మరోవారం వచ్చేసింది. ఐపీఎల్, వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా జనాలు బయట తిరగట్లేదు. చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడంతో థియేటర్లకు కూడా వెళ్లట్లేదు. ఇకపోతే ఈ వారం సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి కానీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు.
(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)
మరోవైపు ఓటీటీల్లో 14 సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. నంబర్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటిలో చూడదగ్గవి కొన్ని ఉన్నాయి. ధురంధర్ 2 మూవీ ఈ వీకెండే విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది గానీ మన దేశంలోనే ఈ వారం వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కర్తవ్య', 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలతో పాటు 'ఎగ్జామ్' అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 11 నుంచి 17 వరకు)
నెట్‌ఫ్లిక్స్
ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13
నెమిసిస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 14
సోల్‌మేట్ (జపనీస్ సిరీస్) - మే 14
ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15
బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15
అమెజాన్ ప్రైమ్
ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 13
ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15
హాట్‌స్టార్
ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12
తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 12
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15
ఆహా
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15
సన్ నెక్స్ట్
కాళిదాస్ 2 (తమిళ చిత్రం) - మే 12
జీ5
టిఘీ (మరాఠీ మూవీ) - మే 15
(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)


