థియేటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఏళ్లకు ఏళ్లు సాగదీయకుండా స్టార్ హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసేలా ఒప్పించాలి. నటీనటులు, మూవీ బడ్జెట్ నియంత్రణలో ఉంచాలి. బడ్జెట్ అనవసరంగా పెంచేసి ఓటీటీల్లో త్వరగా రిలీజ్ చేయడం లాంటివి ఆపాలి. మరీ ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రేక్షకుడిపై భారం పడకుండా చూసుకోవాలి. అప్పుడే థియేటర్లు బతుకుతాయి. తద్వారా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కూడా బతుకుతారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్) -
టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి
థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు, దానికి టైమ్ పడుతుందని నిర్మాతలు.. అలా టాలీవుడ్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్లో నేడు.. ఎగ్జిబిటర్స్, నిర్మాతలతో చర్చలు జరగనున్నాయి. ఛాంబర్ అధ్యకుడు, నిర్మాత సురేశ్ బాబు ఆధ్వర్యంలో ఇరుపక్షాల సమస్యలని చర్చించబోతున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?)ఈ భేటీలో ప్రధానంగా పర్సంటేజీ, రెంటల్, ఓటీటీ విండో గురించి చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, గిల్డ్ నిర్మాతల నుంచి ముగ్గురు సభ్యులు హాజరు కానున్నారు. మొత్తంగా 10 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈరో జు జరిగే చర్చలలో ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుంది నిర్మాత సీ కళ్యాణ్ చెబుతున్నారు. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిలిం ఛాంబర్ చర్చలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
తిమ్మరాజుపల్లి టీవీ సంతృప్తినిచ్చింది: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక మంచి సినిమా అనే ముద్ర కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. నిర్మాతగా మంచి చిత్రం తీశాననే సంతృప్తిని నాకు మిగిల్చింది. నేటి నుంచి మా సినిమాని ‘ఆహా’లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించారు.తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది. ఈ మూవీ నేటి నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం నిర్వహించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘నేను హీరోగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తయింది. ‘గువ్వల చెరువు ఘాట్’ షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో మా సినిమాను ఆదరించారు. ఓటీటీలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని వి. మునిరాజు పేర్కొన్నారు. -
నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి: ప్రియదర్శి
‘‘దూరదర్శని’ సినిమా ట్రైలర్ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శని చానల్లో సినిమాలు చూసి, స్ఫూర్తి పొంది నటుడిగా మారాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడంతో పాటు మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. సువీక్షిత్, గీతిక జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించిన చిత్రం ‘దూరదర్శిని’. వారాహ మూవీ మేకర్స్‌పై జయశంకర్ రెడ్డి .ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రియదర్శి, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రదర్శకుడు సాయి కంపాటి అతిథులుగా హాజరయ్యారు. -
దేశవ్యాప్తంగా రయ్ రయ్‌మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
బిగ్‌బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్‌బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్‌స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం.. పెద్ది మూవీకే ప్లస్ కానుందా?
ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ఎగ్జిబిటర్స్ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.ఎందుకంటే.. స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చూస్తే మోదీ కూడా ప్రశంసిస్తారు
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అన్నారు. -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్‌లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. -
కొత్త శక్తి వచ్చింది.. ఆ భయాన్ని పూర్తిగా జయించా : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొచ్చిలోని దట్టమైన అడవుల్లో జరిగింది. సాధారణంగా రష్మికకు 'అక్రోఫోబియా' (ఎత్తులంటే భయం) ఉంది. అయితే, ఈ సినిమా కారణంగా ఆ భయాన్ని అధిగమించానని చెబుతోంది రష్మిక. ఈ మేరకు ఇన్‌స్టాతో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘కొచ్చిలో ఉన్న రోజులు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయి. అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కౌట్లు, వర్షాలు.. ఇలా ప్రతిదీ ఒక అనుభవం. నాకు ఎత్తులంటే చాలా భయం. ఇక్కడ ఆ భయాన్ని పూర్తిగా జయించాను. మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా పోరాడటం నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఉదయాన్నే అలారం మోగగానే నిద్ర లేవడం నుంచి, ఎంతో ఇష్టమైన పళం పూరీలు కడుపునిండా తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను’ అంటూ కొచ్చిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా, ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ఎలాంటి డూప్ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సాహసోపేతమైన ఫీట్ చేస్తున్న సమయంలో రష్మిక కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పట్టుదలతో షూటింగ్లో పాల్గొన్నారని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రోజూ గోటీల ఫ్యాక్టరీకి వెళ్తా.. రూ.3 కోట్ల ఆదాయం : రాజశేఖర్ కామెడీ
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌కి గోటీల ఫ్యాక్టరీ ఉందనే గాసిప్ గతకొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, పాక్, ఇండియాల్లో గోటీలను అమ్ముతూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడంటూ యూట్యూబ్‌లో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై రాజశేఖర్ స్పందించే వరకు అంతా నిజమనే నమ్మారు. బైకర్ సినిమా ప్రమోషన్స్‌లో తనకు ఎలాంటి ఫ్యాక్టరీ లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో గోటీల ఫ్యాక్టరీ పుకార్లు ఆగిపోయాయి. అయితే రాజశేఖర్ మాత్రం తనపై వచ్చిన పుకార్లను ఎంజాయ్ చేస్తున్నాడు. వాటిపై పంచులు వేస్తూ.. అందర్నీ నవ్విస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన.. గోటీల ఫ్యాక్టరీ పుకార్లపై తనదైన శైలీలో స్పందించాడు.జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతున్న ఆట డ్యాన్స్ షోకి జీవిత-రాజశేఖర్ జంట గెస్ట్‌గా వెళ్లింది. ఈ సందర్భంగా హోస్ట్ సుధీర్ వారిని సాదరంగా స్టేజ్‌పైకి ఆహ్వానించి.. రాజశేఖర్‌ని డ్యాన్స్ చేయమని కోరాడు. అయితే జడ్జిగా ఉన్న నటి రాధిక వెంటనే ‘డ్యాన్స్ అంటే రాజశేఖర్‌కి జ్వరం వచ్చేస్తుంది’ అంటూ నవ్వేసింది.దానికి బదులుగా రాజశేఖర్.. అవును నిజమే. రాధిక చెప్పినట్లు అప్పట్లో డ్యాన్స్ అంటే జ్వరం వచ్చేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయా(నవ్వుతూ..). రోజు ఫ్యాక్టరీకి వెళ్లి వస్తా. నాకు గోటీల ఫ్యాక్టరీ ఉంది. అది కూడా యూట్యూబ్‌లోనే ఉంది. నెలకు రూ.3 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియడం లేదు. వెతుకుతున్నాను’ అని చెప్పడంతో సుధీర్‌తో పాటు జడ్జిగా ఉన్న రాధిక కూడా ఘొల్లున నవ్వేశారు. రాజశేఖర్ కొత్త సినిమాల విషయానికొస్తే.. బైకర్ మూవీతో ఆయన సెకండ్ ఇన్సింగ్స్ మొదలెట్టాడు. ఇందులో ఆయన హీరో శర్వానంద్‌కి తండ్రిగా నటించి, మెప్పించాడు. ప్రస్తుతం సోలో హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
దేవ కన్యలా ఊర్వశి.. డ్రెస్ ధర రూ. 1500 కోట్లా?
ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సీనీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌను ధరించి ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఊర్వశీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీ పొలీ కోచర్ ఈ గౌనుని డిజైన్ చేసినట్లు ఊర్వశీ రౌతేలా వెల్లడించింది. గౌనుతో పాటు ఆమె ధరించిన వెండి ఎంబ్రాయిడరీతో, క్రిస్టల్స్, పూసల వర్క్‌తో డిజైన్ చేసిన సిల్వర్ కలర్ ఫ్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే చోకర్ నెక్లెస్, భారీ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, కేశాలంకరణలో పక్షి ఆకారంలో ఉన్న ఆభరణం, చేత్తో పట్టుకున్న అద్దాలు, రంగుల రాళ్లు పొదిగిన క్లచ్... వంటివన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయనే అభినందనలు దక్కించుకున్నాయి. ఊర్వశి దేవ కన్యలా ఉందని పలువురు అభినందించారు. ఊర్వశి గౌను, ఆభరణాలు, బ్యాగు విలువ ఫ్యాషన్ నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 155.87 మిలియన్ డాలర్లు అట. భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1500 కోట్లు. వీటిని తయారు చేయడానికి 8 నెలలు పట్టిందట. ఇప్పటివరకూ ఊర్వశి పాల్గొన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అత్యంత ఖరీదైనది ఇదే అని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. -
సినిమాల్లో అలా మేనేజ్ చేయొచ్చు కానీ ..: రుక్మిణీ వసంత్
అతి తక్కువ కాలంలో శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన కథానాయకి రుక్మిణీ వసంత్. ప్రస్తుతం కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారీ భామ. నిజం చెప్పాలంటే తమిళంలో రుక్మిణీవసంత్కు ఇంకా సరైన హిట్టు పడలేదు. విజయ్‌సేతుపతికి జంటగా ఏస్ అనే చిత్రం ద్వారా ఈ అమ్మడు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మదరాసి చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ రుక్మిణీ వసంత్‌కు పలు భాషల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు కన్నడంలో రిషబ్‌శెట్టితో కలిసి నటించిన కాంతార చాప్టర్–1 చిత్రం బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. దీంతో అభిమానులు ఆమెను నేషనల్ క్రష్ గా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం యష్‌తో కలిసి నటించిన కన్నడ చిత్రం టాక్సిక్ త్వరలో ఆల్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అదేవిధంగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వీటితోపాటు తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు వరించినట్లు తాజా సమాచారం. రుక్మిణీవసంత్ మోడలింగ్ రంగం నుంచి వచ్చారన్నది చాలా మందికి తెలిసుండదు. కాగా మోడలింగ్, సినిమా రంగం గురించి ఇటీవల ఈమె పేర్కొన్న విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినిమాల్లో నటీనటులు పంచ్ డైలాగులు చెప్పి, యాక్షన్ సన్నివేశాల్లో నటించి మేనేజ్ చేయవచ్చు, అయితే మోడలింగ్ రంగంలో అలాంటి అవకాశం ఉండదు. ఒక మాట కూడా మాట్లాడకుండా భావాలను, అభినయాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇదే మోడలింగ్ సుందరీమణులకు పెద్ద సవాల్. ఇప్పటి వరకు నేను సినిమా రంగంలో నేర్చుకుంటున్న విషయం ఇదే అని రుక్మిణీ వసంత్ పేర్కొన్నారు. -
‘కాన్స్’ లో ఆలియా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్స్ ఫైర్!
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ, విదేశీ తారల తళుకులతో కనువిందుగా సాగుతోంది. మంగళవారం ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై పీచ్ కలర్ ఫ్రాక్‌లో తళుకులీనారు ఆలియా భట్. అయితే ఆలియా చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ‘‘సినిమాల్లో లీడ్ రోల్స్‌లో ఎవరు నటిస్తారు? అనేది ప్రేక్షకులు చూడరు. వాళ్లకి కథ ముఖ్యం’’ అని పేర్కొనడంతో పాటు ఆలియా ఈ ఫెస్టివల్లో ఇంకా మాట్లాడుతూ – ‘‘బార్బీ’లాంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం 75 శాతం సినిమాలు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తారు. అవన్నీ హీరో ప్రాధాన్యంగా సాగే సినిమాలే. అలాంటి సినిమాలు తీయొద్దని అనడంలేదు. కానీ మహిళల కోసమూ సినిమాలు తీయాలి కదా. మహిళా ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలు ఎవరు తీస్తారు? ఎందుకంటే సినిమాలు ఒక వర్గానికి మాత్రమే కాదు. అందరి కోసం తీయాలి’’ అన్నారు. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యతను ఉద్దేశించి ఆలియా ఈ వ్యాఖ్యలు చేశారని ఊహించవచ్చు. అయితే రెడ్ కార్పెట్‌పై ఆలియా అందానికి ప్రశంసలు కురిపించిన పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను మాత్రం విమర్శిస్తున్నారు. ‘‘ఒకవైపు భర్త (రణ్‌బీర్ కపూర్) ‘యానిమల్’ లాంటి వయొలెంట్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో హింస ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చినా ‘యానిమల్’ని సమర్థించింది. అలాగే ‘ధురంధర్’ సినిమా గురించి కూడా పెదవి విప్పలేదు. అలాంటి ఆలియా కాన్స్‌లో మహిళల కోసం సినిమాలు రావాలని మాట్లాడటం ఎందుకు?’’ అంటూ విమర్శించారు. నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! ‘‘నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారీ ‘నేను ఊర్వశిని కాదు... భారతదేశాన్ని! కాన్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో నా భారతదేశం తరఫున నేను ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వియత్నాంకు చెందిన ఫ్యాషల్ లేబుల్ జోలీపొలీ కోచర్ డిజైన్ చేసిన ఈ బ్యూటిఫుల్ గౌనుని ధరించాను’’ అని ఊర్వశీ రౌతేలా పేర్కొన్నారు. -
శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్గా మానస!
శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్‌ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
అంజలి కీలక పాత్రలో 'ముసలోడికి దసరా పండుగ'.. రిలీజ్‌కు రెడీ
నాజర్, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సందర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకముంది. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. -
బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్‌లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్‌లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్‌లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 20న యంగ్ టైగర్ బర్త్ డేకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా? అని వెయిటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఈ నెల 20న జూనియర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. 7 రోజులు మాత్రమే.बस 7 दिन बाकी हैं.இன்னும் 7 நாட்கள் மட்டுமே.ಇನ್ನೂ 7 ದಿನಗಳು ಮಾತ್ರ.ഇനി 7 ദിവസം മാത്രം.#NTRNeel First Glimpse on May 20th.— #NTRNeel (@NTRNeelFilm) May 13, 2026 -
'మీ చేతిలో సినిమాలు లేనప్పుడే గుర్తుకొచ్చిందా..? మైత్రి నిర్మాత కౌంటర్
టాలీవుడ్లో పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్ల బతుకులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. నిర్మాతలంతా మా బాధలను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చినా సరే టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని అన్నారు.తాజాగా శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందించారు. మీ చేతిలో పెద్ద సినిమా లేకపోవడంతో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని అనడం కరెక్ట్ కాదని అన్నారు. హరిహర వీరమల్లు నుంచి ఈ సమస్య మొదలైందని తెలిపారు. ఆ తర్వాత వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి మూవీ కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీకు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీ చేతిలో సినిమా లేకపోతే పర్సంటేజీ అని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు. ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామని రవిశంకర్ అన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన ప్రెస్మీట్లో రవిశంకర్ మాట్లాడారు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని పట్టు పడుతున్నారు.. కానీ నిర్మాతలకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిపై కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. ఈ ప్రెస్‌మీట్‌కు నాగవంశీ, సాహు గారపాటి, సతీశ్ కిలారు కూడా హాజరయ్యారు. కామెడీ కోసం ప్రెస్మీట్లు పెట్టకండి..నాగవంశీఎగ్జిబిటర్ల పర్సంటేజీ విధానంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. 300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని కౌంటరిచ్చారు. సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేశారని విమర్శించారు. సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని నిర్మాత నాగ వంశీ ఎద్దేవా చేశారు. పెద్ది సినిమా వస్తుంటే పూజలు చెయ్యాల్సింది పోయి ఇలా బెదిరించడం సరికాదన్నారు. -
భారీ యాక్షన్ సీక్వెన్స్.. రాజమౌళి ప్లాన్ ఛేంజ్..!
మహేశ్ బాబు- వారణాసి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.అయితే భారీ యాక్షన్ సీన్స్‌ను కోసం హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం గగన్‌పహాడ్ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. అందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల అవసరం కావడంతో జలమండలికి లేఖ రాశారు. వేసవికాలం కావడంతో అంత నీరు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి వారణాసి టీమ్‌కు షాకిచ్చారు. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఈ సీన్స్ కోసం ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ వారణాసికి ప్లాన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ వారణాసిలోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. -
నిర్మాత జోకర్ అయిపోయాడు.. సెట్లో నా మీదే జోకులు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వేళ్లపై లెక్కపెట్టగలిగే నిర్మాతలు తప్పితే కొత్తగా ఎవరొచ్చినా ఇక్కడ నిలబడటం కష్టం. హీరోల ఆధిపత్యం చాలా పెరిగిపోయింది. దీంతో నిర్మాత అనేవాడు డబ్బులు ఖర్చుపెట్టే మెషీన్లా మారిపోయాడు. ఇలాంటి కారణాలతోనే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వాళ్లలో ప్రసాద్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. టాలీవుడ్‌ని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో మరొకటి లేదు. మనం డబ్బులు పెట్టి అవమానాలు పడటం కంటే దారుణమైన విషయం లేదు. ఇండస్ట్రీలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నిర్మాత ఓ జోకర్లా అయిపోయాడు. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదే సెట్లో అందరూ జోకులు వేస్తుంటారు. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని నా మీద ఎవరికీ ఏ ఆందోళన ఉండదు. నన్నో బఫూన్లా చూస్తారు. హాలీవుడ్లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదు. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. నిర్మాతలకు విలువ లేదు. ఇలాంటి చోట ఉండటం ఎందుకని నేనే వచ్చేశాను' అని పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.'టెంపర్' సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌తో వివాదం గురించి స్పందించిన పీవీపీ.. ఆ చిత్రానికి నేను సోలో ఫైనాన్సియర్. బ్యాంక్ తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.రవితేజ 'బలుపు' మూవీతో నిర్మాతగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ సినిమాలు చేశారు. కానీ ఉన్నట్లుండి సడన్‌గా నిర్మించడం మానేశారు. ఇన్నాళ్లకు అందుకు గల కారణాన్ని బయటపెట్టారు.(ఇదీ చదవండి: విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్) -
హీరోయిన్ లయ చెస్ ఛాంపియనా?.. పోస్ట్ వైరల్
అప్పట్లో హీరోయిన్గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్‌స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) -
‘పెద్ది’లో ఆటే కాదు.. అసలు కథే వేరే!
టాలీవుడ్ బాక్సాఫీస్ గత కొంతకాలంగా డల్ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్ హిట్ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.కోచ్‌గా శివరాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్ కూడా కాలేదు. ట్రైలర్ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్లో చూపించే అవకాశం ఉంది. -
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
సబ్బు యాడ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన అలీ
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన నటించిన ఓ యాడ్‌పై ఓ వర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో చివరకు అలీ క్షమాపణలు చెబుతూ ఆ వీడియోని తొలగించేశాడు. అసలేం ఏం జరిగిందంటే..అలీ ఇటీవల ఓ సబ్బుకి సంబంధించిన ప్రకటనలో నటించాడు. అందులో సబ్బుకి లక్ష్మీ పూజ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని మంత్రాలు కూడా వినిపించాయి. ఇదే ఇప్పడు వివాదానికి దారి తీసింది. ఈ ప్రకటనపై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం మత విశ్వాసాల్ని అపహాస్యం చేస్తారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలీ సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ వివాదం ముదరడంతో అలీ వెంటనే స్పందిస్తూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరాడు. అంతేకాదు ఆ యాడ్ కూడా డిలీట్ చేశానని చెప్పారు. ముంబై కంపెనీ వాళ్లు యాడ్ చేయమన్నారని, దేవుడు చేసిన మనుషులు సినిమాలో తనపై కంపోజ్ చేసిన ఓ బిట్ ని ఈ యాడ్ కోసం వాడామని, అయితే తన సన్నిహితులంతా యాడ్ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డిలీట్ చేశానని అలీ చెప్పుకొచ్చారు.Soap Ad Lands Ali in Controversy Hindu organizations have raised objections to a soap advertisement featuring Ali. As the controversy intensified, Ali issued an apology.#Ali #SoapAd #Controversy #Tollywood #Trending pic.twitter.com/ikLM1BjsM8— Telangana Ahead (@telanganaahead) May 13, 2026 -
టాలీవుడ్‌కి బిగ్‌షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది
తెలుగు సినీ పరిశ్రమకు బిగ్ షాక్ తగిలింది. ఒకప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టి, వదిలి వెళ్లిపోయిన పైరసీ బూతం ‘ఐబొమ్మ ’మళ్లీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ ఈ వెబ్సైట్లో కనినిపిస్తున్నాయి. ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ కావడంతో ఇక ఈ సమస్య తీరిపోయిందని భావించిన సినీ పెద్దలకు తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి.కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సూత్రధారిగా భావిస్తున్న రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐబొమ్మ తన డొమైన్లను మార్చుకుంటూ మళ్లీ రంగ ప్రవేశం చేసింది. థియేటర్లలో ఉన్న తాజా చిత్రాలు, ఓటీటీలో విడుదలైన కొత్త కంటెంట్ ఈ సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిర్వాహకుడు బెయిల్‌పై ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. -
పావలా కోసం కొట్టుకుంటున్నాం.. బన్నీవాసు సంచలన ట్వీట్
టాలీవుడ్లో ‘పర్సెంటేజీ’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబీటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ పెద్దలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, పర్సెంటేజీ విధానం అమలు చేయకపోతే సినిమాలను ప్రదర్శించబోమని హెచ్చరించారు. దీనిపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్ రాకపోవడంతో ఆదాయం తగ్గిందని..దానికి గల కారణాలను తెలుసుకొని సరి చేయకుండా.. తగ్గిపోయిన ఆదాయం మీద పోరాటం చేస్తే ఏం లాభం అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.అంతకంటే తెలివితక్కువతనం ఇంకొకటి లేదురూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు.పావలా కోసం కొట్టుకుంటున్నాంచిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; వారి ఆదాయం పావలా స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం.ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా?నా అభిప్రాయం ప్రకారం ప్రధాన కారణాలు ఇవి1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు.ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అని బన్నీవాసు ప్రశ్నించాడు. -
గ్యాంగస్టర్స్గా మారిన స్టార్ హీరోలు
థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ సినిమాను మెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ‘పుష్ప, కేజీఎఫ్’, ఇటీవల ‘ధురంధర్’... ఇలా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆడియన్స్‌కు థియేటర్స్‌లో మాస్ మూమెంట్స్‌ను అందించేందుకు కొందరు స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై గ్యాంగస్టర్స్గా మారారు. మరి... ఈ గ్యాంగ్స్టార్స్పై ఓ లుక్ వేయండి.ఒక్కరు కాదు... ఇద్దరు!‘అపూర్వ రాగంగళ్’, ‘అంతులేని కథ’, ‘గిరఫ్తార్’... ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (తెలుగులో ’అల్లావుద్దీన్ అద్భుత దీపం’) సినిమా తర్వాత రజనీకాంత్–కమల్హాసన్ల కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. తాజాగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ హీరోలుగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది.రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, ఇందులో రజనీకాంత్, కమల్‌హాసన్... ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్‌గా నటిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా జానర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథలో మంచి సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. ఇక ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రధారిగా త్రిష నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.2027 దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించనున్నారు. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. సో... రజనీకాంత్ – సీబీ చక్రవర్తిల కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ తర్వాత, కమల్‌హాసన్–రజనీకాంత్‌ల మల్టీస్టారర్ మూవీ సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.కాకాజీ?హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రధాన కథాంశం కోల్కత్తా నేపథ్యంతో సాగుతుందని, ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కూడా బలంగా ఉంటుందని, ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగు తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, ఆయన కుమార్తె పాత్రలో అనస్వరా రాజన్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఆ దిశగా షూటింగ్ షెడ్యూల్స్‌ను జరిపేందుకు బాబీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. మరో గ్యాంగ్‌స్టర్ సినిమా? హీరో నానితో ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానీతోనే ‘ది ΄్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నారు. ‘ది ΄్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అయితే హీరో చిరంజీవి– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నాని ఈ సినిమాకు నిర్మాత. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉంది. ఈ సినిమా 2027లో సెట్స్‌కు వెళ్లొచ్చు.ముంబై మాఫియాబాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించి, హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమా కోసం ఓ చారిత్రాత్మక కథను అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. దీంతో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఈ ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.పోలీస్ ఆఫీసర్ పోరాటంప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రోఫెసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఖైదీగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. గ్యాంగ్‌స్టర్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ‘స్పిరిట్’ సినిమాలోని కొంత కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇందులో త్రిప్తి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్, త్రిప్తి భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్ తండ్రి, జైలర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. మరో కీలక పాత్రలో సీనియర్ నటి కాంచన, విలన్స్‌గా వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ నటిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తోనే ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్–వివేక్ ఒబెరాయ్‌ల మధ్య కీలమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట సందీప్‌రెడ్డి వంగా. టీ సిరీస్ ఫిల్మస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. కోల్‌కతాలో డ్రాగన్కోల్కతాలో ‘డ్రాగన్’ చెప్పిందే జరగాలి. వెండితెరపై ఆ డ్రాగన్ ఎవరంటే ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్రాగన్’ టైటిల్‌ను ఓ గ్లింప్స్ వీడియోతో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆలియా భట్ లేదా రష్మికా మందన్నా నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.ఫుడ్ మాఫియా..!డ్రగ్స్ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్... ఇలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా చూసి ఉంటారు. కానీ కాస్త డిఫరెంట్‌గా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్నారు హీరో నాని. ‘సాహో, ఓజీ’ వంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ తీస్తున్న తాజా సినిమా ‘బ్లడీ రొమియో’. ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రధానంగా ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘బ్లడీ రొమియో’ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.గోవాలో డ్రగ్ మాఫియా‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ :చాఫ్టర్ 2’ వంటి చిత్రాల తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (ఇంగ్లిష్, కన్నడ) ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’. 1940–1970 మధ్య కాలంలో, గోవా నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే... రాయ, టికెట్..అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న యశ్ లుక్స్ బయటకు వచ్చాయి. గోవా తీర ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ సినిమా. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.ఈ సినిమాలో నాడియాగా కియారా అద్వానీ, గంగ పాత్రలో నయనతార, ఎలిజబెత్ పాత్రలో హ్యూమా ఖురేషీ, రెబెకా పాత్రలో తారా సుతారియా, మెల్లిస్సాగా కియారా అద్వానీ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ ‘టాక్సిక్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ, రిలీజ్‌ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ‘టాక్సిక్’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సామ్రాజ్యంనార్త్ చెన్నైలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు హీరో శింబు. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ సినిమా ‘అరసన్’. కలైపులి యస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఆండ్రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ వెట్రిమారన్ డైరెక్షన్లో ధనుష్ హీరోగా ‘వడ చెన్నై’ సినిమా వచ్చింది. కానీ ‘వడ చెన్నై’ సినిమాకు, ‘సామ్రాజ్యం’ చిత్రానికి సంబంధం లేదని దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే ధనుష్‌తోనే ‘వడ చెన్నై 2’ సినిమా తీయను న్నట్లుగా వెట్రిమారన్ తెలిపారు.డీసీ‘మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తీసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘డీసీ’ అనే సినిమా చేశారు. ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. లోకేశ్ కనగరాజ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి నటించగా, ఓ కీలక పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటించారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో లోకేశ్, చంద్రగా వామికా గబ్బి నటించారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ ‘డీసీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది.ఇలా గ్యాంగ్‌స్టర్స్‌గా వెండితెరపై నటిస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.– ముసిమి శివాంజనేయులు -
జాతరలో డిష్యుం... డిష్యుం
జాతరలో రెచ్చిపోయి ఫైట్ చేస్తున్నారట రవితేజ. ఎందుకంటే ‘ఇరుముడి’ సినిమా కోసం అన్నమాట. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర, భార్య పాత్రలో ప్రియా భవానీశంకర్ నటిస్తున్నారు.నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. తండ్రీకూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. -
కొత్త ప్రపంచంలోకి...
