తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్‌ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.
తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.
గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?
(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)
5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb
— Meher Kilaru (@Kilaruness) May 11, 2026


