Thimmarajupalli Tv Movie
-
'తిమ్మరాజుపల్లి టీవీ'లో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం: ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్. -
తిమ్మరాజుపల్లి టీవీ సంతృప్తినిచ్చింది: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఒక మంచి సినిమా అనే ముద్ర కుటుంబ ప్రేక్షకుల్లో ఉంది. నిర్మాతగా మంచి చిత్రం తీశాననే సంతృప్తిని నాకు మిగిల్చింది. నేటి నుంచి మా సినిమాని ‘ఆహా’లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించారు.తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది. ఈ మూవీ నేటి నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గురువారం నిర్వహించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు’ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ–‘‘నేను హీరోగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తయింది. ‘గువ్వల చెరువు ఘాట్’ షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో మా సినిమాను ఆదరించారు. ఓటీటీలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని వి. మునిరాజు పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఐపీఎల్, వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా జనాలు బయట తిరగట్లేదు. చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడంతో థియేటర్లకు కూడా వెళ్లట్లేదు. ఇకపోతే ఈ వారం సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి కానీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)మరోవైపు ఓటీటీల్లో 14 సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. నంబర్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటిలో చూడదగ్గవి కొన్ని ఉన్నాయి. ధురంధర్ 2 మూవీ ఈ వీకెండే విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది గానీ మన దేశంలోనే ఈ వారం వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కర్తవ్య', 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్రాలతో పాటు 'ఎగ్జామ్' అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 11 నుంచి 17 వరకు)నెట్ఫ్లిక్స్ఒరు దురోహ సహచర్యతిళ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13నెమిసిస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 14సోల్‌మేట్ (జపనీస్ సిరీస్) - మే 14ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15అమెజాన్ ప్రైమ్ఆఫ్ క్యాంపస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 13ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15హాట్స్టార్ద పనిషర్: వన్ లాస్ట్ కిల్ (ఇంగ్లీష్ సినిమా) - మే 12తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 12ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహాతిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్స్ట్కాళిదాస్ 2 (తమిళ చిత్రం) - మే 12జీ5టిఘీ (మరాఠీ మూవీ) - మే 15(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి) -
ఓటీటీకి తిమ్మరాజుపల్లి టీవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కెమెరా అసిస్టెంట్ సాయితేజ్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.ఈ మూవీ కథేంటంటే..ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. One missing TV.One blamed thief.One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj— ahavideoin (@ahavideoIN) May 7, 2026 -
‘సిద్దయ్య’ కోసం 30 కిలోలు పెరిగా.. గుర్తుపట్టలేదు : నటుడు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తొలి సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’తోనే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. అందులో ఒక నటుడు లతీష్. తిమ్మరాజుపల్లి టీవీలో విలన్ సిద్ధయ్య పాత్రలో నటించి..ఆకట్టుకున్నాడు. తొలి మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటున్నాడు లతీష్. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.→ నగరిలో మాది వ్యవసాయ కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి.అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి నన్ను చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు.→ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశాను.→ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్లోనూ మెంబర్ షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.→ తిమ్మరాజుపల్లిలో నాది విలన్ పాత్ర అనగానే.. ఒకప్పుడు విలన్‌గా నటించి తర్వాత హీరోలు అయిన నటులంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం వెయిట్ పెరిగాను. ఏకంగా ముప్పై కిలోలు పెరిగి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయా. సిద్దయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.→ కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూసిన తరువాత టీం అందరినీ మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెన్స్‌గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేశావ్ అని కిరణ్ అన్న మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్స్టిట్యూట్కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.→ ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి. -
సినిమా నిలబడాలి: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి ప్రయత్నం చేశారంటూ ఇండస్ట్రీ పెద్దలు, ఇతరులు ప్రశంసించడం హ్యాపీగా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్‌తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన ఒక్క రోజులోనే ఇందులో నటించిన ఐదారుగురికి అవకాశాలు రావడం హ్యాపీ. నెక్ట్స్ కూడా కొత్తవాళ్లతోనే చేస్తాను. కొత్తవాళ్లు రావాలి, సినిమా నిలబడాలి’’ అన్నారు. ‘‘మేము థియేటర్స్‌కి వెళ్లినప్పుడు మా సినిమాలోని పాత్రల పేర్లను ప్రేక్షకులు పలుకుతున్నారు. పాత్రలన్నీ ఆడియన్స్‌కి రిజిస్టర్ అయ్యాయనేందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి’’ అని మునిరాజు చెప్పారు. ‘‘మా ప్రయత్నం విజయవంతమైందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు వేద. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు ధైర్యాన్నిచ్చిన సక్సెస్ ఇది’’ అని సాయి తేజ్ తెలిపారు. -
‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 17) రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు. సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 90లలో టీవీ అనేది ఒక ఎమోషన్. గ్రామాలల్లో ఒకరిద్దిరి ఇంట్లోనే టీవీలు ఉండేవి. సినిమాలు, సీరియళ్లు చూసేందుకు ఊరంతా వారింటి ముందు క్యూకట్టేది. వాళ్లు చీదరించుకున్నా..తిట్టినా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయేవాళ్లు. ఇప్పటితరానికి ఇవేవి తెలియదు కానీ.. 80-90 తరానికి చెందినవాళ్లకు మాత్రం టీవీతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఒక చిన్న లైన్‌ని తీసుకొని.. దానికి పల్లెటూరి అనుబంధాలను, చక్కని ప్రేమ కథను జత చేసి.. ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడ ప్రజల అలవాట్లను పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఊర్లో జాతరకు టీవీ తీసుకురావడం.. టీవీ చూసేందుకు ఊరంతా ఒక చోటికి రావడం.. చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అయితే పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కొంతవరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. టీవీని దొంగిలించారనే విషయం తెలిసినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. అదే సమయంలో సతీష్-శారదల లవ్‌స్టోరీ రాజప్పకు తెలియడం.. హీరో సవాల్ చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. టీవీ దొంగతనం చేసినవాడిని హీరో ఎలా కనిపెట్టాడు అనేదే ద్వితియార్థం కథ. ఆ దొంగ ఎవరనేది ప్రేక్షకుడు కూడా చివరివరకు కనిపెట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 80-90 తరాలకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఇందులో నటించినవారంతా కొత్తవాళ్లే అయినా కూడా చక్కగా నటించారు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వంశీకాంత్ రేఖన సంగీతం ఈ సినిమాకు మరో అదనపు బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అక్షయ్ రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.