‘శంబాల’ వంటి హిట్ మూవీ తర్వాత ఆది సాయికుమార్, యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని సమర్పణలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించనున్న ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు.ఆది మంచి మాస్ రోల్ చేయనున్నట్లు ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘‘ఎమోషన్స్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించనున్న చిత్రం ఇది. భయం, ఉత్కంఠ, అపరిమితమైన వినోదంతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మా సినిమా ఉంటుంది. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది ’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
'నలుగురు పిల్లల అమ్మాయితో పెళ్లి'.. ఆసక్తిగా టీజర్
సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు. -
నాని ది ప్యారడైజ్‌పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
'జీవో ఇచ్చినా రేట్లు పెంచే ప్రసక్తే లేదు' తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం
తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతు కావాలని కోరింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. నిర్మాతలందరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్‌పై సవతి ప్రేమ వద్దని అన్నారు.దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ..'ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం ఈ పర్సంటేజ్ విధానం. నిర్మాతలందరు అర్థం చేసుకొండి. మాకు సపోర్ట్ చేయండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. గవర్నమెంటు జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ రేట్లు పెంచం' అని అన్నారు.ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ..'2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్లాడుతున్నాం. హరిహర వీరమల్లు టైంలో మాట్లాడితే థియేటర్స్ మూసేస్తున్నామని నెగిటివ్ ప్రచారం చేశారు. నిదానంగా అన్నీ ప్రొడక్షన్స్ హౌస్‌లు పర్సంటేజ్ పద్ధతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము ధియేటర్స్ నడుపుతాం'అని అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డతో సమానం. చాలా కాలం నుంచి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ బిర్యానీ అయితే మల్టీప్లెక్స్ ఆవకాయ లాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. -
'అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు'.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్‌తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్‌కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు గొప్పగా ఉండాలని అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్‌లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్‌లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
'తప్పు నాదే.. ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు'.. లయ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ రెమ్యునరేషన్ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. -
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్‌ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026 -
ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటారు. అలాంటి వాళ్లలో ఈమె ఒకరు. హీరోయిన్గా కొన్ని వందల సినిమాలు చేసిన నటి ఈమె. కానీ ఇప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో కనిపించడంతో ఫొటోలు వైరల్ అయ్యాయి. మరి ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు తాడిపత్రి సరస్వతి దేవి. అదేంటి ఈమె పేరు శారద కదా.. వేరే ఏదో పేరు చెబుతున్నారేంటి అనుకోవచ్చు. కానీ అదే ఆమె అసలు పేరు. ఈమె సినిమాల్లోకి వచ్చే టైంకి సరస్వతి పేరుతో పలువురు నటీమణులు ఉండడంతో శారదగా స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. తెనాలిలో పుట్టిన ఈమె.. చెన్నైలో అమమ్మ దగ్గర పెరిగారు. శారద అమ్మమ్మ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆదివారం మాత్రమే రిహార్సల్స్‌కి పంపించేది. సినిమా కోసమైనా సరే హీరోలు తన మనవరాలిని ముట్టుకోనిచ్చేది కాదు.ఆరేళ్ల వయసు నుంచే డ్యాన్స్ నేర్చుకున్న శారద.. దసరాతో పాటు ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేవారు. 1955లో వచ్చిన తెలుగు సినిమా 'కన్యాశుల్కం'తో నటిగా కెరీర్ ప్రారంభించారు. కానీ తిరిగి నాటకాల్లోకి వెళ్లిపోయి నాలుగేళ్ల తర్వాత అంటే 1959లో మళ్లీ మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో వరస చిత్రాలు చేశారు. 2015లో చివరగా ఓ మలయాళ మూవీ చేశారు. తెలుగులో ప్రభాస్ 'యోగి'లో అమ్మగా నటించారు. చివరగా ఆది 'సుకుమారుడు' మూవీలో కనిపించారు.(ఇదీ చదవండి: రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ)కెరీర్లో కొన్ని వందల సినిమాలు చేసిన శారద.. తన నటనకుగానూ మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్, నంది పురస్కారాలు కూడా గెలుచుకున్నారు.సినిమాలు, అవార్డుల సంగతి పక్కనబెడితే శారదకు లోటస్ చాక్లెట్స్ పేరిట ఓ కంపెనీ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి నుంచి గతంలో ఎంపీగానూ గెలుపొందారు. మలయాళ చిత్రసీమలోని హేమ కమిటీలోనూ ఈమె సభ్యురాలే. వ్యక్తిగత జీవితానికొస్తే నటుడు-నిర్మాత చలంని పెళ్లి చేసుకున్నారు కానీ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతానికైతే ఈమె.. సోదరుడి కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.(ఇదీ చదవండి: పవిత్రమైన 'భస్మ హారతి'లో పాల్గొన్న తమన్నా) -
పవిత్రమైన 'భస్మ హారతి'లో పాల్గొన్న తమన్నా
తెరపై ఎంత గ్లామర్ చూపించినా సరే కొందరు హీరోయిన్లకు భక్తి కూడా అలానే ఉంటుంది. సమంత లాంటి వాళ్లు ఎప్పటికప్పుడు ఈషా ఫౌండేషన్‌లోని ఆదియోగిని దర్శించుకుంటూనే ఉంటారు. మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్లు తిరుమలలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకుంది. వేకువజామున జరిగే భస్మ హారతి కార్యక్రమంలోనూ పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి ఉదయం విశిష్టమైన భస్మ హారతి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో శివలింగాన్ని పవిత్రమైన భస్మంలో ముంచుతారు. ఈ ఆచారం హిందూ పురాణాలలోని ముఖ్యమైన అంశాలైన జననం, మరణం, పునర్జన్మ అనే శాశ్వత చక్రాన్ని సూచిస్తుంది. నాశనం చేసి పునరుద్ధరించగల శివుని పరివర్తన సామర్థ్యాన్ని నొక్కి చెప్పడానికి, ఆత్మ శాశ్వత స్వభావాన్ని తెలియజేయడానికి భస్మాన్ని ఉపయోగిస్తారు. ఇది భక్తులకు శివునికి మధ్య ఓ అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ఓ నమ్మకం.(ఇదీ చదవండి: రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ)🔸બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીનો લીધો લ્હાવો@tamannaahspeaks #TamannaahBhatia #Mahakal #BhasmaAarti #Ujjain #Mahadev #HarHarMahadev #BollywoodNews pic.twitter.com/03f3a78BOI— DD News Gujarati (@DDNewsGujarati) May 12, 2026 -
నా వైఫ్ మిస్సింగ్
వరుణ్ సందేశ్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే టైటిల్ ఖరారైంది. ‘నయనం’ వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆహా సమర్పణలో కొమర మీడియా వర్క్స్ పతాకంపై శివ కంఠంనేని, ఆర్. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నటుడు–నిర్మాత, ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో చక్కటి ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సతీష్ కుమార్ ఎన్ఎస్. -
వైట్ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్‌లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
చిరంజీవి 'విశ్వంభర'.. జూలై కాదు.. ఆ తేదీ ఫిక్స్?
మెగాస్టార్ హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల మరింత ఆలస్యమవుతూ వస్తోంది. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్‌పై విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్‌పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా సమ్మర్లోనే విడుదలవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపించింది.అయితే విశ్వంభరకు రిలీజ్ తేదీకి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తాజా సమాచారం. ఆ సమయంలో పెద్దగా సినిమాల పోటీ లేకపోవడం విశ్వంభరకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశ్వంభర రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఇప్పటికే విశ్వంభర్ రెండు పార్టులుగా వస్తుందన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట స్పందించారు. అలాంటిదేమీ లేదని దర్శకుడు కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ డీల్‌ను క్లోజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశముంది. కాగా.. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
రాజ్ తరుణ్ థ్రిల్లర్ మూవీ.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఇవాళ హీరో రాజ్ తరుణ్ బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా టార్టాయిస్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. టార్టాయిస్ కథ చాలా కొత్తగా.. డిఫరెంట్‌గా ఉంటుందని మేకర్స్ వివరించారు. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది.. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి మర్డర్స్ చేస్తూ ఉంటాడు..ఆ తర్వాత ఏమి జరుగుతుందనే కోణంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. -
'సినిమా ఛాన్స్.. ఫామ్‌హౌస్‌కు వస్తే రూ.25 లక్షలు..' బిగ్‌బాస్ కిర్రాక్ సీత
బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన టాలీవుడ్ బ్యూటీ కిర్రాక్ సీత. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్‌గా అభిమానులను మెప్పించింది. మొదట యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన సీత 7 ఆర్ట్స్ సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. అంతే కాకుండా బేబీ మూవీలో హీరోయిన్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ రోల్లో అద్భుతంగా నటించింది. బిగ్‌బాస్ షో మరింత ఫేమ్ తెచ్చుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తనకెదురైన అనుభవాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది. ఓ సారి సినిమా ఛాన్స్ అని కాల్ చేసి అడిగారని తెలిపింది. 7 ఆర్ట్స్‌లో చేసే సమయంలోనే సినిమా ఛాన్స్ ఉందని ఫోన్ చేసి చెప్పారని గుర్తు చేసుకుంది. అయితే ఫామ్ హౌస్‌కి రావాలిని పిలిచారని తెలిపింది. మొదట సరే అన్నా.. కానీ నేను వెళ్లలేదు.. మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ చేసి అడిగారని పేర్కొంది. ఇక్కడికి వస్తే మీకు రూ.25 లక్షలు ఇస్తారని చెబితే నేను సున్నితంగా తిరస్కరించానని సీత వెల్లడించింది.కొంతమంది ఇలా నంబర్ దొరికితే చాలు కాల్ చేస్తుంటారని కిర్రాక్ సీత తెలిపింది. కేవలం టైమ్‌పాస్‌కు కూడా ఇలా కాల్స్ చేస్తారని వివరించింది. ఎలా ఉంటది అని నేను అడుగుతా.. ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదా?? అని అంటారని పేర్కొంది. అప్పుడు నేను వెంటనే ఇలా అడగడానికి మీకు సిగ్గుందా? అని వెంటనే ఇచ్చిపడేస్తానని సీత వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఐపీఎల్ ఎఫెక్ట్? టాలీవుడ్ తప్పు చేస్తోందా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అవసరమైతే తప్పితే జనాలు కూడా బయటకు రావట్లేదు. మరోవైపు ఐపీఎల్ మ్యాచుల వల్ల రోజూ ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కొన్ని మ్యాచులైతే థ్రిల్లర్ సినిమాలకు మించి ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా టాలీవుడ్లో చలనం లేదు. చెప్పాలంటే ఈ వేసవిని వాడుకునే సరైన మూవ ఒక్కటి రాలేదు. ఇంతకీ అసలేం జరుగుతోంది? టాలీవుడ్‌కి కూడా వేసవి సెలవులు ఇచ్చేయాలా?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)ఐపీఎల్ వల్ల టాలీవుడ్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందా? అంటే అవును కానీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ఎందుకంటే సినిమాలు బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు. లేదంటే స్టార్ హీరోల చిత్రాలు రిలీజైనా సరే కాస్తోకూస్తో సందడి కనిపించే అవకాశముంది. ఈసారి వేసవిలో అలాంటి అద్భుతాలేం జరగలేదు. ఇప్పటికే వేసవిలో రెండు నెలలు గడిచిపోయాయి. మార్చిలో వచ్చిన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయ్యుంటే బాక్సాఫీస్ కాస్తయినా కళకళలాడేది. కానీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇది తప్పితే మరో పెద్ద హీరో మూవీ ఈసారి వేసవిలో థియేటర్లలోకి రాలేదు.అలా అని బాక్సాఫీస్ ఖాళీగా ఉందా అంటే ఏం లేదు. ప్రతివారం ఒకటో రెండో తెలుగు మిడ్ రేంజ్ లేదా చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో యావరేజ్ కాదుకదా నామమాత్ర కంటెంట్ కూడా ఉండట్లేదు. దీంతో వచ్చిన మూవీస్ వచ్చినట్లే డిజాస్టర్స్ అవుతున్నాయి. గతవారమే తీసుకుంటే మూడు తెలుగు సినిమాలు వస్తే వాటిలో ఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తెలుగు దర్శకులు వైవిధ్యంగా కాకుండా అదే రొట్టకొట్టుడు రొటీన్ కాన్సెప్ట్ సినిమాలు తీస్తూ తప్పులు చేస్తున్నారు. దీనికి తోడు ఐపీఎల్ ఉండటం పెద్ద మైనస్ అయింది. ఈ వారం కూడా సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ బొమ్మ తప్పితే మరో చెప్పుకోదగ్గ మూవీ లేదు. సూర్య గత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి దీనిపై ఏ మాత్రం బజ్ లేదు. ట్రైలర్ చూస్తే ఫక్తు కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంది. సినిమా కూడా అలానే ఉండే అవకాశముంది. మరి ఇది ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?ఇదంతా చూస్తుంటే ఈ ఏడాది వేసవిని టాలీవుడ్ సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. పెద్ద మూవీస్ రాలేదు. వచ్చిన మిడ్ రేంజ్ చిత్రాలు ఆడలేదు. చిన్న సినిమాల వైపు జనాలు చూడలేదు. అలా ఈ వేసవి నీరు గారిపోయింది. ఇక వేసవి చివరలో అంటే జూన్ 4న 'పెద్ది' వస్తోంది. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ ఆశలన్నీ దీనిపైనే ఉన్నాయి. ఒకవేళ ఇది హిట్ అయితే రెండు వారాలైనా థియేటర్లు కళకళలాడుతాయి. లేదంటే అంతే సంగతులు. ఈ మొత్తం వ్యవహారంలో ఐపీఎల్ లాంటి వాటికంటే తెలుగు హీరోలు, దర్శకనిర్మాతల తప్పే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇలా వేసవిని వదిలేయడం బాక్సాఫీస్‌కి ఏ మాత్రం మంచిది కాదు.(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
'ఆయన చేతిని ముద్దాడా.. నా జన్మ ధన్యం..' తనికెళ్ల భరణి ఎమోషనల్
టాలీవుడ్ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను రామున్ని చూడలేదు.. కృష్ణుడిని చూడలేదు.. ఆదిశంకరుల్ని చూడలేదు.. వివేకానందుడిని చూడలేదు.. అంటే చూడలేము కూడా అంటూ ట్వీట్ చేశారు. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీని చూశాను.. ముట్టుకున్నాను.. ఆయన చేతిని ముద్దెట్టుకున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటితో నా జన్మ ధన్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేతులను పట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు. కాగా.. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. తనికెళ్ల భరణి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తనికెళ్ల భరణి తెలుగులో కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో రాణిస్తున్నారు. తన నటన, హవాభావాలతో తెలుగులో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.అంటే చూడలేము కూడా.కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.నా జన్మ ధన్యం. pic.twitter.com/UepoVtqxyf— Tanikella Bharani (@TanikellaBharni) May 11, 2026 -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగు సీరియల్ నటుడు కృష్ణారెడ్డి కూడా చేరిపోయాడు. సొంతూరు బలభద్రపురంలో జరిగిన ఈ వేడుకలో సంధ్య అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు తోటి సీరియల్ నటీనటులు హరిత, జాకీ, పవన్ సాయి, సునంద తదితరులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్)బిగ్‌బాస్ 9 ఫేమ్ తనూజ గతంలో నటించిన 'ముద్దమందారం' సీరియల్‌తో కృష్ణారెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం 'ముత్యమంతా ముగ్గు' సీరియల్ కూడా చేశారు. ప్రస్తుతం 'జానకి పరిణయం' ధారావాహికతోపాటు పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.అయితే 2023లోనే కృష్ణారెడ్డి.. స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ అది రద్దయినట్లు ఉంది. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు) View this post on Instagram A post shared by SunandhaMala Setti_Official👸 (@sunandhamalasetti_official) -
చిన్న సినిమానా?.. సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
సెలబ్రిటీలు స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయా? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఆలోచించి.. ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే వారిపై ట్రోలింగ్ తప్పదు. ముఖ్యంగా సినీ తారలు.. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. వాళ్లకు ఇబ్బంది కలిగించేలా ఒక్క మాట మాట్లాడినా.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ని ఎదుర్కొవాల్సిందే. తాజాగా టాలీవుడ్ నటుడు సప్తగిరి విషయంలో ఇదే జరిగింది. ఆయన మాటలకు ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆయనను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అసలు సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? అసలేం జరిగింది?అందుకే సినిమాలు తగ్గించాకమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన సప్తగిరి.. కొన్నాళ్ల తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అయితే హీరోగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ కమెడియన్‌గా మారాడు. ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గెస్ట్ రోల్ లో అయినా కనిపించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం పురుషః. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తన కెరీర్ గురించి సప్తగిరి మాట్లాడుతూ..'ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయ్యిపోయింది. చేసిన పాత్రలే చేస్తున్నాను. కొత్త కొత్త పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాను. అందుకే డబ్బుకోసం కాకుండా వృత్తిపరంగా సంతృప్తి దొరికే పాత్రలను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రెగ్యులర్ గా కామెడీ పాత్రలే కాకుండా ఎమోషనల్ పండించే పాత్రలు కూడా చేయాలనీ చూస్తున్నాను. ఎప్పుడో ఏదో ఒక డైరెక్టర్ మంచి క్యారెక్టర్ రాస్తారు.. కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోపు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను’ అన్నారు.రాజాసాబ్.. చిన్న సినిమానా?అంతవరకు బాగానే మాట్లాడిన సప్తగిరి.. తన జర్నీ గురించి మరింత వివరిస్తూ అనుకోకుండా రాజాసాబ్‌ని చిన్న సినిమాల లిస్ట్‌లో కలిపేశాడు. కమెడియన్‌గా కూడా వరుస సినిమాలను చేస్తున్నానని చెబుతూ..‘ఈ మధ్యే సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. రకరకాల సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పిన చిన్న సినిమాల లిస్ట్‌లో ది రాజాసాబ్‌ని కూడా కలిపేశాడు. ఇక్కడే సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన తమ అభిమాన హీరో సినిమాను చిన్న చిత్రం అంటావా అంటూ సప్తగిరిపై మండిపడుతున్నారు. అంతేకాదు రాజాసాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘ఈ చిత్రం రూ. 1000 కోట్లు కాదు.. రూ. 2000 కోట్లు వసూలు చేస్తుంది’ అని చెప్పి.. ఇప్పుడేమో చిన్న సినిమా అనడం ఫ్యాన్స్‌ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. అందుకే సప్తగిరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం.. ఫ్లోలో అలా అన్నాడు కానీ.. ప్రభాస్ సినిమాను కించపరిచే ఉద్దేశం సప్తగిరికి లేదని మద్దతు తెలుపుతున్నారు. RajaSaab Chinna Movie na🤯ఈ మధ్య సరస్వతి, #TheRajaSaab, కొక్కరకో.. సినిమాల్లో కనిపించాను. చిన్న స్థాయి సినిమాలు కాబట్టి జనాలకు కనిపించలేదు - సప్తగిరి. pic.twitter.com/ulyCNdx5kx— cinee worldd (@Cinee_Worldd) May 10, 2026 -
'భోగి' కోసం ఎర్రచీరలో 'మందారం'
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్.. త్వరలో 'భోగి'తో రాబోతున్నాడు. విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సంపత్ నంది దర్శకుడు. ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు)ఇప్పటికే హీరోహీరోయిన్లు అయిన శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా మందారం అనే పాత్రలో డింపుల్ హయాతి లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎర్రచీరలో డిఫరెంట్‌గా కనిపించింది. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఓ హీరోయిన్గా చేసినప్పటికీ హిట్ అయితే దక్కలేదు.కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్గా పలు సినిమాలు చేస్తున్న డింపుల్ హయాతికి సరైన సక్సెస్ రావట్లేదు. మరి 'భోగి'లో మందారం పాత్ర అయినా దాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్) -
ఆరు నెలలు నరకం చూశా.. కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేదాన్ని : నటి
తల్లి అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తాజాగా ఆమె ప్రముఖ పాడ్‌కాస్ట్ హోస్ట్ రాజ్ షమానికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భగా పోస్ట్‌పార్టమ్ (ప్రసవం తర్వాత తల్లి శరీరం, మానసిక స్థితిలో వచ్చే మార్పు) గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది.‘పాప పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు నరకం చూశా. నాపై నాకే జాలి చూపించుకోవడం కష్టంగా అనిపించింది. చిన్న చిన్న విషయాలకే ఏడ్చేదాన్ని. నా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. నా మనసులోని భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టింది. ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించిన నేను.. నా కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం మాతృత్వం నేర్పింది. ఈ కష్ట సమయంలో నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా చాలా సపోర్ట్ చేశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు రాత్రి నా దగ్గరకే వచ్చేవాడు. డ్రైవ్‌కి తీసుకెళ్లేవాడు. ఆ చిన్న డ్రైవ్స్ కూడా నాకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగించేవి’ అంటూ కియారా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కియారా, సిద్ధార్థ్లది ప్రేమ వివాహం. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులైలో కుమార్తె జన్మించింది. కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా కియారా సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన టాక్సిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్‌ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan)🥺❤️🫂 @trishtrashers getting emotional during CM Joseph Vijay sir’s speech was truly a heart-touching moment ❤️🥹#trishakrishnan #Trisha #vijay #cmvijay #thalapathy #trishaforever #southqueentrisha #ladysuperstartrisha #wonderingwomen pic.twitter.com/3Ofr1zDl4P— Trisha😻Sushma (@Trishkrish_583) May 10, 2026 -
తల్లిగా ఇంతకంటే గొప్ప కానుక మరొకటి లేదు
ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా భావోద్వేగానికి గురయ్యారు. కుమార్తె అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ నుంచి గ్రాడ్యుయేట్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలానే పలు ఫొటోలని కూడా పంచుకున్నారు. ఈ మదర్స్ డేని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చావు అని కూతురుని తెగ పొగిడేశారు.'నా కూతురు అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మమైన హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డ్‌ని అందుకుని ఈ గౌరవం సాధించిన తొలి భారతీయ విద్యార్థిగా అన్షు నిలిచింది''గ్రాడ్యుయేషన్ కాలంలోనే అన్షు.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ లీడర్ సీఈడబ్ల్యూ & టీ 2026, లడ్డి అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, పలు డీన్స్ లిస్ట్ గౌరవాలు, అలానే ఫౌండర్స్ స్కాలర్ గుర్తింపు లాంటి పురస్కారాలను అందుకుంది. కుమార్తె కష్టపడి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే తల్లికి గొప్ప కానుక మరొకటి లేదు. నా చిన్నారి అన్షు.. ఈ మదర్స్ డేని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన రోజుగా మార్చావు. గర్వంగా ఉంది' అని చెబుతూ రోజా భావోద్వేగానికి గురయ్యారు.This #MothersDay became the most unforgettable one for me ❤️My daughter #AnshuRojaSelvamani graduated with Highest Distinction from @IndianaUniv @IUBloomington with a Bachelor of Science degree in Computer Science Honors.She also brought immense pride to our family and to… https://t.co/6MeWoURQff pic.twitter.com/659SVsmTSX— Roja Selvamani (@RojaSelvamaniRK) May 10, 2026 -
నేను కాదు ఆమే లేడీ సూపర్‌స్టార్ : శ్రీలీల
అనేక మందికి ఫేవరేట్‌గా మారిన నటి శ్రీలీల. అలాంటిది తన ఫేవరేట్ నయనతార అక్క అంటోంది బ్యూటీ. కోలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ తాజాగా ధనుష్‌కు జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నేను వైద్య విద్యను అభ్యసించాను. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అయితే నటిగా మారాను. నేను ఈ రంగంలో సక్సెస్ కావడానికి నా తల్లే కారణం. ఇకపోతే అందరి జీవితాల్లోనూ జయాపజయాలు వస్తుంటాయి. వాటిని అంగీకరించాల్సిందే. నాకు అజయం ఎదురైతే ఒక గంటపాటు ఏడ్చేస్తాను. తర్వాత పనికి రెడీ అవుతాను. ఇప్పుడు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నాను. ఇప్పుడు దక్షిణాది, ఉత్తరాది సినిమా అనే తారతమ్యం లేదు. నన్ను కొందరు లేడీ సూపర్‌స్టార్ అంటున్నారు. దాన్ని నేను అంగీకరించను. నా ఫేవరేట్ నటి నయనతార. ఆమే లేడీ సూపర్‌స్టార్. నయనతార నా రోల్ మోడల్. చైన్నె యువత అంటే నాకు చాలా ఇష్టం. నయనతార మాదిరిగా నేనూ చైన్నెలో పెళ్లి చేసుకుంటానా అనేది తెలియదు. చైన్నెలోని దోస అంటే చాలా ఇష్టం. నేను విమానాల్లో ఎక్కువగా పయనిస్తుంటాను.అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భయంగా ఉంటుంది. విమానం పై నుంచి కిందకి దిగిన తరువాత పైలెట్, ఇతర యూనిట్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలి అని మా అమ్మ చెబుతూనే ఉంటారు. దాన్ని నేను ఇప్పటికీ పాటిస్తున్నానని శ్రీలీల పేర్కొన్నారు. -
జాక్ పాట్ కొట్టేసిన త్రిష.. రూ. 12 కోట్లు ఆఫర్!
ఊహించనివి జరగడమే ఆశ్చర్యం. అలాంటి ప్రచారమే ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అదీ నటి త్రిష గురించి. ఈ సంచలన నటి పేరు ప్రజల్లో ఒక జపంలా మరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిష నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారు. రాజకీయ రంగప్రవేశానికి దారులు తెరుసుకుంటున్నాయి వంటి ఆసక్తికరమైన ప్రచారం జోరుందుకున్న విషయం తెలిసిందే. అయితే తాను సినిమాలకు ఎప్పటికీ దూరం కానని, హీరోయిన్ అవకాశాలు రాకపోయినా, ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో జీవితాంతం నటిస్తూనే ఉంటాను అని ఆమె ఇటీవల తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా మరో క్రేజీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే నటుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి సుదీర్ఘ కాలం తరువాత కలిసి నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థపై ఇన్బన్ ఉదయనిధి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. మరో రెండు నెలలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి త్రిషను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించడానికి ఆమెకు రూ. 12 కోట్లు పారితోషికం అందించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజయం అయితే త్రిష క్రేజ్ మరోసారి మారుమోగడం ఖాయం. కాగా ఇంతకు ముందు నటుడు కమలహాసన్‌కు జంటగా మన్మధన్ అన్బు, తూంగావనం, థక్లైఫ్ చిత్రాల్లో త్రిష నటించారు. అదే విధంగా నటుడు రజనీకాంత్‌తో కలిసి పేట చిత్రంలో నటించారు. ఇప్పుడు వీరిద్దరితో కలిసి నటిస్తే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. -
ప్రభాస్‌తో భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఫ్యాన్స్ పండగే
సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్‌లాంటి మంచి కటౌట్ ఉన్న హీరో విలన్స్‌ను చితక్కొడుతుంటే థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ ఫుల్ జోష్‌తో విజిల్స్ వేస్తారు. ఇలాంటి మాస్ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ప్రభాస్ రెడీ అవుతున్నారట. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రంలో త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు)ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానుందని సమాచారం. ప్రభాస్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట సందీప్ రెడ్డి వంగా. దాదాపు వందమంది ఫైటర్స్ ఈ సీక్వెన్స్‌లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ ఫైట్‌కు సంబంధించిన రిహార్సల్స్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారని తెలిసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది. -
నిబంధనలన్నీ హీరోయిన్లకే!
‘‘బాలీవుడ్లో వివక్ష ఎక్కువ. ఒక సినిమా బడ్జెట్ తగ్గించాలంటే ముందు హీరోయిన్ల పారితోషికం తగ్గిస్తారు. అలాగే లొకేషన్‌కి హీరో రాక ముందే హీరోయిన్ మేకప్ వేసుకుని రెడీగా ఉండాలంటారు. సెట్స్‌లో హీరో ఏది అడిగినా కాదనకుండా సమకూర్చుతారు. గౌరవ మర్యాదల విషయంలోనూ తేడా చూపించేస్తారు. నిబంధనలన్నీ హీరోయిన్లకే ఉంటాయి’’ అని కృతీ సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె నటించిన ‘కాక్టెయిల్ 2’ చిత్రం జూన్ 19న విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కృతీ సనన్... ‘‘బాలీవుడ్లో నేను నెపోటిజమ్ బాధితురాలిని’’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘స్టార్ కిడ్స్ వల్ల బాలీవుడ్లో చాలా అవకాశాలు కోల్పోయాను. ముందు నన్ను హీరోయిన్గా తీసుకుని, ఆ తర్వాత స్టార్ కిడ్స్ కోసం నన్ను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.వారసులతో పోటీ పడి అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ‘మిమి’ సినిమాకి ముందు ఐదేళ్లు నా కెరీర్ ఎంతో కష్టంగా సాగింది. టాలెంట్ ఉండి కూడా అవకాశాల కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో కొంత ఒత్తిడికి లోనై, సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చేదు అనుభవాలు, పరాజయాలు, కష్టాలు అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. కెరీర్లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయి’’ అని పేర్కొన్నారు కృతీ సనన్. -
బోల్డ్ హారర్‌లో...
ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్‌గా తమన్నా కనిపిస్తారని ఆమె కమిట్ అయిన తాజా చిత్రం స్పష్టం చేస్తోంది. ఇంతకీ అది ఏ సినిమా అంటే... బాలీవుడ్లో బోల్డ్ హారర్ మూవీగా పాపులర్ అయిన ‘రాగిణి ఎంఎంఎస్’లోని మూడో భాగం. ఏక్తా కపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్’, ఆ చిత్రం సీక్వెల్ ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి.తొలి భాగంలో కైనాజ్ మోతీవాలా, రెండో భాగంలో సన్నీ లియోన్ లీడ్ రోల్స్ చేశారు. మూడో భాగంలో తమన్నా నటించనున్నారు. ఈ పాత్ర చాలా గ్లామరస్‌గా ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో రొమాన్స్ మోతాదు కూడా ఎక్కువగానే ఉన్న విషయం రెండు భాగాలు చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. మూడో భాగంలో కూడా అలానే ఉంటుందని, మోడ్రన్ అమ్మాయిగా, ఆత్మగా తమన్నా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రంలో ఆయుష్ శర్మ సరసన ఆమె నటిస్తారు. తమన్నాకన్నా ఆయుష్ ఏడాది చిన్న. ఇంకా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్
అశోక్ నిమ్మల నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా 'అరేయ్ ఆపండ్రా'. తల్లాడ సాయి కృష్ణ లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా విడుదల చేశారు.సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ ద్వారా మే 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది.ఈ సమ్మర్లో అందరికీ మంచి కూల్ సినిమా ఇది అవుతుందని ఆశిస్తున్నాను. నవ్విస్తూనే భయపెట్టే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ ఇది. సెన్సార్ సభ్యులు కూడా సినిమాని చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారని నటుడు-దర్శకుడు సాయికృష్ణ చెప్పుకొచ్చాడు. -
పవన్ కల్యాణ్ 'పురుషః' రిలీజ్‌కి రెడీ
పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'పురుషః'. బత్తుల కోటేశ్వరరావు నిర్మించగా వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలు చేశారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు.హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'పురుష:' కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నాడు. ఇక దర్శకుడు వీరు మాట్లాడుతూ .. మళ్లీరావా, జెర్సీ, మసూద సినిమాలకు పనిచేశాను. నేను ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీశాను. వేసవి కానుకగా మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. -
విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్
రీసెంట్ టైంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నటి అషురెడ్డి.. ఇప్పుడు ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని చెబుతూ అతడితో కలిసున్న ఫొటోలని పంచుకుని భావోద్వేగానికి గురైంది. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. నా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్ అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి)అషురెడ్డి స్నేహితుడైన భరత్ కాంత్ కూడా నటుడే. కాకపోతే షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా చేస్తున్నాడు. రీసెంట్గా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతడితో పాటు మరో అబ్బాయి కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అషురెడ్డితో పాటు బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తదితరులు కూడా భరత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు.అషురెడ్డి విషయానికొస్తే కొన్నేళ్లుగా ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ఇవ్వలేదని ఆరోపిస్తూ ధర్మేంద్ర తండ్రి అషుపై హైదరాబాద్ సీసీఎస్‌లో చీటింగ్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఇది విచారణ సాగుతోంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని అషు.. తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించింది. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా అషు, తన కుటుంబంతో పాటు సోమవారం విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
బర్త్ డే బ్యూటీ శ్రీముఖి.. రెడ్ డ్రస్‌లో హారిక
చీరలో మెరిసిపోతున్న బర్త్ డే బ్యూటీ శ్రీముఖిఎర్రని డ్రస్‌లో గ్లామరస్‌గా బిగ్‌బాస్ హారికజిగేలుమనే చీరలో ఒకప్పటి హీరోయిన్ లయలద్దాఖ్ వెళ్లిపోయిన హాట్ బ్యూటీ నందినీ రాయ్బర్త్ డే వీక్.. ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య మేనన్వైట్ టాప్‌తో గ్లామర్ చూపించేస్తూ ఐశ్వర్యా రాజేశ్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి
నటి పలు సినిమాలు చేసినప్పటికీ యాంకర్‌గానే బాగా ఫేమస్ అయిన శ్రీముఖి మరో ఇల్లు కట్టుకుంది. ఆదివారం గృహప్రవేశం చేయగా అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. తమ్ముడితో కలిసి హోమం చేసి కొత్త ఇంట్లో పాలు పొంగించింది.ఆరేళ్ల క్రితం సొంతూరు నిజమాబాద్‌లో ఇల్లు కట్టుకున్న శ్రీముఖి.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు మరో ఇంటిని కూడా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. తన 33వ పుట్టినరోజు సందర్భంగా తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకుని గృహప్రవేశం చేసింది. అయితే శ్రీముఖి- ఈమె తమ్ముడు మాత్రమే ఈ వేడుకలో కనిపించారు.అల్లు అర్జున్ 'జులాయి' సినిమాతో పాటు పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేసిన శ్రీముఖి.. బిగ్‌బాస్ 3వ సీజన్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. కానీ బయటకొచ్చిన తర్వాత పలు ఛానెళ్లలో షోలు చేస్తూ బిజీగానే ఉంది. మధ్యలో ఒకటి రెండు మూవీస్‌లో లీడ్ రోల్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. తెలుగులో సామెత ప్రకారం ఇల్లు అయితే కట్టుకుంది మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి? View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
'నమ్మి డబ్బులిస్తే మోసం చేశారు'.. సంజనా షాకింగ్ కామెంట్స్
సంజనా గల్రానీ.. ఈ పేరు గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో మెరిసింది. ఏకంగా టాప్-5 నిలిచిన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాలను పంచుకుంది.తాజా ఇంటర్వ్యూలో సంజనా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. నాకు తెలిసిన వాళ్లను నమ్మి దాదాపు రెండు కోట్లు మోసపోయానని తెలిపింది. నన్ను మోసం చేసిన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద నిర్మాత కూడా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటికీ కూడా ఆ చెక్ బౌన్స్ కేసులు ఇంకా నడుస్తున్నాయని సంజనా గల్రానీ తెలిపింది. ఇప్పుడు ఎవరైనా నన్ను డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వట్లేదని వెల్లడించింది. అయితే తనకు డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. -
చిరుని కలిసిన మలయాళ డైరెక్టర్.. రీమేక్‌పై క్లారిటీ
2017లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నుంచి ఇప్పటివరకు 7 సినిమాలు చేస్తే అందులో మూడు రీమేక్‌లే. కానీ చిరుపై రీమేక్ హీరో ముద్ర చాలా గట్టిగా పడిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్'కి బదులు ఓ రీమేక్ చేస్తారనే రూమర్స్ వచ్చాయి గానీ దాన్ని పక్కనబెట్టేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి రీమేక్స్ చేయట్లేదు. కానీ మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి.. చిరంజీవి ఇంటికొచ్చి కలవడంతో మళ్లీ రీమేక్ సందేహాలు వచ్చాయి.(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి)'తుడురమ్' సినిమాతో హిట్ కొట్టిన మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి.. హైదరాబాద్ వచ్చి చిరుని కలిశాడు. అయితే ఎక్కడ రీమేక్ రూమర్స్ వస్తాయోనని ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. 'తుడురమ్' రీమేక్ కోసం తాము కలవలేదని చెప్పాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.'ఈ భేటీకి 'తుడురమ్' రీమేక్‌కి ఎలాంటి సంబంధం లేదు. చిరంజీవి టీమ్ నుంచి స్వయంగా కాల్ వచ్చింది. చిరంజీవి సర్ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నారు అని చెప్పడంతో విమానం ఎక్కేసి ఆయన ఇంటికి వచ్చేశా. ఆయనతో సినిమా, నా వ్యక్తిగత జీవితం తదితర విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను తీసిన ప్రతి సినిమాని ఎంతో శ్రద్ధగా చూసి, అందులోని ప్రతి సీన్ గురించి వివరించి చెబుతుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఎంతటి సూపర్‌స్టార్ అయినా సరే సినిమాలని ఇప్పటికీ చిన్నపిల్లల్లా ఆసక్తితో చూస్తూ అదే ఉత్సాహంతో చర్చించడం చిరంజీవిగారి ప్రత్యేకత' అని తరుణ్ మూర్తి రాసుకొచ్చాడు.ఇది తన జీవితంలోనే అత్యంత మధురమైన, ఉత్సాహభరితమైన సందర్భాల్లో ఒకటని దర్శకుడు తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే చిరంజీవిని ఈ మలయాళ డైరెక్టర్ కలవడం గురించి సోషల్ మీడియాలో అప్పుడే డిస్కషన్స్ మొదలుపెట్టేశారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ ఉండొచ్చని అనుకుంటున్నారు.ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చిరంజీవి.. తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఎవరితో చేస్తారనేది ప్రస్తుతానికైతే ఫిక్స్ కాలేదు. బహుశా ఆ ఛాన్స్.. మలయాళ డైరెక్టర్ తరుణ్ మూర్తి అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Tharun Moorthy (@tharun_moorthy) -
రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి
ప్రభాస్ మంచితనం గురించి, దానగుణం గురించి అందరికి తెలిసిందే. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభాస్ కనబర్చే దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతేకాదు ఆయన చుట్టు ఉన్నవాళ్ల కోసం కూడా ఆయన ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటాడని ప్రభాస్‌ని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. ఇక ఆయనతో కలిసి నటించిన వారైతే ఆయన పెట్టే భోజనం గురించి కచ్చితంగా మాట్లాడతారు. షూటింగ్ సమయంలో అవకాశం ఉన్నప్పుడల్లా అందరికి భోజనాలు పెట్టించడం ప్రభాస్‌కి చాలా ఇష్టం. అందుకే పలువురు స్టార్స్ ప్రభాస్ భోజనం గురించి చెబుతూ.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు. అయితే ప్రభాస్ చేసే సహాయాల్లో చాలా వరకు బయటకు తెలియవని చెబుతోంది నటి సంజన గల్రానీ. ఈ బ్యూటీ ‘బుజ్జిగాడు’లో ప్రభాస్‌కి మరదలుగా నటించింది. తాజాగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న సంజనా.. ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.‘బాహుబలి తర్వాత ప్రభాస్ చాలా ఎదిగిపోయాడు. ఆయనను చూస్తే ఏ అమ్మాయి అయినా.. అలా ఉండిపోతుంది. ఎత్తు, పర్సనాలిటీ అలా ఉంటుంది మరి. మనిషి మాత్రమే కాదు ఆయన మనసు కూడా చాలా మంచింది. తన జిమ్ ట్రైనర్‌కి రేంజ్ రోవర్ కారునే గిఫ్ట్‌గా ఇచ్చాడని విన్నాం. ఇలా ఎవరు చేస్తారు? బ్యాంక్ అకౌంట్లో అందరికీ డబ్బులు ఉంటాయి. కానీ ఎవరికైనా ఎలాంటి ఫలితం ఆశించకుండా సాయం చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి. అది ప్రభాస్‌లో ఉంది. ఆయనది చాలా పెద్ద మనసు. ఆయన చేసిన సహాయాల్లో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియకుండా చాలా మందికి సహాయం చేశాడు. నటుడిగా చాలా కష్టపడతాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. ఆయన ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఆయనతో టచ్‌లో లేను. కానీ స్పిరిట్ కోసం చాలా ఎదురు చూస్తున్నా. ఫస్ట్‌డే ఫస్ట్ షోకి ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తా’ అని సంజనా చెప్పుకొచ్చింది. కాగా, 2020లో తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ప్రభాస్ రేంజ్ రోవర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆయన సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’. ఇందులో ప్రభాస్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడం వెనుక లక్ష్మణ్ శ్రమ ఉంది. అందుకే ప్రభాస్ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
'కనిపించే దైవం కూడా మాతృమూర్తి తర్వాతే'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!
ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి ప్రస్తావించారు. అమ్మ… మన మొదటి గురువు.. మన మొదటి ధైర్యం.. కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే అంటూ అమ్మపై ప్రేమ చాటుకున్నారు. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మదేనన్నారు. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను షేర్ చేశారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీతో జతకట్టారు. వీరిద్దరు కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య మూవీ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో కలిసి పనిచేయనున్నారు. ఈ మూవీని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ పెడతారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అమ్మ…మన మొదటి గురువు,మన మొదటి ధైర్యం,కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026 -
ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ కమెడియన్.. ఫైమా స్పెషల్ విషెస్
ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రష్మిక, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో టాలీవుడ్ కమెడియన్, పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకున్నారు. తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. పలు ఆల్బమ్ సాంగ్స్‌లో చేసిన వంశిత అనే అమ్మాయిని పెళ్లాడారు. కాగా.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ప్రవీణ్ విషయాకొనిస్తే పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో ఫైమాతో కలిసి ప్రవీణ్ ఎక్కువగా కనిపించారు. వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు. తాజాగా ఫైమా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి రాలేకపోయినా వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పింది. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
సీఎంగా విజయ్.. సందడి మొత్తం త్రిషదే
ఎట్టకేలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారరం చేశాడు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేడుకైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరికంటే స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం త్రిష నిలిచింది.పద్దతిగా చీరలో.. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. అనుకున్నట్లే కాస్త ముందుగానే త్రిష తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది. పద్దతిగా చీరకట్టులో త్రిష వచ్చిన త్రిష.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను నవ్వుతూ పలకరించింది. అప్పటికే వేదిక దగ్గరకు వచ్చిన విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ తల్లి..త్రిషను హత్తుకొని పలకరించింది. స్టేజ్ ముందు ఏర్పాటు చేసిన మొదటి వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రులతో కలిసి త్రిష కూర్చుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో త్రిష ముఖం సంతోషంతో మరింత మెరిసిపోయింది.ಗ್ಯಾಂಡ್ ಲುಕ್ ನಲ್ಲಿ @actorvijay ಅವರ ಪ್ರಮಾಣವಚನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನಟಿ ತ್ರಿಷಾ#Trisha #Oath #Vijay #tamilnaduelectionresults2026 pic.twitter.com/jySoXvqb3d— Anand Hunashal (@ana_hunashal) May 10, 2026త్వరలోనే పెళ్లి?విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం ఆ విషయాన్ని ఇప్పటివరకు అధికారింగా ప్రకటించలేదు. కానీ విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ.. ఓ నటితో తన భర్త రిలేషన్లో ఉన్నారని ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు బయటకు వచ్చింది. సంగీత ఆరోపణలను ఇద్దరూ స్పందించకపోవడం.. పైగా ఓ ఫంక్షన్‌కి కలిసి వెళ్లడంతో పరోక్షంగా రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాడు. ఇక త్వరలోనే త్రిషను పెళ్లి చేసుకొని తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని విజయ్ భావిస్తున్నాడట. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టి పెట్టి.. అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి వీరిద్దరు వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/VmvDUqIjIq— ANI (@ANI) May 10, 2026 -
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్యా రెడ్డిని పెళ్లాడారు. తిరుమలలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి కావ్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయేనని మనందరికీ తెలుసు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ అని తెలుస్తోంది. అంతకుమించి ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియదు. కానీ తాజాగా కావ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.బిజినెస్‌తో రూ.90 లక్షలు..ఆమె బిజినెస్ ద్వారానే నెలకు ఏకంగా రూ.90 లక్షలు రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. అరటి మొక్కల నుంచి వచ్చే నారతో శారీలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారట. వీటికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ద్వారా కావ్య రెడ్డి నెలకు దాదాపు రూ.90 లక్షలు సంపాదిస్తున్నారని లేటేస్ట్ టాక్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మార్చిలో కావ్యాతో నిశ్చితార్థం చేసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో సింపుల్‌గా పెళ్లి పీటలెక్కారు. -
హైదరాబాద్‌లో జోరుగా హుషారుగా...
ఉదయం షూటింగ్‌కి వెళ్లడం... రాత్రికి ఇంటికి చేరుకోవడం... ఇలా లోకల్లో షూటింగ్ చేసినప్పుడు స్టార్స్ ఇంటిని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు స్టార్స్ అలా ఇంటిని మిస్ కాకుండా హైదరాబాద్‌లో జోరుగా హుషారుగా షూట్‌తో బిజీగా ఉంటున్నారు. ఆ స్టార్స్ ఏయే సినిమాల షూట్లో ఉన్నారో తెలుసుకుందాం.గండిపేటలో కింగ్తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన కెరీర్లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున ఫిల్మ్ జర్నీలో ఓ మైల్స్టోన్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తన అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నాగార్జునతో పాటు నటి టబు పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. –టబు కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే విధంగా ‘సిసింద్రి’ సినిమాలోనూ వీరిద్దరూ ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కింగ్ 100’ మూవీ కోసం వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరి రీ యూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున కెరీర్లో ఓ ల్యాండ్‌మార్క్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్ గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట ఆయన. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2027 జనవరికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జన్వాడలో...‘వీర సింహారెడ్డి’ సినిమా తర్వాత బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ముంబయ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ఎంటర్టైనర్గా ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో ‘గుంటూరు కారం’ మూవీ సెట్లో జరుగుతోందని తెలిసింది.బాలకృష్ణతో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట గోపీచంద్ మలినేని. ఈ మూవీలో హీరోయిన్గా తొలుత నయనతార పేరు వినిపించింది. అయితే ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి... వీరిద్దరిలో ఎవరు ఫిక్స్ అవుతారు? లేదంటే మరో హీరోయిన్ ఖరారు అవుతారా? అనేది వేచి చూడలి. ఇదిలా ఉంటే... ‘ఎన్బీకే 111’లో ఓ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ చిందేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటని చిత్రీకరించనున్నారట మేకర్స్.అన్నపూర్ణలో ఆదర్శ కుటుంబం‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) సినిమాతో తన కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు వెంకటేశ్. అంతేకాదు... ఈ మూవీ ద్వారా రూ. 300కోట్ల వసూళ్ల క్లబ్లో చేరి, సరికొత్త రికార్డును సృష్టించారాయన. ఈ చిత్రం తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకటేశ్ ఇమేజ్‌కి తగ్గ అందమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారట త్రివిక్రమ్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మార్క్ కామెడీతో పాటు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించిన ఓ హై ఓల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. వెంకటేశ్ హీరోగా నటించిన పలు హిట్ సినిమాలకు మాటలు అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన హీరోగా తన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... వెంకటేశ్–కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా కీర్తీ సురేష్ నటిస్తారు. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో రూపొందనున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. గండిపేటలో వారణాసిమహేశ్బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. మహేశ్ హీరోగా నటిస్తున్న 29వ సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ఆయన గెటప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ఎపిక్ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు.‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 120 దేశాల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఆర్ఎఫ్సీలో... ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ చేస్తున్న ఆయన మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో సమాంతరంగా పాల్గొంటున్నారాయన. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్న్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారట. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.పీరియాడికల్ యాక్షన్‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.పీరియాడికల్ యాక్షన్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర తారాగణంపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. కొంత టాకీ పార్టుతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా ప్రధాన కథకు ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని, ప్రధాన కథాంశం 1969 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అంతేకాదు... ముఖ్యంగా కోల్కత్తా ప్రస్తావన ఉంటుందట.ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో టు షేడ్స్‌లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఓ లుక్‌లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్‌లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిట. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలో,్ల అటు ప్రేక్షకుల్లో బజ్ నెలకొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానుంది. అజీజ్‌నగర్‌లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంకల్ప్ రెడ్డి. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘భరత వర్ష’.గోపీచంద్ ఈ మూవీలో యోధుడి పాత్ర కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజెన్న్స్ అన్నీ కలిసి ఈ పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చేస్తాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. టెక్నికల్‌గా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ నటిస్తున్నారు. ఇన్నోవేటివ్ కథనాలు, హై టెక్నికాల్టీకి పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి... భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా తెరపై ఆవిష్కరించబోతున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘గోపీచంద్ 34’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ముచ్చింతల్‌లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘ఆయా షేర్...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ డ్రామా శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శగుతోంది.ఈ షెడ్యూల్లో శర్వానంద్‌పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సంపత్ నంది. ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ పాన్–ఇండియా మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్న్స్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అద్భుతమై సంగీతం అందించారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. శంకర్‌పల్లిలో... హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ 2023 జూన్ 28న విడుదలై థియేటర్లలో నవ్వులు కురిపించడంతో పాటు హిట్‌గా నిలిచింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హిలేరియస్ కామెడీ డ్రామా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమా ద్వారా ‘సామజవరగమన’ చిత్రాన్ని మించిన నవ్వులు పంచాలనే బలమైన ఆలోచనతో తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాలో ‘మోగ్లీ’ మూవీ ఫేమ్ సాక్షీ మదోల్కర్ కథానాయికగా నటించనున్నారని టాక్. ‘వెన్నెల’, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
వెండితెరపై వెలిగిన అమ్మ
అమ్మ అనే పదం సృష్టిలో అత్యంత మధురమైనది. నవ మాసాలు మోసి, కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తపించే మాతృమూర్తి త్యాగానికి వెల కట్టలేము. భారతీయ సంస్కృతి మాతృదేవో భవ అని అమ్మకు పవిత్ర స్థానం ఇచ్చింది. సినిమాలలో కథ ఏదైనప్పటికీ ‘అమ్మ’ పాత్రలకు అత్యున్నత స్థానం ఉందని ఆయా చిత్రాలు నిరూపించాయి. తల్లే ప్రధాన భూమిక పోషించిన చిత్రాలు నాటి నుండి నేటి వరకు చూస్తే సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ తీసిన ప్రతి చిత్రం అమ్మ ఔన్నత్యం, ప్రేమ, త్యాగాల గురించి చెప్పాయి. ΄పౌరాణిక, జానపద, సాంఘికమనే భేదం లేకుండా అమ్మకు సంబంధించిన సినిమాలు రావడం విశేషం.పురాణాల్లో మాతృభక్తి ‘భూకైలాస్’ (1958)లో తల్లిప్రేమ కోసం శివుని మెప్పించి ఆత్మలింగం తెస్తాడు రావణుడు. ‘శ్రీకృష్ణ పాండవీయం’ (1966)లో ద్రౌపదిని గెలుచుకుని అర్జునుడు ఇంటికి రాగానే తల్లి కుంతి ఆజ్ఞ మేరకు ద్రౌపదిని పెళ్లాడతారు పాండవులు. తల్లి మాటకు గల విలువను ఈ సన్నివేశం నిరూపిస్తుంది. ‘భక్తప్రహ్లాద’ (1967)లో భర్త హిరణ్య కశిపుని క్రూరత్వానికి, కొడుకు ప్రహ్లాదుని ప్రాణ సంకటస్థితికి మధ్య నలిగి΄ోయే తల్లి లీలావతి బిడ్డను రక్షించుకోవడానికి పడే తపనను, మనోవేదనను అద్భుతంగా చూపించారు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ ఏమాత్రం తక్కువ కాదని ‘యశోద కృష్ణ’ (1975) చెప్పింది.కుటుంబానికి వెన్నెముక అమ్మ‘కన్నతల్లి’ (1953)లో కొడుకుల సుఖం కోసం తల్లి ఈ లోకం నుంచే దూరమవుతుంది. ‘తల్లి ప్రేమ’ (1968)లో కేశవరావు తమ్ముడి భార్య పురిటిలోనే బిడ్డను కోల్పోతుంది. అప్పుడే మగబిడ్డకు జన్మనిచ్చిన కేశవరావు భార్య తోటికోడలు స్పృహలోకి రాకముందే తన బిడ్డను ఇస్తుంది. తల్లి త్యాగాన్ని చూపించిన చిత్రమిది. సావిత్రి స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ (1969) ఒక ఆదర్శవంతమైన గృహిణి తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూపిస్తుంది. ‘అమ్మ కోసం’ (1970)లో తన కొడు కుల మధ్య విభేదాలు తలెత్తినపుడు ఆ తల్లి పడే మానసిక సంఘర్షణను చూపించారు. రేఖ రెండో హీరోయిన్గా నటించిన తొలి తెలుగు చిత్రమిదే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ వైపు రాలేదు.త్యాగానికి మరో పేరు అమ్మ‘అమ్మ మాట’ (1972)లో తన తండ్రిని జైలుకు పంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలనుకునే కొడుకు తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పగను అణచుకుంటాడు. ‘బంగారు తల్లి’ (1972)లో భర్త పోయాక కొడుకులను ప్రయోజకులను చేయడం కోసం తల్లి పడే తపన, శ్రమ, హృద్యం! ‘కన్నతల్లి (1973) కన్నబిడ్డ ఎక్కడ ఉన్నా రప్పించుకొనే శక్తి మాతృప్రేమకే ఉందని నిరూపించింది.ఆధునిక చిత్రాల్లో అమ్మ ఔన్నత్యం‘అమ్మ రాజీనామా’ (1991)లో తల్లి రాత్రింబవళ్లు భర్త, పిల్లల కోసం శ్రమిస్తుంది. కానీ పిల్లలు ఆమెను పనిమనిషిలా చూస్తూ, సేవలను గుర్తించరు. దాంతో ఆమె తన బాధ్యతలకు ‘రాజీనామా’ చేసి, తన విలువ తెలిసొచ్చేలా చేస్తుంది. ‘మాతృదేవో భవ’ (1993)లో కేన్సర్ వ్యాధితో తాను త్వరలో చని΄ోతానని తెలిసిన ఒక తల్లి, అనాథలు కాబోతున్న తన నలుగురు బిడ్డలను వేర్వేరు ఇళ్లకు దత్తత ఇస్తూ, పడిన క్షోభ కరుణరసాత్మకం. ‘యమలీల’ (1994)లో యముడు సైతం తల్లి ప్రేమకు కరిగి, ఒక తల్లి అంత్యకాలం ముగిసినప్పటికీ దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు.కొత్త మిలీనియంలో కొత్త అమ్మ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ (2003)లో తల్లీకొడుకుల మధ్య బంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ‘ఛత్రపతి’ (2005), ‘నాని’ (2004) చిత్రాలు తల్లి ప్రేమకు ఉదాహరణలు. ‘బాహుబలి’ (2015)లో శివగామి తాను నీళ్లలో మునిగి΄ోతున్నా, చేయి పైకెత్తి బిడ్డను కాపాడే దృశ్యం మాతృశక్తికి నిదర్శనం. ‘బిచ్చగాడు’ (2016)లో భర్త మరణానంతరం ఒంటరిగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, కొడుకును ప్రయోజకుడిని చేసిన తల్లి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ‘హాయ్ నాన్న’ (2023) చిత్రం ఒక తండ్రి ఎంత ప్రేమను పంచినా, తల్లి ప్రేమే ఒక బిడ్డకు అసలైన బలమని నిరూపిస్తుంది.అమ్మను మించిన దైవం లేదునిజానికి తల్లి పాత్ర లేకుండా ఏ కథా ఉండదు, ఏ చిత్రమూ ఉండదు. ‘కుపుత్రో జాయేత్... క్వచిదపి కుమాతా న భవతి’ అన్నట్లు లోకంలో చెడ్డ కొడుకు లుంటారేమో గానీ, చెడ్డ తల్లి ఎక్కడా ఉండదని ఆది శంకరుల వారి మాట! ‘అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అంతటా ఉండలేక తల్లులను సృష్టించాడు’ అని ప్రసిద్ధ రచయిత రుడ్ యార్డ్ కిప్లింగ్ చెప్పిన మాట అక్షర సత్యం. ఈ ఉదాత్త భావనతోనే మన సిన్మాలు అమ్మను వెండితెరపై వెన్నెల సంతకంలా చిత్రించి, అమ్మకు నిజమైన నీరాజనం అందించాయి.– డాక్టర్ వి.వి. రామారావు (రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత) -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్‌లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్‌కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్‌కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్‌ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్‌కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్‌పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
హాలీవుడ్ మేకింగ్‌తో తెలుగు సినిమా 'ది మానిటి.ఇన్'
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన 'ది మానిటి.ఇన్' చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు.. వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా, టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమాక్స్ 8K ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు 'మానిటీ' (MANITY) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. -
హీట్ పెంచిన పూజా హెగ్డే.. తమన్నా కూడా తగ్గట్లే!
గ్లామర్ హీట్ పెంచేసిన పూజా హెగ్డేబక్కచిక్కిపోయిన హీరోయిన్ సమంతఒంపుసొంపులు చూపిస్తున్న తమన్నామెరుపుతీగలా మెరిసిపోతున్న రాశీ సింగ్పట్టుచీరలో నిండుగా మృణాల్ ఠాకుర్ఎర్రగులాబీ అంత అందంగా కృతిశెట్టి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
రాయవలస రాధిక అనిపించుకుంటాను
కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి నిర్మాతగా, తల్లి డైరెక్టర్‌గా 'రాయవలస' సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్‌కి యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్... ఇలా అన్ని విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని హీరో ఆకాశ్ జగన్నాథ్ అన్నారు. కార్తీక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రాధిక జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ .జె నిర్మించిన చిత్రం 'రాయవలస'. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆకాశ్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మరో అతిథిగా విచ్చేసిన కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. తల్లి డైరెక్షన్, తండ్రి ప్రొడక్షన్, కొడుకు హీరోగా చేయడం విశేషం. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని ఈ పదిహేనేళ్లల్లో ఏ ఎన్నారైలోనూ చూడలేదు. వాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్ముతున్నానని అన్నారు.నా కలను తమ కలగా మార్చుకుని, నాతో సినిమా చేసిన మా అమ్మానాన్నకు థ్యాంక్స్. నిజంగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నానని కార్తీక్ చెప్పారు. ఈ సినిమాకి మంచి కథ ఇచ్చిన రాఖీకి థ్యాంక్స్. కార్తీక్‌కి చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. కథ నచ్చి, నా భర్త ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో 'రాయవలస' రాధికగా గుర్తింపు తెచ్చుకుంటాననే నమ్మకం ఉందని రాధిక జయంతి అన్నారు. పదేళ్ల క్రితమే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాం. ఇప్పుడు సినిమాతో వస్తున్నామని గోపీకృష్ణ .జె అన్నారు. -
నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి
ధర్మేంద్ర అనే ఎన్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుందని చీటింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి.. నిన్న(మే 08) వేలిక ఉంగరం, మరో వ్యక్తి చేతిలో చేయి వేసి ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడో సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు స్వయంగా అషురెడ్డినే సమాధానమిచ్చింది. మరిన్ని ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన చిరు)బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత పలు చిత్రాల్లో ఒకటి అరా పాత్రలు చేసిన అషురెడ్డి.. వీటి కంటే గ్లామరస్ ఫొటోషూట్స్తోనే ఫేమ్ తెచ్చుకుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన రెండు ఇంటర్వ్యూలు.. ఈమెపై చాలామంది విమర్శలు చేసేందుకు కారణమయ్యాయి. ఇవన్నీ అలా ఉండగానే ఈమె చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆ విషయం కాస్త వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని ఈమె తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు.ప్రస్తుతానికైతే చీటింగ్ కేసు విషయమై అషురెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సోమవారం విచారణకు హాజరవ్వాలని హైదరాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే నిశ్చితార్థం అనుకునేలా కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో అంతా నిజమేనని అనుకున్నారు. కానీ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే సిరీస్ షూటింగ్ కోసం తీసుకున్న ఫొటోలు ఇవని తేలింది. సదరు షూటింగ్ ఫొటోలు, వీడియో పోస్ట్ చేసి అషురెడ్డి.. మీరు చూసేదంతా, వినేదంతా నిజం కాదు అని క్యాప్షన్ రాసుకొచ్చింది. గత ఫొటోల్లో అషురెడ్డితో కనిపించిన చెయ్యి మరెవరిదో కాదు బిగ్‌బాస్ 8 విజేత నిఖిల్ మళయక్కల్‌ది. అదన్నమాట సంగతి.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
విషాదం.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం. సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని చెప్పిన నిర్మాతల మండలి సంతాపం తెలియజేసింది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: నేను చనిపోలేదు బతికే ఉన్నాను: 'యానిమల్' నటుడు)ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ 'జగపతి' సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా తొలుత పనిచేసిన కాకర్ల కృష్ణ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. ఆ అనుభవంతోనే 1974లో కృష్ణ, అంజలీదేవీ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో నిర్మాతగా మారారు. తర్వాత ఏడంతస్తుల మేడ, ఊరంతా సంక్రాంతి, రాగదీపం తదితర మూవీస్ తీశారు.ఈయన నిర్మించిన 'ఇంటింటి కథ' విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్వస వేడుకులు కూడా చేశారు. తర్వాత పలు ఇంటర్వ్యూల్లోనూ తన అనుభవాల్ని పంచుకున్నారు. ఇప్పడు వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ట్వీట్‌కి పూనమ్ కౌర్ కౌంటర్) -
పవన్ కల్యాణ్ ట్వీట్‌కి పూనమ్ కౌర్ కౌంటర్
ఒమన్‌లో ఇబ్బందులు పడ్డ మహిళను రక్షించినట్లు పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. సోషల్ మీడియాలో కనిపించే హంగులను నమ్మొద్దని, ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికే అంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు ముందుగా సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చి చూపించాలంటూ పవన్ కల్యాణ్‌కి చురకలు అంటించారు. ఒమన్‌లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చామంటూ పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.‘అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్, ఒమన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నుండి తనను రక్షించాలని, భారతదేశానికి తిరిగి వచ్చేలా సహాయం చేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ఒక హృదయపూర్వక వీడియోను పంచుకున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే, ఆమె క్షేమంగా తిరిగి రావడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరాను. వారు వెంటనే స్పందించారు. ఆమెను సురక్షితంగా మన మాతృభూమికి చేర్చడంలో సహకరించిన భారత రాయబార కార్యాలయ అధికారులు, ఒమన్ అధికారులకు కూడా నా ధన్యవాదాలు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ పవన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.ఈ ట్వీట్‌పై పూనమ్ ఇలా స్పందించారు. ‘సోషల్ మీడియాలో చెప్పిన మాటల్లో దేన్నీ నమ్మకండి. సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ విజువల్ హంగులు కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే. ఒకవేళ నిజంగానే సహాయం చేస్తే మంచిదే' అని పూనమ్ కౌర్ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై పూనమ్ ఇలా డైరెక్ట్ ఎటాక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు నెటిజన్స్ ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. Don’t believe in anything spoken just on social media - a promise given to sugali Preeti’s mother needs to be fulfilled and much more - these visual spectacles are just to divert .good if done .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 9, 2026 -
రౌడీ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేశ్.. విజయ్ బర్త్‌డే పోస్టర్!
విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల్లో రౌడీ జనార్దన్ కూడా ఒకటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విజయ్ బర్త్‌డే సందర్భంగా నేడు(మే 9) మరో కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపించిన విజయ్.. కొత్త పోస్టర్ లవ్లీగా కనిపించాడు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అందులో విజయ్ వర్షంలో తడుస్తూ, చేతిలో తుపాకీ పట్టుకొని కూర్చొని ఉండగా.. అతని గుండెలపై ఒక అమ్మాయి కాలు పెట్టినట్లు ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇందులో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. తొలిసారి తూర్పుగోదావరి యాసలో విజయ్ మాట్లాడబోతున్నాడు. 80వ దశకం నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. “The soul” of ROWDY JANARDHANA. A man who fights the world…but surrenders only to love ❤️Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/8rQYuafGIM— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2026 -
ధనుష్ కొత్త సినిమా.. భారీ ఆలయ సెట్!
ధనుష్ హీరోగా నటించిన కర చిత్రం ఇటీవలే విడుదలై ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఆయన తన 55వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలకపాత్రను పోషిస్తున్నారు. అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని, ఎళిల్ అరసు చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో ధనుష్‌పై ఓపెనింగ్ సాంగ్ ఉంటుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన యూనిట్ సభ్యులు తాజాగా షూటింగ్ వేగాన్ని పెంచినట్లు సమాచారం.చిత్త షూటింగ్‌ను చైన్నె చెంగల్పట్టు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకంగా నిలిచే ఒక ఆలయాన్ని చైన్నె సమీపంలోని గ్రామంలో బ్రహ్మాండంగా సెట్ వేసి షూటింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఈ సెట్లో జరగనున్న షూటింగ్లో ధనుష్ పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్లో ధనుష్, శ్రీలీలపై ఒక పాటను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ధనుష్ ఈ చిత్రాన్ని జూలై రెండవ వారానికంతా పూర్తిచేసి తను తన తర్వాత తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో నటించనున్న షూటింగ్‌కు సిద్ధమవుతారని సమాచారం. -
ఈ సినిమాలో పాటతో పాటు ఫైట్ కూడా చేశా: రాజేంద్రప్రసాద్
కామెడీ సినిమాలకు ఎప్పటికి ఆదరణ ఉంటుంది . టైటిల్ లోనే వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ కథాంశం తో విడుదలకు సిద్ధం అయిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక ’. నట కిరీటి రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాకి రాజ్ పవన్ , వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలుగా వ్యవహరించగా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ సినిమా లోని ’సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట ’ అనే రెట్రో స్టైల్ లో ఉన్న పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుంది . ఈ సందర్బంగా సినిమా యూనిట్ మీడియా తో పాంచాలి పంచభర్తృక సినిమా విశేషాలని పంచుకున్నారు .రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలం లో నాకు ఇలాంటి పాత్ర రావడం చాల అరుదు , ఈ సినిమాలో పాట , ఫైట్ లతో మళ్ళీ మీ అప్పటి రాజేంద్రప్రసాద్ ని చూస్తారు’ అన్నారు. దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..‘బాబీ అందించిన బలమైన కథ చెప్పడానికి కామెడీ ని ఎంచుకున్నాను , రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్ , టీం వర్క్ తో అది సాధ్యం అయింది , ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక. ఈ సినిమాలో డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయి , ఈ సినిమా నిర్మాణం లో సహకరించిన నిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఈ సినిమాలో మొదటి సారి హీరో పాత్రలో కనిపించబోతున్న రాప్ సెన్షేషన్ రోల్ రైడా మాట్లాడుతూ ‘సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు , ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా ’ అని తెలిపారు .‘ఆరోగ్యవంతమైన కామెడీ తెలుగు ప్రేక్షకులు చూసి చాల రోజులైంది , ఇంత మంచి కామెడీ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్ లో నటించడం మాకు సవాలే ’అని మరో హీరోగా నటించిన జెమినీ సురేష్ అన్నారు. -
అర్జున్ రెడ్డి టు అర్జునుడు.. క్రేజ్ అంటే విజయ్‌దే!
సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. స్టార్ హీరో అయినా సరే ఒకటి రెండు ఫ్లాపులు వస్తే.. ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుంది. కానీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఇది జరగలేదు. జయాపజయాలకు అతీతంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎవరూ కదిలించలేని, శంకించలేని స్థాయికి చేరుకున్నట్లు ఆయన లైనప్ చూస్తే తెలుస్తోంది. రౌడీ జనార్థన, రణబాలి, శౌర్యువ్, వైరా బ్యానర్ కొత్త సినిమా.. ఈ మూడు చిత్రాలు ఏమాత్రం మారని విజయ్ స్టార్ డమ్, రేంజ్ ను చూపిస్తున్నాయి. స్టార్ గా తను ఎదగడమే కాదు తన ఆకర్షణతో తెలుగు సినిమాను కూడా మరింత ఎత్తుకి తీసుకెళ్తున్నాడు విజయ్.నిర్మాతలు విజయ్ స్టార్ డమ్ ను, థియేటర్ పుల్లింగ్ క్రేజ్ ను, ఆయన స్టామినాను నమ్ముతున్నారు. దర్శకులు తాము ఊహించుకున్న పాత్రలను విజయ్ సమర్థవంతంగా పోషించగలడని, ఆ పాత్రలకు లైఫ్ ఇవ్వగలడని విశ్వసిస్తున్నారు. ఫలితంగానే ఇంత వెర్సటైల్, భారీ మూవీస్ ఆయనతో అనౌన్స్ చేస్తున్నారు. ఒక సినిమాను స్క్రిప్ట్ స్థాయిలోనే ఓన్ చేసుకుని, ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్ తత్వం, ప్యాషన్ మేకర్స్ కు ఎనలేని నమ్మకాన్ని కలిగిస్తుంటాయి.విజయ్ కెరీర్ ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మూవీ లవర్స్ కు ఆయన ఫిల్మోగ్రఫీలో 90 పర్సెంట్ ఫేవరేట్ మూవీస్ ఉంటాయి. అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా ఆడియెన్స్ ఆదరణ, ప్రేమ పొందడం విజయ్ ప్రత్యేకత.పెళ్లి చూపులు మూవీ విజయ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఆయన టాక్ ఆఫ్ ది పాన్ ఇండియా అయ్యారు. ఆయన పర్ ఫార్మెన్స్ గురించి బాలీవుడ్ స్టార్స్ స్పందించారు. తమ ఫేవరేట్ యాక్టర్ అంటూ ఓపెన్ గా చెప్పుకున్నారు. విజయ్ లోని ఫైర్, డెడికేషన్, సడలని ఏకాగ్రత ఇవే ఆయనను స్టార్ గా నిలబెట్టాయి. టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది.ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. కల్కి చిత్రంలో అర్జునుడిగా మెరిశారు విజయ్ దేవరకొండ. ఆయనది అతిథి పాత్రైనా ఆ క్యారెక్టర్ గ్లింప్స్, స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యూచర్ లో ఎవరైనా మేకర్ మహాభారతంపై సినిమా చేస్తే అర్జునుడిగా విజయ్ దేవరకొండ పర్పెక్ట్ అనే ప్రశంసలు దక్కాయి. కింగ్డమ్ సినిమా విజయ్ ని కొత్తగా తెరపై ఆవిష్కరించింది.కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తారు విజయ్. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు.ఏ పరిస్థితిలోనైనా తనకు అండగా నిలబడి ప్రోత్సహించే అభిమానులంటే విజయ్ కు ప్రాణం. తనను ప్రేమించే వాళ్ల గురించి సోషల్ మీడియా ద్వారా దృష్టికి వస్తే తప్పకుండా వాళ్లను కలుస్తారు. ఇటీవల ఓ పాప తనను విజయ్ వివాహానికి పిలవలేదని పోస్ట్ పెడితే, ఇంటికి పిలిచి దగ్గరుండి భోజనం పెట్టించి, ఆమెకు ఫొటోస్ ఇచ్చారు. తన అభిమానులు ఎక్కడున్నా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందించడం విజయ్ హ్యుమానిటికీ నిదర్శనం. నటనతో పాటు విజయ్ కు బిజినెస్ అంటే ఇష్టం. రౌడీ వేర్ ను సక్సెస్ ఫుల్ బ్రాండ్ గా నిలబెట్టి ప్రతిభ గల బిజినెస్ మెన్ అనిపించుకున్నారు విజయ్. ఏషియన్ విజయ్ మల్టీప్లెక్స్ నిర్మాణం, రెస్టారెంట్ నిర్వహణతో విజయ్ మల్టిపుల్ బిజినెస్ ప్లాట్ ఫామ్స్ ను తన ప్యాషన్ తో కొనసాగిస్తున్నారు.ఇటీవలే విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు, కోస్టార్ రశ్మికను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది. విరోష్ పెళ్లికి సంబంధించిన ప్రతి విశేషం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోదీ ఆశీస్సులతో పాటు ఎందరో ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు, వివిధ రాష్ట్రాల అభిమానులు, ప్రజలు విరోష్ ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తమ పెళ్లి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేశారు విజయ్, రశ్మిక జంట. సొంత ఊరు అంటే విజయ్ కు చాలా ఇష్టం. నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లయ్యాక తుమ్మన్ పేట వెళ్లి అక్కడి గ్రామ ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు విజయ్, రశ్మిక జంట. తుమ్మన్ పేట ప్రభుత్వ పాఠశాలలో చదివే 9, 10 వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చి మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తానని విజయ్ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్ లోని 44 పాఠశాలల్లో ఈ స్కాలర్ షిప్స్ ఇస్తామని ఆయన తెలిపారు. విజయ్ చేపట్టిన ఈ ఛారిటీ కార్యక్రమం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.విజయ్ లైనప్ లో ఉన్న మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమీప భవిష్యత్ లో విజయ్ ఏ స్థాయిలో ఉండబోతున్నాడు అనేది హింట్ ఇస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు రవికిరణ్ కోలా రూపొందిస్తున్న రౌడీ జనార్థన మూవీ విజయ్ లోని మాస్ యాంగిల్ ను కంప్లీట్ గా తెరపైకి తీసుకురానుంది. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ లో రౌడీ జనార్థన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న రణబాలి సినిమా భాషలకు అతీతంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ టైటిల్ గ్లింప్స్, ఏందయ్యా సామీ పాట వైరల్ గా మారాయి. "రణబాలి"తో విజయ్, రశ్మిక జోడి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక తాజాగా ప్రకటించిన శౌర్యువ్, వైరా బ్యానర్ మూవీతో విజయ్ ఇండియన్ సినిమాను మరో ముందడుగు వేసేలా చేశారు. ఈ సినిమాకు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం. వారణాసి, రాకా వంటి ప్రెస్టీజియస్ మూవీస్ తో విజయ్, శౌర్యువ్ మూవీకి పోలికలు వచ్చాయి.ఇదంతా కేవలం పదిహేనేళ్ల కెరీర్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక ఔట్ సైడర్ గా ఇండస్ట్రీకి వచ్చి విజయ్ దేవరకొండ సాధించిన విజయాలు. ఆయన మాటల్లో వింటే - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీ కొత్త ప్రయత్నం చేసేందుకు స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. అంటారు విజయ్. నేడు(మే 9) విజయ్ దేవరకొండ బర్త్‌డే. ఈ పుట్టినరోజు విజయ్ దేవరకొండకు మరింత స్పెషల్ గా ఉండాలని కోరుకుంటూ. ఆయనకు పుట్టినరోజు విషెస్ చెబుదాం. -
బర్త్‌డే స్పెషల్.. సాయి పల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?
తనదైన నటన, డ్యాన్స్‌తో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి.ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది.ఈ రోజు(మే 9) ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి 10 ఆసక్తికర విషయాలు. 1) సాయి పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంథామరై కన్నమ్. 1992 మే 9న తమిళనాడులోని కోటగిరిలో జన్మించింది. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. జార్జియాలోని ప్రముఖ యూనివర్సీటీలో ఎంబీబీఎస్ చదివింది.2) ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు.3) సాయి పల్లవి మాతృభాష బడగ. ఆమెకు బడగ భాషతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,ఇంగ్లీష్, జార్జియన్ భాషలు వచ్చు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కి ఇన్ని భాషలు రావు.4) 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో సాయి పల్లవి తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.5) 2009లో తెలుగులో ఢీ షోలో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లింది. కసూర్తి మాన్(2005), ధామ్ ధూమ్(2008) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసింది 6) ఫిదా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది.7) సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా గ్లామరస్ రోల్స్ చేయదు. అలాగే ఎన్ని కోట్లు ఇస్తామన్నా సరే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని అడ్వర్టైజ్ చేయదు. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.8) సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది.9) సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ కూడా గతంలో ఓ తమిళ సినిమాలో నటించింది. 2024లో ఆమె వివాహం జరిగింది.10) ప్రస్తుతం నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. రాముడి పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషిస్తున్నాడు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
LIK Movie: 2040 డిజిటల్ లవ్ స్టోరీ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘లైక్’ మూవీ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ప్రేమ గుడ్డిది అనే నానుడి వినే ఉంటారు. కానీ ఇదే నానుడి పోను పోను ప్రేమ డిజిటలైజ్డ్ అని వినిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. మనిషి తన మేధస్సుతో సాంకేతికతను బానిసగా చేసుకుంటున్నాను అనుకుంటున్న ఈ సమయంలో, అదే టెక్నాలజీ తన మనిషినే బానిసని చేసుకుంటోందని తెలుసుకోలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా రేపటి తరం ఈ టెక్నాలజీకి ఇప్పటి నుండే దాసోహం అంటున్నారు. మన చుట్టూ టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో ఉండే స్వచ్ఛమైన భావన ప్రేమ. కానీ ఆ ప్రేమను కూడా టెక్నాలజీకి ముడి పెడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో వచ్చినదే ఈ ‘లైక్’ సినిమా. ఈ రోజుల్లో పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయేంత వరకు మనమంతా ఇప్పుడు టెక్నాలజీతోనే ఉంటున్నాం. ఆరు నుండి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు ఫోన్, ట్యాబ్‌లకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఆ అలవాటు మనకి ఎంత గ్రహపాటో వినోదాత్మకంగా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమా చూడడం పూర్తయ్యాక మనం ఒక రోజైనా టెక్నాలజీకి దూరంగా ఉండాలని కొందరు పిల్లలు సైతం అనుకున్నారంటే... ఈ సినిమా ప్రభావం పిల్లల్లో కూడా ఎంతలా ఉందో ఆలోచించండి. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా మనకు 25 ఏళ్ళ తరువాత అంటే... 2040లో జరగబోయే కథన్న మాట. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ మరో వంద రెట్లు ఉంటుంది. అందుకే కథ ముందుగా పచ్చదనం ప్రాంతంలోని వైభవ్ వాస్ అనే యువకుడితో ప్రారంభమవుతుంది. పచ్చదనం ప్రాంతం అంటే 2040లో జైలన్నమాట. అంటే అక్కడ ఫోన్, టీవీ ఇలాంటివి ఏవీ ఉండవు. టెక్నాలజీ పెరిగిపోయి 2040లో నేరం చేసినవాళ్ళను పచ్చదనం ప్రాంతానికి శిక్షగా పంపుతారు. వాస్ వాళ్ళ నాన్న ఈ జైలుకు అధికారి. దేశమంతా లైక్ అని ఓ యాప్ ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ప్రేమించుకునే వాళ్ళకి, ప్రేమించాలి అని అనుకునేవాళ్ళకి ఈ యాప్ ద్వారా తమ ప్రేమ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇదే యాప్‌కి బానిసైన ధీమాని వాస్ ప్రేమిస్తాడు. కానీ వాస్ ప్రేమ నిజమైనది కాదు అని ఆ యాప్ స్పష్టం చేస్తుంది. ధీమాకి తనది స్వచ్ఛమైన ప్రేమ అని, డిజిటల్ ఎమోషన్ కాదు అని వాస్ ఎలా నిరూపిస్తాడో ‘లైక్’ సినిమాలోనే చూడాలి. సినిమా మొత్తం వినోదాత్మకంగా, నేటి తరం వారికి హెచ్చరికగా, రేపటి తరం వారికి పాఠంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్ల దగ్గర పిల్లలను గమనిస్తూ జాగ్రత్త పడాలి. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ. – హరికృష్ణ ఇంటూరు -
ఎక్కడా స్టార్ 'పవర్' పనిచేయట్లేదు
ఓ సినిమాకు జనాలు రావాలన్నా, అటెన్షన్ ఏర్పడాలన్నా అందులో స్టార్స్ కచ్చితంగా ఉండాలి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇదే ఫార్ములా నడుస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా చిన్న, మిడ్ రేంజ్ కంటే స్టార్ హీరో లేదా హీరోయిన్ల వెంట పడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్‌కి కాలం చెల్లిందా అనే సందేహం కలుగుతోంది. తాజాగా వస్తున్న సినిమాల బాక్సాఫీస్ ఫలితాలే దీనికి ఉదాహరణ.(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)గత వారం దక్షిణాదిలో రిలీజైన సినిమాలనే తీసుకుంటే తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి 'కర' వచ్చింది. ఇతడి నుంచి వచ్చే రెగ్యులర్ రొటీన్ స్టైల్ కంటెంటే ఉండేసరికి తెలుగు, తమిళంలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. థియేటర్లకు జనాలు పెద్దగా రాలేదు. ధనుష్, మమిత బైజు లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ టాక్ నెగిటివ్ రావడంతో తేలిపోయింది.సాయిపల్లవి సినిమా చేసిందంటే దానిపై కచ్చితంగా ఓ మాదిరి బజ్ ఏర్పడుతుంది. కానీ ఈమె హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' ఘోరమైన డిజాస్టర్ అయింది. నిర్మాతగా వ్యవహరించిన ఆమిర్ ఖాన్.. ప్రీమియర్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయిపల్లవి యాక్టింగ్ మెచ్చుకుని ఆకాశానికెత్తేశాడు. అయినా సరే ప్రేక్షకులు మనసు కరగలేదు. సాయిపల్లవి యాక్టింగ్ బాగున్నా సరే ఈ మూవీని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరిట విడుదలైంది గానీ ఆ సంగతే జనాలు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మలయాళంలో టాప్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్'. వీళ్ల ముగ్గురికి తోడు నయనతార, రేవతి, దర్శనా రాజేంద్రన్, కుంచకో బోబన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండేసరికి సినిమాపై బజ్ చాలానే ఏర్పడింది. కానీ కంటెంట్ ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయేసరికి వీకెండ్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర చల్లబడిపోయింది. తెలుగులో దీన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దామనుకుని వాయిదా వేశారు. పరిస్థితి చూస్తుంటే ఇక డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడం కష్టమే.పైన చెప్పిన మూడు సినిమాలే కాదు ఈ ఏడాది రిలీజైన రాజాసాబ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ ఉన్నారు. కానీ ఏం లాభం? కంటెంట్ బాగోలేదనే టాక్ మొదటి ఆటకే రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాల్ని లైట్ తీసుకున్నారు. దీనిబట్టి దర్శకనిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూవీలో స్టార్స్ ఉంటే సరిపోదు అందుకు తగ్గ కథాకథనాలు కూడా కచ్చితంగా ఉండాలి. లేదంటే నిర్ధాక్ష్యిణ్యంగా ఫ్లాప్, డిజాస్టర్ కావడం ఖాయం!(ఇదీ చదవండి: గవర్నర్‌తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?) -
మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్
'వారణాసి' హీరోగా చేస్తున్న మహేశ్ బాబు నిర్మాతగానూ అడపాదడపా మూవీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అలా మహేశ్ సొంత నిర్మాణ సంస్థ తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. లెక్క ప్రకారం జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 'పెద్ది' ప్రభావంతో నెలపాటు వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా)మార్చిలో రావాల్సిన 'పెద్ది'.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఆ టైంకి పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 4కి వాయిదా పడింది. ఈ మేరకు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓవర్సీస్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ తేదీకి వస్తామని అనుకున్న సత్యదేవ్ 'రావు బహదూర్' సినిమాని జూలై 3న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా దీన్ని తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది.జీఎంబీ ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)


